Mutual Funds

ఇక్కడ ముందుగా మీకో విషయం చెప్పాలి…ధనం ఉన్న వారిని మాత్రమే ధనవంతుడు అంటారు..అస్తి ఉన్న వారిని అస్తిపరులు అంటారు.చాలామంది అస్తి బాగా ఉన్నవారిని ధనవంతుల జాబితాలో చేరుస్తారు..అది పొరపాటు..

ఉదాహరణకు మీకు ఒక కొటి రూపాయలు అస్తి ఉందను కోండి. మీకు ప్రస్తుతం ఒక లక్ష రపాయల అవసరం వచ్చింది..ఈ లక్ష కోసం మీరు ఇల్లు అమ్ముకొలేరు కదా…అల అని తాకట్టు కూడా పెట్టలేరు….అందుకని..ఆస్తులు ఉండటం ఎంత అవసరమో,అవసరాలకి డబ్బు వుండటం కూడా అంతే అవసరం.ముఖ్యంగా పిల్లల చదువు, పెళ్లి ,retirement అవసరాలు..ఇలాంటి వాటి కోసం డబ్బు చాలా అవసరం.

మీకు ఇప్పటికే సొంత ఇల్లు ఉంటే.మీ దీర్ఘ కలిక అవసరాల కోసం ఈక్విటీ Mutual funds lo పెట్టుబడి పెట్టడం మంచిది.

ఒకవేళ మీకు సొంత ఇల్లు లేకపోతే housing loan తీసుకుని.ఇల్లు కోనుకొండి..మీ దగ్గర మొత్తం amount ఉన్నా కొంత మొత్తం loan తీసుకొంటే మంచిది..ఎందుకంటే housing loan EMI కూడ టాక్స్ benefits ఉన్నాయి (సెక్షన్80C, Principal amount),(section 24 loan interest amount).

చివరగా ఒక మాట;

ఇల్లు కొనటం అనేది అవసరం గా భావించాలి తప్ప పెట్టుబడి గా కాదు…పెట్టుబడి కోసం అయితే equity mutual funds better.. అయితే ఇది దీర్ఘకాలిక లక్ష్యాల కోసం.ఈక్విటీ పెట్టుబడులు మార్కెట్ హెచ్చుతగ్గులు కు లోబడి ఉంటాయి .ఇది ఖచ్చితంగా గమనించాల్సన విషయం.

ఇల్లు లేదా మ్యూచువల్ ఫండ్స్?

రెండింటికీ దాని స్వంత ప్రయోజనాలు ఉన్నాయి,

ఇల్లు మీకు భద్రత మరియు మనశ్శాంతిని ఇస్తుంది. ఒకరు ఇల్లు కొంటే, అతడు ఇంట్లో ఎప్పటికీ ఉండగలడు, అదే ఇంటిని తరువాతి తరాలకు కూడా ఇవ్వవచ్చు. డబ్బు అవసరం సమయంలో, దానిని అమ్మవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్: ఇది ప్రమాదకర వెంచర్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెట్టిన వాటాలను బట్టి, మ్యూచువల్ ఫండ్ల విలువ ప్రతి నిమిషం మారుతుంది. ఇది మీరు పెట్టుబడి పెట్టిన విలువ కంటే ఎక్కువ లేదా తక్కువ కావచ్చు. ప్రతి నిమిషం విలువ మారినప్పుడు, పెట్టుబడి గురించి మీకు మనశ్శాంతి ఉండకపోవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా, రిస్క్‌ను బట్టి ఒకరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఈక్విటీ, రిస్క్, మార్కెట్, రుణ వైవిధ్యాలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నాయి

నేను రిస్క్‌ని ఇష్టపడను, అందువల్ల మ్యూచువల్ ఫండ్స్‌కు వెళ్లేముందు కనీసం ఒక ఇంటిని కలిగి ఉండాలని సలహా ఇస్తున్నాను.

Mutual Funds Uncategorized

మ్యూచువల్ ఫండ్లలో (ఆ మాటకొస్తే స్టాక్ మార్కెట్లో) పెట్టుబడి అంటే ఒక వ్యాపారంలో పెట్టుబడితో సమానం. ఊరికే డబ్బు పోగొట్టుకోవాలని అయితే ఎవరూ ఎందులోనూ పెట్టుబడి పెట్టరు (సాధారణంగా).

నాకు తెలిసిన ఒకాయన పాల వ్యాపారం గురించి బాగా వివరాలు సేకరించి అందులోకి దిగారు కానీ మూడేళ్ళలో నష్టాలకు మూసివేసారు. పాల వ్యాపారమే అప్పటికి మూడేళ్ళుగా నష్టాల్లో నడుపుతున్న ఇంకొకాయనపై నమ్మకంతో నా స్నేహితుడు 5 లక్షలు అందులో పెట్టుబడి పెట్టాడు. మరో మూడేళ్ళలకు లాభాలు మొదలై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం బాగా విస్తరించిన బ్రాండ్ అయిందది. ఆ 5 లక్షల వాటా ఇప్పుడు దాదాపు కోటి రుపాయలు విలువ చేస్తుంది. మరి పాలవ్యాపారం అది చేసేవారందర్నీ ధనవంతులను చేస్తుందా?

డ్యూ డిలిజెన్స్ (వ్యాపారం గురించి వివరాలు, విశేషాలు అన్నీ తెలుసుకుని, లాభం వచ్చే అవకాశం మెండుగా ఉందా అని తెలుసుకోవటం) – వ్యాపారం మొదలుపెట్టాలనుకునే ప్రతిఒక్కరు చేసేదే. అయినప్పటికీ అందరూ వ్యాపారంలో లాభాలార్జించలేరు. దీనికి కారణం అదృష్టం కాదు – నిరంతర శ్రమ, మార్పుకు సంకోచించని తత్వం. వ్యాపారం మొదలెట్టేశాం కదా అని గుఱ్ఱాల కళ్ళకు కట్టే బ్లింకర్స్ వంటివి పెట్టేసుకుని మూసధోరణిలో వెళ్తే కష్టం.

ఏ పెట్టుబడి అయినా అది అమలు చేసే విధానాన్ని బట్టి ఫలితం ఉంటుంది.

మనం చేరాల్సిన గమ్యం ధనవంతులం అవడం అయితే మనల్ని అక్కడికి తీసుకువెళ్ళే వాహనాలలో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. ఆ వాహనం నడిపే విధానాన్ని బట్టి మనం గమ్యం చేరుకుంటామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ మిమ్మల్ని ధనవంతులుగా చేయగలవా?

ఖచ్చితంగా చెయ్యగలవు. ఒక క్రమబద్ధమైన పద్ధతిలో పెట్టుబడి పెడితే మ్యూచువల్ ఫండ్ల ద్వారా ధనం సంపాదించడం సాధ్యమే.

అయితే పెట్టుబడి పెట్టేశాం, ఇక ధనవంతులైపోవటమే తరువాయి అని బిందాస్‌గా గుడ్లను చూసి కోడిపిల్లలను లెక్కపెట్టేసుకునే ధోరణి ఉంటే సత్ఫలితం దాదాపు అసంభవం.

  1. ఎంత కాలానికి, ఎందుకు పెట్టుబడి పెడుతున్నదీ స్పష్టంగా నిర్ణయించుకోవాలి.
  2. తదనుగుణంగా నాణ్యమైన మ్యూచువల్ ఫండ్లు ఎంచుకోవాలి.
  3. పెట్టుబడి దీర్ఘకాలానికైతే డైరెక్ట్ ఫండ్లనే ఎంచుకోవాలి.
  4. దీర్ఘకాలానికైతే (అంటే ఆరేళ్ళకు మించి) ఏడాదికోసారి, స్వల్పకాలానికైతే (అంటే రెండు-మూడేళ్ళకు) ఆరు నెలలకోసారి ఫండ్ పనితీరును సమీక్షించాలి.
  5. పనితీరు సంతృప్తికరంగా లేకపోతే నిర్మొహమాటంగా డబ్బును నాణ్యమైన ఫుండ్‌కు తరలించాలి.
  6. మార్కెట్లో వచ్చే కుదుపులకు (ఉదాహరణకు 2008, కోవిడ్) భయాందోళనలకు లోనవ్వకుండా, అటువంటి కుదుపులను అవకాశాలుగా ఉపయోగించుకోగల వెరవని ధైర్యముండాలి.

పైవన్నీ పాటించే ఎవరినైనా మ్యూచువల్ ఫండ్లు ధనవంతులను చేస్తాయి.

గమనిక: మ్యూచువల్ ఫండ్లు అంటే ఈక్విటీ ఫండ్లు అన్న అర్థంతోనే ఈ సమాధానం రాయటం జరిగింది. ఎందుకంటే నాణ్యమైన ఈక్విటీ ఫండ్లు మాత్రమే మదుపర్లను ధనవంతులను చెయ్యగలవు, వాటి ఉద్దేశ్యమూ అదే. డెట్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు ముఖ్యంగా ఎఫ్‌డీలను మించిన రాబడి పొందేందుకే.

Wealth News

ఇది చాలా క్లిష్టమైన పని.ఒక మంచి న్యాయ వాదికి చూపిస్తే కానీ అన్ని కాగితాలు, అనుమతులు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ముఖ్యంగా కావలసినవి, సేల్డీడ్,మునిసిపాలిటీ లేదా పంచాయతీ వారి అనుమతి,గత 25సంవత్సరాలుగా ఆ ఆస్తి ఎవరి చేతులలో ఉన్నదో తెలిపే ఈసీ.

సాధారణంగా అమ్మే వారు అన్ని ఇస్తారు. కానీ ఒక్కొకప్పుడు కొంత మంది నకిలీవి ఇస్తారు.ఈ కాలంలో మన దేశంలో నకిలీవి. సృష్టించడంచాలా తేలిక.అందువలననే మనకు పరిచయం లేని వారినుండి లేదా ఆ ప్రదేశంలో స్థిరనివాసం లేని వారి నుండి ఆస్తి కొనడం చాలా ప్రమాదం. కొంత మంది తప్పుడు కాగితాలతో మనకు రిజిస్ట్రేషన్ చేసి ఎక్కడికో పోతారు. ఆతరువాత అసలు సొంతదారులు వస్తారు.అప్పుడు సమస్య మొదలు అవుతుంది. ఈసమస్య ఖాళీ ప్లాట్ల విషయంలో ను కొన్ని ఇళ్ళ విషయంలో ను జరుగుతుంది. కావున ముందు మనము చూసుకోవలసినదేమిటంటే అమ్మే వాడు నమ్మకస్తుడేనా మరియు ఈ ఆస్తిని న్యాయం గానే సంపాదించాడా,?ఇక్కడే స్థిరనివాసం ఉంటున్నాడా?దళారుల మాటలు నమ్మి త్వరపడి ఏదీ కొనకూడదు. వీరు తొందరపెట్టి నకిలీ పత్రాలతో అమ్మేస్తారు.మనదేశంలో న్యాయ వాదులు పత్రాలను చూసి న్యాయ సలహా ఇస్తారు.కానీ రేపేదైనా తేడా వస్తే ఆయనదేమీ బాధ్యత లేదు.ఆ ఆస్తి మీద ఇప్పటికే బాంకు లోను తీసుకుని ఉంటే ఆ పత్రాలను పరిశీలించండి.అలాగైతే కొంత వరకు అది సక్రమ మైన ఆస్తి అనుకోవచ్చు. ఈ ఆస్తి అమ్మే వారి అధీనంలో 12 లేదా 25సంవత్సరాల నుండి ఉంటే మనము తీసుకోవచ్చు. ఈ ఆస్తి ఈమధ్యనే కొన్న దైతే ఆలోచించాలి.ఇది వారసత్వ ఆస్తి ఐతే బాగా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి.వేరే వారసుల చేత కొంత మంది సాక్షి సంతకాలు. చేయించుకుంటారు.

ఇక ముస్లింల ఆస్తుల లో చాలా సమస్యలుంటాయి అంటారు.

నేను ముఖ్య ముగా చూసేది అమ్మేవాడికి సమాజంలో ఎలాంటి గౌరవం ఉన్న ది.ఇది బాగుంటేనే అసలుమనము ఈ కొనుగోలు గురించి ఆలోచించాలి.లేకపోతే పూర్తిగా వదులుకోవడం మంచిది.

మన దేశంలో మోసం చేసి తప్పించుకోవడం చాలా తేలిక. డబ్బు చేయిదాటినతర్వాత తిరిగి రాదు.కావున అడ్వాన్స్ ఇచ్చే టపుడే క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి.ఒకసారి తొందరపడి అడ్వాన్స్ ఇస్తే మీ డబ్బు మొత్తం పోయినట్లే.అందుకే దళారులు వచ్చి హడావుడి చేసి అడ్వాన్స్ ఇప్పిస్తారు.కావున మీరు ఈ దళారులతో బాగా ఖచ్చితంగా వ్యవహరించాలి.

ఏదైనా ఇల్లు కొనేటపుడు అనుభవజ్ణులు,మీశ్రేయోభిలాషులైన పెద్ద వారిసమక్షంలో మాట్లాడుకోండి.ఇది చాలా ఉపయోగిస్తుంది.వారి అనుభవంతో లొసుగులను తేలికగా పసికడతారు.

ఏదైనా కారుచౌకగా వచ్చేదానిని కొనకూడదు. అందులో ఏవో లొసుగులు ఉంటాయి.

ఇలు కొనెటపుడు ముందుగా లింకు కాగితాలు తీసుకోవడం తప్పనిసరి మరియు ఇ.సి పేపరు రిజిస్ట్రేషన్ ఆఫీసు లో కాని మీ సేవ లో కాని తీసుకోవడం తపనిసిరి దీని వల్ల ఆ ఇల్లు ఎవరి పేరు న ఉన్నదొ మనకు తెలిసిపొతుంది అమ్మేవారు పేరు ఇ.సి లో ఉన్నవారి పేరు సరి చూసుకోవాలి పేరు సరిపోయి ఉంటే ఎలాంటి అనుమానం అవసరం లేదు .ఒక వేళ మీరు ఎఛ్ .ఎమ్ .ఢి .ఏ లో తీసుకోవాలనుకుంటే పైనల్ లేఅవుట్ అపృవ్ఢ్ లెటర్ తప్పనిసరి

Wealth News

IP అంటే Insolvency petition. ఒక వ్యక్తి /సంస్థ తన ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువగా ఉన్నాయని, తాము ఆ అప్పులను తీర్చలేమని కోర్టు లో వేసే దావా నే ఐ పీ.

IP అంటేనే insolvency petition.

పిటీషన్ అంటే అభ్యర్థన.అది అందరికీ తెలుసు. సొల్వెన్సీ అంటే దివాళా తీయడం.

ఒక వ్యక్తి అప్పు తీర్చగల సామర్ధ్యాని కి మించి అప్పులు చేసి,కొంతకాలం పాటు నమ్మకం గా వడ్డీలు కడు తూ మరి కొంత అప్పు చేసి రుణ దాతలు గ్రహించి పట్టుకునే లోపే రాత్రి కి రాత్రి వుడాయించి కొద్ది రోజుల తరువాత రావడమూ లేదా కనిపించక పోవచ్చు.

వెంటనే కోర్టులో IP దాఖలు చేయడం.

ఒక వ్యక్తి I P పెట్టాడు అని అంటే సమాజంలో బతుకు వున్నా మరణించిన వాని కింద లెక్క.

కోర్టు ఈ సంస్థ / వ్యక్తి యొక్క ఆర్ధిక వివరాలు తనిఖీ చేసి, వారిని insolvent గా ధ్రువ పరుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ, ఒక రిసీవర్ ని నియమిస్తుంది.

ఆ రిసీవర్ ఆస్తులని అమ్మి, ఆ నిష్పత్తి లో అప్పులకి చెల్లింపులు చేసి ఆ విషయాన్ని పూర్తి చేస్తారు. అందుకు కొంత గడువు ఉంటుంది.

ఐపీ పెట్టడం అనేది ఎందుకంత చర్చనీయంగా ఉంటుంది అంటే, ఆ వ్యక్తి కి ఇచ్చిన అప్పు, పూర్తిగా వసూలు అయ్యే అవకాశం ఉండదు, దొరికిన ఏ కాస్త తో అయినా సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక. ఋణదాతలకి తమ దగ్గర అప్పు తీసుకున్న వారు ఐపీ పెడితే అందుకే ఇబ్బంది.

ఈ విధి విధానాలలో మార్పులు చేస్తూ, సంస్కరిస్తూ Insolvency and Bankruptcy code , 2016 ని భారత ప్రభుత్వం శాసనం చేసింది. Insolvency and Bankruptcy board ఈ విధానాలకి Nodal authority.

కాలానుగుణంగా చెప్పాల్సి వస్తే,

లేవు, అయితే ఏంచేస్తావ్ అనేదే ఐ. పి.

ఐ. పి. అంటే సివిల్ డెత్ అని అంటారు. అంటే అతను భౌతికంగా ఉన్న కూడా సంఘం దృష్టిలో లేనట్టే.

జీవచ్ఛవం అనేది సరి అయిన పదం కావచ్చు.

అంటే నమ్మించి మోసము చేయటం.

అయితే ఇదంతా చట్టం దృష్టిలో మాత్రమే.

నేను విన్న సామెత ఏమంటే,

ఆరు సార్లు ఐ. పి పెట్టిన వాడిని వెదికి మరి పిల్లను ఇవ్వమన్నారు.

ఎందుకంటే, ఒక సారి ఐ. పి అంటే ఏదో పరిస్థితులు అనుకూలించక జరిగింది అనుకోవచ్చు కానీ మహానుభావుడు అదే పనిలో ఉంటే ఏంటి, జనాలు ఆయన ఏమి చెప్పిన నమ్ముతారు అని.

మరి అంత తెలివితేటలు గలవాడిని ఊరకే పోనిస్తే ఎలా, అల్లుడు అయితే, సహాయం గా వుంటాడు, ఇంకోటి, మనం జాగ్రత్తగా ఉండి అప్పు ఇవ్వము. ఇచ్చిన సారు ఎలాగూ ఆస్తి భార్య పేరునే దాస్తాడు కాబట్టి అమ్మాయి క్షేమంగా ఉంటుంది.

Wealth News

వీలునామా,నామినీ రెండూ వేర్వేరు విషయాలు.ఎలా అంటారా?

ముందుగా నామినీ గురించి: ఉదా:తన జీవితంపై ఒక వ్యక్తి ఒక కోటి రూపాయల కి బీమా చేసి,నామినీ గా తల్లి పేరు రిజిస్టర్ చేసాడు అనుకుందాం.పెండ్లి అయ్యి ఇద్దరు చిన్న పిల్లలు ఒకరికి 4సం. ఇంకొకరికి 6సం.బీమా చేసిన వ్యక్తికి 36 సం.వయసు.భార్య వయసు 30.

25 సం.టర్మ్ తో పాలసీ తీసుకున్నాడు.పాలసీ తీసుకున్న తరువాత 7వ సం.లో పాలసీ క్లైమ్ కి వస్తె బీమా మొత్తాన్ని తల్లికి ఇస్తారు.

పైన చెప్పిన విధంగా కాకుండా ఒక ఇరవై సం. తర్వాత 50 లక్షలు మెచ్యూరిటీ మొత్తం వచ్చేలా పాలసీ తీసుకుని పాలసీ కంతులు(వాయిదాలు) క్రమం తప్పకుండా కడుతూ వున్నాడు.భార్య పేరు వీలునామా రిజిస్టర్ చేసాడు.సదరు వ్యక్తి అనుకోకుండా చనిపోయినా,పాలసీ వ్యవధి అయిపోయినా పాలసీ మొత్తాన్ని భార్య కి ఇస్తారు.

చాలా వరకు నామినీ ఒక ట్రస్టీ మాత్రమే.నామినీ చనిపోయిన వారి యొక్క డబ్బుకు ట్రస్టీ గా వుండి నామినీ aయొక్క వారసులకు అప్పజెప్పడం ట్రస్టీ యొక్క విధి.

ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి తన బ్యాంక్ ఖాతా మరియు ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా జీవిత బీమా పాలసీ లలో మరో వ్యక్తిని సదరు రికార్డ్ లలో నామినీ గా పెట్టాడు.

ఈ పైన చెప్పిన అన్ని ఆర్థిక సంస్థల లో వున్న డబ్బులన్నీ అక్కడ ఇరుక్కు పోకుండా తీసుకునే అవకాశం ఉన్నది.అదే నామినేషన్ చేయించ క పోయి వుంటే ఆయా ఆర్థిక సంస్థల నుంచి నగదును బయటికి తీసుకు రావడం కష్టం అయి వుండేది.నామినీ గా ఎవరో ఒకరి పేరు రిజిస్టర్ చేయక పోతే

వారసత్వ ధృవీకరణ అనీ సక్సెషన్ సర్టిఫికేట్ అనీ లీగల్ హైర్స్ సర్టిఫికేట్ అనీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.మనీ ఆర్థిక సంస్థల దగ్గర ఇరుక్కు పోతుంది.

ఇలా ఆర్థిక సంస్థల దగ్గర ఇరుక్కు పోయిన మనీ చాలానే ఉంది అనీ రిపోర్టులు చెబుతున్నాయి.

సెక్షన్ 39 ఇన్సూరెన్స్ ఆక్ట్ ప్రకారం L I C పాలసీ లు తీసుకునేటప్పుడు పాలసీ దారు ఎవరినైతే నామినీగా పేరు రిజిస్టర్ చేస్తారో ఆ నామినీ కే పాలసీ దారు మరణానంతరం దరఖాస్తు చేసిన వారికి అంటే claimant హక్కుదారు నకు అన్ని రకాల పత్రములు సమర్పించిన మీదట (ఆఫీస్ ద్వారా ఇవ్వబడిన క్లైమ్ పేపర్స్ policy బాండ్ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఆధార్ కాపీ పాన్ వివరాలు) బీమా పాలసీ డబ్బు ను

నామినీ ఖాతాలో వేయడం జరుగు తుంది.

వీలునామా రాసినా నామినీ గా రికార్డ్ లలో వున్నా సదరు వ్యక్తి బ్రతికి ఉన్నంత వరకు హక్కులు అసలు వ్యక్తికి

మాత్రమే వుంటాయి.నామినీ గానీ వీలునామా ఎవరి పేరున వున్నదీ ఆ వ్యక్తి గానీ అసలు వ్యక్తి మరణానంతరం మాత్రమే

మరణించిన వ్యక్తి యొక్క ఆస్థికి,డబ్బుకు హక్కుదారులతారు.

నామినేషన్ ఎన్నిసార్లయినా మార్చుకునే వీలుంది.వెసలుబాటు వుంది. అలా ఎందుకు అని అంటే ఒక వ్యక్తి తన పెండ్లికి ముందు తన తల్లిని గానీ తండ్రిని గానీ నామినీ గా రికార్డ్ లో రిజిస్టర్ చేసి వుంటారు.కానీ పెండ్లి అనంతరం సహచరిని/భార్యని నామినీ గా రికార్డులలో పొందు పరచ వలసి ఉంటుంది.

వీలునామా కూడా రెండు రకములుగా వుండే అవకాశం ఉన్నది.

అందులో మొదటిది: తన జీవిత కాలం సదరు ఆస్థిని అనుభవిస్తూ అనంతరం వారీసులకు చెందేలా వ్రాయడం ఒక పద్ధతి.

రెండవది.సంపూర్ణ హక్కులు సంక్రమింప జేస్తూ తన ఇష్టానుసారం అనుభవించే స్వేచ్ఛ మరియు అమ్ముకునేందుకు హక్కు ఉండునట్లు వ్రాయడం.

ఇవి కాకుండా షేర్స్,డివిడెండ్ లు,రాయల్టీ, డిబెం న్చర్ లు,ఇలా ఎన్నో రకాల ఆర్థిక సంస్థల దగ్గర డబ్బులు వ్యక్తుల లేదా సంస్థల డబ్బులు వుండే అవకాశం ఉంది.

అందువల్ల తప్పని సరిగా నామినేషన్ దాఖలు చేయడం మంచిది.నామినేషన్ రిజిస్టర్ అయిందా లేదా అనేది తెలుసు కోవడం ముఖ్యం.

కారణం ఏమంటే బ్యాంకు వారు గానీ బీమా సంస్థలు గానీ లేదా ఇతర ఏ ఆర్థిక సంస్థలు గానీ వారికున్న పని ఒత్తిడి కారణంగా నో లేదా నిర్లక్ష్యం వల్ల నో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.

నేను 2011 లో బ్యాంక్ ఖాతా తెరిచినప్పుడు ఏజ్ ప్రూఫ్,ఆధార్,పాన్ వివరాలు,నివాస ధృవీకరణ పత్రాలు అన్నీ ఇవ్వడం జరిగింది. ఓ రెండేళ్ల తరువాత ఎందుకనో బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ మొదటి పేజీ చూడటం జరిగింది.నామినేషన్ అన్న కాలం దగ్గర not registered అని వుంది.మరలా రెండోసారి అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి కరెక్షన్ చేయించడం జరిగింది.

అందరూ అలా వుంటారు అని కాదు.అన్ని చోట్ల అలానే జరుగుతుందని కాదు.

ఈ వ్యవస్థలో ఎవరిని వారే ఉద్ధరించు కోవాలి.

Stock Market

ఆప్షన్స్ కొనటం అంటే నష్టపోయే ట్రేడింగ్ అని ఎందుకంటారు?

ఇది తెలుసుకునేందుకు ముందు కొన్ని పదాలు తెలుసుకోవాలి:

చాంచల్యం (volatility): మార్కెట్లో పెద్ద కదలికలు (పైకో, కిందకో) వేగంగా రావటం

స్థిరత్వం (stability): మార్కెట్లు నెమ్మదిగా కదలటం (పైకో, కిందకో)

మార్కెట్లు ఎంత చంచలంగా కదలాడితే ఆప్షన్స్ కొని, అమ్మేవారికి అంత లాభం; అమ్మి, కొనేవారికి (షార్ట్ చేసేవారు) అంత నష్టం.

మార్కెట్లు ఎంత స్థిరంగా ఉంటే ఆప్షన్స్ కొని, అమ్మేవారికి అంత నష్టం; అమ్మి, కొనేవారికి అంత లాభం.

దీనికి కారణం ఆప్షన్స్‌కు ఉన్న కాలక్షీణత (Time Decay) లక్షణం.

ఏమిటీ కాలక్షీణత?

జనవరి 29న నిఫ్టీ 13650, నిఫ్టీ ఫిబ్రవరి 14500 CE ఆప్షన్ ధర 95.

ఫిబ్రవరి నెలాఖరుకు నిఫ్టీ 14500కు కిందే ఉంటుందనుకుందాం. అప్పుడు 14500 CE ఆప్షన్ ధర 0. నెలరోజుల్లో మార్కెట్ 14500 కంటే పైకి వెళ్ళలేదు కాబట్టి 14500, ఆపై స్ట్రైక్ ఉన్న కాల్ ఆప్షన్స్ అన్నీ 0 అయిపోతాయి. 14500, ఆకింద ఉన్న స్ట్రైక్ పుట్ ఆప్షన్స్ కూడా 0 అయిపోతాయి. ఇదే కాలక్షీణత.

ఈ కాలక్షీణత ఆప్షన్స్ షార్ట్ చేసేవారి ఆప్తమిత్రుడయితే ఆప్షన్స్ కొనేవారి బద్ధ శత్రువు.

ఉదాహరణ:

29 జనవరిన మార్కెట్లు మూతపడే సమయానికి నిఫ్టీ 13650 వద్ద ఉంటే నిఫ్టీ ఫిబ్రవరి 14500 CE ఆప్షన్ ధర 95 చొప్పున ఒక లాట్ కొనటానికి 7,125 రుపాయలు (95*75).

నిన్న ఫిబ్రవరి 5న మార్కెట్ మూతపడే సమయానికి నిఫ్టీ 14950 అయితే 14500 CE ఆప్షన్ ధర 580. చాంచల్యం ఎక్కువై కేవలం 5 రోజుల్లో నిఫ్టీ 1300 పాయింట్లు (దాదాపు 9%) పెరిగింది.

14500 CE ఆప్షన్ కొన్నవారి లాభం (580-95)*75 = 36,375 రుపాయలు. ఒకవేళ మార్కెట్ ఇంతగా పెరగకపోయుంటే గరిష్టంగా ఆ 7,125 రుపాయలే నష్టం. పరిమిత నష్టం, అపరిమిత లాభం.

ఇందుకే ఆప్షన్స్ కొనేవారికి కొదవ లేదు. 7,125 రుపాయలతో 36,375 రుపాయల లాభం ఎవరికి చేదు?

అదే నిఫ్టీ 14500 CE ఆప్షన్ 95 వద్ద షార్ట్ చేసి ఉంటే (అలా షార్ట్ చెయ్యటానికి అవసరమైన మూలధనం సుమారు 1,65,000 రుపాయలు) ఒక లాట్‌పై ఇప్పటికి 36,375 రుపాయల నష్టం.

అయినా సరే ధైర్యంగా నెలాఖరు వరకు అట్టిపెట్టుకుని, అప్పటికి నిఫ్టీ 14500కు కిందే ఉంటే 95*75 = 7,125 రుపాయల లాభం, ఎందుకంటే మార్కెట్ల స్థిరత్వం, చాంచల్య లేమి వల్ల 14500 CE విలువ 0 అవుతుంది. అపరిమిత నష్టం, పరిమిత లాభం.

మరి ఇటువంటి ఆప్షన్స్ ట్రేడింగ్ ఎవరు చెయ్యాలి?

ఇక్కడ షిప్ మెకానిక్ కథ తెలిసినదే అయినా మరొకసారి చెప్పుకుందాం.

ఒకానొక రోజు ఒక నౌకకు ఏదో సమస్య వచ్చి ఇంజను మొరాయించింది. నౌకా సిబ్బంది ఎన్నివిధాల ప్రయత్నించినా సమస్య ఏమిటో తెలియలేదు. అప్పుడు నౌక యజమాని ఒక ప్రసిద్ధ మెకానిక్‌ను పిలిపించారు.

ఆయన వచ్చి రెండు గంటలపాటు ఇంజనును పరిశీలించి, దానిపై ఒక చోట చిన్న సుత్తితో తట్టాడు. అంతే, ఇంజను పనిచెయ్యసాగింది.

మరుసటి రోజు మెకానిక్ 10,000 రుపాయలకు బిల్లు పంపాడు. చిన్న సుత్తితో తట్టినందుకు అంత బిల్లా అని కోపంతో వివరాలు రాసి పంపమని బిల్లు తిప్పి పంపాడు యజమాని. అప్పుడు మెకానిక్ రాసి పంపిన వివరం:

సుత్తితో తట్టినందుకు: 100 రుపాయలు

ఎక్కడ తట్టాలో తెలిసినందుకు: 9,900 రుపాయలు

ఆప్షన్స్ ట్రేడింగ్ సరళమే కానీ ఎప్పుడు, ఎక్కడ, ఏది ట్రేడ్ చెయ్యాలో తెలుసుకోవటం ముఖ్యం. అది తెలుసుకోకుండా ట్రేడ్ చేసేవారు చివరకు డబ్బు పోగొట్టుకుని, ట్రేడింగ్ అంటే జూదమే అని టముకేస్తూ నేర్చుకోవాలన్న కుతూహలం ఉన్నవారినీ హడలగొడతారు.

ఏ విద్య అయినా అభ్యసించనిదే ఆచరించకూడదన్నది ఇంగితజ్ఞానం.

ఆప్షన్స్ ని సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు/ట్రేడర్స్ కొనుగోలు చేస్తారు.

ఎక్కువ మంది నష్టపోతున్నా ఎందుకు కొంటారు? అనేది మీ ప్రశ్న…

ఫ్యూచర్స్ లో రిలయన్స్ ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలని అనుకొంటే,సుమారుగా 2,60,000 రూపాయలు కావాలి.

అదే కాంట్రాక్ట్ 2000 కాల్ ఆప్షన్ కి 32000, పుట్ ఆప్షన్స్ కి 30000,నిన్నటి ధరల ప్రకారం, అవసరం అవుతాయి.

అందరూ అంత మొత్తం పెట్టి ఫ్యూచర్స్ పొజిషన్ తీసుకోలేరు కాబట్టి ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ తీసుకొంటారు.

ఇంకో ప్రయోజనం ఆప్షన్స్ లో ఏంటంటే, మనం చెల్లించిన ప్రీమియం కంటే 1 రూపాయ కూడా ఎక్కువ నష్టపోము.

అదే ఫ్యూచర్స్ లో అయితే ట్రెండ్ మనకు వ్యతిరేకంగా ఉన్నంత కాలం మనం మార్జిన్ మొత్తం maintain చేయడానికి మళ్ళీ డబ్బులు పెడుతూ ఉండాలి!

ఆప్షన్స్ ఖరీదు చేసే వారికి పైన ఉదహరించిన ప్రీమియం ఒక్కటే అడ్వాంటేజ్,మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ వారికి వ్యతిరేకంగా పని చేస్తాయి…ఉదాహరణకు గ్రీక్స్ అంటే వొలాటిలిటీ, theta లాంటివి.

గ్రీక్స్ వల్ల మనం అనుకొన్న దిశ లో మన షేర్ వెళ్లినా మనం నష్ట పోయే అవకాశాలు ఎక్కువ.

కానీ మనం అనుకొన్న దిశలో మూవ్మెంట్ త్వరగా వస్తే మాత్రం theta వల్ల జరిగిన నష్టం పోగా మనకి ఎన్నో రెట్లు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

లాటరి లానే ప్రాబబిలిటీ తక్కువే కానీ తక్కువ పెట్టుబడి పైన చాలా ఎక్కువ రిటర్న్స్ ,అదీ కొద్దీ సమయంలోనే అవకాశం చాలా మందిని ఆకర్శిస్తుంది.

Investment

ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఎదైనా శాఖకు వెళ్ళి సావరిన్ గోల్డ్ బాండ్లను కొనవచ్చు. ఇలా కొంటే బాండ్లను ప్రమాణపత్రాల రూపేణా అందజేస్తారు. ఆ పత్రాలను భద్రపరచుకోవాలి.

ఆన్‌లైన్ అయితే KYC పూర్తైన వారు (షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి పెట్టుబడులు చేసేవారు) బ్యాంకు వెబ్‌సైట్ లేదా డీమ్యాట్ ఖాతా ద్వారా సులువుగా ఈ బాండ్లను కొనవచ్చు. ఇలా కొంటే డిజిటల్ రూపేణా డీమ్యాట్ ఖాతా హోల్డింగ్స్‌లో కొనుగోలు చేసిన బాండ్లను చూడవచ్చు.

ఉదాహరణకు జెరోధాలో 2016లో కొన్న బాండ్లు:

దాని వల్ల వచ్చే లాభ నష్టాలు ఏమిటి?

లాభాలు:

బంగారం నగలు, బిస్కెట్ల రూపంలో కొంటే స్వచ్చత, భద్రపరచే బాధ్యత, ఖర్చు వంటి రిస్కులు ఉంటాయి. గోల్డ్ బాండ్లలో ఈ భయాలు ఉండవు.

999 స్వచ్చమైన బంగారం ప్రమాణికంగా బాండ్లు కేటాయిస్తారు.

బాండ్ల గడువు పూర్తయ్యాక షేర్లను అమ్మినట్టు అమ్మేయవచ్చు – ద్రవ్యత్వ లోపం, బ్రోకరేజీ రుసుము, తరుగు వంటి వృధా ఖర్చులు ఉండవు.

బాండ్ల పెట్టుబడి మొత్తంపై సాలీనా 2.5% వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది.

మెచ్యూరిటీ తరువాత లాభానికి అమ్మేస్తే ఆ లాభంపై ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఉండదు. ఒకవేళ నష్టానికి అమ్మితే ఆ నష్టానికి ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో మినహాయింపు పొందవచ్చు.

బాండ్ల కొనుగోలులో గ్రాముకు 50 రుపాయల డిస్కౌంట్ ఉంటుంది. ఇది మనబోటి రీటైల్ మదుపర్లకు మాత్రమే!

గోల్డ్ బాండ్లు ప్రభుత్వ పూచీకత్తుతో రిజర్వు బ్యాంకు విక్రయిస్తుంది. అందువల్ల భరోసా ఉంటుంది. దివాలా, ద్రవ్యత్వలోపం వంటి మోసాలకు తావు లేదు.

నష్టాలు:

8 సంవత్సరాల మెచ్యూరిటీ గడువు ఉంటుంది. అమ్మేయాలనుకున్న వారికి కొంత రుసుముతో 5 ఏళ్ళ తరువాత అమ్ముకునే సౌకర్యం.

బాండ్లపై చెల్లించే 2.5% వడ్డీని వ్యక్తిగత ఆదాయానికి జోడించి స్లాబు ప్రకారం ఉపయుక్తమైన ఆదాయపు పన్ను చెల్లించాలి.

మెచ్యూరిటీ తరువాత మార్కెట్లో బంగారం ధర మన కొనుగోలు ధరకంటే తక్కువగా ఉంటే నష్టం సంభవం. అయితే ఇది భౌతికంగా బంగారం కొన్నా ఉంటుంది.

సావెరిన్ గోల్డ్ బాండ్స్ – 2021

సావెరిన్ గోల్డ్ బాండ్లపై వివరాలకు

ప్రభుత్వం జారీ చేసే గోల్డ్ బాండ్ల నోటిఫికేషన్ ప్రకారం కొత్తగా ఈ బాండ్లలో పెట్టుబడికి తేదీలు:

మే 17న మొదలయ్యే ట్రాంచ్‌కు గాను 24 కారట్ల బంగారం గ్రాము ధర 4,777 రుపాయలుగా నిర్ణయించారు. దానిపై రీటైల్ మదుపర్లకు (మనకు) గ్రాముకు 50 రుపాయల డిస్కౌంట్ వర్తిస్తుంది. అంటే ఒక గ్రాము 4727 రుపాయలకు కొనుగోలు చెయ్యవచ్చు.

కనీస పెట్టుబడి 1 గ్రాము, గరిష్టం 4కీజీలు.

పెట్టుబడి మొత్తంపై ఏటా 2.5% వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ వడ్డీ వ్యక్తిగత ఆదాయానికి కలిపి స్లాబు ప్రకారం పన్ను కట్టవలసి ఉంటుంది.

మెచ్యూరిటీ 8 ఏళ్ళ తరువాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, లాభంపై ఎలాంటి పన్ను ఉండదు. అయిదేళ్ళ తరువాత అత్యవసరమైతే అమ్ముకోవచ్చు కానీ పన్ను మినహాయింపు ఉండదు.

డీమ్యాట్ ఖాతా ఉన్నవారు ఆ ఖాతా నుండి నేరుగా బాండ్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు జెరోధాలో ఖాతా ఉన్నవారు కింది లంకె ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు:

 జెరోధా లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇక్కడే ఈ లింక్ మీద క్లిక్ చేయండి

డీమ్యాట్ ఖాతా లేనివారు ఏదైనా ప్రముఖ బ్యాంకు శాఖకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

Stock Market

స్టాక్ మార్కెట్ ‘జీరో సం గేం’ గా పిలవబడుతుంది.

మార్కెట్లు మూసివున్న డబ్బా వంటివి అయితే అలా అనుకోవచ్చేమో, కానీ అలా కాదు. ఫ్రెష్ క్యాష్ మార్కెట్లలోకి వస్తూనే ఉంటుంది.

అంటే ఒకరికి డబ్బులు వస్తే వేరే వారికి అవి పోవాలి. లేకపోతే అవి కేవలం కాగితం మీద కనబడే లాభమే తప్ప మన జేబులోకి వచ్చినది కాదు. మనం షేర్లు కొన్నప్పుడు వేరొకరు (లేకపోతే కంపెనీ వారు) అమ్మితేనే కొనగలం. ఆ షేర్ల సంఖ్య ఫిక్సెడ్ గా ఉంటుంది. కొత్త షేర్లు ఇష్యూ చెయ్యాలంటే సెబీ వారి అనుమతి కావాలి.

మనం ₹10 లో కొన్న షేరు ₹20 లో అమ్మితే వేరే వారెవరో అది కొన్నారనే అర్ధం. కొన్ని కంపెనీల షేర్లు కొనడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడవి పతనం అయ్యి లోవర్ సీలింగు వేసుకుంటూ సున్నా కి దగ్గరగా వెళ్ళిపోతాయి. మనం ₹20 లొ కొన్న షేరు ₹10 లో అమ్ముకుంటే మనకి పోయిన పది వేరెప్పుడో ఎవరో ₹10 లొ కొని ₹20 లో అమ్మేరు గా, వారి లాభం మన నష్టం రెండూ కంపెనీకి చెందవు (ఆ కంపెనీ ఏ మన షేర్లు కొంటే తప్ప); రెండు లావాదేవీలు బ్యాలెన్స్ అయిపోయాయి రిపోర్టులో.

కంపెనీ కి కేవలం ఈ షేర్ల రూపం లో కనబడే విలువ మార్కెట్ క్యాపిటలైజేషన్ గా చూపించుకొని అదనపు నిధులు పెట్టుబడి సంస్థల నుంచీ రాబెట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆ విలువని పెరుగుతూ ఉండేలాగ వారు చర్యలు తీసుకుంటారు. వారి కంపెనీ అమ్మాలి అనుకున్నప్పుడు ఈ క్యాపిటలయిజేషన్ ఆధారంగా అమ్ముతారు కాబట్టీ ఆప్పుడు వారి జేబులోకి లాభం వచ్చి చేరుతుంది. అంతవరకూ అది కూడా కాగితానికే పరిమితం.

అందుకే దీర్ఘ కాలిక మదుపరులెవరయినా చూసేది లాభాలలో ఉన్న కంపెనీలలో మదుపు పెట్టడానికి. ప్రతీ త్రైమాసిక ఫలితాల తరువాత ఆ కంపెనీ అర్జించిన లాభాలను మొత్తం ఇష్యూ చెయ్యబడిన షేర్ల తో హెచ్చించి డివిడెండు రూపం లో ప్రతీ షేరు హోల్డరుకీ పంచుతారు.

మిగితా దైనిక స్టాక్ మార్కెట్ లావాదేవీ ఆధారిత లాభనష్టాలన్నీ మదుపరులు, లేక ఆ షేర్లు కొనుగోలు చేసిన సంస్థలు, మ్యూచువల్ ఫండులు , అవి తనఖా పెట్టబడిన బ్యాంకులకే చెందుతాయి. ఎస్టీటీ, సర్చార్జి రూపం లో గవర్నమెంటు ప్రతీ లావాదేవీ మీద సుంకం విధిస్తుంది కాబట్టీ ఎప్పటికయినా నిజంగా లాభం అనేది కేవలం మన ప్రభుత్వం మాత్రమె పొందుతుందని చెప్పాలి .

కొన్ని ఉదాహరణలు:

మీరు ఒకానొక ప్రదేశంలో రాబోవు కాలంలో అభివృద్ధి బాగా జరిగి, భూమి విలువ పెరుగుతుందని తెలుసుకుని, కొంత భూమిని కొన్నారనుకోండి. అభివృద్ధి జరగకో, ఏదో వివాదంలో చిక్కుకునో, ఆ భూమి విలువ పడిపోయిందనుకోండి. అప్పుడు నష్టపోయిన డబ్బు ఎక్కడకు పోయినట్టు?

మీకు అనుకోకుండా కొంత డబ్బు చేతికొచ్చి, దాంతో బంగారం కొన్నారనుకోండి. కొంత కాలానికి స్టాక్ మార్కెట్లలో చాంచల్యం తగ్గటం వల్లనో, అంతర్జాతీయ పరిణామాల వల్లనో బంగారం ధర పడిపోయిందనుకోండి. మీ కొనుగోలు నష్టపూరితమైనదా?

ఓ సంస్థ IPOలో షేర్లు కొన్న మదుపరి వాటిని అలాగే అట్టిపెట్టుకుని బయ్ బ్యాక్[1]లో తిరిగి ఎక్కువ ధరకు కంపెనీకి అమ్మితే నష్టపోయింది ఎవరు?

ఓ సంస్థ షేర్లు ఒకరు 10 రూపాయలకు కొని, 9 రూపాయలకు అమ్మేసారు. అయితే, మధ్యలో డివిడెండ్ 2 రూపాయలు వచ్చుంటే ఇది నష్టపూరిత లావాదేవి కాదు.

కొందరు మదుపర్లు తమ పోర్ట్ ఫోలియో రక్షణకు హెడ్జింగ్ ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో ఓ సంస్థకు చెందిన ఒక సాధనంలో ఎక్కువ లాభం కొరకు అదే సంస్థకు చెందిన మరో సాధనంలో కాస్త నష్టం నమోదు చేసుకుంటారు. అప్పుడు కూడా ఇది Zero Sum Game అవ్వదు.

Stock Market

స్టాక్ మార్కెట్ లు ఎప్పుడు ఎలా ఎందుకు పతనమవుతాయి అన్నది బ్రహ్మరహస్యం కన్నా సూక్ష్మమైన రహస్యం లాంటిది. మహమహా మేధావులు తమ బుర్ర చించుకున్నా కూడా ఈ రహస్యాన్ని అర్థం చేసుకోలేకున్నారు. కొన్ని కారణాలు ఎంతో కష్టం మీద ఊహించాలి. నా ఊహలు ఇవి. (నేను స్టాక్ మార్కెట్ నిపుణున్ని కాదు కానీ స్టాక్ మార్కెట్ లలో కొన్ని తన్నులు తిన్న మదుపరిని.)

బటర్‌ఫ్లై ఎఫెక్ట్ గురించి వినే ఉంటారు. సుకుమార్ గారు “నాన్నకు ప్రేమతో” చిత్రంలో వివరించారు.

ప్రపంచంలో ఒక మూలన సీతాకోకచిలుక రెక్కలాడిస్తే, ఆ పిల్లగాలి ప్రపంచంలో మరో మూలకు వెళ్ళేసరికి తుఫానులా పరిణమిస్తుందంటారు. అలాంటిది కొరోనా వంటి తుఫానే ఒక మూల బయలుదేరితే మరి ప్రపంచం మొత్తం ప్రకంపనలు ఉంటాయి.

స్టాక్ మార్కెట్లకు ఈ సిద్ధాంతం భేషుగ్గా సరిపోతుంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నో దేశాల సమాగమం కాబట్టి.

కరోనా వల్ల దేశంలో ఆఫీసులకు, ఫాక్టరీలకు పోయే జనాభా తగ్గింది. దరిమిలా ఆ ఫాక్టరీల ఉత్పత్తులు తగ్గాయి. అలాంటి ఫాక్టరీలకు మూల పదార్థాలు (Raw Material) సప్లై చేసే కంపెనీలు గనక ఇండియాలో ఉంటే అవీ లాసు. దరిమిలా ఈ కంపెనీల షేర్లు లాస్.

ఈ రా మెటీరియల్ సప్లై చేసే కంపెనీ వేటి మీద ఆధారపడిందో ఆ కంపెనీలన్నీ లాస్.

దేశంలో కరోనా వల్ల నాన్ వెజ్ వాడకం తగ్గింది. దరిమిలా అనుబంధమైన అనేక సంస్థలు, వ్యాపారాలకు దెబ్బ. కోళ్ళ ఫారాలు, ఆ కోళ్ల ఫారాలలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్ల పైన ఆధారపడిన ఇతర వ్యాపారాలు, కోళ్ళ ఫారాలలో కోళ్ళకు సప్లై చేసే ఫుడ్, ఆ ఫుడ్ సప్లై చేసే సంస్థలు వగైరా వగైరా.

కరోనా వల్ల జనాలు ట్రావెల్ చెయ్యడం మానేశారు. దరిమిలా ట్రావెల్ మీద ఆధారపడిన ఐర్ లైన్ సంస్థలకు భారీ నష్టం. జనాలు ట్రావెల్ చెయ్యట్లేదు గనక. తద్వారా ఎయిర్ పోర్ట్ లకు నష్టం. ఎయిరోప్లేన్ లలో ఫుడ్ సప్లై చేసే సంస్థలకు నష్టం. ఎయిర్ ప్లేన్ ల ద్వారా బట్వాడా అయ్యే సరంజామా, కొరియర్ కంపెనీలు వీటికి నష్టం. కొరియర్ కంపెనీల మీద ప్రపంచం మొత్తం ఆధారపడింది కాబట్టి అంతలక్కా నష్టం.

అలాగే దేశంలో నెట్ వర్కింగ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో నిపుణులు ఇంటికాడ పడుకుంటే నెట్ వర్కింగ్ లో వచ్చే రోజువారీ సమస్యలను ఫిక్స్ చెయ్యడం కష్టం అవుతుంది. ఆ సమస్యలు త్వరగా తెమలకపోతే వాటిపై ఆధారపడిన డిజిటల్ కంష్యూమర్ సంస్థలకు దెబ్బ.

ఉదాహరణ:

చైనాలో కార్ల భాగాలు తయారు చేసే కర్మాగారం కొరోనా వల్ల తాత్కాలికంగా మూతపడిందనుకోండి.

మన దేశంలో ఆ భాగాలతో కార్లు తయారు చేసే సంస్థలు ఇప్పుడేం చెయ్యాలి? అవీ మూతపడితే ఎంత నష్టం?

అక్కడ పని చేసే కూలీలకు ఏది దిక్కు? వారికి భృతి లేకుండా ఏం తింటారు? వారు సరుకులు కొనకపోతే కిరాణా కొట్లు ఏమైపోవాలి? కిరాణా కొట్లు కూడా సరుకులు కొనటం ఆపేస్తే అవి తయారు చేసే సంస్థలు ఉత్పత్తి ఆపేస్తాయి కదా? వీరు ముడిసరుకు కొనకపోతే రైతులకు ఏది దిక్కు?

వ్యాపారము, వర్తకము, వ్యవసాయము, ఇలా అన్నీ అంతస్సంబంధాలు కలిగి ఉంటాయి. కాస్త ఉల్లేఖించి చెప్పినా టూకీగా విషయం ఇదే.

వ్యాపారాలను దెబ్బతీసేది లేదా అటకాయించేది (తాత్కలికమే కావచ్చు) ఏదైనా సరే స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష బింబం స్టాక్ మార్కెట్లు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే – స్టాక్ మార్కెట్లు విపరీత మూల్యాంకనం వద్దకు చేరిన ప్రతి సారీ దిద్దుబాటుకు గురౌతాయి. సరిగా ఆ సమయానికి దిద్దుబాటుకు ఏదో ఒక కారకం సిద్ధిస్తుంది. ఇలాంటప్పుడు పెట్టుబడికి వెనుకాడితే స్టాక్ మార్కెట్లలో ఉండటం లాభదాయకమే కాదు.

ఇట్లా ఎన్నో ఉన్నాయి. మనం చెయ్యగలిగిందల్లా, పతనం అవుతున్నాయని గ్రహించి తెలివిగా మసులుకోవటమే.

Stock Market

స్టాక్ మార్కెట్ లో investing మొదలు పెట్టాలంటే ముందుగా మీరు చేయవల్సిన పని సెబి దగ్గర రిజిస్టర్ అయిన ఏదైనా ఒక బ్రోకరేజి సంస్థలో ఒక డిమాట్ అకౌంట్ ను తెరువాలి.
ఉదాహరణకు దేశంలో అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జెరోధా లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇక్కడే ఈ లింక్ మీద క్లిక్ చేయండి
ఇండియాలో అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకర్ అయిన జెరోదాలో 2021 నాటికి 25 లక్షల పైన ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయి.వాటిలో కనీసం 15 లక్షల ట్రేడింగ్ అకౌంట్లు ఆక్టీవ్ గా ట్రేడ్ అవుతుంటాయి.
దేశం మొత్తంలో అందరి బ్రోకర్స్ లో దాదాపు 17% మార్కెట్ వాటను ఒక్క జెరోదానే కలిగి ఉన్నది.
జెరోదాకు డిస్కౌంట్ బ్రోకర్ అని ఎందుకు పేరు అంటే ఇది ఐ.సి.ఐ.సి.ఐ సెక్యురిటీస్ లిమిటెడ్, హెచ్.డి.ఎఫ్.సి. సెక్యురిటీస్ లిమిటెడ్, ఎస్.ఎం.సి గ్లోబల్ సెక్యురిటీస్ మాదరిగా ఫుల్ సర్వీస్ బ్రోకర్ కాదు.ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ లలో ఫిజికల్ ఆఫీసులతో పాటు మరికొన్ని ఇతర సర్వీసులు కూడా కలిసి ఉంటాయి.ఇవన్ని మేయింటేన్ చేయాలంటే కస్టమర్నుండి బ్రోకర్ ఎక్కువమొత్తంలో కమీషన్ చార్జిచేయాలి.అవేమి లేకుండా తక్కువ ఖర్చుతో మినిమం మేయింటేన్స్ లతో జెరోదా నడుస్తుంది.అందుకే వారికి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.స్టాక్స్ లో డెలివరి పొజిషన్ తీసుకుంటే మీకు జెరోదాలో 0% బ్రోకరేజి ఉంటుంది.ఇతర సర్వీస్ టాక్స్, జి.ఎస్.టి.సెబి టర్నోవర్ చార్జీలు మాత్రం స్వల్పంగా ఉంటాయి. కాబట్టి జెరోదాలో స్టాక్స్ డెలివరి బయ్ సెల్ చేసేవారికి బ్రోకరేజి చార్జీలు ఉండవు కాబట్టే ఇలాంటి బ్రోకరేజి సంస్థలను డిస్కౌంట్ బ్రోకర్స్ అంటారు.

జెరోధాలో లేదా ఇతర ఏ బ్రోకరేజి సంస్థలోనైనా ముందుగా డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాడానికి మీరు ఆన్ లైన్ లో కంప్యూటర్ మీద కాని మోబైల్ మీద కాని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.అకౌంట్ ఓపెన్ చేయడానికి ముందే మీరు కొన్ని డాక్యుమెంట్స్ రెడిగా స్కాన్ చేసి కాని ఫోటో తీసికాని రెడిగా పెట్టుకోండి.అవి.

మీ ఆధార్ కార్డ్.
మీ పాన్ కార్డు
మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు (బ్యాంకులో మీ పేరు,మీ అకౌంట్ నెంబర్ , మీ బ్యాంక్ పూర్తి పేరు, బ్యాంక్ ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్ + ఎమ్.ఐ..సి.ఆర్ కోడ్(IFSC+MICR CODE)
మీకు ఏ బ్యాంకు లో ఖాతా ఉన్నదో ఆ బ్యాంక్ కేన్సిల్డ్ చెక్ .
గత 6నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ లేదా గత ఏడాడి ఐ.టి. రిటర్న్.
మీ మోబైల్ నెంబర్
మీ ఈమేయిల్ ఐ.డి.
మీ పాస్ పోర్ట్ సైటు ఫోటో.

పై 8 మీ దగ్గర రెడిగా ఉన్న తరువాత జెరోధాలో కాని మరెక్కడైనా బ్రోకర్ దగ్గర ప్రొసీడ్ కండి. ఆన్ లైన్ లో ప్రొసీడ్ అయినప్పుడు ఫోటో అవసరం ఉండదు, ఆన్ లైన్ లోనే మీరు ఫోటో దిగే స్టెప్ వస్తుంది.
పై డాక్యుమెంట్స్ అన్ని అప్ లోడ్ చేసాకా లేదా ఆధార్ అథ్నికేషన్ పూర్తి అయ్యాకా డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ కు ఫీజు కట్టాలి.
ఒక్కో బ్రోకర్ దగ్గర ఒక్కో రకమైన ఫీజు ఉంటుంది. జెరోధాలో రూ.200 తో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చును. కొన్ని బ్రోకర్స్ లలో ముందు ఫ్రీ అని ఉంటుంది.తరువాత ఆన్యువల్ మేయింటేన్స్ ఫీజులు హైగా ఉంటాయి.
జెరాధాలో ఈ ఫీజు ఏటా రూ.300 మాత్రమే. బ్రోకర్ ను బట్టి 1 లేదా 2,3 రోజుల్లో మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తరువాత మీకు డిమ్యాట్ అకౌంట్ + దాంతో పాటే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.మీకు అకౌంట్ ఓపెన్ అయిన తరువాత మీ ట్రేడింగ్ అకౌంట్ లోకి మీ బ్యాంక్ నుండి ముందుగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.మీకు డిమ్యాట్ అకౌంట్ దాంతో పాటే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.మీ డిమ్యాట్ అకౌంట్ నెంబర్ మీ ఫ్రోఫైల్ లో కనపడుతుంటుంది.
మీ బ్యాంక్ అకౌంట్ నుండి ట్రేడింగ్ అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స ఫర్ చేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి.
ఒక్కసారి మీ ట్రేడింగ్ అకౌంట్ లోకి మీరు డబ్బులు ట్రాన్సఫర్ చేసుకున్న తరువాత ఇక మీరు స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టవచ్చును.

ముందుగా మీరు ఏయే స్టాక్స్ లో పెట్టుబడి పెట్టదలుచున్నారో అయా స్టాక్స్ అన్ని అక్కడ ముందుగా ఆడ్ చేసుకోండి.అయా స్టాక్ ల ప్రైస్ ఎంత ఉందో నోట్ చేసుకోండి.ఇక ఒక్కో స్టాక్ సెలక్ట్ చేసి మీరు ఆయా స్టాక్స్ లో ఎన్ని షేర్లు కొనదలచుకున్నారు నిర్ణయించుకోండి.

మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే అదే రోజు షేర్లు కొని అమ్మితే అవి మీ డిమ్యాట్ ఖాతాలోకి వెళ్ళవు.మీరు అక్కడ ఆర్డర్ క్లిక్ చేసేప్పుడే ఇంట్రాడేనా(INTRADAY) లేదా డెలివరి నా ( క్యాష్ అండ్ క్యారి CNC)అనే అప్షన్ కనపడుతుంది. ముందుగా మీరు మీకు నచ్చిన షేరు సెలక్టు చేసుకోవాలి. ఉదా .ఎస్.బి.ఐ. బ్యాంక్ షేరును డెలివరి తీసుకుంటే ఆ షేరకు ఇప్పుడున్న రేటు ప్రకారం రూ.200 మీ అకౌంట్ లో ఉంటే సరిపోతుంది.అలాగే 100 ఎస్.బి.ఐ. షేర్లు కొనాలంటే రూ.2000 ఉంటే సరిపోతుంది. అదే రిలయన్స్ షేరు కొనదలుచుకుంటే ఇప్పుడున్న రేట్లో రూ.2100 ఉంటే ఒక్క రిలయన్స్ షేరును కొనవచ్చును.అంటే రిలయన్స్ 10 షేర్లు కొనాలంటే రూ.20వేలు, రిలయన్స్ 100 షేర్లు కొనాలంటే రూ.2లక్షలు, అదె డా.రెడ్డి లాబ్స్ షేరు ను కొనాలాంటే ఇప్పడున్న రేట్లో 1 షేరుకు రూ.5000 ఉండాలి. అదే 10 షేర్లకు రూ.50వేలు, 100 షేర్లకు 5లక్షలు ఉండాలి.
మీ అకౌంట్ లో ఉన్న డబ్బుల మేరకే అదే విలువ కల షేర్లు మీరు కొనగలరని దీంతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. అదే ఇంట్రా డే ట్రేడింగ్ లో బ్రోకర్ మార్జిన్ మని ఇస్తాడు .దాంతో 10,20 రెట్ల లెవల్లో కూడా మీరు షేర్లు కొనవచ్చును.ఉదా. ఇంట్రాడే లో డా.రెడ్డిస్ లాబ్స్ షేరు కొనాలంటే మీ దగ్గర రూ.5000 ఉండాల్సిన పనిలేదు.అంతకు 10 లేదా 20 రెట్ల తక్కువగా (ఇది షేరును బట్టి మారుతుంటుంది) అంటే రూ.500తో కూడా డా.రెడ్డిస్ లాబ్స్ 10షేరు కొనవచ్చును. కాని సాయంత్రం 3.10 కల్లా ఖచ్చితంగా తిరిగి లాభానికో లేదా నష్టానికో అమ్మాల్సిందే. అది ఒక వేళ 3.10 సమయానికి నష్టంతో నడుస్తుంటే దాన్ని డెలివరి పోజిషన్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. కాని మీ అకౌంట్ లో దాని 1 షేరు పూర్తి విలువ ఐన రూ.5000 ఉండాల్సిందే.

స్టాక్ మార్కెట్లో షేర్లలో నష్టపోయిన 90శాతం మంది డే ట్రేడర్స్ నే ఉంటారు. ఎక్కు వ లాభాలు వస్తాయని ఎక్కువ మొత్తం మార్జిన్ మని తో లేని డబ్బుతో ట్రేడింగ్ చేస్తే లాభం ఎంత ఎక్కువగా వస్తుందో నష్టం కూడా అంతే ఎక్కువగా వస్తుంది. కొత్తగా ఇన్వెస్ట్ మెంట్ మొదలుపెట్టిన ఎవరు కూడా కనీసం 1 ఏడాది పాటు డే ట్రేడింగ్ చేయకపోవడమే మంచిది. ఏడాది వరకు కేవలం డెలివరి పోజిషన్స్ మాత్రమే తీసుకోండి.

మీరు ఇంట్రా డే ట్రేడింగ్ కాకుండా డెలివరి పోజిషన్ ( క్యాష్ అండ్ క్యారి CNC)తీసుకుని బయ్ చేసిన షేర్లు 3వర్కిండ్ డేస్ లో మీ డిమాట్ అకౌంట్ లో కనపడుతాయి. దీన్నే T+2 Days వర్కింగ్ డేస్ లో మీ డిమాట్ అకౌంట్ అకౌంట్ లోకి షేర్లు జమ అవుతాయి అని చెపుతుంటారు. T+2 Days అంటే మరేం లేదు. ఈరోజు బయ్ చేసారంటే మధ్యలో వచ్చే సెలువులు కాకుండా మరో 2 రోజుల్లో మీ డిమాట్ అకౌంట్ లోకి షేర్లు వెళ్ళుతాయి.వాటిని ఇక మీరు ఎప్పుడైనా తిరిగి అమ్ముకోవచ్చు.మీ డిమ్యాట్ అకౌంట్ లోకి వెళ్ళడానికంటే ముందే అంటే మర్నాడు కూడా అమ్మవచ్చును.2 రోజులు ఆగి అమ్మవచ్చును. ఏడాది తరువాత అమ్మవచ్చు లేదా 10 ఏండ్లకో 30ఏండ్ల తరువాతో కూడా అమ్మవచ్చును.
మీరుషేర్లు కొన్న తరువాత ఈలోపు వాటివిలువ డౌన్ అయితే మీ అకౌంట్ లో మీపెట్టుబడుల విలువ లాస్ లో చూపిస్తుంటుంది. అదే లాభాల్లో ఉంటే ఫ్రాఫిట్ లో చూపిస్తుంటుంది.