Mutual Funds

డెబిట్ ఫండ్ ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము ఇది ఫిక్సిడ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్లైన కార్పొరేట్ మరియు ప్రభుత్వ బాండ్లలో, కార్పొరేట్ డెబిట్ సెక్యూరిటీలు మరియు మనీ మార్కెటింగ్ ఇన్స్ట్రుమెంట్లైన మొదలగు వాటిలో క్యాపిటల్ అప్రిసియేషన్ అందించే వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. డెబిట్ ఫండ్స్ని ఫిక్సిడ్ ఇన్కమ్ ఫండ్స్ లేదా బాండ్ ఫండ్స్ అని కూడా తెలుపుతారు.

డెబిట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన పెద్ద లాభం, పోల్చినప్పుడు స్థిరమైన రిటర్నులు, అధిక లిక్విడిటీ మరియు సహైతుకమైన సురక్షత ఉన్నాయి.

రెగ్యులర్ ఆదాయం లక్ష్యంగా ఉండే ఇన్వెస్టర్ల కొరకు డెబిట్ ఫండ్స్ ఆదర్శమైనవి, కానీ రిస్క్ విముఖంగా ఉంటాయి. డెబిట్ ఫండ్స్ తక్కువ అస్థిరమైనవి, కావున ఈక్విటీ ఫండ్స్ కన్నా తక్కువ రిస్కుతో ఉంటాయి. మీరు సంప్రదాయ ఫిక్సిడ్ ఇన్కమ్ ఉత్పత్తులైనటువంటి బ్యాంకు డిపాజిట్లలో ఆదా చేస్తూ ఉండి మరియు తక్కువ అస్థిరమైన, క్రమం తప్పని రిటర్నుల కొరకు చూస్తూ ఉంటే, డెబిట్ మ్యూచువల్ ఫండ్స్ చక్కని ఎంపిక ఎందుకంటే, అవి మీ ఆర్థిక లక్ష్యాలను మరింత పన్ను ప్రభావిత పద్ధతిలో మరియు మరింత చక్కని రిటర్నులు సంపాదించడానికి మీకు సహాయపడతాయి.

నిర్వహణ విషయంలో, డెబిట్ ఫండ్స్ పూర్తిగా ఇతర మ్యూచువల్ ఫండ్ స్కీములు కన్నా విభిన్నమైనవి కావు. అయితే, క్యాపిటల్ భద్రత విషయంలో, వాటికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్కువ మార్కులు వస్తాయి.

Mutual Funds

డిన్నర్‌కు మీరు కూరగాయలు ఎక్కడి నుంచి తెస్తారు? మీరు వాటిని మీ పెరట్లో పెంచుతారా లేదా సమీపంలోని మండి/సూపర్‌మార్కెట్ నుండి మీకు అవసరమైన దానిని బట్టి కొనుగోలు చేస్తారా? మనం స్వంతంగా కూరగాయలను పండించడం గొప్ప దారి ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి, కానీ విత్తనాలు ఎన్నుకోవడం, ఎరువులు వేయడం, నారు పోయడం, కీటకాల నివారణ మొదలగు వాటి పైన శ్రమ చేయబడుతుంది. తరువాతి ఎంపిక కష్టమైన పని లేకుండా విస్తృత రకాల నుండి ఎంచుకునే ఎంపికను అందిస్తుంది.

అదేవిధంగా, మీరు సంపదను మంచి కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసి లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి తయారు చేయవచ్చు. మనం స్టాక్సుని కొనుగోలు చేసినప్పుడు మన డబ్బుని కంపెనీలు వాటి వ్యాపారాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు, అలా మన డబ్బుకి విలువను పెంచే సంపదను తయారు చేస్తుంది.

షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయడం చాలా ఎక్కువ రిస్క్ ఎలిమెంటుని కలిగి ఉంటుంది. మీరు కంపెనీ మరియు సెక్టారుని పరిశోధించడం ద్వారా స్టాక్సుని ఎన్నుకోవాలి. స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేయబడిన వేల కంపెనీల నుండి కొన్ని కంపెనీల ఎన్నుకోవడం పెద్ద పని. మీరు ఒకసారి చేసిన తరువాత, ప్రతి స్టాకు పనితీరుని ట్రాక్ చేయాలి.

మ్యూచువల్ ఫండ్స్‌లో, స్టాక్ ఎన్నుకోవడం నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్ల ద్వారా చేయబడుతుంది. ఫండ్ లోపల ఉన్న ఒక్కో స్టాక్సుని కాకుండా మీరు ఫండ్ పనితీరుని ట్రాక్ చేస్తూ ఉండాలి. స్టాక్సు, గ్రోత్/డివిడెండ్, టాప్-అప్స్, సిస్టమాటిక్ విత్ డ్రాయల్స్/ట్రాన్స్ఫర్స్, మొదలగు వాటిలా పెట్టుబడి పెట్టే వెసులుబాటు కాకుండా, చిన్న మొత్తాలను ఎస్ఐపిల ద్వారా రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒడుదుడుకులను అధిగమించడానికి అవి వీలుకల్పిస్తాయి.

Uncategorized

మీరు అమెజాన్‌తో కలిపి పని చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అమెజాన్ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. దీని ద్వారా ప్రతి నెలా అదనపు డబ్బులు పొందొచ్చు.

కరోనా టైమ్‌లో ఈ-కామర్స్ బిజినెస్ గణనీయంగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. అందుకే ఈకామర్స్ కంపెనీలు కూడా వాటి ఫ్రాంచైజీలను విస్తరించుకుంటూ వస్తున్నాయి. మీరు కూడా ఈ ఫ్రాంచైజీ బిజినెస్ ప్రారంభించొచ్చు. ప్రతి నెలా అదిరిపోయే రాబడి పొందొచ్చు.

అమెజాన్ డెలివరీ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. దీని ద్వారా ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. అయితే ఎక్కువ స్థలం కావాలి. మీకు కిరాణ షాపు ఉండి, అందులో ఖాళీ ఉంటే.. మీరు సులభంగానే అమెజాన్ ఫ్రాంచైజీ ద్వారా సంపాదన పొందొచ్చు.

అమెజాన్ ఐ హ్యావ్ స్పేస్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా మీరు మీ లోకల్ ఏరియాలో అమెజాన్ డెలివరీ సర్వీసులు అందించడ ద్వారా డబ్బులు పొందొచ్చు. ప్రతి డెలివరీకి మీకు కమిషన్ వస్తుంది. అంటే అదనపు ఆదాయం పొందొచ్చు.

మీరు 2 నుంచి 4 కిలోమీటర్ల విస్తీర్ణంలో డెలివరీ చేయొచ్చు. 2 నుంచి 3 గంటల్లో ఈ పని పూర్తి చేసుకోవచ్చు. మీ లొకేషన్ ఆధారంగా అమెజాన్ మీకు డెలివరీ ప్రొడక్టులు అందిస్తుంది. మీకు స్మార్ట్‌ఫోన్, బైక్ ఉండాలి.

ఈ ప్రొడక్టులను డెలివరీ చేస్తే ఒక్కో ప్రొడక్టుకు రూ.15 నుంచి 20 వరకు కమిషన్ పొందొచ్చు. లేదంటే అమెజాన్ డెలివరీ సర్వీస్ పార్ట్‌నర్స్‌గా కూడా చేరొచ్చు. దీనికి రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది.

Alternative Income

అమెజాన్ స్టోర్ 35 పట్టణాలలో ఆన్లైన్ ద్వారా వస్తువులను మనకు చేరవేస్తుంది చాలా రకాల మండల కేంద్రాలు మేజర్ పంచాయతీలు అమెజాన్ సేవలను వినియోగంలోకి తేవడానికి indian buys అనే సంస్థ అన్ని ఊర్లలో అమెజాన్ ల ద్వారా మనము కొనుగోలు చేసిన వస్తువులను మనకు చేరవేసే ప్రయత్నంలో భాగంగా స్టోర్ లను ఏర్పాటు చేస్తోంది.

స్టోర్లను ఎవరైనా ప్రారంభించవచ్చు indian buys సంస్థ స్టోర్కు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి అందిస్తుంది.

అమెజాన్ స్టోర్ ను మీరు ఉంటున్న ఊరి నుండి ప్రారంభించవచ్చు ఒక రూము , ఫర్నిచర్ , టీవీ , లాప్టాప్ లేదా కంప్యూటర్ , టేబుల్ టేబుల్ చైర్ , ఇలా అన్ని వస్తువులు సమకూర్చుకొని స్టోర్ ను డిజైన్ చేయండి.

డెకరేషన్ విషయంలో indian buys వాళ్లు మీకు సలహాలు ఇస్తారు.

ఈ స్టోర్ ద్వారా ఎన్నో రకాల సేవలు కస్టమర్లకు అందించవచ్చు.

ఉదాహరణకు:-

కరెంటు బిల్లులు , గ్యాస్ బిల్లులో, ఇన్సూరెన్స్ , టెలిఫోన్ బిల్లులు, ఫోన్ రీఛార్జి , ఇలా ఎన్నో రకాల సేవలను ఈ స్టోర్ ద్వారా మనము కస్టమర్లకు అందించవచ్చును.

ప్రతి సేవకు మనకు కమిషన్ రూపంలో మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.

అమెజాన్ లో ఉన్న మూడు వేల రకాల వస్తువులను కస్టమర్లకు మనము ఫ్రీగా డెలివరీ చేయవచ్చును.

కస్టమరు మన స్టోర్ కి వచ్చినప్పుడు వారికి కావాల్సిన ఐటమ్స్ ల్యాప్టాప్ ద్వారా టీవీలో చూపించి వారికి కావలసిన వస్తువులు బుక్ చేసి డెలివరీ ఇవ్వగలము వస్తువును బట్టి మనకు కమీషన్ రూపంలో ఎకౌంట్లో క్రెడిట్ అవుతుంది 2% నుండి 20% దాకా ఆ వస్తువును బట్టి మనకు కమిషన్ యాడ్ అవుతుంది మంచి ఆదాయం ఉంటుంది.

అమెజాన్ స్టోర్ లో తక్కువ రేటుకు వస్తువులు వస్తున్నప్పుడు కొన్ని వస్తువులను కొనుగోలు చేసి మన స్టోర్ లో ఉంచండి కస్టమర్లు స్టోర్ కు వచ్చినప్పుడు ఆ వస్తువులను చూసి వారికి నచ్చినవి కొనుక్కొని తీసుకువెళ్తారు.

ఈ వ్యాపారానికి సంబంధించిన అన్ని సమాచారాలను indian buys వారిని అడిగి తెలుసుకోండి.

ఇప్పుడిప్పుడే ఈ వ్యాపారం అని ఊర్లకు విస్తరిస్తుంది

అందరూ ఆన్లైన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.

స్టోర్ను స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ తెలియజేయండి.

Stock Market

Stop loss అంటే ఎక్కువ లాస్ నుండి మనల్ని మనం సేవ్ చేసుకోవడం అనుకోవచ్చు.
ఒక స్టాక్ నష్టాల్లో కూరుకున్నప్పుడు, కొన్ని సార్లు సరైన నిర్ణయం అమ్మెయ్యటం. అయితే, మన భావోద్వేగాలు నష్టాన్ని భరించలేవు. మళ్ళీ పుంజుకుంటుందేమో అన్న ఆశతో అమ్మకుండా ఉంచి మరింత నష్టాల పాలవుతాము.

లేదా, మీరు ఒక స్టాక్ కొని, అంతర్జాలం లేని ప్రదేశాలకు విహార యాత్రకు వెళ్లొచ్చు. మీరు యాత్రలో ఉండగా, ఆ కంపెనీ స్టాక్ పడిపోవచ్చు.

ఇటువంటి ప్రమాదాలను అరికట్టటానికి ‘స్టాప్ లాస్’ వాడొచ్చు. మీరు 100/- కి స్టాక్ కొంటే, 20/- కన్నా ఎక్కువ నష్టం రాకూడదు అనుకుంటే, 80/- ‘స్టాప్ లాస్’ ఆర్డర్ పెట్టొచ్చు. ఇప్పుడు, ఆ స్టాక్ విలువ 80/- తాకినా, అంతకన్నా కిందకు వెళ్లినా, మీ ప్రమేయం లేకుండా మీ స్టాక్ మొత్తం అమ్మివేయబడుతుంది.

మీరు వంద రూపాయలకి ఒక స్టాక్ కొన్నారని అనుకుందాం. మీరు మీ ట్రేడ్ లో పది రూపాయల కంటే ఎక్కువ లాస్ తీసుకోదల్చుకోలేదు, అప్పుడు 90 కి స్టాప్ లాస్ పెట్టుకుంటారు ఒకవేళ స్టాక్ 90 కన్నా కింద పడితే మీరు ఆ స్టాక్ నుండి ఎగ్జిట్ అవుతారు.
రాజు రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుందని నలుగురూ అంటుంటే లాభానికి అమ్మేద్దామని 50 లక్షలకు ఒక ఫ్లాట్ కొన్నాడు. డీమానెటైజేషన్ అనీ, కోవిడ్ అనీ ఏళ్ళ తరబడి ఫ్లాట్ విలువ పెరక్కపోగా తగ్గి 45 లక్షలయింది. మళ్ళీ పెరుగుతుందని ఎవరో చెబితే అట్టే పెట్టుకున్నాడు. ఇప్పుడదే 40 లక్షలు పలుకుతోంది. 45 లక్షలు స్టాప్-లాస్ అనుకుని 5 లక్షల నష్టానికి అమ్మివేసి ఆ వచ్చిన డబ్బు వేరే పెట్టుబడి పెడితే బాగుండేది.

స్టాప్-లాస్ అంటే పెట్టుబడిలో మనం తట్టుకోగల గరిష్ట నష్ట పరిమితి.

స్టాక్ మార్కెట్ పరిభాషలో ఉదాహరణ:
రాము 2019లో లక్ష రుపాయలతో 370 ఐటీసీ షేర్లు 270 రుపాయల వద్ద కొన్నాడు. ఆ లక్షలో 15 వేలు మాత్రమే రిస్క్ చెయ్యగలను అనుకుని తదనుగుణంగా షేరు ధర 230కి పడిపోతే మొత్తం అమ్మేయాలనుకున్నాడు. 2020 జనవరిలో అమ్మేశాడు. ఇక్కడ 230 స్టాప్-లాస్.

తరువాత మార్చిలో మార్కెట్లు పతనమైనప్పుడు ఆ వచ్చిన 85,000 రుపాయలకు 77 రిలయన్స్ షేర్లు 1100 వద్ద కొన్నాడు. ఈసారి పదివేలు మాత్రమే గరిష్ట నష్టం అనుకుని షేరు 970కి పడితే (స్టాప్-లాస్) అమ్మేయాలనుకున్నాడు. అంతదాకా రాలేదు, ఆపై ఏడాదిలో 100% లాభానికి అమ్మేశాడు.

రాము, రాజు కథలు నిజమే, పేర్లు కల్పితం.

అయితే ఈ స్టాప్-లాస్ ఎక్కడ పెట్టుకోవాలన్న విషయంలో మూడు పద్ధతులున్నాయి.

పైన చెప్పిన మూలధన ప్రకారం అనుకునేది ఒక రకం.

ఫండమెంటల్ విశ్లేషణతో వచ్చేది ఒక రకమయితే, సాంకేతిక విశ్లేషణతో మూడవ రకం.

ఫండమెంటల్ విశ్లేషణ:

ఇందులో “సంస్థ వ్యాపార వ్యూహం మారినప్పుడు (మంచికి కాదు)” అన్నది ఒక విధమైన స్టాప్-లాస్.

ఉదాహరణకు ఐటీసీ సంస్థ తమ మూలవ్యాపారమైన పొగాకు ఉత్పత్తులపై ఆధారపడకూడదని వేరే రంగాల్లోకి అడుగుపెట్టాలనుకోవటం మంచిదే అనుకున్నారంతా. అయితే ఆ అడుగు పెట్టే రంగాలు లెక్కకు మించి, అనుభవం లేనివి కావటంతో పొగాకు ఉత్పత్తులపై వచ్చే లాభాల్లో సింహభాగం మిగతా ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కొరకు ఖర్చు చెయ్యవలసి వస్తోంది. తత్ఫలితంగా ఏళ్ళ తరబడి షేరు ధర పెరగనా తరగనా అంటూ అక్కడే తారాడుతోంది.

సంస్థ యాజమాన్యం చట్టవిరుద్ధ చర్యలు చేసినట్టు తెలియటం మరొక విధమైన స్టాప్-లాస్. సత్యం, ఫోర్టిస్ యజమానుల చేష్టలు ఇందుకు తార్కాణాలు.

సంస్థ ఆడిటర్ మారటం మరొక స్టాప్-లాస్ సంకేతం. ఉదాహరణకు మన్పసంద్ బెవరేజస్.

సాంకేతిక విశ్లేషణ:

ఇందులో కేవలం చార్ట్ చూసి మునుపు గిరాకీ-సరఫరా స్థాయిలను గుర్తించి తదనుగుణంగా స్టాప్-లాస్ నిర్ధారించుకోవచ్చు.

అయితే stop loss అనేది loss లో కాకుండా ప్రాఫిట్ లో కూడా పెట్టుకోవచ్చు దాన్ని trailing స్టాప్ లాస్ అంటారు.

ఉదాహరణకి మీ ₹100 స్టాక్ 110 రూపాయలు వెళ్తే 105 రూపాయలు దగ్గర మీరు trailing stoploss పెట్టుకుంటారు. 105 కన్నా కింద పడితే మీరు ఆ stock అమ్మేస్తారు.

ముఖ్య గమనిక: ‘స్టాప్ లాస్’ 80/- కి పెట్టినంత మాత్రాన 80/- కి అమ్మబడుతుందని చెప్పలేము. పెద్ద దుర్వార్త వెలువడితే, స్టాక్ ఉన్నపళంగా 60/- కి పడిపోవచ్చు… అప్పుడు ‘స్టాప్ లాస్’ ఆర్డర్, మీ స్టాక్స్ అన్నిటిని 60/- కి అమ్మేస్తుంది. ఇలా జరిగే అవకాశం చాలా తక్కువ.

మరో గమనిక: ‘స్టాప్ లాస్’ మీరు కొన్న ధరకి మరీ దగ్గరగా పెట్టకూడదు. స్టాక్స్ సహజంగా హెచ్చు తగ్గులకు గురవుతాయి. మరీ దగ్గరగా పెడితే, అనవసరంగా నష్టాలకు గురవుతారు.

Stock Market

హర్షద్ మెహతా స్కాం అనేది చాల పాతది ఇంకా అప్పటికి స్టాక్ మార్కెట్ పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.

అప్పటికి స్టాక్ ఎక్స్చేంజి లో సంస్కరణలు ప్రారంభము కాలేదు.

మెహతా చేసినది ఏమంటే, షేర్లను తాకట్టు పెట్టి బ్యాంకులలో డబ్బు తీసుకున్నాడు.

అప్పటికి షేర్లు కేవలం పేపర్ల పైన ఉండేవి ఇప్పటి మాదిరి డిజిటల్ ఫార్మ్ లో లేవు. అందువల్ల అయన కొన్ని రకాల షేర్లను వేల సంఖ్యంలో కొని వాటిని బ్యాంకులలో కుదువ పెట్టాడు.

అదే సమయంలో వాటికీ విలువ పెరగటానికి వాటి రేటు కృత్రిమంగా పెంచాడు.

మీకు ఉదాహరణగా చెప్తాను.

శ్రీనివాస్ లాప్టాప్ అనే కంపెనీ ఉందనుకోండి.

మెహతా దాని షేర్లను ప్రతి రోజు ఎక్కువ రేటుకు కొంటాడు.

ఒక వెయ్యి షేర్లు 10 రూపాయలకు, మర్నాడు వాటినే 20 రూపాయాలకు ఆలా.

ఒక నెలలో వాటిని 50 రూపాయల దాక తీసుకుని పోతాడు. అప్పటికి అయన దగ్గర శ్రీనివాస్ లాప్టాప్ అనే కంపెనీ షేర్లు ఒక 10000 ఉంటాయి.

వాటి విలువ 10000 X 50 = 5 ,౦౦,౦౦౦, అవుతుంది. ఇప్పుడు వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి 400000 తీసుకుని మరో షేర్లను ఇలాజె పరుగులు పెట్టిస్తాడు. ఇలాకొన్ని రోజులకు బ్యాంకులనుండి అయన తీసుకున్న అప్పు లక్షల్లో చేరి అయన మార్కెట్ లో నుండి విరామంచుకున్నప్పుడల్లా మార్కెట్ పడిపోవటం మొదలు పెట్టింది.

ఈ ఫిజికల్ షేర్లు కొన్ని డూప్లికేట్ అయ్యి బ్యాంకులో వున్నవి వున్నట్టే వుండి అవ్వే షేర్లు మెహతా ద్వారా అమ్మబడ్డాయి.

ఈ విషయాలు బయట పడేటప్పటికి చాల ఆలస్యం అయ్యి ఎప్పుడు కూలదామా అని వుండే మార్కెట్ ఒక్క సరిగా కుప్ప కూలి పోయింది.

నకిలీ షేర్ల కారణంగా బ్యాంకులు, ఇతర కొనుగోలుదారులు నష్ట పడ్డారు.

చాలా షేర్లు అసలు చలామణిలో లేవని తెలిసింది. అంటే శ్రీనివాస్ లాప్టాప్ అని కంపెనీనే లేదు వున్నా మూత పడింది. ఒక వేళా బతికే వున్నా దాని షేరు విలువ అర్థ రూపాయి కూడా ఉండదు. అటువంటి షేరులు 50 రూపాయలకు కొంటె కొన్న వాడి పరిస్థితి ఏమిటి, తాకట్టు పెట్టుకున్న బ్యాంకు పరిస్థితి ఏమిటి.

ఈ కుంభ కోణం తరువాత,

స్టాక్ ఎక్స్చేంజి,

కొన్ని షరతులు పెట్టింది.

ఏ షేరు కూడా ఒక రోజులో 20 % కంటే ఎక్కువ పెరగ కూడదు.

అన్ని షేర్లు డీమ్యాట్ అకౌంట్ ద్వారా నే లావాదేవీలు జరగాలి. అన్ని షేర్లను కాగితాల రూపంలో నుండి ఎలెక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవాలి.

బ్యాంకులు కూడా ఇటువంటి తాకట్టు విషయాలలో జాగ్రత్త పడాలి.

దీని తరువాత మార్కెట్ లో స్కాం లు తగ్గినాయి.

Stock Market

(Dividend)డివిడెండ్: ఏదైనా ఒక కంపెనీ తనకు వచ్చిన లాభల్లో కొంత భాగాన్ని ఆ కంపెనీ లో షేర్లు కలిగినటువంటి షేర్ హోల్డర్స్ (Share Holders) కి పంచుతుంది. వాటిని డివిడెండ్ (Dividend) అని అంటారు.

సాధారణంగా ఈ డివిడెండ్స్ ని సంవత్సరానికి ఒకసారి గాని లేదా ఆరు లేదా మూడు నెలలకు ఒకసారి గాని ప్రకటిస్తాయి . ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని కంపెనీ లు తమ త్రైమాసిక ఫలితాలను(Quarterly Results) ప్రకటిస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే డివిడెండ్ ఇస్తున్నాయా లేదా ఇస్తే ఎంత శాతం డివిడెండ్ ఇస్తున్నాయి వంటి వివరాలు ప్రకటిస్తాయి.

అలాగే ప్రతిసారి ఒకే విధంగా డివిడెండ్ ఇవ్వాలని లేదు. ఆ కంపెనీ కి వచ్చిన లాభాలను బట్టి ఈ డివిడెండ్ (Dividend) ని ఇస్తాయి ఒక్కొక్కసారి ఈ డివిడెండ్ ఇవ్వడం కూడా మానేస్తాయి.

అయితే అన్ని కంపెనీ లు కూడా ఈ డివిడెండ్ లు ఇవ్వవు కేవలం కొన్ని కంపెనీ లు మాత్రమే డివిడెండ్ ని ఇస్తాయి.

బాగా పేరు పొందిన పెద్ద పెద్ద కంపెనీలు తమకు వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని డివిడెండ్ గా ఇచ్చి మిగిలిన భాగాన్ని కంపెనీని మరింత విస్తరించడానికి ఖర్చుచేస్తాయి. కానీ కొత్తగా ఏర్పడిన కంపెనీలు, చిన్న కంపెనీ లు మాత్రం ఈ డివిడెండ్ ని ప్రకటించకుండా పూర్తి లాభాలను కంపెనీని మరింత అభివృద్ధి చెయ్యడానికి ఖర్చు చేస్తాయి.

చాలా మంది ఏ కంపెనీ అయితే ఎక్కువగా డివిడెండ్ ని ఇస్తాయో అటువంటి కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. దాని వల్ల షేర్ ధర (Share Price) ఇంకా పెరుగుతుంది. కాబట్టి కంపెనీ లు ఇన్వెస్టర్స్ ని ఆకర్షించడానికి డివిడెండ్ లు ప్రకటిస్తాయి. ఎంత శాతం డివిడెండ్ ఇవ్వాలి అనేది ఆ కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ (Board of Directors) నిర్ణయిస్తారు.

డివిడెండ్స్ ని డబ్బు రూపంలో గాని లేదా షేర్ల రూపంలో గాని ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా డబ్బు రూపంలోనే డివిడెండ్స్ ని ప్రకటిస్తారు. ఒకవేళ కంపెనీలు డివిడెండ్ ని ప్రకటిస్తే ఆ డబ్బు డైరెక్ట్ గా మన బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అయ్యిపోతుంది.

ఇలా డివిడెండ్స్ (Dividends) ఇచ్చే కంపెనీలలో పెట్టుబడి పెట్టడం వలన షేర్ ధర పెరగడం వలన వచ్చే లాభాలతో పాటుగా ఈ డివిడెండ్ ను కూడా అదనంగా పొందవచ్చు.

దేశంలో అత్యధిక డివిడెండ్ యీల్డ్ ఉన్న షేర్లు:

ఇక్కడ “Div Yld” అని ఉన్నదే డివిడెండ్ యీల్డ్.

వీటిలో చిన్నాచితకా సంస్థలు తీసేస్తే:

ఈ జాబితాలో సగం ప్రభుత్వ రంగ సంస్థలే. వీటి విలువ పెంచటానికో, వ్యాపారం వృద్ధి చెయ్యటానికో కాక కేవలం డివిడెండ్లు పిండుకోటానికే అన్నట్టు నడుపుతున్నారు.

డివిడెండ్ పే చేసే స్టాక్స్ సంవత్సరంలో ఎన్నిసార్లు పే చేస్తారు?

సాధారణంగా ఆర్థిక ఫలితాలు ప్రకటించేప్పుడు డివిడెండ్లు ప్రకటిస్తారు – త్రైమాసిక ఫలితాలు కావచ్చు, వార్షిక ఫలితాలు కావచ్చు. అయితే మన దేశంలో ఏడాదికొక సారి, మధ్యలో ఒకటి-రెండు సార్లు డివిడెండ్లు ప్రకటించటం పరిపాటి.

డివిడెండ్ అనేది డబ్బు రూపంలోనే ఇస్తారా? లేదా స్టాక్స్ రూపంలో కూడా ఇస్తారా?

డివిడెండ్ నగదు రూపంలోనే ఇస్తారు – అలా ఇచ్చే దాన్నే డివిడెండ్ అంటారు. స్టాక్స్ రూపంలో ఇచ్చేవి బోనస్ అంటారు.

Stock Market

ఒక సంస్థ తమ లాభాలను మదుపర్లతో రెండు విధాలుగా పంచుకుంటుంది:

నగదు డివిడెండ్ – ఒక షేరుకు ఇంత నగదు అని పంచటం.

షేర్ల డివిడెండ్ – ఒక షేరుకు ఇన్ని షేర్లు అని పంచటం (ఇదే బోనస్ ఇష్యూ).

డివిడెండ్‌పై DDT(డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్) ఉంటుంది, బోనస్ షేర్లపై ఎటువంటి పన్నూ ఉండదు.

బోనస్ షేర్లు జారీ చేసేందుకు పలు కారణాలు:

సంస్థ ప్రమోటర్లు వారి వోటింగ్ హక్కును పెంచుకోవటం.

షేర్ల ద్రవ్యత్వాన్ని పెంచటం. ఒక షేరు వెల బాగా ఎక్కువగా ఉంటే చిన్న మదుపర్లు కొనరు. ఇందువల్ల ద్రవ్యత్వం తగ్గి పెద్ద సంస్థ ఏదైనా ఆ సంస్థను స్వాయత్తం చేసుకోవటం చాలా సులభం. ఉదా: MRF షేరు ధర 60,000/-.

మదుపర్లలో సంస్థపై నమ్మకం, దీర్ఘకాలిక పనితనంపై విశ్వాసం కలిగించటం.

బోనస్ షేర్ల వల్ల మదుపర్లకు కలిగే ప్రయోజనాలు:

ఉచితంగా సంస్థలో మరింత భాగం దక్కటం.

ఉచితంగా వచ్చిన షేర్లపై ఎటువంటి పన్ను లేకపోవటం.

ఇకపై నగదు డివిడెండు ప్రకటించినప్పుడు ఎక్కువ నగదు వచ్చే అవకాశం.

ఒక ఉదాహరణ:

ఒకవేళ ఎవరైనా 1980 సంవత్సరంలో 10,000 రూపాయలు కనుక (Wipro)విప్రో కంపెనీ లో పెట్టుబడిగా పెట్టి 34 సంవత్సరాల పాటు కొనసాగించి ఉంటె 2014 సంవత్సరంలో వాటి విలువ అక్షరాలా 535 కోట్ల రూపాయలు. నమ్మశక్యంగా లేదు కదా.అదెలాగో ఇప్పుడు చూద్దాం

1980 సంవత్సరంలో విప్రో కంపెనీ షేర్ ధర 100 రూపాయలాగా ఉండేది. ఆ సమయంలో మనం 10000 రూపాయలతో విప్రో కంపెనీకి చెందిన 100 షేర్లు కొన్నాం అనుకుందాం.

1981 లో విప్రో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే మన దగ్గర 1 షేర్ కనుక ఉంటె విప్రో కంపెనీ మరొక షేర్ ని బోనస్ గా మన ఖాతాలో వేస్తుంది. కాబట్టి మనం 100 షేర్లు కొన్నాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర 200 విప్రో షేర్లు ఉన్నట్టు.

1985 సంవత్సరంలో కంపెనీ మరలా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. దాంతో మన దగ్గర ఉండే 200షేర్లు కాస్త 400 షేర్లు అయ్యాయి

1986 లో కంపెనీ తన షేర్ ధరను 10 రూపాయలుగా విభజించింది. దీనినే స్టాక్ స్ప్లిట్ (Stock Split) అంటారు. దీని గురించి రాబోయే భాగాలలో వివరంగా తెలుసుకుందాం. ఇలా షేర్ విభజన జరగడంతో మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 400 నుండి 4000 చేరుకుంది.

1987 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. మన దగ్గర ఉండే 4000 షేర్లకి కంపెనీ బోనస్ గా 4000 షేర్లు ఇవ్వడంతో ఇప్పుడు మన దగ్గర షేర్ల సంఖ్య 8000 కి చేరుకుంది.

1989 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 16,000 కు చేరుకుంది.

1992 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది.ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 32,000 కు చేరుకుంది.

1995 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది.ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 64,000 కు చేరుకుంది.

1997 లో కంపెనీ ఈ సారి 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే మన దగ్గర ఉన్న ఒక్కొక్క షేర్ కి రెండు షేర్లను బోనస్ గా ఇస్తుంది. దాంతో మన దగ్గర ఉండే 64,000 షేర్లు 1,92,000 షేర్లు అయ్యాయి.

1999 లో కంపెనీ మరలా తన షేర్ ధరను 2 రూపాయలుగా విభజించింది (Stock Split). ఇలా Stock Split జరగడంతో మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 1,92,000 నుండి 9,60,000 చేరుకుంది.

2004 లో కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఇప్పుడు షేర్ల సంఖ్య 28,80,000 కు చేరుకుంది.

2005 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 57,60,000 కు చేరుకుంది.

2010 లో కంపెనీ 2:3 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే మన దగ్గర 3 షేర్లు ఉంటె కంపెనీ బోనస్ గా 2 షేర్లను ఇస్తుంది. దాంతో మన దగ్గర ఉన్న షేర్ల సంఖ్య 96,00,000.

అంటే మనం 1980 లో 10000 రూపాయలతో కొన్న 100 షేర్లు కాస్త Stock Split, బోనస్ కారణంగా 2010 నాటికి 96,00,000 షేర్లగా మారాయి. ఈ 96 లక్షల షేర్లను 2014 వరకు అమ్మలేదు అనుకుందాం. 7 April, 2014 నాటికి విప్రో కంపెనీ షేర్ ధర 557 రూపాయలుగా ఉంది.

అంటే ఒక్క షేర్ ధర 557 రూపాయలు. మన దగ్గర ఉన్న షేర్ల సంఖ్య 96,00,000. ఇప్పుడు వీటి విలువను లెక్కగడితే

557 × 96,00,000 = Rs.534,72,00,000/- . సుమారుగా 535 కోట్ల రూపాయలు. అంతేకాదు ఈ 535 కోట్ల రూపాయల లాభానికి ఒక్క రూపాయి కూడా టాక్స్(TAX) కట్టవలసిన అవసరం లేదు.

కేవలం Wipro కంపెనీ ఒక్కటే కాదు. Cipla , Reliance, Titan, Dr. Reddy Labs ఇలా ఎన్నో కంపెనీలు ఇటువంటి లాభాలనే అందించాయి.

10000 రూపాయలు ఎక్కడ , 535 కోట్ల రూపాయలు ఎక్కడ. బ్యాంకు , రియల్ ఎస్టేట్, బంగారం ఇలా రంగంలో అయిన ఇంత రాబడి రాదు. అయితే 1980 లో పెట్టుబడి పెట్టి 34 సంవత్సరాల పాటు ఆ పెట్టుబడి ని కొనసాగించిన వారు మాత్రమే అంత లాభం పొందారు. చాలా తక్కువ మందికి మాత్రమే అంతటి ఓపిక ఉంటుంది. చాల మంది ఈరోజు పెట్టుబడి పెట్టి రేపటికి అది రెట్టింపు అయిపోవాలని ఆతృతతో స్టాక్ మార్కెట్ లోకి వచ్చి చేతులు కాల్చుకుంటారు. కాబట్టి Stock Market మీద కొద్దీ పాటి జ్ఞానం, అవగాహన, ఓపికతో పెట్టుబడి పెడితే తప్పకుండ దీర్ఘకాలం లో మంచి లాభాలు పొందవచ్చు.

ఇది వాస్తవం, ఊహా లెక్క కాదు.