Wealth News

ఇది చాలా క్లిష్టమైన పని.ఒక మంచి న్యాయ వాదికి చూపిస్తే కానీ అన్ని కాగితాలు, అనుమతులు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ముఖ్యంగా కావలసినవి, సేల్డీడ్,మునిసిపాలిటీ లేదా పంచాయతీ వారి అనుమతి,గత 25సంవత్సరాలుగా ఆ ఆస్తి ఎవరి చేతులలో ఉన్నదో తెలిపే ఈసీ.

సాధారణంగా అమ్మే వారు అన్ని ఇస్తారు. కానీ ఒక్కొకప్పుడు కొంత మంది నకిలీవి ఇస్తారు.ఈ కాలంలో మన దేశంలో నకిలీవి. సృష్టించడంచాలా తేలిక.అందువలననే మనకు పరిచయం లేని వారినుండి లేదా ఆ ప్రదేశంలో స్థిరనివాసం లేని వారి నుండి ఆస్తి కొనడం చాలా ప్రమాదం. కొంత మంది తప్పుడు కాగితాలతో మనకు రిజిస్ట్రేషన్ చేసి ఎక్కడికో పోతారు. ఆతరువాత అసలు సొంతదారులు వస్తారు.అప్పుడు సమస్య మొదలు అవుతుంది. ఈసమస్య ఖాళీ ప్లాట్ల విషయంలో ను కొన్ని ఇళ్ళ విషయంలో ను జరుగుతుంది. కావున ముందు మనము చూసుకోవలసినదేమిటంటే అమ్మే వాడు నమ్మకస్తుడేనా మరియు ఈ ఆస్తిని న్యాయం గానే సంపాదించాడా,?ఇక్కడే స్థిరనివాసం ఉంటున్నాడా?దళారుల మాటలు నమ్మి త్వరపడి ఏదీ కొనకూడదు. వీరు తొందరపెట్టి నకిలీ పత్రాలతో అమ్మేస్తారు.మనదేశంలో న్యాయ వాదులు పత్రాలను చూసి న్యాయ సలహా ఇస్తారు.కానీ రేపేదైనా తేడా వస్తే ఆయనదేమీ బాధ్యత లేదు.ఆ ఆస్తి మీద ఇప్పటికే బాంకు లోను తీసుకుని ఉంటే ఆ పత్రాలను పరిశీలించండి.అలాగైతే కొంత వరకు అది సక్రమ మైన ఆస్తి అనుకోవచ్చు. ఈ ఆస్తి అమ్మే వారి అధీనంలో 12 లేదా 25సంవత్సరాల నుండి ఉంటే మనము తీసుకోవచ్చు. ఈ ఆస్తి ఈమధ్యనే కొన్న దైతే ఆలోచించాలి.ఇది వారసత్వ ఆస్తి ఐతే బాగా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి.వేరే వారసుల చేత కొంత మంది సాక్షి సంతకాలు. చేయించుకుంటారు.

ఇక ముస్లింల ఆస్తుల లో చాలా సమస్యలుంటాయి అంటారు.

నేను ముఖ్య ముగా చూసేది అమ్మేవాడికి సమాజంలో ఎలాంటి గౌరవం ఉన్న ది.ఇది బాగుంటేనే అసలుమనము ఈ కొనుగోలు గురించి ఆలోచించాలి.లేకపోతే పూర్తిగా వదులుకోవడం మంచిది.

మన దేశంలో మోసం చేసి తప్పించుకోవడం చాలా తేలిక. డబ్బు చేయిదాటినతర్వాత తిరిగి రాదు.కావున అడ్వాన్స్ ఇచ్చే టపుడే క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి.ఒకసారి తొందరపడి అడ్వాన్స్ ఇస్తే మీ డబ్బు మొత్తం పోయినట్లే.అందుకే దళారులు వచ్చి హడావుడి చేసి అడ్వాన్స్ ఇప్పిస్తారు.కావున మీరు ఈ దళారులతో బాగా ఖచ్చితంగా వ్యవహరించాలి.

ఏదైనా ఇల్లు కొనేటపుడు అనుభవజ్ణులు,మీశ్రేయోభిలాషులైన పెద్ద వారిసమక్షంలో మాట్లాడుకోండి.ఇది చాలా ఉపయోగిస్తుంది.వారి అనుభవంతో లొసుగులను తేలికగా పసికడతారు.

ఏదైనా కారుచౌకగా వచ్చేదానిని కొనకూడదు. అందులో ఏవో లొసుగులు ఉంటాయి.

ఇలు కొనెటపుడు ముందుగా లింకు కాగితాలు తీసుకోవడం తప్పనిసరి మరియు ఇ.సి పేపరు రిజిస్ట్రేషన్ ఆఫీసు లో కాని మీ సేవ లో కాని తీసుకోవడం తపనిసిరి దీని వల్ల ఆ ఇల్లు ఎవరి పేరు న ఉన్నదొ మనకు తెలిసిపొతుంది అమ్మేవారు పేరు ఇ.సి లో ఉన్నవారి పేరు సరి చూసుకోవాలి పేరు సరిపోయి ఉంటే ఎలాంటి అనుమానం అవసరం లేదు .ఒక వేళ మీరు ఎఛ్ .ఎమ్ .ఢి .ఏ లో తీసుకోవాలనుకుంటే పైనల్ లేఅవుట్ అపృవ్ఢ్ లెటర్ తప్పనిసరి

Wealth News

IP అంటే Insolvency petition. ఒక వ్యక్తి /సంస్థ తన ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువగా ఉన్నాయని, తాము ఆ అప్పులను తీర్చలేమని కోర్టు లో వేసే దావా నే ఐ పీ.

IP అంటేనే insolvency petition.

పిటీషన్ అంటే అభ్యర్థన.అది అందరికీ తెలుసు. సొల్వెన్సీ అంటే దివాళా తీయడం.

ఒక వ్యక్తి అప్పు తీర్చగల సామర్ధ్యాని కి మించి అప్పులు చేసి,కొంతకాలం పాటు నమ్మకం గా వడ్డీలు కడు తూ మరి కొంత అప్పు చేసి రుణ దాతలు గ్రహించి పట్టుకునే లోపే రాత్రి కి రాత్రి వుడాయించి కొద్ది రోజుల తరువాత రావడమూ లేదా కనిపించక పోవచ్చు.

వెంటనే కోర్టులో IP దాఖలు చేయడం.

ఒక వ్యక్తి I P పెట్టాడు అని అంటే సమాజంలో బతుకు వున్నా మరణించిన వాని కింద లెక్క.

కోర్టు ఈ సంస్థ / వ్యక్తి యొక్క ఆర్ధిక వివరాలు తనిఖీ చేసి, వారిని insolvent గా ధ్రువ పరుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ, ఒక రిసీవర్ ని నియమిస్తుంది.

ఆ రిసీవర్ ఆస్తులని అమ్మి, ఆ నిష్పత్తి లో అప్పులకి చెల్లింపులు చేసి ఆ విషయాన్ని పూర్తి చేస్తారు. అందుకు కొంత గడువు ఉంటుంది.

ఐపీ పెట్టడం అనేది ఎందుకంత చర్చనీయంగా ఉంటుంది అంటే, ఆ వ్యక్తి కి ఇచ్చిన అప్పు, పూర్తిగా వసూలు అయ్యే అవకాశం ఉండదు, దొరికిన ఏ కాస్త తో అయినా సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక. ఋణదాతలకి తమ దగ్గర అప్పు తీసుకున్న వారు ఐపీ పెడితే అందుకే ఇబ్బంది.

ఈ విధి విధానాలలో మార్పులు చేస్తూ, సంస్కరిస్తూ Insolvency and Bankruptcy code , 2016 ని భారత ప్రభుత్వం శాసనం చేసింది. Insolvency and Bankruptcy board ఈ విధానాలకి Nodal authority.

కాలానుగుణంగా చెప్పాల్సి వస్తే,

లేవు, అయితే ఏంచేస్తావ్ అనేదే ఐ. పి.

ఐ. పి. అంటే సివిల్ డెత్ అని అంటారు. అంటే అతను భౌతికంగా ఉన్న కూడా సంఘం దృష్టిలో లేనట్టే.

జీవచ్ఛవం అనేది సరి అయిన పదం కావచ్చు.

అంటే నమ్మించి మోసము చేయటం.

అయితే ఇదంతా చట్టం దృష్టిలో మాత్రమే.

నేను విన్న సామెత ఏమంటే,

ఆరు సార్లు ఐ. పి పెట్టిన వాడిని వెదికి మరి పిల్లను ఇవ్వమన్నారు.

ఎందుకంటే, ఒక సారి ఐ. పి అంటే ఏదో పరిస్థితులు అనుకూలించక జరిగింది అనుకోవచ్చు కానీ మహానుభావుడు అదే పనిలో ఉంటే ఏంటి, జనాలు ఆయన ఏమి చెప్పిన నమ్ముతారు అని.

మరి అంత తెలివితేటలు గలవాడిని ఊరకే పోనిస్తే ఎలా, అల్లుడు అయితే, సహాయం గా వుంటాడు, ఇంకోటి, మనం జాగ్రత్తగా ఉండి అప్పు ఇవ్వము. ఇచ్చిన సారు ఎలాగూ ఆస్తి భార్య పేరునే దాస్తాడు కాబట్టి అమ్మాయి క్షేమంగా ఉంటుంది.

Wealth News

వీలునామా,నామినీ రెండూ వేర్వేరు విషయాలు.ఎలా అంటారా?

ముందుగా నామినీ గురించి: ఉదా:తన జీవితంపై ఒక వ్యక్తి ఒక కోటి రూపాయల కి బీమా చేసి,నామినీ గా తల్లి పేరు రిజిస్టర్ చేసాడు అనుకుందాం.పెండ్లి అయ్యి ఇద్దరు చిన్న పిల్లలు ఒకరికి 4సం. ఇంకొకరికి 6సం.బీమా చేసిన వ్యక్తికి 36 సం.వయసు.భార్య వయసు 30.

25 సం.టర్మ్ తో పాలసీ తీసుకున్నాడు.పాలసీ తీసుకున్న తరువాత 7వ సం.లో పాలసీ క్లైమ్ కి వస్తె బీమా మొత్తాన్ని తల్లికి ఇస్తారు.

పైన చెప్పిన విధంగా కాకుండా ఒక ఇరవై సం. తర్వాత 50 లక్షలు మెచ్యూరిటీ మొత్తం వచ్చేలా పాలసీ తీసుకుని పాలసీ కంతులు(వాయిదాలు) క్రమం తప్పకుండా కడుతూ వున్నాడు.భార్య పేరు వీలునామా రిజిస్టర్ చేసాడు.సదరు వ్యక్తి అనుకోకుండా చనిపోయినా,పాలసీ వ్యవధి అయిపోయినా పాలసీ మొత్తాన్ని భార్య కి ఇస్తారు.

చాలా వరకు నామినీ ఒక ట్రస్టీ మాత్రమే.నామినీ చనిపోయిన వారి యొక్క డబ్బుకు ట్రస్టీ గా వుండి నామినీ aయొక్క వారసులకు అప్పజెప్పడం ట్రస్టీ యొక్క విధి.

ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి తన బ్యాంక్ ఖాతా మరియు ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా జీవిత బీమా పాలసీ లలో మరో వ్యక్తిని సదరు రికార్డ్ లలో నామినీ గా పెట్టాడు.

ఈ పైన చెప్పిన అన్ని ఆర్థిక సంస్థల లో వున్న డబ్బులన్నీ అక్కడ ఇరుక్కు పోకుండా తీసుకునే అవకాశం ఉన్నది.అదే నామినేషన్ చేయించ క పోయి వుంటే ఆయా ఆర్థిక సంస్థల నుంచి నగదును బయటికి తీసుకు రావడం కష్టం అయి వుండేది.నామినీ గా ఎవరో ఒకరి పేరు రిజిస్టర్ చేయక పోతే

వారసత్వ ధృవీకరణ అనీ సక్సెషన్ సర్టిఫికేట్ అనీ లీగల్ హైర్స్ సర్టిఫికేట్ అనీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.మనీ ఆర్థిక సంస్థల దగ్గర ఇరుక్కు పోతుంది.

ఇలా ఆర్థిక సంస్థల దగ్గర ఇరుక్కు పోయిన మనీ చాలానే ఉంది అనీ రిపోర్టులు చెబుతున్నాయి.

సెక్షన్ 39 ఇన్సూరెన్స్ ఆక్ట్ ప్రకారం L I C పాలసీ లు తీసుకునేటప్పుడు పాలసీ దారు ఎవరినైతే నామినీగా పేరు రిజిస్టర్ చేస్తారో ఆ నామినీ కే పాలసీ దారు మరణానంతరం దరఖాస్తు చేసిన వారికి అంటే claimant హక్కుదారు నకు అన్ని రకాల పత్రములు సమర్పించిన మీదట (ఆఫీస్ ద్వారా ఇవ్వబడిన క్లైమ్ పేపర్స్ policy బాండ్ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఆధార్ కాపీ పాన్ వివరాలు) బీమా పాలసీ డబ్బు ను

నామినీ ఖాతాలో వేయడం జరుగు తుంది.

వీలునామా రాసినా నామినీ గా రికార్డ్ లలో వున్నా సదరు వ్యక్తి బ్రతికి ఉన్నంత వరకు హక్కులు అసలు వ్యక్తికి

మాత్రమే వుంటాయి.నామినీ గానీ వీలునామా ఎవరి పేరున వున్నదీ ఆ వ్యక్తి గానీ అసలు వ్యక్తి మరణానంతరం మాత్రమే

మరణించిన వ్యక్తి యొక్క ఆస్థికి,డబ్బుకు హక్కుదారులతారు.

నామినేషన్ ఎన్నిసార్లయినా మార్చుకునే వీలుంది.వెసలుబాటు వుంది. అలా ఎందుకు అని అంటే ఒక వ్యక్తి తన పెండ్లికి ముందు తన తల్లిని గానీ తండ్రిని గానీ నామినీ గా రికార్డ్ లో రిజిస్టర్ చేసి వుంటారు.కానీ పెండ్లి అనంతరం సహచరిని/భార్యని నామినీ గా రికార్డులలో పొందు పరచ వలసి ఉంటుంది.

వీలునామా కూడా రెండు రకములుగా వుండే అవకాశం ఉన్నది.

అందులో మొదటిది: తన జీవిత కాలం సదరు ఆస్థిని అనుభవిస్తూ అనంతరం వారీసులకు చెందేలా వ్రాయడం ఒక పద్ధతి.

రెండవది.సంపూర్ణ హక్కులు సంక్రమింప జేస్తూ తన ఇష్టానుసారం అనుభవించే స్వేచ్ఛ మరియు అమ్ముకునేందుకు హక్కు ఉండునట్లు వ్రాయడం.

ఇవి కాకుండా షేర్స్,డివిడెండ్ లు,రాయల్టీ, డిబెం న్చర్ లు,ఇలా ఎన్నో రకాల ఆర్థిక సంస్థల దగ్గర డబ్బులు వ్యక్తుల లేదా సంస్థల డబ్బులు వుండే అవకాశం ఉంది.

అందువల్ల తప్పని సరిగా నామినేషన్ దాఖలు చేయడం మంచిది.నామినేషన్ రిజిస్టర్ అయిందా లేదా అనేది తెలుసు కోవడం ముఖ్యం.

కారణం ఏమంటే బ్యాంకు వారు గానీ బీమా సంస్థలు గానీ లేదా ఇతర ఏ ఆర్థిక సంస్థలు గానీ వారికున్న పని ఒత్తిడి కారణంగా నో లేదా నిర్లక్ష్యం వల్ల నో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.

నేను 2011 లో బ్యాంక్ ఖాతా తెరిచినప్పుడు ఏజ్ ప్రూఫ్,ఆధార్,పాన్ వివరాలు,నివాస ధృవీకరణ పత్రాలు అన్నీ ఇవ్వడం జరిగింది. ఓ రెండేళ్ల తరువాత ఎందుకనో బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ మొదటి పేజీ చూడటం జరిగింది.నామినేషన్ అన్న కాలం దగ్గర not registered అని వుంది.మరలా రెండోసారి అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి కరెక్షన్ చేయించడం జరిగింది.

అందరూ అలా వుంటారు అని కాదు.అన్ని చోట్ల అలానే జరుగుతుందని కాదు.

ఈ వ్యవస్థలో ఎవరిని వారే ఉద్ధరించు కోవాలి.

Insurance Wealth News

మీకు EPF (ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) అకౌంట్ ఉందా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకోసమే. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు వచ్చే లాభాలపై మీకు అవగాహన ఉందా? ఇది తెలియక పోతే మీరు ఇన్స్యూరెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహించే ‘ఈడీఎల్ఐ’ (EDLI) స్కీమ్‌కు అర్హులే. అయితే దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

పీఎఫ్ అకౌంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఈపీఎఫ్ అకౌంట్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ఒక కంపెనీలో 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే.. అప్పుడు ఆ కంపెనీ కచ్చితంగా ఈపీఎఫ్ సేవలను ఎంప్లాయీస్‌కు అందుబాటులో ఉంచాలి. ఈపీఎఫ్ అకౌంట్ ముఖ్య ఉద్దేశం రిటైర్మెంట్ బెనిఫిట్స్. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఉత్తమమైన రిటైర్మెంట్ సేవింగ్ సాధనాల్లో ఈపీఎఫ్ కూడా ఒకటి.

మూడు సేవింగ్ స్కీమ్స్..

ఈపీఎఫ్ స్కీమ్‌లో చేరడం వల్ల పదవీ విరమణ తర్వాత కచ్చితమైన రాబడి పొందొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. కాగా ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లు మూడు రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ అనేవి ఇవి. తొలి రెండూ అంటే ఈపీఎఫ్, ఈపీఎస్ అనేవి సేవింగ్స్ స్కీమ్స్. ఇక ఈడీఎల్ఐ (ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్) అనేది ఇన్సూరెన్స్ స్కీమ్.

ఈడీఎల్ఐ అంటే ఏంటి?

అసలు ఈడీఎల్ఐ స్కీమ్ ఏంటంటే? ఇది బీమా పథకం. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఈపీఎఫ్‌ఓ అందించే బీమా ప్రయోజనం. ఇటీవల ఈ స్కీమ్‌కి సంబంధించి కొన్ని సవరణలు చేసింది ఈపీఎఫ్‌ఓ. ఎక్కువ మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈ ఇన్సూరెన్స్ లాభాలు అందించేందుకు ఈపీఎఫ్ఓ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈపీఎఫ్ సబ్‌స్కైబర్ చనిపోవడానికి ముందు ఒక సంవత్సరానికి ముందు ఒక సంస్థ లేదా అంతకంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేసి సర్వీసులో మరణించినట్టైతే వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ బీమా ప్రయోజనం కల్పించాలని EPFO నిర్ణయం తీసుకుంది. గతంలో ఇలాంటి నియమాలు ఉండేవి కావు.

ఈడీఎల్ఐ స్కీమ్ కొత్తదేమీ కాదు. 1976 నుంచే అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగులకు ఈపీఎఫ్ మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్న ప్రతి కంపెనీకి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ వల్ల ఉద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగి మరణిస్తే.. అప్పుడు వారికి ఈ ఈపీఎఫ్‌వో స్కీమ్ నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఈపీఎఫ్‌వో చట్టం కింద రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీకి ఇది వర్తిస్తుంది. ఈ కంపెనీలు ఈ స్కీమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకొని ఉద్యోగులకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్‌ను అందించాల్సి ఉంటుంది.

స్కీమ్‌లో ఎలా చేరాలి?

ఈడీఎల్ఐ స్కీమ్‌లో ప్రత్యేకంగా చేరాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ ఈపీఎస్ సేవింగ్స్ స్కీమ్స్‌తో లింక్ అయ్యి ఈ పథకంప నిచేస్తుంది. అంటే ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు అందరికీ ఈడీఎల్ఐ స్కీమ్ వర్తిస్తుంది. ఆటోమేటిక్‌గానే ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ స్కీమ్ కోసం ఉద్యోగులు పరోక్షంగా కంట్రిబ్యూట్ చేస్తారు. మీరు పని చేస్తున్న కంపెనీ ఈ స్కీమ్‌కు మీ తరుపున కంట్రిబ్యూషన్ చేస్తుంది. డీఏ, శాలరీ ప్రాతిపదికన కంట్రిబ్యూట్ మొత్తం డిసైడ్ అవుతుంది. కంపెనీ గరిష్టంగా 0.50 శాతం లేదా రూ.75లను ఈడీఎల్‌ఐ స్కీమ్‌కు మీ తరుపున కంట్రిబ్యూట్ చేస్తుంది.

స్కీమ్ ప్రయోజనాలు

ఈ స్కీమ్ ద్వారా రరూ.2.5 నుంచి రూ.6 లక్షల వరకు ఉచితంగా బీమా పొందవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగా మరణిస్తేనే.. సంబంధించిన నామినీకి ఈ బీమా మొత్తం లభిస్తుంది. అయితే ఈడీఎల్ఐ స్కీమ్ నెలకు బేసిక్ సాలరీ రూ.15 వేల లోపు ఉన్నవారందరికీ వర్తిస్తుంది. బేసిక్ సాలరీ రూ.15 వేలు దాటితే గరిష్టంగా రూ.6 లక్షల వరకే బీమా ఉంటుంది.

ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగి మరణం తర్వాత నామినీకి శాలరీకి 30 రెట్లు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఇక్కడ శాలరీ అంటే కేవలం డీఏ, బేసిక్ శాలరీని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ డబ్బుతోపాటు అదనంగా రూ.1.5 లక్షల బోనస్ కూడా అందజేస్తారు. కంపెనీలు ఉద్యోగులకు ఈడీఎల్ఐ స్కీమ్ కన్నా మంచి ఇన్సూరెన్స్ పథకాన్ని అందజేస్తే.. అప్పుడు ఈ స్కీమ్ నుంచి తప్పుకోవచ్చు. ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడే మరణిస్తే.. నామినీకి గరిష్టంగా రూ.6 లక్షల వరకు లభిస్తాయి.

డబ్బు ఎలా క్లెయిమ్ చేయాలి?

అయితే ఈడీఎల్ స్కీమ్‌లో చేరడానికి ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంప్లాయిర్ మాత్రం బేసిక్ సాలరీలో రూ.5 శాతం లేదా గరిష్టంగా 75 రూపాయలు ప్రతీ నెల చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ చనిపోతే నామినీ ఈ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు.

 ఒకవేళ నామినీ కూడా మరణిస్తే.. అప్పుడు వారి బంధువులు క్లెయిమ్ డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ పెద్ద కొడుకు తీసుకోవడానికి వీలు లేదు. అలాగే కూతురు ఉండి, ఆమెకు పెళ్లై ఉండి భర్త జీవించి ఉంటే.. అప్పుడు వీరికి కూడా క్లెయిమ్ డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలని భావిస్తే.. అప్పుడు ఫామ్ 5ని ఫిల్ చేసి ఈపీఎఫ్‌వో ఆఫీస్‌లో అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈడీఎల్ఐ మెబర్ డెత్ సర్టిఫికెట్, గార్డియన్‌షిప్ సర్టిఫికెట్, సక్సెషన్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

ఉదాహరణ గమనిస్తే..

ఈడీఎల్ఐ స్కీమ్ ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుంద్దాం. ఒక ఉద్యోగి ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్‌గా కొనసాగుతున్నారు. ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ స్కీమ్స్‌లో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగి డ్యూటీలో మరణించారు. ఈ ఉద్యోగి నెలవారీ జీతం రూ.15,000గా ఉంది. ఇప్పుడు ఉద్యోగి నామినీ ఈడీఎల్ఐ క్లెయిమ్ కోసం అప్లై చేసుకున్నారు. నామినీకి రూ.6 లక్షలు (30 x Rs 15,000) + (Rs 1,50,000) వస్తాయి.

Wealth News


ఈపీఎఫ్ అంటే ఏమిటి?

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ భారత ప్రభుత్వ సామాజిక భద్రతా కార్యక్రమం. ఈ ఫండును భారత ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (భారత ప్రభుత్వ చట్టబద్ధ శాఖ) ద్వారా అమలుచేస్తున్నారు. ఈ ఫండ్ లో యజమాని (సంస్థ యొక్క యజమాని) మరియు ఉద్యోగి వేతనం నుంచి తప్పనిసరిగా పొదుపు ఉండాలి. ముసలి వయస్సు లేదా అత్యవసర పరిస్థితిలో ఈ ఫండ్ ఉపయోగించుకోవడానికి ఉద్యోగికి అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వివిధ ఆన్ లైన్ సేవలను విస్తరిస్తుంది. ఉద్యోగులు క్రింది సేవల లబ్దిని పొందవచ్చు.

  1. పిఎఫ్ ఖాతా నిల్వ.
  2. పిఎఫ్ లావాదేవీల పాస్ పుస్తకం.
  3. ఫైల్ బదిలీ దావా.
  4. ఇతర సేవలు.

పిఎఫ్ పాస్ బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి సూచనలు

కింద పిఎఫ్ పాస్ బుక్కు డౌన్లోడ్ ప్రక్రియ వివరించబడింది.

  1. members.epfoservices.in ను దర్శించండి
  2. మీరు మొదటి సారి యూజర్ అయితే, మొదట రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు నమోదు లింక్ http://members.epfoservices.in/employee_reg_form.php to register.
  3. పేరు, మొబైల్ నెంబర్, పుట్టిన తేది వంటి కొన్ని వ్యక్తిగత వివరాలు పూరించాలి. మీ వ్యక్తిగత వివరాలే కాకుండా బాక్స్ డ్రాప్ డౌన్ నుంచి ఒక డాక్యుమెంట్ రకాన్ని (పాన్ కర్డు, ఓటరు గుర్తింపు కార్డు తదితరమైనవి) ఎంచుకొండి మరియు సంబంధిత పత్రం నంబర్ (పాన్, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య) క్రింద ఇచ్చిన టెక్స్టు బాక్స్ లో నమోదు చెయ్యండి.
  4. వివరాలను నమోదు చేసిన తర్వాత, వినియోగదారుడు “పిన్ పొందండి” ఎంపికను క్లిక్ చేయాలి.
  5. కొన్ని నిమిషాలలో, వినియోగదారు అతని/ఆమె మొబైలు ఫోనులో పిన్ పొందుతారు. తర్వాత పేజీ కింది వైపు ఉన్న బక్సు “అధికార పిన్ నమోదు” లో పిన్ నమోదు చేయండి. డిస్క్లైమర్ తర్వాత అందుబాటులో ఉన్న “నేను అంగీకరిస్తున్నాను” చెక్ బాక్స్ ఎంచుకోవటం మర్చిపోవద్దు.
  6. ఒకసారి మీరు విజయవంతంగా రిజిస్టరు చేసుకుంటే, లాగిన్ పేజీకి వెళ్ళండి. మీ పత్రం మరియు మొబైల్ సంఖ్యను నమోదు చేయండి, తర్వాత”సైన్ ఇన్ చేయి” క్లిక్కు చేయండి.
  7. తర్వాత వెబ్ పేజీ యూజర్ యొక్క ఎగువ ఎడమ వైపు “డౌన్లోడ్ ఇ పాస్ బుక్” ఎంపికను ఎంచుకోవాలి.
  8. సంస్థ ఏ రాష్ట్రం కిందికి వస్తుంది, వాకందారు పిఎప్ అకౌంటును చూస్తున్న EPFO ఆఫీసు, కోడు వివరాలు, అకౌంటు సంఖ్య మరియు యూజరు పేరు లాంటి వివరాలను ఇవ్వాలి. వివరాలను ఇచ్చిన తర్వాత ” గెట్ పిన్”ను క్లిక్ చేయండి. పాసు బుక్కు అందుబాటులో ఉంటే, వినియోగదారు అతని/ఆమె మొబైల్ నంబరులో PIN ను పొందుతారు. గమనిక: ప్రస్తుత సదుపాయం మే 2012 నుండి వేతనాల ఎలక్ట్రానిక్ చలాన్ కం రిటర్న్ లను యజమాని అప్లోడ్ చేసిన సభ్యులకే కలదు.
  9. “అధికార పిన్ నమోదు” బాక్స్ లో పిన్నును (మొబైల్ ద్వారా పొందినది) నమోదు చేయండి.
  10. .చివరగా మీరు పిఎఫ్ పాసు బుక్కు పొందుతారు మరియు పాస్ బుక్ డౌన్లోడ్ చేయడానికి “డౌన్లోడ్” బటన్ను క్లిక్కు చేయండి.
Wealth News

ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలనుకుంటున్నారా? అయితే, కానీ ఖర్చు లేకుండానే అందుకు సంబంధించిన విషయమంతా ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది. మెసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వారు ఇప్పుడు ఫ్రీ ఆన్‌లైన్‌ టెక్నాలజీ కోర్సు ఒకటి ప్రారంభించారు. దీని ద్వారా వ్యాపార నైపుణ్యాల్ని, స్టార్టప్‌కు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఈ జ్ఞానం ఎంఐటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఎంఐటి లాంచ్‌ ప్రోగ్రాంలు నిర్వహించే మార్గాల్ని చూపుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలనుకునే వారికి, వ్యాపార రంగంలో ఒక లక్ష్యంగా కొత్తగా ఏదైనా చేద్దాం అనుకునే యువత కోసం రూపొందించిన ఒక వినూత్నమైన కోర్సు ఇది. ఈ ప్రయత్నంలో వారికి ఎదురయ్యే సవాళ్లను ఎలా చేదించాలో వారు చెబుతారు.

  • ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలన్న తీవ్రమైన ఆకాంక్ష ఉన్నా, చాలా మందికి దాన్ని ఎలా ప్రారంభించాలో తెలియదు. అలాంటి వారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది హైస్కూల్‌, కాలేజ్‌ విద్యార్థులను ఉద్దేశించి రూపొందించినదే అయినా అన్ని వయసుల వారూ ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కేవలం ఆరు వారాల శిక్షణతో సొంతంగా ఒక వెంచర్‌ను ప్రారంభించడానికి అవసరమైన సాధనాలు, నైపుణ్యాలు, విషయజ్ఞానం లభిస్తాయి.

యోగ్యతలు:ఎంటర్‌ప్రెన్యూర్‌గా గానీ, మరే వ్యాపారంలో గానీ పూర్వానుభవం ఏమీ అవసరం లేదు.

శిక్షణలో

  • కొత్తగా కంపెనీని ప్రారంభించడంలో ఎదురయ్యే తీవ్రమైన ఆటంకాల్ని ఎలా అధిగమించాలి
  • కొత్త వ్యాపార ఆలోచనలకు ఎలా ఆచరణ రూపం ఇవ్వాలి.
  • మార్కెట్‌ రీసెర్చ్‌ చేయడం ఎలా? మీ ఉత్పత్తులు లేదా సేవలు మీ కస్టమర్‌ను చేరడం ఎలా?
  • మీ సంస్థకు సంబంధించిన ప్రణాళికను రూపొందించుకుని, అందులో మీ హోదాను పెంచుకోవడం ఎలా?
  • ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా వ్యాపారానికి, అమ్మకాలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఎలా
  • అనే ప్రశ్నలకు, ఇతర సందేహాలకు ఈ కోర్సులో పూర్తి సమాధానాలు లభిస్తాయి.

మరింత సమాచారం కోసం entrepreneurship

Wealth News

డాలర్ తో పోలిస్తే రూపాయి  విలువ తగ్గడం గురుంచి ఈ మధ్య మీరందరూ తరుచుగా వింటూనే ఉన్నారు.ఈ మధ్య డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 74 చేరుకోవడం మీకు తెలిసే ఉంటుంది.. అసలు రూపాయి పతనం అంటే ఏమిటో ఒక్క సారి చూద్దాం. మార్కెట్ లో ఏదైనా ఒక వస్తువు ధర పడిపోయినప్పుడు దానిని కనుగోలు చేయాలి అనుకున్న వ్యక్తీ తక్కువ ధర చేల్లిస్తాడు అనే విషయం మీకు తెలుసుకదా ? అదే విధంగా  భారత దేశంలో నివసిస్తున్న మనం రూపాయిని  కనుగోలు చేయలేము. మనం ,మనకు కావలసిన రూపాయలను జీతం ద్వారా,  మనం అందించిన సేవల ద్వారా మాత్రమే పొందగలం.కాని మీరు ఒక్కసారి ఆలోచించండి.  విదేశాల నుండి మనం దేశానికి వచ్చే టూరిస్టులు కాని, విదేశాలలో ఉన్న మన బందువులు కాని మనకు డబ్బు పంపాలి అంటే  వారూ మన దేశ రూపాయిని కనుగోలు

చేయాల్సి ఉంటుంది అంటే వారి వద్ద ఉన్న విదేశీ కరెన్సీని  మన దేశ కరెన్సీలో కి మార్చు కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వారూ వారి వద్ద గల 100 డాలర్లతో మన రూపాయిని కనుగోలు చేసినప్పుడు  ఇది వరకటి కంటే ఎక్కువ రూపాయలు పొందితే  రూపాయి విలువ తగ్గినట్టు.అంటే మార్కెటులో ధర తగ్గడం వలన వస్తువులు అధికంగా వచ్చినట్టుగా . ఉదాహరణకి గతంలో 100 డాలర్లకు 6000  రూపాయలు వస్తే ఇప్పుడు అదే 100 డాలర్లకు 7400 రూపాయలు వస్తున్నాయి.అంటే గతంతో పోలిస్తే అధిక రూపాయలు వస్తున్నాయి కదా ? మనం ఇది వరకు వంద రూపాయలు ఇచ్చి కొన్న వస్తువులు , ఈ సారి అదే వంద రూపాయలకు అవే వస్తువులు ఇదివరకటి కంటే ఎక్కువ వస్తే దాని అర్ధం వస్తువల ధర పడిపోవడమే కదా ? అదే విధంగా రూపాయి కూడా .

ఒక దేశ కరెన్సీ దాని స్వంత భౌగోళిక ప్రాంతంలో మాత్రమే చెల్లు బాటు అవుతుంది.దాని  భౌగోళిక ప్రాంతం వెలుపల డబ్బుతో సంభందమైన యే లావాదీవీ జరపాలన్న పరస్పర ఆమోదయోగ్యమైన  కరెన్సీ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించవలసి ఉంటుంది. సాదారణంగా అంతర్జాతీయ లావాదేవీలకు  us డాలర్ ను పరస్పర ఆమోదయోగ్యమైన కరెన్సీగా వాడతారు. అందువలనే ఒక దేశ కరెన్సీ  యొక్క విలువని డాలర్ తో పోలుస్తారు. మనం మన రూపాయిని డాలర్ తో పోలుస్తున్నప్పుడు  USD –INR అని సంబోదించడం జరుగుతుంది. అంటే ఒక డాలర్ విలువ ఎన్ని రూపాయలకో సమానం అనే విషయం తెలియచేస్తుంది.ఉదాహరణకు USD –INR = 74 అంటే ఒక డాలర్ కి 74 రూపాయలు సమానం .

రూపాయి విలువ పతనం వలన మన దేశం అధిక  విదేశీ నిధులను పొందలేదు. అదే రూపాయి బలంగా ఉంటే అధిక విదేశీ నిధులను పొందడానికి  అవకాశం ఉంటుంది. రూపాయి విలువ పతనం కావడం అనేది గిరాకి ,సరఫరా ,ఆర్ధిక మరియు రాజకీయ కారణాలపై ఆధారపడి ఉంటుంది.

మన దేశం మన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం , అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడం చాలా సర్వసాధారణం. ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకం పొందితే , దిగుమతి చేసుకున్న వస్తువులకు విదేశీ మారకం చెల్లించవలసి ఉంటుంది. ఇది సాదారణంగా us డాలర్ రూపంలోనే జరుగుతుంది.ఐతే మన దేశం ఎగుమతుల ద్వారా పొందే విదేశీ మారకం కంటే , చేసుకొనే దిగుమతులకు చెల్లించవలసిన విదేశీ మారకం ఎక్కువ కావడం వలన విదేశీ మారక ద్రవ్యలోటు ఏర్పడుతుంది.ఈ లోటు కొంత వరకు  NRIs పంపే డబ్బు, విదేశీ అప్పుల వలన తీరితే  మిగితా  లోటు పూరించడానికి మనం అంతర్జాతీయ  మార్కెట్ లో కనుగోలు చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే గిరాకీ అధికంగా ఉంటుందో  అప్పుడు దాని విలువ పెరుగుతుంది.దానితో మన రూపాయి విలువ తక్కువగా ఉంటుంది. 

మన దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. దానిని తగ్గించడానికి రిజర్వు బ్యాంక్ వివిధ చర్యలు తీసుకున్నప్పటికి కూడా  ద్రవ్యోల్బణం దిగిరావడం లేదు .దీనివలన విదేశీ పెట్టుబడులు తగ్గడంతో  రావలసిన డాలర్ ప్రవాహం తగగ్డం వలన కూడా రూపాయి పతనం జరుగుతుంది.

సాదారణంగా దేశంలో భారీ విదేశీ మారకం నిల్వ ఉంటుంది. వాటి నుండి దేశం చేసుకొనే దిగుమతలకు కావాల్సిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఎప్పుడైతే విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉంటాయో అప్పుడు మన అవసారాలకు సరిపడా డాలర్ కనుగోలు చేయవలసి ఉంటుంది. దానితో రాపాయి విలువ తగ్గిపోతుంది.

 దేశం చేసే స్వల్ప కాలిక ఋణాలు చెల్లించడానికి  డాలర్లు సేకరించవల్సి  ఉంటుంది. దానితో డాలర్ విలువ పెరిగి రూపాయి పతనం కావడం జరుగుతుంది.

దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా బలహీన ప్రభుత్వం అనడానికి పరోక్షంగా ఎన్నో సంకేతాలు ఉన్నాయి. పాలక పార్టీ ఎన్నో విధాన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేయడం జరుగుతుంది. దీనివలన విదేశీ పెట్టుబడి దారులు మన ఆర్ధిక వ్యవస్థపై సందేహంతో పెట్టుబడి పెట్టడానికి వేనుకాడతారు.  ఇది కూడా రూపాయి విలువపై  ప్రభావం చూపిస్తుంది.

Wealth News


అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ నుండి నో కాస్ట్ EMI గురించి మీకు తెలుసా

నో కాస్ట్ EMI అనేది ZERO % వడ్డీ, ZERO డౌన్ పేమెంట్ మరియు ZERO ప్రాసెసింగ్ ఫీజు అని వారు పేర్కొన్నారు. ఇది ఎలా సాధ్యపడుతుంది?

 ఏదేమైనా, ఆర్బిఐ నోటిఫికేషన్ ప్రకారం (17 సెప్టెంబర్ 2013 నాటిది), జీరో శాతం వడ్డీ రుణాలు ఇవ్వడంలో ఆర్బిఐ ఆర్థిక సంస్థలను నిషేధించింది. అటువంటి పరిస్థితిలో, ZERO వడ్డీ, ZERO డౌన్‌పేమెంట్ మరియు ZERO ప్రాసెసింగ్ ఫీజు వద్ద నో కాస్ట్ EMI ని ఎలా అందించవచ్చు? 

  # Buyers

 ఆన్‌లైన్‌లో బ్రౌజ్ చేసి ఆర్డర్‌ను ఇచ్ఛే మీరే Buyers.

# Sellers

 సెల్లెర్స్ అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ కాదు, అయితే అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ తరపున ఆర్డర్‌లను పొందడం ద్వారా ఉత్పత్తులు లేదా బ్రాండ్‌లను విక్రయించే మరికొందరు ఉన్నారు. ఉత్పత్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా బిల్లులోనే మీరు విక్రేత వివరాలను కనుగొనవచ్చు.

# Amazon or Flipkart

వారు కేవలం కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల మధ్య కనెక్టివిటీని అందిస్తున్నారు మరియు మధ్యలో సంపాదిస్తున్నారు.

No Cost EMI from Amazon and Flipkart – How does it work?

అమెజాన్ ఈ నో కాస్ట్ EMI ని నిర్వచించినదాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

“నో కాస్ట్ EMI అనేది మీరు EMI ప్రొవైడర్‌కు చెల్లించిన మొత్తం ,మొత్తం EMI కాలంలో సమానంగా ఉత్పత్తి యొక్క ధర అవుతుంది. 

చెక్అవుట్ సమయంలో బ్యాంకుకు చెల్లించవలసిన వడ్డీ ముందస్తు తగ్గింపుగా ఇవ్వబడుతుంది, ఇది మీకు నో కాస్ట్ EMI యొక్క ప్రయోజనాన్ని ఇస్తుంది. ”

. ఈ భావనను వివరంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. 

# మీరు రూ .30,000 ఖర్చు చేసే ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్నారని అనుకోండి.

 # ముందస్తు నో కాస్ట్ EMI డిస్కౌంట్ రూ .638 ఉందని అనుకోండి. ఇది మీ బ్యాంక్ మీకు 3 నెలల EMI వసూలు చేసే వడ్డీకి సమానం (ఇది మీరు కలిగి ఉన్న క్రెడిట్ కార్డు యొక్క ఇన్‌పుట్‌లపై ఆధారపడి ఉంటుంది).

 # ఇప్పుడు ఉత్పత్తి ధర రూ .29,362 కు తగ్గించబడింది.

 # అయితే, మీ బ్యాంక్ మీకు రూ .29,362 పై వడ్డీని వసూలు చేస్తుంది (కానీ ఉత్పత్తి ధర రూ .30 000 కాదు, ) ఇది వాస్తవ రుణ మొత్తంగా పరిగణించబడుతుంది. అందువల్ల, బ్యాంకుకు క్రెడిట్ రూ .29,362 + 3 నెలలకి రూ .638 వడ్డీ = రూ .30,000. 

# ఈ రూ .30,000 3 నెలల రూ .10,000 ఇఎంఐగా మార్చబడుతుంది. అందువల్ల, చివరికి, మీరు వడ్డీ, డౌన్ పేమెంట్ మరియు ప్రాసెసింగ్ ఫీజు లేకుండా మూడు విడతలుగా రూ .30 వేల ఉత్పత్తికి రూ .10,000 ఇఎంఐ చెల్లిస్తున్నారు. 

అమెజాన్ యొక్క దిగువ picture  ద్వారా నేను అదే చూపిస్తాను.

**అయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. పై చిత్రం లో గమనిక చూడండి, వర్తించే పన్నులు బ్యాంక్ వసూలు చేస్తాయని పేర్కొనబడింది.

Who will pay the No Cost EMI Discount?

ఆర్‌బిఐ నోటిఫికేషన్ గురించి నేను పైన పంచుకున్నట్లుగా, ఇప్పుడు ఏ ఆర్థిక సంస్థలను ZERO శాతం వడ్డీకి రుణం ఇవ్వడానికి అనుమతించలేదు. అటువంటి పరిస్థితిలో, మీ వడ్డీ భాగాన్ని ఎవరు చెల్లిస్తారు? 

ఇది మీరు లేదా ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ కాదు, కానీ విక్రేతలు, చిల్లర లేదా బ్రాండ్ దీనిని వారు భరిస్తారు. 

అందువల్ల, మీరు ఈ భాగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Why the No Cost EMI is so short?

నో కాస్ట్ EMI లను మీరు గమనించినట్లయితే, అవి 3 నెలల నుండి 6 నెలల వరకు పరిమితం చేయబడతాయి. 

6 నెలలకు మించి ఎందుకు ఉండకూడదు? 

కారణం సులభం. ఇది విక్రేతలు, చిల్లర వ్యాపారులు లేదా బ్రాండ్ భరించే ఖర్చు. అందువల్ల, loan యొక్క పదవీకాలం ఎక్కువ  ఉంటె వారు తమ జేబులో నుండి ఎక్కువ చెల్లించాలి. వారు దానిని చాలా తక్కువగా ఉంచుతారు, మీకు ఎటువంటి వడ్డీ లేదా ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా నెలవారీగా చెల్లించడం కొంత సుఖంగా ఉంటుంది, అయితే అదే సమయంలో వారు ఉత్పత్తులను అమ్మాలి. అందువల్ల, చివరికి, మీకు, బ్యాంకులకు (ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లంఘించని) మరియు అమ్మకందారులకు ఇది సంతోషకరమైన పరిస్థితి.

Whether No Cost EMI is actually ZERO cost EMI?

అటువంటి రుణాలపై బ్యాంకులు మీకు పన్ను వసూలు చేస్తాయని పై చిత్రంలో (నేను గమనికను హైలైట్ చేసిన చోట) గమనించాను. అందువల్ల, ఈ టాక్స్ మీకు అదనపు ఖర్చు, అలాంటి కొనుగోళ్లను మీరు భరించాలి. 

వర్తించే పన్ను అంటే జిఎస్‌టి, ప్రస్తుతం ఇది 18%. పన్నును పరిగణనలో

కి తీసుకున్న తర్వాత మీకు ఎంత ఖర్చవుతుందో చూద్దాం.

3 నెలలకు EMI నెలకు రూ .10,000 ఉన్నప్పటికీ, అసలు EMI దీని కంటే ఎక్కువ మరియు మీరు చివరికి రూ .30,000 కంటే ఎక్కువ చెల్లించడం తో ముగుస్తుంది. 

అందువల్ల, అమ్మకందారుడు రూ .638 యొక్క వడ్డీ భాగాన్ని భరించినప్పటికీ, మీరు ఇప్పటికీ అసలు EMI కన్నా ఎక్కువ చెల్లించవలసి ఉంటుందని నేను చెప్పగలను, ఈ ఆన్‌లైన్ అమ్మకపు పోర్టల్స్ మీరు దానిని సరిగ్గా గమనించే విధంగా చూపిస్తాయి. 

విక్రేత రూ .638 భరించాడు మరియు మీరు రూ .114 పన్నును కట్టుకోవాలి. 

అందువల్ల, నో కాస్ట్ EMI పూర్తిగా ZERO వడ్డీ లేదా ZERO ప్రాసెసింగ్ EMI కాదు, మీరు ఇంకా వడ్డీ భాగంపై పన్నును భరించాలి.

 మీరు ఏదైనా ఉత్పత్తులను కొనడానికి ముందు ఈ ఖర్చును తనిఖీ చేయండి.