News

భారత ప్రభుత్వం దేశంలో స్టార్టప్ల కోసం అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి ‘స్టార్టప్ భారత్’ కార్యక్రమాన్ని ప్రకటించింది. వివిధ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు వివిధ ప్రయోజనాల కోసం కార్యక్రమాలను ప్రారంభించాయి. ఎంపిక చేసిన సంస్థలకు ఏకరూపత తీసుకురావడానికి ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కలిసి స్టార్టప్లకు ఒక నిర్వచనాన్ని తయారుచేసాయి.

స్టార్టప్ నిరవచనం (ప్రభుత్వం పథకాల ప్రయోజనం కోసం మాత్రమే)

స్టార్టప్ అంటే ఒక ఎంటిటీ, ఐదు సంవత్సరాల ముందు భారతదేశంలో నమోదు చేసుకొని ఉండి దాని వార్షిక టర్నోవర్, గతంలోని ఆర్థిక సంవత్సరంలో, 25 కోట్లు మించకుండా ఉండి సాంకేతిక లేదా మేధో సంపత్తిని ఉపయోగిస్తూ ఆవిష్కరణ, అభివృద్ధి, విస్తరణ లేదా కొత్త వస్తువుల, ప్రక్రియల లేదా సేవల వ్యాపారీకరణ దిశగా పనిచేస్తు ఉండాలి. అప్పటికే ఉన్న వ్యాపారాన్ని విడగొట్టి లేదా పునర్నిర్మాణం చేసిన వాటికి ఇది వర్తించదు. ఒక ఎంటిటీ టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో 25 కోట్లు దాటినా లేదా నమోదు తేదీ నుండి 5 సంవత్సరాలు పూర్తయినా దాని స్టార్టప్ గా ఆమోదించరు.

ఒక స్టార్టప్ అంతర్గత మంత్రుల బోర్డు నుండి ధ్రువీకరణ పొందిన తర్వాతే పన్ను ప్రయోజనాలు పొందడానికి అర్హత పొందుతుంది.

పదాల నిర్వచనం

  • ఎంటిటీ – ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (కంపెనీల చట్టం, 2013) లేదా ఒక రిజిస్టర్ పార్టనర్షిప్ ఫర్మ్ (భారతీయ భాగస్వామ్య చట్టం, 1932) లేదా పరిమిత బాధ్యత భాగస్వామ్యం (పరిమిత బాధ్యత భాగస్వామ్య చట్టం, 2002).
  • టర్నోవరును కంపెనీల చట్టం, 2013 కింద నిర్వచించినది.
  • పైన చెప్పిన నిర్వచనం ప్రకారం ఉన్నవ్యాపారాలను గుర్తించటం – అభివృద్ధి మరియు వ్యాపారాత్మక లక్ష్యంతో వ్యాపారం చేసేవి
  • ఒక కొత్త ఉత్పత్తి లేదా సేవ లేదా ప్రక్రియ; లేదా
  • ఇప్పటికే ఉన్న వాటిలో ఉత్పత్తి లేదా సేవ లేదా ప్రక్రియను గణనీయంగా మెరుగుపరచటం. దాని వలన వినియోగదారులకు లేదా వర్క్ ఫ్లోకు లాభం చేకూరుతుంది.

కేవలం అభివృద్ధి

  • వ్యాపారీకరణ శక్తి లేని ఉత్పత్తులు లేదా సేవలు లేదా ప్రక్రియలు ; లేదా
  • అవసరం లేని ఉత్పత్తులు లేదా సేవలు లేదా ప్రక్రియలు; లేదా
  • పరిమితంగా పెరుగుతున్న లేక విలువ పెరగని ఉత్పత్తులు లేదా సేవలు లేదా ప్రక్రియలు లేదా వినియోగదారులు లేదా వర్క్ ఫ్లో.

ఈ నిర్వచనం పరిధిలోకి రానివి

  • అంతర్గత మంత్రుల బోర్డు – పన్ను సంబంధిత ప్రయోజనాలు ఇవ్వటానికి, వ్యాపారాల వినూత్న స్వభావాన్ని ధ్రువీకరించడానికి అంతర్గత మంత్రిత్వ బోర్డును డిఐపిపి ఏర్పాటు చేసింది. అంతర్గత మంత్రుల బోర్డు పరిమితి లేని లేదా మోసంపూరిత అప్లికేషనుల చూడటానికి ఉంటుంది.

స్టార్టప్ గుర్తింపు ప్రక్రియ

‘స్టార్టప్’ గుర్తింపు ప్రక్రియ మొబైల్ అనువర్తనం/ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ పోర్టల్ ద్వారా ఉంటుంది. కింది పత్రాలలో ఏదైనా ఒక సాధారణ పత్రాన్ని స్టార్టప్ సమర్పించాల్సి ఉంటుంది:

  • దేశంలోని ఒక పోస్ట్-గ్రాడ్యుయేట్ కాలేజ్ లో స్థాపించబడిన ఒక ఇంక్యుబేటర్ నుండి డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) పేర్కొన్న విధంగా (వ్యాపార వినూత్న స్వభావానికి సంబంధించి) సిఫార్సు పొందాలి; లేదా
  • పథకంలో భాగంగా GoI నుండి (ప్రాజెక్ట్ కు సంబంధించి) మూలనిధిని పొందుతున్న ఒక ఇంక్యుబేటర్ ద్వారా మద్దతు లేఖను; లేదా
  • DIPP ద్వారా పేర్కొన్న విధంగా GoI ద్వారా గుర్తింపు పొందిన ఒక ఇంక్యుబేటర్ నుండి (వ్యాపార వినూత్న స్వభావానికి సంబంధించి) సిఫార్సు ; లేదా
  • 20 శాతం ఈక్విటీ కంటే తక్కువ కాకుండా ఇంక్యుబేటర్ ఫండ్/ఏంజెల్ ఫండ్/ప్రైవేట్ ఈక్విటీ ఫండ్/అక్సిలేటరు/ఏంజెల్ నెట్వర్క్ నుంచి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (సెబి)లో రిజిస్టరయిన, దానితో లెటరు ; డిఐపిపి ఇటునంటి ఫండును ప్రతికూల జాబితాలో చెరుస్తుంది ; లేదా
  • ఆవిష్కరణను పెంపొందించడానికి ఏదైనా పేర్కొన్న పథకంలో భాగంగా GoI లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ నిధుల లేఖ; లేదా
  • వ్యాపార స్వభావానికి సంబంధించిన ప్రాంతాల్లో భారత పేటెంట్ కార్యాలయ జర్నల్ లో ప్రచురించిన పేటెంట్.

డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషను అలాంటి మొబైల్ అనువర్తనం/పోర్టల్ ప్రారంభం అయ్యే వరకు ‘స్టార్టప్’ లను గుర్తించే ప్రత్యామ్నాయ ప్రయత్నాలను చేస్తుంది. ఒకసారి సంబంధిత పత్రాలతో ఇటువంటి అప్లికేషన్ అప్లోడ్ అయితే ఒక నిజమైన గుర్తింపు సంఖ్యను స్టార్టప్ కు జారీ చేయబడుతుంది. తదుపరి నిర్ధారణ సమయంలో, గుర్తింపు పత్రాన్ని అప్లోడ్ చేయకుండా లేదా ఏదైనా ఇతర పత్రం లేదా ఒక నకిలీ పత్రాన్ని అప్లోడ్ చేసి పొందిన గుర్తింపును పొందిన దరఖాస్తుదారు జరిమానా వేయవచ్చు. ఇది యాభై శాతం స్టార్టప్ మూలధనంగా ఉండవచ్చు. ఈజరిమానా కనీసం 25,000 రూపాయల కంటే తక్కువ ఉండకూడదు.

మూలం: ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ

Uncategorized

స్టార్టప్ ఇండియా అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రముఖ కార్యక్రమము. దేశంలో శక్తివంతమైన ఆవిష్కరణలు మరియు స్టార్టప్ల అభివృద్ధికి ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం దీని ఉద్ధేశం. ఇది స్థిరమైన ఆర్థిక వృద్ధిని మరియు భారీ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది. ప్రభుత్వం చొరవతో స్టార్టప్ల ఆవిష్కరణ మరియు డిజైన్లను పెంచడానికి ప్రయత్నిస్తుంది.

భారతదేశం స్టార్టప్ యాక్షన్ ప్లాన్ అవలోకనం

లక్ష్యాలను పూర్తిచేయడానికి, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ యొక్క అన్ని అంశాలను కలిగిన భారత యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ యాక్షన్ ప్లాన్ తో ప్రభుత్వపు స్టార్టప్ ఉద్యమ వ్యాప్తి వేగవంతం అవుతుందిని భావిస్తోంది.

  • డిజిటల్/సాంకేతిక రంగం నుండి వ్యవసాయం, తయారీ, సామాజిక రంగ, ఆరోగ్య, విద్య, మొదలైన రంగాలకు వస్తరిస్తుంది.; మరియు
  • ప్రస్తుతమున్న టైర్ 1 నగరాల నుంచి టైర్ 2, టైర్ 3 నగరాలు మరియు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరింస్తుంది.

యాక్షన్ ప్లాను క్రింది విధంగా విభజించబడింది:,

  • సరలీకరణ మరియు హ్యాండ్ హోల్డింగ్
  • నిధుల మద్దతు మరియు ఇన్సెంటివ్స్
  • ఇండస్ట్రీ అకాడెమియా భాగస్వామ్యం మరియు ఇంక్యుబెషను

ప్రణాళికలో ముఖ్యాంశాలు

సరలీకరణ మరియు హ్యాండ్ హోల్డింగ్,

  • స్వీయ సర్టిఫికేషన్ ఆధారంగా అంగీకారము – స్టార్టప్లకు 9 కార్మిక మరియు పర్యావరణ చట్టాలకు సంబంధించి స్వీయ అంగీకారాన్ని(స్టార్టప్ మొబైల్ అనువర్తనం ద్వారా) అనుమతి లభించును. కార్మిక చట్టాల సందర్భంలో, 3 సంవత్సరాల వ్యవధి వరకు ఏ పరీక్షలు నిర్వహించరు. స్టార్టప్ల ఉల్లంఘనలకు సంబంధించి నమ్మదగిన మరియు పరిశీలనా ఫిర్యాదు అంది కనీసం ఒక సీనియర్ లెవెల్ పర్యవేక్షణాధికారి ఆమోదించింన తర్వాత విచారణను చేపడతారు. పర్యావరణ చట్టాలకు సంబంధించి ఇవి ‘తెలుపు వర్గం’ కిందికి వస్తాయి (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) నిర్వచించిన విధంగా). అలాంటి సందర్భాలలో స్వీయ సర్టిఫై సమ్మతి ఉన్నందు వలన స్టార్టప్లకు తక్కువ నిఖీలు జరుగుతాయి.
  • స్టార్టప్ భారత్ హబ్ –మొత్తం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఒకే దగ్గర సంప్రదింపులు జరపటం మరియు నిధులు మరియు సమాచార మార్పిడి యాక్సెసును ఎనేబుల్ చెయ్యటం.
  • రోలింగ్ అవుట్ మొబైల్ ఆప్ మరియు పోర్టల్ – అన్ని వ్యాపార అవసరాలు మరియు వివిధ వాటాదారుల మధ్య సమాచార మార్పిడి కోసం ప్రభుత్వం మరియు రెగ్యులేటరీ సంస్థలతో కలవడానికి ఒకే వేదికను నిర్మించటం.
  • లీగల్ మద్దతు మరియు తక్కువ ఖర్చుతో ఫాస్ట్ ట్రాక్ పేటెంట్ పరిశీలన – ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ పేటెంట్లు, చిహ్నాలు లేదా నమూనాలకు సంబంధిచిన వాటి మొత్తం ఫీజును భరింస్తుంది. స్టార్టప్ చట్టబద్ధమైన ఫీజు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. అప్లికేషన్ దాఖలు చేయడానికి తగ్గింపును కల్పిస్తుంది: స్టార్టప్ పేటెంట్లపై ఇతర కంపెనీలుతో పోలిస్తే80% రిబేటు పొందితుంది. ఈ పథకం ఒక సంవత్సరం పాటు పైలెట్ ప్రాతిపదికన మొదట ప్రారంభించబడింది; అనుభవము ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు.
  • స్టార్టప్ పబ్లిక్ ప్రోక్యూర్మెంట్ నిబంధనల సడలింపు – స్టార్టప్లను ప్రోత్సహించే క్రమంలో, ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు లేదా సాంకేతిక పరిమితులలో ఏ సడలింపు లేకుండా “అనుభవముతో/టర్నోవర్” యొక్క ప్రమాణం నుండి స్టార్టప్లకు (తయారీ రంగంలో) మినహాయింపును ఇచ్చింది. స్టార్టప్ కూడా కొన్ని అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు అమలులో అవసరమైన సామర్ధ్యం ప్రదర్శించేందుకు భారతదేశంలో వారి సొంత తయారీ సౌకర్యాలు తప్పని సరిగా కలిగి ఉండాలి.
  • స్టార్టప్ల కోసం వేగంగా నిష్క్రమణ – స్టార్టప్ ఇటీవలి దివాలా మరియు వ్యాపారాల స్వచ్ఛంద మూసివేత నిబంధనలు దివాలా బిల్ 2015, ప్రకారం, ఫాస్ట్ ట్రాక్ ఆధారంగా విరమించుకోవచ్చు. అప్లికేషన్ ఇచ్చిన 90 రోజుల వ్యవధిలో మూసివేయటానికి అనుమతిని ఇస్తారు. ఈ ప్రక్రియ పరిమిత బాధ్యత భావనతో పనిచేస్తుంది.

నిధుల మద్దతు మరియు ఇన్సెంటివ్స్

  • ₹ 10,000 కోట్ల కార్పస్ ఫండ్ ద్వారా నిధులు మద్దతు అందించడం – స్టార్టప్లకు మద్దతు అందించడానికి ప్రభుత్వం 2,500 కోట్ల ప్రారంభ కార్పస్ మరియు నాలుగు సంవత్సరాలకు 10,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయనుంది (అంటే సంవత్సరానికి 2,500 కోట్లు). ఇది ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూపంలో ఉంటుంది. ఇది స్టార్టప్లకు నేరుగా పెట్టుబడి పెట్టదు. కానీ సెబి తో నమోదు అయిన వెంచర్లకు ఇది నిధులను అందిస్తుంది.
  • స్టార్టప్లకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ –జాతీయ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ (NCGTC)/SIDBI ద్వారా క్రెడిట్ గ్యారంటీ మెకానిజం కోసం రాబోయే నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 500 కోట్లు బడ్జెట్లో ఉంచబడతాయి.
  • పెట్టుబడి లాభాల మీద పన్ను మినహాయింపు – ఈ లక్ష్యం తో, ప్రభుత్వం ద్వారా గుర్తింపు ఫండ్స్ ఆఫ్ ఫండ్ లో మూలధన లాభాలు పెట్టుబడి ఉంటే, సంవత్సరంలో మూలధన లాభాలు కలిగిన వ్యక్తులకు పన్నులు ఉండవు. అదనంగా, వ్యక్తులు కొత్తగా ఏర్పరిచిన తయారీ SMEs పెట్టుబడికి ఇప్పటికే మూలధన రాబడి పన్ను మినహాయింపును అన్ని స్టార్టప్లకు విస్తరించవచ్చు.
  • పన్ను 3 సంవత్సరాలు స్టార్టప్లకు మినహాయింపు – స్టార్టప్ లాభాలకు 3 సంవత్సరాల వరకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. మినహాయింపు స్టార్టప్ ద్వారా డివిడెండ్ పంపిణీ చేయకుండా ఉంటేనే అందుబాటులో ఉంటుంది.
  • సరసమైన మార్కెట్ విలువ కంటే ఎక్కువ పెట్టుబడులపై పన్ను మినహాయింపు – ఒక స్టార్టప్ (సంస్థ) వాటాలు, అదనపు పరిశీలనలో సరసమైన మార్కెట్ విలువకు (FMV) మించి వాటాలను జారీచేస్తే ఆదాయపు పన్ను చట్టం, 1961, కింది పన్ను విధించబడుతుంది. స్టార్టప్లో వెంచర్ కాపిటల్ నిధులను ఉపయోగిస్తే దీనీకి మినహాయింపు ఉంది. స్టార్టప్లు ఇంక్యుబేటర్లలో పెట్టుబడి చేసినప్పుటు దీనిని విస్తరించవచ్చు.

ఇండస్ట్రీ -అకాడెమియా భాగస్వామ్యం మరియు ఇంక్యుబేషన్

  • ఇన్నోవేషన్ ప్రదర్శనలను మరియు కొలాబరేషనుకు వేదికల కోసం స్టార్టప్ ఉత్సవాల నిర్వహణ –భారతదేశంలో స్టార్టప్ వాతావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రభుత్వం జాతీయ మరియు అంతర్జాతీయ స్టేజీలలో స్టార్టప్ ఉత్సవాలను పరిచయంచెసే ప్రతిపాదన ఉంది.
  • స్వయం ఉపాధి మరియు టాలెంట్ యుటిలైజేషన్లతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM) కార్యక్రమం ప్రారంభం (SETU) –వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ సెక్టార్ సంబంధిచిన ఇంక్యుబేటర్లను మరియు 500 ‘టింకరింగ్ ల్యాబ్స్’ను స్థాపించింది. దీనిలో, స్టార్టప్ అదిక పెరుగుదల కోసం, ప్రాథమిక శిక్షణతోపాటు సీడ్ ఫండ్ ఉంటుంది. మూడు జాతీయ అవార్డులతో పాటు మూడు ఆవిష్కరణ అవార్డులు ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇస్తారు. అలాగే దేశంలో అతి తక్కువ ఖర్చు పరిష్కారాలను కనుగొన్నవారికి ఒక గ్రాండ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అవార్డును కూడా ఇస్తారు.
  • ఇంకుబేటర్ సెటప్ కోసం ప్రైవేట్ సెక్టార్ నిపుణత నియంత్రణ – ప్రభుత్వ మద్దతు/నిధులతో ఇంక్యుబేటర్ల నిర్వహణకు, ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడానికి ఒక విధానాన్ని మరియు ఫ్రేమ్ వర్కును తయారు చేస్తుంది.
  • నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లలో ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు-దేశంలో R & D మిరియు ఇంక్యుబేటర్ల ఎదుగుదల ప్రయత్నాలు పెంపొందించడానికి గాను ప్రభుత్వం జాతీయ ఇన్స్టిట్యూట్లలో (1,200 కంటే ఎక్కువ నూతన స్టార్టప్ల ప్రారంభాలకు సౌకర్యాలు అందించడానికి) 31 కేంద్రాలను ఆవిష్కరిస్తుంది.
  • ఐఐటీ మద్రాసు రిసెర్చ్ పార్క్ సెటప్పును పోలిన7 కొత్త పరిశోధనా పార్కుల ఏర్పాటు –ప్రభుత్వం 100 కోట్లతో 7 కొత్త పరిశోధనా పార్కు ఇన్స్టిట్యూట్లను ప్రారంభిస్తుంది. ఈ రీసెర్చ్ పార్కులకు ఐఐటీ మద్రాసు రిసెర్చ్ పార్కును మోడలులాగా నిర్ణయించారు.
  • బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్ల ప్రోత్సహించడం –5 కొత్త బయో క్లస్టర్లు, 50 కొత్త బయో ఇంక్యూబేటర్లు, 150 సాంకేతిక బదిలీ కార్యాలయాలు మరియు 20 బయో కనెక్ట్ కార్యాలయాలను భారతదేశం అంతటా పరిశోధన సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలో ఏర్పాటు చేయబడతాయి. BIRAC ఏస్ ఫండ్ జాతీయ మరియు గ్లోబల్ ఈక్విటీ ఫండ్స్ (భారత్ ఫండ్, ఇతర మధ్య భారతదేశం ఆశించిన ఫండ్) భాగస్వామ్యంతో యువ బయోటెక్ స్టార్టప్లకు ఆర్థిక సాయాన్ని అందింస్తుంది.
  • ఆవిష్కరణలపై దృష్టిసారించే విద్యార్థి కార్యక్రమాలు – ఐదు లక్షల పాఠశాలలో 10 లక్షల ఆవిష్కరణలను సేకరించాలని ఆవిష్కరణ కోర్ కార్యక్రమం చేస్తుంది. వాటిలో 100 ఉత్తమ ఆవిష్కరణలను ఎంపికచేసి రాష్ట్రపతి భవన్లో వార్షిక ఫెస్టివల్లో ప్రదర్శింప చేస్తుంది. గ్రాండ్ చాలెంజ్ కార్యక్రమం NIDHI (జాతీయ హార్నేస్సింగ్ ఆవిష్కరణలు మరియు అభివృద్ధి కార్యక్రమం) ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ అభివృద్ధి కేంద్రాల (IEDCs) సహాయంతో ఏర్పాటు చేయబడుతుంది. ఇది 10 లక్షల రూపాయల అవార్డును 20 మంది విద్యార్థి ఆవిష్కరణలకు అందజేస్తుంది. ఉచ్చతర్ ఆవిష్కార్ యోజనను, ఉమ్మడి MHRD-DST పథకం ద్వారా ఏటా 250 కోట్ల రూపాయలు ఐఐటి విద్యార్థుల ” చాలా అధిక నాణ్యత” పరిశోధనను ప్రోత్సహించడానికి, ప్రారంభించారు.
  • వార్షిక ఇంకుబేటర్ గ్రాండ్ ఛాలెంజ్ –ప్రభుత్వం పది ఇంకుబేటర్లను గుర్తించి ఎంచుకుంటుంది. వాటి పని తీరును ముందే ఉన్న పనితీరు సూచికలతో (KPIs) మూల్యాంకనంచేసి అవి ప్రపంచ స్థాయి సామర్ధ్యం కలిగి ఉన్నాయని తెలిస్తే వాటికి రూ .10 కోట్ల సహాయం వాటి ముల సదుపాయాల అభవృద్ధికీ గాను ఇస్తుంది.

ఆధారం : స్టార్టప్ ఇండియా

News

వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2021-22) సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తనకు ఈ గురుతల భాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి హరీశ్‌రావు

⍟ పన్నుల ఆదాయం అంచనా రూ.92,910 కోట్లు, పన్నేతర ఆదాయం అంచనా రూ.30,557.35 కోట్లు, గ్రాంట్ల అంచనా రూ. 38,6669.46కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాలు రూ. 13,990.13కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా రూ. 12,500 కోట్లు, ఎక్సై్జ్ ఆదాయం రూ.17వేల కోట్లు, అమ్మకం పన్ను ఆదాయం అంచనా రూ. 26,500కోట్లు, వాహనాల పన్ను ఆదాయం అంచనా రూ.5వేల కోట్లు,

Samsung Galaxy M12 ఎందుకు కొనాలో తెలుసుకోవాలంటే ఈ 12 పాయింట్లు చదవండి

⍟ ఐటీ శాఖకు రూ. 360 కోట్లు, ఆర్టీసీ రూ.3వేల కోట్లు, హోమ్ శాఖకు రూ.6,465కోట్లు, ఆర్ అండ్ బీ శాఖకు రూ. 8,778 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు రూ.750కోట్లు, సాంస్కృతిక, పర్యాటక రంగానికి రూ.726కోట్లు, కొత్త సచివాలయానికి రూ.610కోట్లు, మండల, జిల్లా పరిషత్‌కు రూ.500 కోట్లు కేటాయింపు.

⍟ విద్యుత్ శాఖకు రూ.11,046 కోట్లు, పరిశ్రమల రాయితీకి రూ.2,500 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.3,077కోట్లు

⍟ పాఠశాల విద్య కోసం రూ. 11,735 కోట్లు కేటాయింపు. విద్యారంగ అభివృద్ధి కోసం రెండేళ్లలో రూ.4వేల కోట్లతో నూతన పథకం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మౌలిక వసతుల ఏర్పాటు. బృహత్తర విద్యా పథకం కోసం ఈ ఏడాది రూ.2వేల కోట్లు కేటాయింపు. ఉన్నత విద్య కోసం రూ.1,873 కోట్లు,

⍟ హైదరాబాద్ మెట్రో రైల్ కోసం రూ.1000 కోట్ల కేటాయింపులు, ఔటర్ రింగ్‌ రోడ్డు లోపల కొత్త కాలనీల కోసం తాగునీటి సరఫరాకు రూ.250కోట్లు. వరంగల్ కార్పోరేషన్‌కు రూ.250కోట్లు, ఖమ్మం కార్పోరేషన్‌కు రూ.150కోట్లు, వైద్య,ఆరోగ్య శాఖకు రూ.6,295కోట్లు

⍟ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి రూ.11వేల కోట్లు, సొంత స్థలం కలిగిన పేదలకు రెండు పడక గదుల ఇళ్ల హామీ అమలుకు త్వరలోనే విధి విధానాలు.

⍟ పట్టణాల్లో సమీకృత మార్కెట నిర్మాణం కోసం రూ.500 కోట్లు, వైకుంఠ ధామాల కోసం రూ.200కోట్లు, నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల ద్వారా హైదరాబాద్‌ తాగునీటి ప్రాజెక్టుకు రూ.725 కోట్లు. మూసీ నది పునరుజ్జీవం కోసం రూ.200కోట్లు

⍟ ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.5,522కోట్లు. మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.1,606 కోట్లు, మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.3వేల కోట్లు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ.1,702 కోట్ల కేటాయింపు. బీసీలకు కళ్యాణలక్షి పథకంలో భాగంగా అదనంగా రూ.500కోట్లు. నేతన్నల సంక్షేమం కోసం రూ.338కోట్లు . ఎస్సీ ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 21,306.85కోట్లు కేటాయింపు

⍟ ఆసరా ఫించన్ల కోసం రూ.11,728 కోట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్ పథకాల కోసం రూ.2,750కోట్లు, రైతు భీమా పథకం కోసం రూ.1,200 కోట్లు, ఎస్టీ గృహాలకు విద్యుత్ రాయితీ కోసం రూ.18కోట్లు, 3లక్షల గొర్రె యూనిట్ల కోసం రూ.3వేల కోట్ల కేటాయింపు. వ్యవసాయ శాఖకు రూ.25వేల కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.1,730కోట్లు, నీటి పారుదల శాఖకు 16,931కోట్లు, సమగ్ర భూ సర్వేకు రూ.400కోట్లు

⍟ సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌కు రూ. వెయ్యి కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500కోట్లు కేటాయింపు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ నిధుల కింద రూ.5కోట్ల చొప్పున మొత్తం రూ.800 కోట్ల కేటాయింపు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271కోట్లు కేటాయింపు. రైతు బంధు పథకానికి 14,800 కోట్లు, రుణమాఫీ కోసం రూ.5,225కోట్లు కేటాయింపు. పురపాలక శాఖకు రూ.15,030కోట్లు

⍟ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వం తీసుకున్న ప్రగతి శీల చర్యల వల్లే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని హరీశ్‌రావు తెలిపారు. 2014-15లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.41 కోట్ల ఎకరాలు కాగా.. 2020-21లో అది 2.10 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. సాగు విస్తీర్ణం 49 శాతానికిపైగా పెరిగిందన్నారు.

⍟ ‘2019-20లో తెలంగాణలో 193 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. అందులో 111 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది. 2020 యాసంగిలో మన రాష్ట్రం ఎఫ్‌సీఐకి 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అందించింది. ఎఫ్‌సీఐ దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ధాన్యంలో ఇది 56 శాతం’ అని హరీశ్‌రావు తెలిపారు.

⍟ ‘తెలంగాణ తలసరి ఆదాయం 2020-21కి గానూ రూ. 2 లక్షల 27 వేల 145గా ఉంటుందని కేంద్ర గణాంకాల శాఖ అంచనా. ఇది గత ఏడాది కంటే 0.6 శాతం ఎక్కువ. ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.1.27 లక్షలు మాత్రమే. ఇది గత ఏడాది కంటే 4.8 శాతం తగ్గింది. తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే రూ.99,377 అధికంగా ఉంది. దేశ తలసరి ఆదాయం తగ్గినా.. తెలంగాణ ఆదాయం పెరిగింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణ పురోగతి మెరుగ్గా ఉంది. తెలంగాణ దేశంలో ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని అనడానికి ఇదో నిదర్శనం’ అని హరీశ్ రావు తెలిపారు.

⍟ వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ రూ.2,30,825,.96 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు. ఆర్థిక లోటు అంచనా.. రూ.45,509.60 కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం రూ29,046.77 కోట్లు. రెవెన్యూ మిగులు రూ.6,743.5కోట్లు.

⍟ 2019లో 13.5 శాతం నుంచి 1.3 శాతానికి డీఎస్‌డీపీ వృద్ధి తగ్గింది. అయినా కేసీఆర్ ముందు చూపుతో చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల 2021లో ప్రాథమిక రంగం అంచనాలో 17.7 శాతం వృద్ధి నమోదు చేసింది. దేశ ఆదాయం తగ్గిన పరిస్థితుల్లోనూ తెలంగాణలో మంచి ఆదాయం ఉంది. తెలంగాణ ప్రబల శక్తిగా ఎదుగుతుందని చెప్పడానికి ఇది నిదర్శనం. గ్రామాల్లో పారిశుద్ధ్యం పెంపొందించేందుకు పల్లె ప్రగతి పేరుతో కార్యాచరణ ప్రకటించాం. ఇది గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చేసింది.

⍟ 2021లో స్థూల రాష్ట్రీయ దేశీయ ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం రూ.9 లక్షల 78 వేల 378 కోట్లు ఉంటుందని అంచనా. లాక్‌డౌన్ కారణంగా తెలంగాణ జీఎస్‌డీపీ 13.5 శాతం నుంచి 1.3 శాతానికి గణనీయంగా తగ్గింది. జాతీయ స్థాయితో పోలిస్తే.. రాష్ట్ర జీఎస్‌డీపీ మెరుగ్గా ఉంది. కరోనా సంక్షోభం తలెత్తినా.. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కారణంగా ప్రాథమిక రంగం 17.7 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది.

⍟ ఏడేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం ఏడు పదుల వయసున్నరాష్ట్రాలతో పోటీపడి అభివృద్దిని పరుగులు పెడుతోందని హరీశ్‌రావు అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తాము చేస్తున్న పాలనకు ప్రజలను నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు లభిస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. దేశంలో తెలంగాణ ప్రజల శక్తిగా ఎదుగుతోందన్నారు.

⍟ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. కరోనా సంక్షోభంతో విలవిలలాడుతున్న ప్రజలు ఈ బడ్జెట్‌పై చాలానే ఆశలు పెట్టుకున్నారు.

⍟ మంత్రి హరీశ్‌ రావు ఇవాళ ఉదయం 11.30 గంటలకు శాసన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో 2021-22 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ప్రజలందరికి మంచి జరగాలని, సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా పేదల సంక్షేమం కోసం, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు.

⍟ వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2021-22) తెలంగాణ ప్రభుత్వం నేడు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914 కోట్ల పద్దును ప్రతిపాదించగా.. ఈ సారి 11 శాతం పైగా అంచనాలను పెంచుతూ సుమారు రూ.2.04 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాబడులపై పూర్తి విశ్వాసంతో ప్రభుత్వం ముందుకు వెళ్లనున్న ప్రభుత్వం సంక్షేమ రంగానికి భారీగా కేటాయింపులు చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ప్రగతి పద్దు 13 శాతం పైగా, నిర్వహణ పద్దు 10శాతం మేర పెరగనుంది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ఉదయం 11.30 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు.

https://youtu.be/Dy5zDgDpip4