Uncategorized

ఇప్పటికీ వాడుకలో ఉర్దూ పదాలే అధికం

నిజాం కాలం నుంచీ చలామణి

చాలా మందికి అర్థంకాని పరిస్థితి

రెవెన్యూ పదజాలం.. ఇప్పటికీ చాలామందికి అర్థంకాని గందరగోళం.. నిజాం కాలం నుంచి చలామణిలో ఉన్న ఈ పదాలపై ఓ సారి లుక్కేద్దాం.. రెవెన్యూ శాఖ పదాలు ఎక్కువగా ఉర్దూలోనే ఉన్నాయి. కాలక్రమేణా ఇంగ్లిష్, తెలుగు పదాలు కొన్ని వచ్చి చేరినా ఈ పరిభాష ఇప్పటికీ సామాన్యులకే కాదు.. ఆ శాఖలో కొందరు ఉద్యోగులకు సైతం తెలియదంటే అతిశయోక్తి కాదు. తాజాగా ‘రెవెన్యూ శాఖ’ హాట్ టాపిక్లా మారిన నేపథ్యంలో అందులోని కొన్ని పదాలు..

వాటి అర్థాలు మీ కోసం..

గ్రామ కంఠం : గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అం టారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.

అసైన్డ్భూమి : భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.

ఆయకట్టు : ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.

బంజరు భూమి (బంచరామి) : గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.

అగ్రహారం : పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.

దేవళ్ ఇనాం : దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.

అడంగల్ (పహాణీ) : గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్ను అడంగల్ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.

తరి : సాగు భూమి

ఖుష్కీ : మెట్ట ప్రాంతం

గెట్టు : పొలం హద్దు

కౌల్దార్ : భూమిని కౌలుకు తీసకునేవాడు

కమతం : భూమి విస్తీర్ణం

ఇలాకా : ప్రాంతం

ఇనాం : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి

బాలోతా ఇనాం : భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి

సర్ఫేఖాస్ : నిజాం నవాబు సొంత భూమి

సీలింగ్ : భూ గరిష్ఠ పరిమితి

సర్వే నంబర్ : భూముల గుర్తింపు కోసం కేటాయించేది

నక్షా : భూముల వివరాలు తెలిపే చిత్రపటం

కబ్జాదార్ : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి

ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) : భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.

ఫీల్డ్ మెజర్మెంట్ (ఎఫ్ఎంబీ) బుక్ : దీన్నే ఎఫ్ఎంబీ టీపన్ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.

బందోబస్తు : వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.

బీ మెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్ను బీ మెమో అంటారు.

పోరంబోకు : భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.

ఫైసల్ పట్టీ : బదిలీ రిజిస్టర్

చౌఫస్లా : ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.

డైగ్లాట్ : తెలుగు, ఇంగ్లిఫ్ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్.

విరాసత్/ఫౌతి : భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.

కాస్తు : సాగు చేయడం

మింజుములే : మొత్తం భూమి.

మార్ట్గేజ్ : రుణం కోసం భూమిని కుదవపెట్టడం.

మోకా : క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్ఇన్స్పెక్షన్).

పట్టాదారు పాస్ పుస్తకం : రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.

టైటిల్ డీడ్ : భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.

ఆర్వోఆర్ (రికార్డ్స్ ఆఫ్ రైట్స్) : భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్.

ఆర్ఎస్సార్ : రీ సెటిల్మెంట్ రిజిస్టర్ లేదా శాశ్వత ఏ రిజిస్టర్.

పర్మినెంట్ రిజిస్టర్ : సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్. సేత్వార్ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.

సేత్వార్ : రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.

సాదాబైనామా : భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.

దస్తావేజు : భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇత
రత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.

ఎకరం : భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.

అబి : వానకాలం పంట

ఆబాది : గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు

అసైన్మెంట్ : ప్రత్యేకంగాకేటాయంచిన భూమి

శిఖం : చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం

బేవార్స్ : హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్ భూమి అంటారు.

దో ఫసల్ : రెండు పంటలు పండే భూమి

ఫసలీ : జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.

నాలా : వ్యవసాయేతర భూమి

ఇస్తిఫా భూమి : పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి

ఇనాం దస్తర్దాన్ : పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి

ఖాస్రాపహానీ : ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.

గైరాన్ : సామాజిక పోరంబోకు

యేక్రార్నామా : ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్ తీసుకునే గ్రామాల ఒప్పందం..

Uncategorized

ప్రశ్న : ఆరోగ్య బీమా అంటే ఏమిటి?

సమాధానం:

‘ఆరోగ్య బీమా’ అనే పదం, మీ వైద్య ఖర్చులకు ఆచ్ఛాదన పలిపించే ఒక రకం బీమాకు వర్తిస్తుంది. ఒక ఆరోగ్య బీమా పాలసి బీమా కంపెనీ మరియు ఒక స్వతంత్ర వ్యక్తి/బృందం మధ్య ఒడంబడిక, ఇందులో బీమా కంపెనీ పలసీలో నిర్దిష్టంగా తెలుపబడిన నియమాలు మరియు షరతులకు లోబడి ఒక నిశ్చిత మైన ప్రీమెయమ్ వద్ద నిర్దిష్టమైన ఆరోగ్య బీమా ఆచ్ఛాదనను అందజేయడానికి అంగీకరిస్తారు.

ప్రశ్న : లభిస్తున్న ఆరోగ్య బీమా రకాలేమిటి?

సమాధానం:

ఇండియాలోని ఆరోగ్య బీమా పాలసీలు సాధారణంగా ఆసుపత్రిలో చేర్చబడినందు వల్ల భరించిన ఖర్చులకు ఆచ్ఛాదన కల్పిస్తాయి, అయితే ప్రస్తుతం పలు రకాల పథకాలు అభ్యమవుతున్నాయి, ఇవి బీమా చేయబడుతున్న వారి అవసరం మరియు అభిమతం అధారంగా ఒక శ్రేణి ఆరోగ్య బీమా అందిస్తాయి. ఆరోగ్య బీమా చేసేవారు సాధారణంగా ఆసుపత్రికి నేరుగా డబ్బు చెల్లించే పద్ధతి (నగదు రహిత సౌకర్యం) లేదా జబ్బులు మరియు గాయాలతో సహ సంబంధంగా కల ఖర్చులను తిరిగి చెల్లిచే పద్ధతి లేదా ఒక జబ్బు చేసిన మీదట ఒక స్థిరమైన మొత్తాన్ని అందజేసే పద్ధతిని అందజేస్తారు. ఆరోగ్య ప్రణాళిక ద్వారా ఆచ్ఛాదన కల్పించబడే ఆరోగ్య సంరక్షణ రకం మరియు మొత్తం ముందుగానే నిర్దిష్టంగా తెలియ పరచడం జరుగుతుంది.

ప్రశ్న: ఆరోగ్య బీమా ఎందుకని ముఖ్యమైనది?

సమాధానం:

మన అవసరాలను బట్టి మనందరం మనం మనకొరకు మరియు మన కుటుంబ సభ్యులందరి కొరకు ఆరోగ్య బీమా తప్పకుండా కొనుగోలు చేయాలి. ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడ6 ద్వారా ఆకస్మాత్తుగా, అనుకోని విధంగా ఆసుపత్రిలో చేరితే దాని ఖర్చుల నుండి (లేదా క్రిటికల్ ఇల్ నెస్ లా0టి అచ్ఛాదన కల్పించబడే ఇతర ఆరోగ్య సంబంధిత సంఘటనలు) మనల్ని పరిరక్షిస్తుంది, లేక పోతే ఇంట్లో దాచుకున్న డబ్బును చిల్లి పడుతుంది లేదా అప్పుల బారిన పడవలసివస్తుంది. పలు రకాల ఆరోగ్య సమస్యల హెచ్చరికలు లేకుండా వైద్య సంబంధిత అత్యవసర పరిస్థితి మనలో ఎవరినైనా దెబ్బతీయవచ్చును. సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి, కొత్త ప్రక్రియలు మరియు మరింత ప్రభావం కలిగిన మందులు, వీటన్నిటి ఖరీదు పెరగడంతో ఆరోగ్య సంరక్షణ కూడా రోజు రోజుకి మితిమీరి ఆర్ధిక పరంగా భారమయి పోతున్నది. ఈ అధిక ఖర్చుతో కూడిన చికిత్స్ చాలా మంది మనుషులకు భరించలేనిది, అయితే, ఆరోగ్య బీమా అనే భద్రతను కల్పించుకోవడం చాలా మందికి వీలయ్యే పని.

ప్రశ్న : ఏఏ రకాల ఆరోగ్య బీమా ప్రణాళికలు లభ్యమవుతున్నాయి?

సమాధానం:

ఒక సూక్ష్మ – బీమా పాలసీ క్రింద రూ. 5000 బీమా చేయబడిన మొత్తంలోనే ఆరోగ్య బీమా పాలసీలు లభ్యమవుతున్నాయి, అక్కడి నుండి రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి కూడా కొన్ని నిశ్చితమైన క్రిటికల్ ఇల్ నెస్ ప్లానుల క్రింద లభ్యమవుతున్నాయి. బీమా చేసే చాలా మంది రూపాయలు 1 లక్షల మధ్య మొత్తానికి పాలసీలుల్ జారీచేస్తారు. బీమా చేసే వారి చెల్లించవలసిన గది అద్దెలు మరియు ఇతర ఖర్చులు, ఎంచుకున్న బీమా చేయబడే మొత్తానికి లింకు చేయడం ఎక్కువై పోతున్నది. కాబట్టి, చిన్న వయస్సులోనే తగినంత మొత్తానికి అచ్ఛాదన తీసుకోమని సలహా ఇవ్వబడుతున్నది, ఎందుకనగా, ప్రత్యేకించి ఒక దావా చేసిన తరువాత బీమా చేసే మొత్తాన్ని పెంచండం అ0త సులభం కాదు. ఇంకా, ధారణ బీమా కంపెనీలు చాలా మటుకు ఒక సంవత్సరం వ్య్వధికి ఆరోగ్య బీమా పాలసీలను అందజూపుతాయి, అయితే రెండు, మూడు, నాలుగు మరియు ఐదు సంవత్సరాల వ్యవధికి కూడా జారీచేయ పాలసీలున్నాయి. జీవిత బీమా కంపెనీలు దీర్ఘ కాల వ్యవధికి జారీ చేయబడే ప్లానులను కలిగి యున్నాయి.

ఆసుపత్రిలో చేరిన దానికి ఇచ్చే పాలసీ, ఇది పాలసీ వ్యవధిలో ఆసుపత్రిలో చేర్చిన తరువాత చికిత్సకు వాస్తవంగా అయ్యే ఖర్చులను పాక్షికంగా లేదా పూర్తిగా అచ్ఛాదన కల్పిస్తాయి. ఇదొక విస్చతమైన అచ్ఛాదన రూపం, పలు రకాల ఆసుపత్రి ఖర్చులను వర్తిస్తుంది. దీనిలో కొంత నిర్దిష్ట సమయానికి ఆసుపత్రిలో చేరక ముందు మరియు చేరిన తరువాత ఖర్చులకు వర్తిస్తుంది. అలాంటి లాపసీలు ఒక వ్యక్తికి బీమా చేసే మొత్తంపై లేదా కుటుంబ ఫ్లోటర్ పై అధారపడి లచ్యమవుతాయి, ఫ్లోటర్ లో బీమా చేయబడిన మొత్తం కుటుంబ సభ్యుల మధ్య పంచుకోవడం జరుగుతుంది.

హాస్పిటల్ డెయిలీ క్యాష్ భెనిఫిట్ పాలసీ అనే మరోక పథకం ఆసుపత్రిలో ఉన్న ప్రతి రోజుకు స్థిరమైన మొత్తంలో బీమా మొత్తం చెల్లిస్తుంది. ఐసియు లో చేర్చబడితే లేదా నిర్దిష్టమైన జబ్బులకు లేదా గాయాలకు ఎక్కువ మొత్తంలో రోజు వారీ ప్రయోజనం అందించే ఆచ్ఛాదన కూడా ఉంటుంది.

క్రిటిల్ ఇల్ నెస్ భెనిఫిట్ పాలసీ, ఒక నిర్దిష్టమైన జబ్బు ఉందని రోగ నిర్ధారణ చేయబడితే లేదా ఒక నిర్దిష్టమైన ప్రక్రియను చేయించుకుంటుంటే, బీమా చేయబడిన వారికి ఒక స్థిరమైన ఏక మొత్తం డబ్బు అందజేయడుతుంది. ఒక చాల తీవ్రమైన జబ్బు కారణంగా పలు ప్రత్యక్ష లేదా పరోక్ష ఆర్ధిక పర్యవసానాలను వీలైనంత వరకూ తగ్గి0చడంలో ఈ మొత్తం సహాయపడుతుంది. సధారణంగా, ఈ మొత్తం ఒకసారి చెల్లింప బడితే, ప్లాను అమలు కావడం పూర్తవుతుంది.

ఒక నిర్దిష్టమైన శస్త్ర చికిత్స్ చేయించుకుంటే ఏక మొత్తంలో చెల్లించడాన్ని అందజూపే ఇతర రకాల పథకాలున్నాయి. (సర్జికల్ క్యాష్ బెనిఫిట్) మరియు వయోవృద్ధుల అవసరాలను నిర్దిష్టమైన రీతిలో లక్ష్యంగా చేసుకుని వారి అవసరాలను నెరవేర్చే పథకాలు కూడా ఉన్నాయి.

ప్రశ్న: నగదు రహిత ప్రయోజనం అంటే ఏమిటి?

సమాధానం:

దేశంలోని ఆసుపత్రుల నెట్ వర్క్తో బీమా కంపెనీలు ఒక ఒప్పంద ఏర్పాటును కలిగి యుంటాయి. నగదు రహిత బీమా పాలసీ క్రింద, పాలసీ దారుడు కనుక నెట్ వెర్క్ ఆసుపత్రులు దేనిలోనైనా చికిత్స చేయించుకుంటే, అప్పుడు బీమా చేయించుకున్న వ్యక్తి ఆసుపత్రి బిల్లులు చెల్లించవలసిన పని లేదు.బీమా కంపెనీ తనథర్డ్ పార్టి ఎడ్మిన్ స్ట్రేటర్ (టిపిఎ) ద్వారా సరాసరి ఆసుపత్రికి డబ్బులు చెల్లిస్తుంది. పాలసీ ద్వారా సరాసరి ఆసుపత్రికి డబ్బులు చెల్లిస్తుంది. పాలసీ ద్వారా నిర్ధారించబడిన పరిమితులు లేదా ఉప పరిమితులను మించిన ఖర్చులు ఆసుపత్రికి బీమాచేయబడిన వ్యక్తి నేరుగా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, నెట్ వర్క్ లో లేని ఒక ఆసుపత్రిలో మీరు కనుక చికిత్స చేయించుకుంటే, నగదు రహిత సౌకర్యం లభ్యం కాదు.

ప్రశ్న : నేను కనుక ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటే నాకు లభించే పన్ను సంబందిత ప్రయోజనా లేమిటి?సమాధానం:

ఒక జతచేయబడిన ప్రోత్సాహకంగా ఆకర్షణీయమైన పన్ను సంబందిత ప్రయోజనాలతో ఆరోగ్య బీమా లభిస్తుంది.

ఆదాయపు పన్ను చట్టంలో ఒక ప్రత్యేక విభాగం ఉన్నది, దీని ప్రకారం, ఆరోగ్య బీమాకు పన్ను ప్రయోజనాలను అందజేస్తుంది.

ఇదే సక్షన్ 80 డి మరియు జీవిత బీమాకు వర్తించే సక్షన్ 80 సి లాగా కాదు, సక్షన్ 80 సి క్రింద ఇతర రకాల పెట్టుబడులు/ఖర్చులు కూడా తగ్గింపుకు అర్హత పొందుతాయి. ప్రస్తుతం, నగదు కాకుండా మరే విధంగానైనా డబ్బు చెల్లించి ఆరోగ్య బీమాను కొనుగోలు చేసిన వారు, తమకు స్వయంగా, భార్య లేదా భర్తకి మరియు తనపై అధారపడిన పిల్లల కొరకు చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియమ్ ద్వారా తమ పన్ను చెల్లించవలసిన ఆదాయంలో రూ.15000 వార్షిక తగ్గింపును లభ్యం చేసుకోవచ్చును. వయోవృద్ధులకు ఈ తగ్గింపు అధికంగా ఉంటుంది. ఇది ఉఊ.200,000.ఇ0కా, ఆర్ధిక సంవత్సరం 2008 – 09 మొదలుకుని, తల్లిదండ్రుల తరపున చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియమ్ కు అదనంగా రూ. 15,000 తగ్గింపు లభ్యం అవుతుంది, ఇది మరలా తల్లిదండ్రులు కనుక వయోవృద్ధులైతే ఈ మొత్తం రూ.20,000.

ప్రశ్న : ఆరోగ్య బీమా ప్రీమియమ్ ను ప్రభావితం చేసే అంశాలేమిటి?

సమాధానం:

ప్రీమియమ్ ని నిర్ధారించే ప్రధాన అంశం వయస్సు. మీకెంత ఎక్కువ వయస్సు ఉంటే మీ ప్రీమియమ్ అంత అధికంగా ఉంటుంది, ఎందుకంటే మీరు జబ్బు బారిన పడే అవకాశం ఎక్కువ కాబట్టి. ప్రీమియమ్ ని నిర్ధారించే మరోక ప్రధాన అంశం, మీ గత వైద్య చరిత్ర. ముందటి వైద్య చరిత్ర ఏఇ లేకపోతే, ప్రీమియమ్ ని నిర్ధారించే ప్రధాన అంశం దానంతట అదే తగ్గుపోతుంది. ప్రీమియమ్ ఖర్చుని నిర్ధారించే మరో ప్రధాన అంశం, దావా రహిత సంవత్సరాలు, ఎందుకంటే దాని ద్వారా కొంత రాయితీ వల్ల మీరు ప్రయోజనం పొందుతారు కాబట్టి. ఇది దానంతట అదే మీ ప్రీమియమ్ తగ్గిపోవడానికి సహాయ పడుతుంది.

ప్రశ్న : ఆరోగ్య బీమా పాలసీ వేటికి అచ్ఛాదన కల్పించదు?

సమాధానం:

ప్రకటన పత్రిక/పాలసీని పూర్తిగా చదివి, దాని క్రింద ఆచ్ఛాదన కల్పించబడనిదేమిటో మీరు అర్థం చేసుకోవాలి. సాధారణంగా ముందే ఉన్న వ్యాధులు (ముందుగానే ఉన్న వ్యాధి అనేదానిని ఎలా నిర్వచించారో అర్థం చేసుకోవడానికి పాలసీని చదవాలి) ఆరోగ్య బీమా పాలసీ నుండి మినహాయించడం జరుగుతుంది. తదుపరి, ఆచ్ఛాదన యొక్క మొదటి సంవత్సరం నుండి కొన్ని వ్యాధులను పాలసీ సాధారణంగా మినహాయిస్తుంది మరియు వేచి ఉండవలసిన వ్యవధి కూడా విధించబడుతుంది. కళ్ళద్దాలు, కాంటాక్ట్ లెన్సులు మరియు వినికిడి సాధనాలు లాంటి ప్రమాణికమైన మినహాయింపులు ఉంటాయి, అలాగే దంత చికిత్స్ / శస్త్ర చికిత్స్ (ఆసుపత్రిలో చేర్చవలసిన అవసరం రాకపోతే తప్ప) ఆచ్ఛాదన కల్పించబడదు, మూర్ఛలు, సాధారణ ఆసక్తత, పుట్టుకతో వచ్చిన బాహ్య లోపాలు, వి.డి., కావాలని స్వయంగా పరుచుకోవడం, మత్తును కలిగించే ఔషదాలు/మద్యాన్ని ఉపయోగించడం, ఎయిడ్స్ , రోగినిర్ధారణ ఖర్చులు, ఆసుపత్రిలో చేరవసిన అవసరం ఉన్న వ్యాధికి సంబందం లేని ఎక్స్ – రే, లేదా లేబరేటరీ పరిక్షలు, సెజేరియన్ విభాగంతొ సహా గర్భధారణ లేదా బిడ్డ జననంకు సంబందించిన చికిత్స , నేచురోపతి చికిత్స

ప్రశ్న: పాలసీ క్రింద వేచి ఉండవలసిన వ్యవధి ఏదైనా ఉందా?

సమాధానం:

అవును. మీరొక కొత్త పాలసీ తీసుకునప్పుడు ,సాధారనంగా ,పాలసీ ప్రారంభ తేదీ నుండి 30 రోజులు వేచి ఉండవలసిన వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధి సమయంలో ఏదైనా ఆసుపత్రిలో చేర్చబడిన ఛార్జీలను బీమా కంపెనీ చెల్లించదు. అయితే, దుర్ఘటన కారణంగా అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చవలసి వస్తే ఇది వర్తించదు. రెన్యువల్ చేయబడ్డ తదుపరి పాలసీలకు ఈ వేచియుండే వ్యవధి వర్తించదు.

ప్రశ్న : ఆరోగ్య బీమా పాలసీ క్రింద ముందుగానే ఉన్నస్థితి అంటే ఏమిటి?సమాధానం:

మీరు ఆరోగ్య బీమా పాలసీని తీసుకోకముందే మీకున్నటువంటి స్థితి/వ్యాధి, మరియు ఇది విశిష్టమైనది, ఎందుకంటే మొదటి పాలసీకి 48 నెలల ముందు అలా ముందుగానే ఉన్న పరిస్థితులకు బీమా కంపెనీలు ఆచ్ఛాదన కల్పించవు. దీనర్థం, బీమా ఆచ్ఛాదన కొనసాగుతున్న 48 నెల పూర్తయిన తరువాత ముందుగానే స్థితికి చెల్లింపు చేయడానికి పరిగణించవచ్చు అని.

ప్రశ్న : ముగింపు తేదీ ముందుగా నా పాలసీని పునరుద్ధరించక పోతే పునరుద్ధరించడానికి నేను నిరాకరించబడతానా?

సమాధానం:

ముగింపు తేదీ కి 15 రోజుల లోపల (దీనిని ఉదార వ్యవధి (గ్రేస్ పీరియడ్) అంటారు) మీరు కనుక ప్రీమియమ్ చెల్లించినట్లయితే పాలసీ పునరుద్ధరింప బడుతుంది. అయితే, బీమా కంపెనీ చేత ప్రీమియమ్ అందుకొని సమయానికి ఆచ్ఛాదన లభించదు. ఉధార వ్యవధి లోపల ప్రీమియమ్ కనుక చెల్లించక పోతే పాలసే రద్ధయిపోతుంది.

ప్రశ్న : పునరుద్ధరణ ప్రయోజనాన్ని పోగొట్టుకోకుండా ఒక బీమా కంపెనీ నుండి మరొక దానికి నేను బదిలీ చేసుకోవచ్చునా?

సమాధానం:

అవును. బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అధికార వర్గం (ఐ ఆర్ డి ఎ) వారు దీనిని 1 అక్టోబర్ 2011 నుండి అమలు చేయాలని ప్రకటన పత్రిటను జారీచేసారు, దీని ప్రకారం ఒక బీమా కంపెనీ నుండి మరొక దానికి బదిలీచేసుకోవడాన్ని, ఇంతకు మునుపటి పాలసీ ద్వారా లభించిన ముందుగానే ఉన్న షరతులతో బీమా చేయబడిన వ్యక్తి పునరుద్ధరణ క్రెడిట్లను నష్టపోకుందా అనుమతించమని నిర్దేశించడం జరిగింది. అయితే, ఇంతకు మునుపటి పాలసే క్రింద బీమా చేయబడిన మొత్తానికి (బోనస్ తో కలిపి ) ఈ క్రెడిట్ పరిమితం చేయబడుతుంది. వివరాల కొరకు, బీమా కంపెనీతో మీరు సంప్రదించవచ్చును.

ప్రశ్న : ఒక దావా సమర్పించిన తరువాత పాలసీ ఆచ్ఛాదనకు ఏమి జరుగుతుంది?సమాధానం:

ఒక క్లెయిమ్ సమర్పించిన తరువాత మరియు అది పరిష్కరించ బడిన తరువాత, పరిష్కారం సందర్భంగా చెల్లించిన మొత్తం పాలసీ ఆచ్ఛాదన నుండి తగ్గించడం జరుగుతుంది. ఉదాహరణకు, జనవరిలో సంవత్సరానికి రూ. 2 లక్షలతో ఆచ్ఛాదనతో ఒక పాలసీని మీరు ప్రారంభిచారనుకోండి. ఎప్రిల్ లో, 2 లక్షలకు దావా సమర్పంచారు. మే నుండి డిశంబరు వరకుక్ లభించే ఆచ్ఛాదన, మిగిలిన రూ.3 లక్షల రూపాయలు.

ప్రశ్న : “ఏదైన ఒక అస్వస్థత” అంటే ఏమిటి?

సమాధానం:

“ఏదైన ఒక అస్వస్థత” అంటే అర్థం, అస్వస్థత కొనసాగే వ్యవధి అని, దీనిలో పాలసీలో నిర్దిష్టంగా తెలియజేసినట్లుగా నిశ్చితమైన రోజులలో తిరగబెట్టడం కూడా కూడి యున్నది. సాధారణంగా ఇది 45 రోజులు ఉంటుంది.

ప్రశ్న : ఒక సంవత్సరంలో గరిష్టంగా అనుమతించబడే దావాలు ఎన్ని?

సమాధానం:

పాలసీ దేన్లోనైనా నిర్దిష్టంగా పరిమితి విధించక పోతే, తప్ప పాలసీ వ్యవధిలో ఎన్ని దావాలనైనా చేసుకోవచ్చును. అయితే, పాలసీ క్రింద బీమా చేయబడిన మొత్తం, గరిష్టంగా పరిమితి

ప్రశ్న: “ఆరోగ్య తనిఖీ” సౌకర్యం అంటే ఏమిటి?

సమాధానం:

కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు కొన్ని సంవత్సరాలలో ఒకసారి సాధారణ ఆరోగ్య తనిఖీకి నిర్దిష్టమైన ఖర్చులను చెల్లిస్తాయి. సాధారణంగా ఇది నాలుగు సంవత్సరాలకు ఒకసారి లభిస్తుంది.

ప్రశ్న: కుటుంబ ఫ్లోటర్ పాలసీ అంటే అర్థం ఏమిటి?

సమాధానం:

కుటుంబ ఫ్లోటర్ పాలసీ అనేది మీ పూర్తి కుటుంబపు ఆసుపత్రి ఖర్చులను చెల్లించే ఒక సింగిల్ పాలసీ. పాలసీకి ఒకే బీమా చేయబడిన మొత్తం ఉంటుంది, దీనిని బీమా చేయబడిన వ్యక్తులు ఎవరైనా / అందరూ నిష్పత్తి దేనిలోనైనా లేదా మొత్తం ఉపయోగించుకోవచ్చును, అయితే బీమా చేయబడిన పాలసీ మొత్తం యొక్క మొత్తం మీది పరిమితి వరకు ఇలా చేయవచ్చును. చాలా తరచుగా కుటుంబ ఫ్లోటర్ ప్లానులు విడిగా ఒక్కో వ్యక్తికి పాలసీలు తీసుకోవడం కన్నా మెరుగైనవి. అకస్మాత్తుగా జబ్బు చేయడం, శస్త్ర చికిత్సలు మరియు దుర్ఘటనల సందర్భాలలో వైద్య ఖర్చులన్నిటి పట్ల కుటుంబ ఫ్లోటర్ పాలసీ శ్రద్ధ వహిస్తాయి.

Insurance

అర్హత:

18 నుంచి 50 సంవత్సరాల వయస్సు మరియు ఒక బ్యాంకు ఖాతా కలిగి ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటుంది. 50 సంవత్సరాల పూర్తి చేయకుండానే పథకంలో చేరిన వ్యక్తులకు లైఫ్ కవర్, ప్రీమియం చెల్లింపుకు లోబడి, 55 సంవత్సరాల వరకు పథకం వర్తిస్తుంది.

ప్రీమియం:

ఏడాదికి Rs.330. ఆటో డిబేటు అవుతుంది.

చెల్లింపు రకం:

ప్రీమియం చెల్లింపు చందాదారులు ఖాతా నుండి బ్యాంకు ద్వారా నేరుగా ఆటో డెబిట్ అవుతుంది.

రిస్క్ కవరేజ్:

ఏ కారణంచేతనైనా మరణించినప్పుడు రూ .2 లక్షలు.

రిస్క్ కవరేజ్ నిబంధనలు:

ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అతను దీర్ఘకాల ఎంపిక తీసుకుంటే తన ఖాతాలో బ్యాంకు ఆటో డెబిట్ ప్రతి సంవత్సరం అవుతుంది.

ఎవరు ఈ పథకాన్ని అమలు చేస్తారు:

పథకం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మరియు ఈ ప్రయోజనం కోసం బ్యాంకులతో టై అప్ కు సిద్ధంగా ఉన్న అన్ని ఇతర జీవిత బీమా కంపెనీలు అందిస్తున్నాయి.

ప్రభుత్వం సహాయం:

  • వివిధ మంత్రిత్వ శాఖలు ఎవరూ తీసుకోని డబ్బు నుండి ఈ బడ్జెట్లో నుండి లేదా పబ్లిక్ వెల్ఫేర్ ఫండ్ నుండి వారి లబ్దిదారులకు వివిధ కేటగిరీల సహ దోహద ప్రీమియం అందించవచ్చు. ఇది విడిగా సంవత్సరంలో నిర్ణయించబడుతుంది.
  • సాధారణ ప్రచార ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది.

మూలం: PIB

Insurance

ర్హత:

బ్యాంకు ఖాతాగల 18 నుంచి 70 సంవత్సరాల ప్రజలు అర్హులు.

ప్రీమియం:

ఏడాదికి రూ.12 లు.

చెల్లింపు రకం:

చందాదారుల బ్యాంకు ఖాతా నుండి ప్రీమియం నేరుగా చేల్లించబడుతుంది. ఈ పద్ధతి మాత్రమే అందుబాటులో ఉంది.

రిస్క్ కవరేజ్:

  • రూ .2 లక్షలు – ప్రమాదవశాత్తు మరణం మరియు పూర్తి వైకల్యానికి
  • రూ .1 లక్ష – పాక్షిక వైకల్యానికి.

అర్హత:

బ్యాంకు ఖాతా మరియు ఆధార్ సంఖ్య కలిగిన ఏవరైనా వ్యక్తి పథకంలో చేరడానికి ప్రతి సంవత్సరం జూన్ 1 వతేదీ ముందు ఒక సాధారణ ఫాం ఇవ్వాలి. నామినీ పేరును ఫాంలో ఇవ్వాలి.

రిస్క్ కవరేజ్ నిబంధనలు:

ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీర్ఘకాల కొనసాగింపు ఎంపిక చేసుకుంటే అతని ఖాతాలో నుంచి ఆటో డెబిట్ ప్రతి సంవత్సరం అవుతుంది.

ఎవరు ఈ పథకం అమలు చేస్తారు ?:

పథకం ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు పథకం చేరడానికి మరియు బ్యాంకులతో టై అప్ అవడానిక సిద్ధంగా ఉన్న అన్ని ఇతర భీమా కంపనీల ద్వారా అందిస్తున్నారు.

ప్రభుత్వం సహాయం:

  • వివిధ మంత్రిత్వ శాఖలు ఎవరూ తీసుకోని డబ్బు నుండి ఈ బడ్జెట్లో నుండి లేదా పబ్లిక్ వెల్ఫేర్ ఫండ్ నుండి వారి లబ్దిదారులకు వివిధ కేటగిరీల సహ దోహద ప్రీమియాన్ని అందించవచ్చు. ఇది విడిగా సంవత్సరంలో నిర్ణయించబడుతుంది.
  • సాధారణ ప్రచార ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది.

మూలం: PIB

Wealth News

ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలనుకుంటున్నారా? అయితే, కానీ ఖర్చు లేకుండానే అందుకు సంబంధించిన విషయమంతా ఆన్‌లైన్‌ ద్వారా పొందే అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది. మెసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వారు ఇప్పుడు ఫ్రీ ఆన్‌లైన్‌ టెక్నాలజీ కోర్సు ఒకటి ప్రారంభించారు. దీని ద్వారా వ్యాపార నైపుణ్యాల్ని, స్టార్టప్‌కు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఈ జ్ఞానం ఎంఐటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఎంఐటి లాంచ్‌ ప్రోగ్రాంలు నిర్వహించే మార్గాల్ని చూపుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలనుకునే వారికి, వ్యాపార రంగంలో ఒక లక్ష్యంగా కొత్తగా ఏదైనా చేద్దాం అనుకునే యువత కోసం రూపొందించిన ఒక వినూత్నమైన కోర్సు ఇది. ఈ ప్రయత్నంలో వారికి ఎదురయ్యే సవాళ్లను ఎలా చేదించాలో వారు చెబుతారు.

  • ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలన్న తీవ్రమైన ఆకాంక్ష ఉన్నా, చాలా మందికి దాన్ని ఎలా ప్రారంభించాలో తెలియదు. అలాంటి వారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది హైస్కూల్‌, కాలేజ్‌ విద్యార్థులను ఉద్దేశించి రూపొందించినదే అయినా అన్ని వయసుల వారూ ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కేవలం ఆరు వారాల శిక్షణతో సొంతంగా ఒక వెంచర్‌ను ప్రారంభించడానికి అవసరమైన సాధనాలు, నైపుణ్యాలు, విషయజ్ఞానం లభిస్తాయి.

యోగ్యతలు:ఎంటర్‌ప్రెన్యూర్‌గా గానీ, మరే వ్యాపారంలో గానీ పూర్వానుభవం ఏమీ అవసరం లేదు.

శిక్షణలో

  • కొత్తగా కంపెనీని ప్రారంభించడంలో ఎదురయ్యే తీవ్రమైన ఆటంకాల్ని ఎలా అధిగమించాలి
  • కొత్త వ్యాపార ఆలోచనలకు ఎలా ఆచరణ రూపం ఇవ్వాలి.
  • మార్కెట్‌ రీసెర్చ్‌ చేయడం ఎలా? మీ ఉత్పత్తులు లేదా సేవలు మీ కస్టమర్‌ను చేరడం ఎలా?
  • మీ సంస్థకు సంబంధించిన ప్రణాళికను రూపొందించుకుని, అందులో మీ హోదాను పెంచుకోవడం ఎలా?
  • ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా వ్యాపారానికి, అమ్మకాలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఎలా
  • అనే ప్రశ్నలకు, ఇతర సందేహాలకు ఈ కోర్సులో పూర్తి సమాధానాలు లభిస్తాయి.

మరింత సమాచారం కోసం entrepreneurship

News Real Estate

ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌

వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఇకపై సరళం

పట్టా పాసుపుస్తకానికి హక్కు పత్రం అధికారం

కొత్త రెవెన్యూ చట్టం బిల్లులో ఎన్నో సంస్కరణలు

కొత్త రెవెన్యూ చట్టం బిల్లులో విశేషాలెన్నో

రెవెన్యూ చట్టానికి సబంధించిన బిల్లును ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుతోపాటు అనేక మార్పులతో తెచ్చిన తెలంగాణ రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ యాక్ట్‌- 2020 బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ ముందు ఉంచారు. రాష్ట్రంలోని అన్ని తహసీల్దారు కార్యాలయాల్లో ఏక కాలంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌లు పూర్తయ్యేలా కొత్త చట్టం అవకాశం కల్పిస్తోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న భూ యాజమాన్య హక్కుల కల్పన చట్టం-1971ను ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త చట్టంతో పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో భూ దస్త్రాలను నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్‌గా వ్యవహారంలో ఉన్న ప్రభుత్వం రూపొందించిన ఇంటిగ్రేటెడ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఇకపై మరింత కీలకం కానుంది. నూతన చట్టం విశేషాలు.

కొత్త రెవెన్యూ చట్టానికి సబంధించిన ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో ఎన్నో సంస్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులిలా ఉన్నాయి.

సబ్‌ రిజిస్ట్రారుగా తహసీల్దారు

  • తహసీల్దారు కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేపడతారు. తహసీల్దారు సబ్‌ రిజిస్ట్రారుగా వ్యవహరిస్తారు.
  • మండల పరిధిలోని వ్యవసాయ భూముల విక్రయాలు, బహుమతి (గిఫ్ట్‌), తనఖా, బదలాయింపులు చేపడతారు. ఇందుకోసం రిజిస్టరు చేసిన పత్రాలతో వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దారు సమయం (స్లాట్‌) కేటాయిస్తారు.
  • రిజిస్ట్రేషన్‌ సమయంలో దరఖాస్తుదారు అఫిడవిట్‌, పట్టా పాసుపుస్తకం అందజేయాలి.
  • భూ యజమాని దరఖాస్తులో పేర్కొన్న వివరాలను ధరణి పోర్టల్‌లోని భూ దస్త్రాల సమాచారంతో తహసీల్దారు సరిపోల్చుకుంటారు.
  • భారత స్టాంపుల చట్టం ప్రకారం స్టాంపు డ్యూటీ, మ్యుటేషన్‌ రుసుం వసూలు చేస్తారు.
  • రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక మ్యుటేషన్‌ సమయంలో భూ క్రయవిక్రయదారుల ఖాతాల్లో భూ విస్తీర్ణాన్ని నవీకరిస్తారు.
  • తనఖాకు ధరణిలో సూచించిన మేరకు రుసుం వసూలు చేస్తారు.
  • భూమి కొనుగోలు చేసిన యజమానికి గతంలో పట్టా పాసుపుస్తకం లేకుంటే కొత్తగా జారీ చేస్తారు. గతంలో ఇలా..

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన 141 సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఐదారు మండలాలకు ఒక సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం ఉంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిర, చర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఇక్కడే చేపడుతుండటంతో రద్దీ ఎక్కువగా ఉండేది. స్లాట్‌ దొరికేందుకు అధిక సమయం పట్టేది.

పాసుపుస్తకం పూచీకత్తు లేకుండానే రుణం

పట్టా పాసుపుస్తకం, పహాణీ నకలు తీసుకోకుండానే ఎలక్ట్రానిక్‌ దస్త్రాల పరిశీలన ఆధారంగానే బ్యాంకులు, ఇతర సంస్థలు వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలి. రుణం పొందిన, తిరిగి చెల్లించిన వారి వివరాలను ఆ సంస్థలు ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయాలి.

గతంలో ఇలా: రుణ సంస్థలు రుణాలు ఇవ్వడానికిగాను పట్టాదారు పాసుపుస్తకాల చట్టం 1971లోని సెక్షన్‌ 6సి, 6బి కింద పాస్‌బుక్కులు, టైటిల్‌ డీడ్‌లు అడుగుతున్నాయి. భూయజమానులు వాటి కోసం పట్టుబడుతున్నారు. పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్‌లు పెట్టి రుణాలు పొందిన రైతులు తిరిగి దస్త్రాల్లో వారి పేరుతో భూమిని మార్చుకోవడానికి కష్టాలెదుర్కొన్న సంఘటనలెన్నో ఉన్నాయి. వ్యవసాయ భూమికి సంబంధించిన పహాణీ పత్రాన్ని గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ధ్రువీకరించాక, తహసీల్దారు ధ్రువపత్రం జారీ చేసేవారు. దానిని తీసుకొని పాసుపుస్తకాన్ని బ్యాంకులో పూచీకత్తుగా పెట్టుకుని రుణం మంజూరు చేసేవారు.

ఆటోమేటిక్‌ విధానంలో మ్యుటేషన్‌

తహసీల్దారు భూమి రిజస్ట్రేషన్‌ పూర్తి చేయగానే ఆన్‌లైన్‌లో మ్యుటేషన్‌ (భూ యాజమాన్య హక్కు మార్పిడి) ప్రక్రియ పూర్తవుతుంది. ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేసిన భూ దస్త్రాల సమాచారం ఆధారంగా దానంతట అదే ఆటోమేటిక్‌ విధానంలో జరిగిపోతుంది

గతంలో ఇలా..: కొనుగోలు చేసిన భూమిపై హక్కులు పొందాలంటే పది రోజుల సమయం గడువు ఉండేది. సబ్‌రిజిస్ట్రారు వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకున్న పత్రాలతో తహసీల్దారుకు మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. తహసీల్దారు/గిర్దావరు(ఆర్‌ఐ), గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ద్వారా భూ క్రయవిక్రయదారులకు నోటీసులు పంపి క్షేత్రస్థాయి నుంచి విచారణ దస్త్రం తీసుకున్నాక మ్యుటేషన్‌ చేసేవారు.

వారసత్వ బదిలీ… భాగ పంపిణీ ఇలా

భూ యజమాని నుంచి వారసులు భూమిపై హక్కులు పొందాలంటే ఉమ్మడిగా ఒప్పందం తప్పనిసరి. చట్టబద్ధమైన వారసులు తామేనంటూ నిరూపిస్తే తహసీల్దారు భూ విభజన చేయాలి. ఉమ్మడి ఒప్పంద పత్రం, దరఖాస్తును పోర్టల్‌లో సమర్పిస్తే తహసీల్దారు సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులు తప్పనిసరిగా తహసీల్దారు ఎదుట హాజరవ్వాలి. న్యాయపరమైన అంశాలను పరిశీలించి మ్యుటేషన్‌ రుసుం చెల్లించాక భూమి హక్కుల దస్త్రాల్లో నమోదు చేసి కొత్త పాసుపుస్తకం జారీ చేస్తారు. గతంలో నోటీసులు జారీ, విచారణ, అభ్యంతరాల పరిశీలన ప్రక్రియలు ఉండేవి.

ఎలక్ట్రానిక్‌ విధానంలో …

ఇకపై పూర్తిగా ఎలక్ట్రానిక్‌ విధానంలో భూ రికార్డుల నిర్వహణ కొనసాగుతుంది. ధరణి పోర్టల్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో భూ యాజమాన్య హక్కుల పర్యవేక్షణ, బదిలీ కొనసాగుతుంది. కోర్‌ బ్యాంకింగ్‌ విధానం కోసం ప్రతి గ్రామంలోని భూ హక్కుల దస్త్రాలను డిజిటల్‌ రూపంలో స్టోరేజీ (నిల్వ) చేపట్టాలి. గతంలో సాధారణ పద్ధతిలో రెవెన్యూ మాతృ దస్త్రాలు, పహాణి, 1 బి పత్రం, ఇతర పత్రాలను నిర్వహించేవారు.

ప్రభుత్వ భూములకు వర్తించని చట్టం

కొత్త చట్టం కింద రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భూములకు మినహాయింపు ఉంటుంది. పాయిగా, జాగీరు, సంస్థానాలు, మక్తా, గ్రామ అగ్రహారం, ఉహ్లి, ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం కింద బదిలీ కుదరదు. జాగీరు, సంస్థాన్‌, మక్తా, పాయిగా, ఇనాం రూపాల్లో హైదరాబాద్‌ పాలకులు దానాల కింద భూములు ఇచ్చారు. వాటిని పొందినవారు జీవితకాలం అనుభవించవచ్చు. వాటి విక్రయం, వారసత్వం చెల్లదు. భూ యజమాని మృతి చెందితే పాలకులకు చెందుతుంది. వాటిని తిరిగివ్వాలా వద్దా అనేది పాలకుల విచక్షణ మేరకు ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం తెచ్చిన జాగీరు రద్దు చట్టాన్ని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. జాగీరు, సంస్థాన్‌, మక్తా, ఇనాం భూములు రాష్ట్ర ప్రభుత్వ పరమయ్యాయి. ఈ భూవివాదాలకు సంబంధించి ఏపీ (తెలంగాణప్రాంత)అతియాత్‌ విచారణ చట్టం 1952 కింద అతియాత్‌ కోర్టు ఉత్తర్వులే అంతిమం.

దస్త్రాలు దిద్దితే.. అంతే…

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా దస్త్రాలను దిద్దినట్లు, మార్చినట్లు (టాంపర్‌) గుర్తిస్తే సర్వీసు నుంచి తొలగిస్తారు. చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు. అపరాధ రుసుం విధిస్తారు.

తప్పు చేస్తే క్రిమినల్‌ చర్యలు

ప్రభుత్వ భూములకు మోసపూరితంగా పట్టా పాసుపుస్తకం జారీ చేస్తే తహసీల్దారును విధుల నుంచి తొలగించి క్రిమినల్‌ చర్యలు చేపడతారు. పాసుపుస్తకం రద్దుచేసి, భూమిని స్వాధీనం చేసుకునే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది.

డిక్రీల అమలు

కోర్టులు జారీచేసే డిక్రీలు అమలు చేసే సమయంలో భూ యజమానులకు స్లాట్‌ కేటాయించి కోర్టు నిబంధనల మేరకు రుసుం వసూలు చేస్తారు. కొత్త పట్టా పాసుపుస్తకం జారీ చేస్తారు.

  • ప్రకటన ద్వారా ప్రభుత్వానికి కొత్తగా నిబంధనలను రూపొందించుకునే అధికారం ఉంటుంది. ఆ భూములకు అనుమతి

రాష్ట్రంలో ఇప్పటి వరకు పట్టా పాసుపుస్తకాలు జారీ కాని భూములకు కొత్త పట్టా పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్లకు అనుమతి లభించనుంది. పెండింగ్‌లో ఉన్న పాసుపుస్తకాల జారీ, పంపిణీ ప్రక్రియలు పూర్తి చేసేందుకు నిబంధనల మేరకు అనుమతి ఉంటుంది.
సవరణలపై దావాకు వీలులేదు
డిజిటల్‌ దస్త్రాల ఆధారంగా ప్రభుత్వ అధికారి లేదా ప్రభుత్వం సవరణలు చేస్తే ఆ అధికారి లేదా ప్రభుత్వంపై ఎటువంటి దావాలు కుదరవు.

  • భూ దస్త్రాలకు సంబంధించి విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం నియమించిన అధికారులకు సివిల్‌ ప్రొసీజర్స్‌, 1908 ప్రకారం సివిల్‌ కోర్టుల అధికారాలుంటాయి.

◆ ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు
భూ వివాదాలను పరిష్కరించేందుకు ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు తహసీల్దారు, ఆర్డీవో, సంయుక్త కలెక్టర్‌ కోర్టుల్లో ఉన్న అపరిష్కృత కేసులన్నీ ట్రైబ్యునళ్లకు బదిలీ అవుతాయి. పునః పరిశీలన కేసులు కూడా బదిలీ కానున్నాయి. ట్రైబ్యునళ్ల తీర్పులే అంతిమం.
టైటిల్‌ డీడ్‌గా పట్టా పాసుపుస్తకం
కొత్త చట్టం ప్రకారం జారీ చేసే పట్టా పాసుపుస్తకం టైటిల్‌ డీడ్‌ను ఇకపై హక్కు పత్రంగా గుర్తిస్తారు. ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం, 1882 ప్రకారం తనఖాకు కూడా వెసులుబాటు ఉంటుంది. దస్త్రాలను రిజిస్టర్‌ చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ చట్టం, 1908 కింద అనుమతిస్తుంది.

రిజిస్టరైన వెంటనే పేరు నమోదు

వ్యవసాయేతర భూములు, ఆస్తులకు వర్తింపు

జీహెచ్‌ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్‌ చట్టాలకు సవరణ

హైదరాబా రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే రికార్డుల్లో భూయాజమాన్య హక్కులను మార్పు (మ్యుటేషన్‌) చేసి ధ్రువపత్రం ఇచ్చేలా చట్టాలను సవరిస్తూ ప్రభుత్వం బుధవారం శాసనసభలో బిల్లుల్ని ప్రవేశపెట్టింది. ఇకపై రిజిస్టర్‌ అయిన వెంటనే ఆస్తి పన్ను రికార్డుల్లో కొనుగోలుదారు పేరు నమోదవుతుంది. మ్యుటేషన్‌, ఆస్తిపన్ను సంఖ్య బదిలీ వంటి అధికారాలు ప్రస్తుతం పట్టణాల్లో, కార్పొరేషన్లలో కమిషనర్‌కు ఉండగా ఇకపై ఈ అధికారం సబ్‌రిజిస్ట్రార్‌లకు దఖలు కానుంది. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ధరణి పోర్టల్‌ ద్వారా యాజమాన్య హక్కులను బదిలీ చేసే అధికారాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖకు కేటాయించారు. జీహెచ్‌ఎంసీ చట్టం-1955, పురపాలక చట్టం-2019, పంచాయతీరాజ్‌ చట్టం-2018లలో ప్రభుత్వం ఈ మేరకు మార్పులను ప్రతిపాదించింది. పురపాలక చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టాల సవరణ బిల్లులను పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు; పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సభలో ప్రవేశపెట్టారు.

మ్యుటేషన్‌ ప్రక్రియదానం, తనఖా, విభజన లేదా వారసత్వ విధానంతో బదిలీలకు సంబంధించి ఆన్‌లైన్‌లో మ్యుటేషన్‌ జరగనుంది. సబ్‌రిజిస్ట్రార్‌లు నిర్దేశించిన ఫీజును వసూలు చేసి ధరణి పోర్టల్‌లో భూ యాజమాన్య హక్కులను మార్చి ధ్రువపత్రాన్ని అందజేయాలి.

◆కొనుగోలుదారు ఇందుకోసం ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, విద్యుత్‌ బకాయిలు లేవని ధ్రువీకరణ పత్రాలను సబ్‌రిజిస్ట్రార్‌కు అందచేయాలి. ఎలాంటి బకాయిలు లేకుంటేనే మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. గ్రామ పంచాయతీల పరిధిలోనూ ఇదే విధానం ఉంటుంది.

◆ గ్రామ పంచాయతీ ఆస్తి హక్కు రికార్డులను రిజిస్ట్రేషన్‌ శాఖకు అనుసంధానం చేస్తారు. ఆస్తిని బదిలీ చేసినపుడు ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్‌)ను బదిలీ చేసే అధికారాన్ని; ఖాళీ స్థలం బదిలీ జరిగినపుడు ఖాళీ స్థలం పన్ను సంఖ్య(వీఎల్‌టీఎన్‌)ను బదిలీ చేసే అధికారాన్ని ప్రభుత్వం సబ్‌రిజిస్ట్రార్‌లకు దఖలుపరచింది.

వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినప్పటికీ ఆ ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించడాన్ని వీఆర్వోలు స్వాగతించారు. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం వీఆర్వోలు బుధవారం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేక చేశారు.

Mutual Funds

ఒక పథకం యొక్క పనితీరు దాని నికర ఆస్తి విలువ (NAV) ను ప్రతిబింబిస్తూ తెలుస్తుంది. ఆ నికర ఆస్తి విలువ కాలపరిమితి లేని పథకాల్లో రోజువారీగాను, కాలపరిమితి గల పథకాల్లో వారం వారీగాను బహిరంగంగా ప్రకటింపబడుతాయి.మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఈ ఎన్ఎవిలు వార్తా పత్రికలలో ప్రచురించవలసిన అవసరం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ యొక్క వెబ్ సైట్లలో కూడా ఈ ఎన్ఎవిలు లభ్యమౌతాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ తమ యొక్క ఎన్ఎవిలను భారత మ్యూచువల్ ఫండ్స్ సంఘం (association of mutual funds in India) యొక్క వెబ్ సైట్ లో కూడా పొందుపరచాలి. ఎ ఎమ్ ఎఫ్ ఐ (AMFI) వెబ్ సైట్ ఏమిటంటే www.amfindia.com. ఆ విధంగా మదుపరులు అన్ని మ్యూచువల్ ఫండ్ల్ యొక్క ఎన్ఎవిలను ఒకే స్థలంలో పొందే వీలుంది.

అంతే గాకుండా, మ్యూచువల్ ఫండ్లు తమ యొక్క పనితీరును అర్ధసంవత్సరాల ఫలితాల రూపంలో ప్రచురించవలసిన అవసరముంది. గత ఆరునెలలు, ఒక సంవత్సరం, మూడు సంవత్సరాలు, అయిదు సంవత్సరాలు కాలం ప్రకారం తమ పథకాలపై వచ్చే లాభాలు /ఆదాయాలతో కలిపి ప్రకటించవలసి ఉంది. ఈ ఫలితాలను పథకం ప్రారంభ సమయం నుంచి ప్రకటించాలి. మొత్తం ఆస్తులపై చేసిన ఖర్చుల శాతం వివరాలను మదుపరులు తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే ఈ ఖర్చులు తమకొచ్చే ఆదాయంపై ప్రభావం చూపడమే కాక ఆ సంవత్సరం యొక్క అర్ధ సంవత్సరం సమాచారం వివరాల సమాచారానికి ఉపయోగపడ్తాయి.

సంవత్సరానికి వాటాదారులకు వార్శిక నివేదికను గాని సంక్షిప్త వార్షిక నివేదికను గాని మ్యూచువల్ ఫండ్లు పంపించవలసిన అవసరం కూడా ఉంది.

మ్యూచువల్ ఫండ్ల యొక్క పథకాల మీద, ఆ వివిధ పథకాలలో వచ్చే ఆదాయాల గురించి కూడా కలిపి చేసిన వివిధ రకాల అధ్యయనాలను ఆర్ధిక వార్తా పత్రికలలో వారం వారీగా ప్రచురించడం కూడా జరుగుతోంది. ఈ అధ్యయనాలే కాక అనేక పరిశోధనా సంస్థలు (many research agencies) కూడా మ్యూచువల్ ఫండ్ల యొక్క పనితీరుపై పరిశోధనా వ్యాసాలు ప్రచురిస్తున్నాయి. ఈ పరిశోధనా వ్యాసాలలో వివిధ రకాల పనితీరు స్థాయిని కూడా కలిపి తెలియ పరుస్తారు. మదుపరులు ఈ పరిశోధనా వ్యాసాలను అధ్యయనం చేసి వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల యొక్క వివిధ పథకాల పనితీరు గురించి ఇచ్చిన సమాచారం పై అవగాహన కలిగించుకోవాలి.

మదుపరులు తమ పథకాల పనితీరును అదే స్థాయిలోని ఇతర మ్యూచువల్ ఫండ్ల యొక్క పథకాల పనితీరుతో పోల్చుకోవచ్చు.వారు ఈక్విటీ ఆధారిత పథకాల యొక్క పనితీరుతో పాటు బిఎన్ఇ సెన్సి టివ్ ఇండెక్స్ (BSE Sensitive Index), ఎస్ &పిసిఎన్ ఎక్స్ నిఫ్టీ ( S&PCNX Nifty) మొదలైన పథకాల నిర్దేశిత ప్రమాణాల (benchmark)పనితీరుతో కూడా పోల్చుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్ల యొక్క పనితీరు ఆధారంగా మదుపరులు మ్యూచువల్ ఫండ్ల పథకంలో ఎప్పుడు చేరాలో లేదా ఎప్పుడు విరమించుకోవాలో నిర్ణయించుకోగలరు .

మదుపరుల నుంచి పోగు చేసిన పెట్టుబడుల సొమ్మును మ్యూచువల్ ఫండ్ పథకాలు ఎక్కడ మదుపు చేస్తారో తెలుసుకోవడం ఎలా?

అర్ధ సంవత్సరం వారీగా తమ మొత్తం పథకాలలోని పూర్తి వాటాల జాబితా(portfolios)లను మ్యూచువల్ ఫండ్స్ వార్తా పత్రికలలో ప్రచురించి ప్రకటించవలసిన (బహిరంగపరచవలసిన) అవసరముంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ తమ పూర్తి వాటాల జాబితాను యూనిట్ హోల్డర్లకు నేరుగా పంపుతాయి.

పథకం యొక్క వాటాల జాబితా ప్రతి సెక్యూరిటీలో మదుపు చేసిన మొత్తాన్ని తెలియజేస్తుంది. అంటే ఈక్విటీ , డిబెంచర్లు, మనీ మార్కెట్ పత్రాలు (instruments)ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైనవి. వాటియొక్క మొత్తం మార్కెట్ విలువ మరియు ఎన్ ఎ వి లో వాటి శాతం తెలియజేస్తాయి. ఈ వాటాల మొత్తం జాబితాలు నగదుగా మార్చుకునే సెక్యూరిటీల వాటాల జాబితాను ప్రకటించవలసిన అవసరముంది. అంతేగాక రేటెడ్ మరియు అన్ రేటెడ్ డెట్ సెక్యూరిటీలలో చేసిన మదుపు గురించి, నికర నిరర్ధక ఆస్తులు (NPAS- Non Performing Assets) గురించి కూడా ప్రకటించవలసి ఉంది.

కొన్ని మ్యూచువల్ ఫండ్స్ వాటాదారులకు తమ పథకాలలో ఉన్న మొత్తం వాటాల జాబితాలతో కూడిన సమాచారాన్ని త్రైమాసిక వారీ లేఖల ద్వారా పంపుతాయి.

మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయడానికి మరియు ఒక కంపెనీ ప్రాథమికంగా ప్రజల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఇచ్చిన ప్రకటనల ద్వారా వాటిలో మదుపు చేయడానికి /ఏమైనా తేడా ఉందా?

ఉంది. తేడా ఉంది. మదుపరులకు మార్కెట్ పై గల భావన, అవగాహనల (Market sentiment and perception of Investors) ఆధారంగా కంపెనీల యొక్క ఐపిఒలు జారీ చేసే ధర కంటే ఎక్కువ లేదా తక్కువ ధరకు పెట్టుబడులను ఆహ్వానిస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్ల యొక్క ముఖ లేదా మూల విలువ (Par value) యూనిట్ల కేటాయింపు అయిన తర్వాత తక్షణం తగ్గడం కాని పెరగడం కాని జరగదు. మ్యూచువల్ పండ్ పథకాలు సెక్యూరిటీలలో మదుపు చేసేందుకు కొంత సమయం పడ్తుంది. పథకాల యొక్క(NAV- net asset value)ఎన్ఎవి – నికర ఆస్తి విలువ ఆ పథకాలు పెట్టుబడి పెట్టే సెక్యూరిటీ విలువ పై ఆధారపడి ఉంటాయి.

ఒకే స్థాయిలో వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లు పథకాలను అందిస్తూ ఉంటే, ఎవరైనా తక్కువ ఎన్ఎవిగల పథకాలను ఎంపిక చేసుకోవచ్చా?

కొంతమంది మదుపరులు ఎక్కువ ఎన్ఎవిగల పథకాల కంటే తక్కువ ఎన్ఎవిగల పథకాలకు ప్రాముఖ్యత కల్పిస్తూ వాటిలో పెట్టుబడి పెట్టే ఉద్దేశం కల్గి ఉంటాయి. కొన్ని సమయాలలో వారు యూనిట్లు 10 రూపాయల చొప్పున జారీ చేసే కొత్త పథకాలకు ప్రాముఖ్యత ఇస్తారు. అప్పటికే అదే స్థాయిలో ఎక్కువ ఎన్ ఎ వి లకు అందించే పథకాలు అమలులో ఉన్నా మదుపరులు కొత్త వాటినే ఎంచుకుంటారు. మ్యూచువల్ ఫండ్ల పథకాల విషయంలో మదుపరులు ఈ విషయాన్ని గ్రహించాలి. అవేమిటంటే వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లు తక్కువ లేదా ఎక్కువ ఎన్ఎవిలకు అందించే ఒకే రకమైన పథకాలకు ఒకదాని కంటే ఒకటి సంబంధం ఉండని విధంగా ఉంటాయి. పై విషయాలు పక్కన పెట్టి మదుపరులు తాము పెట్టుబడి పెట్టేందుకు ఎంపిక చేసుకున్న పథకం యొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క పనితీరు రికార్డు, సేవల ప్రమాణం, వృత్తి నిర్వహణ మొదలైన వాటి ఆధారంగా ఆ పథకంలో మదుపు చేయాలి. ఈ కింద ఆ విషయాన్ని ఉదహరించడం జరిగింది.

ఉదాహరణకు పథకం ‘ఎ’ ఎన్ ఎ వి 15 రూపాయలకు అందుబాటులో ఉండగా పథకం ‘బి’ 90 రూపాయలకు అందుబాటులో ఉందనుకోండి. ఈ రెండు పథకాలు ఈక్విటీ ఆధారిత పథకాలయినప్పటికినీ వీటి పనితీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ రెండు పథకాల్లో మదుపరి 9 వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. పథకం ‘ఎ’లో అతడు 600 యూనిట్లను యూనిట్ 15 రూపాయల చొప్పున 9 వేల రూపాయలకు పొందగా పథకంలో ‘బి’లో అతడు 100 యూనిట్లను యూనిట్ కి 90 రూపాయల చొప్పున 9 వేల రూపాయలకు పొందుతాడు. మార్కెట్ లో వీటి ధర 10 శాతం పెరిగినట్లయితే , ఈ రెండు పథకాలు సమానమైన పనితీరుతో వాటి ఎన్ఎవిలను ప్రతిబింబిస్తాయి. అయితే పథకం ‘ఎ’లోయూనిట్ ఎన్ఎవి రూ11 16.50 లు కాగా పథకం’ బి’లో యూనిట్ ఎన్ ఎవి 99 రూపాయలు గా పెరుగుతుంది. ఈ ప్రకారం పెట్టుబడుల యొక్క మార్కెట్ విలువ రూ11 9900(600 యూనిట్లకి రూ11 16.50 చొప్పున ) పథకం ‘ఎ’లోనూ అదె 9900 రూపాయలకు 100 యూనిట్లకు రూ11 99 చొప్పున ఉంటాయి. అందువలన మదుపరి తాను పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క పథకం మీద 10 శాతం లాభం పొందుతాడు. ఈ కారణంగా పథకాల యొక్క ఎన్ఎవి తక్కువైనా లేదా ఎక్కువైనా మరియు తాను పెట్టుబడి పెట్టదలచిన సొమ్మును తక్కువ సంఖ్య్లో కేటాయింపబడిన లేదాఎక్కువ సంఖ్యలో కేటాయింపబడినాపెట్తుబడి పెట్టే నిర్ణయానికి ఈ అంశాలు పెద్దగా పరిగణనలోనికి తీసుకోవలసిన అవసరం లేదు. అలాగే కొత్త ఈక్విటీ ఆధారిత పథకం 10 రూపాయలకు ఇవ్వడానికి పెట్టుబడులు ఆహ్వానించినట్టయితే మరియు ప్రస్తుతం అమలులోఉన్న పథకం 90 రూ11లకు అందుబాటులో ఉన్నట్లయితే పథకంలో మదుపు చేసే నిర్ణయానికి ఈ అంశాలు పరిగణించనక్కరలేదు. ఇదే విధంగా ఆదాయం లేదా డెట్ ఆధారిత పథకాలకు కూడా ఈ అంశాలను పరిగణించనక్కరలేదు.

ఇది ఇలా ఉండగా, ఎక్కువ ఎన్ ఎ వి తో ఉత్తమ రీతిలో నిర్వహింపబడుతున్న పథకం ఎక్కువ లాభాలు గడించడంతో పోలిస్తే, అలాగే నైపుణ్యం కొరవదిన రీతిలో తక్కువ ఎన్ఎవితో నిర్వహింపబడుతున్న పథకం తక్కువ లాభాలు గడించడం సర్వసాధారణమే. అలాగే ఎన్ ఎ వి లు పడిపోయిన సందర్భాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ ఎన్ ఎ వి లు కలిగి నైపుణ్యంతో కూడి నిర్వహింపబడుతున్న పథకం యొక్క ధర, తక్కువ ఎన్ ఎవి కల్గి నైపుణ్యం కొరవడి నిర్వహింపబడుతున్న పథకం యొక్క ధర పడిపోయినంతగా పడిపోదు. అందువలన మదుపరి వృత్తి నైపుణ్యంతో నిర్వహిస్తున్న పథకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అంతేగాని తక్కువ ఎన్ ఎ వి గల పథకానికి ఎక్కువ ప్రాధాన్యత రాదు. తక్కువ ఎన్ ఎ వి గల పథకంలో అతడు ఎక్కువ సంఖ్యలో యూనిట్లు పొందవచ్చు. కాని ఆ పథకం నైపుణ్యంతో నిర్వహింపబడకపోతే అతడు అధిక లాభాలు పొందలేడు.

ఎన్నో పథకాలు అందుబాటులో ఉండగా మదుపు చేయడం కోసం ఏ పథకం ఎంపిక చేసుకోవాలో ఎలాగ తెలుస్తుంది?

ఇంతకు ముందు చెప్పినట్టుగా, మదుపరులు పెట్టుబడులు పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్లు జారీ చేసిన అమ్మకపు ఆహ్వాన పత్రంలోని పథకాన్ని క్షుణ్ణంగా చదవాలి. వారు ఆ పథకం యొక్క గత పనితీరు రికార్డును దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అలాగే అదే మ్యూచువల్ ఫండ్ యొక్క ఇతర పథకాలను గురించి కూడా తెలుసుకోవాలి. మదుపరులు తాము పెట్టుబడి పెట్టే పథకాల లక్ష్యాలతో సమానమైన లక్ష్యాలు గల ఇతర పథకాల పనితీరును సరిపోల్చు కోవలసి ఉంటుంది. ఒక పథకం యొక్క గత పనితీరు ఆ పథకం యొక్క భవిష్యత్ పనితీరుకు ఎటువంటి కొలబద్ద(indicator)కాదని మరియు గతంలో ఉత్తమ పనితీరు కనబరచినా, భవిష్యత్ లో అలాగే పనితీరు ఉంటుందో , ఉండకపోవడం జరగవచ్చని మదుపరి తాను పథకంలో పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకునే సమయంలో ముఖ్య అంశంగా ఆలోచించవలసి ఉంటుంది. డెట్ ఆధారిత పథకాల విషయంలో , గతంలో వచ్చిన లాభాల పై దృష్టి పెట్టడం కాకుండా మదుపరిడెట్ పత్రాల రేటింగ్ ను ప్రతిబింబించే వాటి నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలి. తక్కువ లాభాలనార్జించే ప్రమాణం గల పథకం ఉత్తమ ప్రమాణ పత్రాలుకలిగి ఉంటే అందులొ మదుపు చేయడం సురక్షితం . అలాగే, ఈక్విటీ పథకాలలో కూడా మదుపరులు నాణ్యత గల వాటాల జాబితాపై దృష్టి పెట్టాలి. మదుపరులు నిపుణుల సలహాలను తీసుకోవచ్చును. 

మ్యూచువల్ ఫండ్ల పథకాల మాదిరిగా కంపెనీలు మ్యూచువల్ బెనిఫిట్ అని పేర్లు కూడా పెట్టుకుని ఉండవచ్చా?

కొన్ని కంపెనీలు మ్యూచువల్ ఫండ్ల లాగే మ్యూచువల్ బెనిఫిట్ అని పేరు పెట్టుకొనవచ్చని మదుపరులు భావించవచ్చు. కాని అటువంటి కంపెనీలు సెబి పరిధి కిందకు రావు. సరిగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్లు సెబి మ్యూచువల్ ఫండ్లుగా తమ పేరు నమోదు చేసుకున్న తర్వాత తాము ప్రవేశ పెట్టబోయే పథకాలకు మదుపరులనుంచి పెట్టుబడులు ప్రోగు చేస్తాయి. 

స్పాన్సర్ హెచ్చు స్థాయి యోగ్యత కల్గి ఉంటే అతడు ఉత్తమ లాభాలు అందించగలడని హామీ ఇవ్వవచ్చా?

మ్యూచువల్ ఫండ్ పథకం జారీ చేసే అమ్మకపు ఆహ్వాన పత్రం లో స్పాన్సర్ గురించి మూడేళ్ళ సమయం యొక్క అతని యోగ్యత , అతని ఆర్ధిక నిర్వహణ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ను అందిస్తున్న కంపెనీ యొక్క పనితీరు రికార్డును మదుపరులు తెలుసుకోవడమే ఈ అంశం యొక్క ముఖ్యోద్దేశం. స్పాన్సర్ యొక్క యోగ్యత హెచ్చు స్థాయిలో ఉంటే పథకం అందించే లాభాలు అదికమౌతాయనుకోవడం సరియైనదికాదు. అలాగే ఎన్ ఎ వి విలువ పడిపోతే, స్పాన్సర్ ఆ విలువకు పరిహారం చెల్లిస్తాడనుకోవడం కూడా సమంజసం కాదు.

మ్యూచువల్ ఫండ పై సమాచారాన్ని మదుపరులు ఎక్కడనుంచి పొందవచ్చో ఎలాగ తెలుస్తుంది?

అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇంచుమించు తమ స్వంత వెబ్ సైట్లు (websites) కల్గి ఉన్నాయి. మదుపరులు అన్ని మ్యూచువల్ ఫండ్ల ఎన్ ఎ వి ల గురించి, అర్ధ సంవత్సరవారీ ఫలితాలు మరియు ఆ ఫండ్ల యొక్క వాటాల జాబితాలు భారత వెబ్ మ్యూచువల్ ఫండ్ల సంఘం (Association of web mutual funds in India) యొక్క వెబ్ సైట్ లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ (ఎఎమ్ఎఫ్ఐ- AMFI) www.amfiindia.com మదుపరులకుపయోగించే సమాచారాన్ని ఎఎమ్ఎఫ్ఐ కూడా ప్రచురిస్తుంది.

సెబి మార్గదర్శకాలు మరియు నియమ నిబంధనల గురించి సమాచారం పొందడానికి మదుపరులు సెబి యొక్క వెబ్ సైట్ www. sebi.gov.inకు log on చేసి మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్ లోకి వెళ్ళవచ్చు. ఈ వెబ్ సైట్ లో మ్యూచువల్ ఫండ్స్ వివరాలు (డేటా), మ్యూచువల్ ఫండ్స్ పొందుపరచిన లిఖిత ఆఫర్ పత్రాలు , మ్యూచువల్ ఫండ్స్ యొక్క చిరునామాలు మొదలైనవి తెలుసుకొవచ్చును. అలాగే ఆ వెబ్ సైట్ లో సెబి యొక్క వార్షిక నివేదికలు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేగాక మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వెబ్ సైట్ లో ఇవ్వబడింది. అదే విధంగా ఎన్నో వెబ్ సైట్లలో వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారంతోబాటు ఆ ఫండ్స్ ఏ కాలానికి ఎంత మొత్తంలో ఆదాయాలు ఇస్తాయో ఇవ్వబడ్డాయి. అలాగే ఎన్నో వార్తా పత్రికలు మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన ఉపయోగకరమైన సమాచారాన్ని రోజువారీ లేదా వారం రోజుల కొకసారి ప్రచురిస్తాయి. మ్యూచువల్ ఫండ్ల సమాచారాన్ని పొందడానికి మదుపరులు ఆ ఫండ్ల ప్రతినిధులను గాని పంపిణీ దారులను గాని సంప్రదించి వారి మార్గదర్శకత్వం పొందవచ్చు.

మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో మదుపు చేసే మదుపరి తన బదులు నామినీ ని నియమించుకోవచ్చా?

వ్యక్తులు వాటాలను పొందడానికి దరఖాస్తు చేసే సమయంలో నామినేషన్ ఇవ్వవచ్చు. అలాగే వ్యక్తులు వాటాలను తమ పేరిట కాని లేదా సంయుక్తంగా కాని కలిగి ఉన్నట్లయితే తమ తరఫున కూడా నామినేషన్ ఇవ్వవచ్చు. వ్యక్తులు కాకుండా ఉన్న సంస్థలు అనగా సంఘం, ట్రస్టు, బాడీ కార్పొరేట్ (body corporate), భాగ స్వామ్య సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబం (Hindu undivided family- HUF) యొక్క కర్త, పవర్ ఆఫ్ అటార్నిటి (holder of power of attorney) గల వారు నామినేషన్ ఇవ్వరాదు. 

మదుపరులు తమ సమస్యలను (పిర్యాదులను) ఏ విధంగా పరిష్కరించుకోగలరు?

మ్యూచువల్ ఫండ్ పథకాల యొక్క పెట్టుబడి ఆహ్వాన పత్రంలో మదుపరులు తమ యొక్క ప్రశ్నలు, పిర్యాదులు లేదా సాధక బాధకాల గురించి ఏ పేరుగల వ్యక్తితో సంప్రదించాలన్న విషయం ఆధారంగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి తమ సమస్యలు పరిష్కరించుకోవాలి. మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలను ఆ మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు పర్యవేక్షిస్తారు . పెట్టుబడి ఆహ్వాన పత్రంలో అస్సెట్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ల పేర్లు మరియు ట్రస్టీల పేర్లు కూడా ఇవ్వబడతాయి. మదుపరులు తమ యొక్క మ్యూచువల్ ఫండ్ లేదా తమ యొఅక్క మ్యూచువల్ ఫండ్ యొక్క మదుపరుల సేవా కేంద్రానికి వెళ్లి తమ పిర్యాదులు చేయవచ్చు. తమ పిర్యాదులు ఇంకా పరిష్కారం కాకపోతే, ఆ మదుపరులు సెబిని సందర్శించి తమ పిర్యాదులకు మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించమని కోరవచ్చు. పిర్యాదులను స్వీకరించిన తర్వాత సెబి (SEBI) ఆ పిర్యాదులకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్ లతో సంప్రదించి క్రమంగా వాటి పరిష్కారం కొసం చర్యలు చేపట్టవచ్చు. మదుపరులు తమ పిర్యాదులను ఈ కింది మూలం/ ఆధారం( సోర్స్) కు కూడా పంపవచ్చు.

ఆధారము: SEBI-FAQ’S

Mutual Funds

మ్యూచువల్ ఫండ్స్ అంటే మార్కెట్ విషయంలో వృత్తిపరంగా నైపుణ్యం సాధించిన మదుపరులతో కూడిన సం స్థ నిర్వహించే పెట్టుబడుల శాఖ. మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ ,బాండ్లు, సంస్థ స్వంతంగా నిర్వహించే సంయుక్త పెట్టుబడులు (అనేకమదుపరులతో కూడినవి). ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు షేర్స్ కొనుగోలు చేస్తే మీరు పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని వారు మరే ఇతర సంస్థల్లోనై నా అధిక లాభాలు వచ్చే విధంగా స్టాక్స్ లో బాండ్ల లో మరేదైనా విధంగా కొనుగోలు రూపంలో పెట్టుబడి పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడికి వారు తమ షేర్ హోల్డర్ లకు నెలవారీ, త్రైమాసికంగా, ఆరు మాసాలకోమారు ప్రకారం డివిడెండ్ల రూపంలో లాభాలను పంపిణీ చేస్తారు
ఒక పరిశ్రమ గాని మార్కెట్ గాని మీరు ఊహించి న విధంగా లాభాలను ఆర్జించలేకపోవచ్చు. నష్టాల్లో కూరుకు పోవచ్చు. కాని చిన్నచిన్న మొత్తాలలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టే చిన్న మదుపరులు తాము తమ నష్టాలను సాధ్యమైన రీతిలో తగ్గించుకునేందుకు మార్కెట్ లో అనుభవం గడించిన విశ్లేషకులు, వృత్తి నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ విశ్లేషకులు తమ మదుపరులు పెట్టే పెట్టుబడిని ఒక పరిశ్రమ, ఒక మార్కెట్ లో కాక వివిధ రకాల కంపెనీలు, సెక్యూరిటీలలో చిన్న చిన్నమొత్తాల్లో పెట్టు బడి పెట్టే సలహాలిచ్చి మదుపరుల నష్టాలను తగ్గిస్తారు. అదే ఈ మ్యూచువల్ ఫండ్స్ వల్ల జరిగే వెసులుబాటుగా గుర్తించాలి. అయితే ఈవిధానంలో కూడ ప్రమాదముందని మదుపరులు గుర్తించాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిపుణుల సలహాలు ఆచరించినా, స్టాక్సు ధరతగ్గే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ప్రమాదమున్నప్పటికినీ భవిష్యత్ అవసరాలకు డబ్బును స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం శ్రేయోదాయకం. మీరు స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్ లో డబ్బును పెట్టుబడి పెట్టడంలో ఉన్న ప్రాధాన్యతను ముందే గమనించండి.

సంయుక్త పెట్టుబడులు ( మూలధనం లేదా నిధులు)

పరిచయం

మదుపరులకు (investors) వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టుకునేందుకు అనువైన పద్ధతులు లేదా మార్గాలు (avenues) అందుబాటులోకి వచ్చాయి లేదా ఉన్నాయి. మదుపరులకు సంయుక్త పెట్టుబడులు ( Mutual Funds) పద్ధతిలో తమ యొక్క పెట్టుబడులు పెట్టుకునేందుకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. మదుపరులు తాము పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకొనే సమయంలో వివిధ రకాల పత్రాలలో (instruments)తాము చెల్లించవలసిన పన్నులను సర్దుబాటు చేసేందుకు ఆ పెట్టుబడులలో ఉన్న నష్టాలు( risks) మరియు వాటిలో వచ్చే లాభాలను బేరీజు వేసుకోవాలి. పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకునే సమయంలో మదుపరులు, నిపుణులు మరియు సలహాదారుల సలహాలను తీసుకోవాలి. వీటితో బాటు మ్యూచువల్ ఫండ్స్ పథకాల యొక్క ఏజెంట్లు మరియు పంపిణీదారుల సలహాలు కూడ తీసుకోవాలి.

సంయుక్త పెట్టుబడులు ఏ విధంగా పనిచేస్తాయో మదుపరులకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ పత్రంలో ప్రశ్నలు – సమాధానాల రూపంలో సమాచారాన్ని అందించే ప్రయత్నం జరిగింది. మదుపరులు తమ పెట్టుబడులు లేదా మదుపు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారం తోడ్పడుతుంది.

సంయుక్త పెట్టుబడులు (మ్యూచువల్ ఫండ్స్) అంటే ఏమిటి ?

మదుపరులకు వాటాలు (యూనిట్లు) జారీ చేసి తద్వారా ఆర్ధిక వనరులను (resources) సమీకరించుకునే ప్రక్రియనే మ్యూచువల్ ఫండ్ అని అంటారు. అలా సమీకరించిన ఫండ్స్ ను తాము ప్రకటించిన పత్రంలో చెప్పిన విధంగా తమ లక్ష్యసాధనగా సెక్యూరిటీస్ లో మదుపు చేస్తారు.

సెక్యూరిటీస్ లో మదుపు చేయడం అనగా ఈ పెట్టుబడులను వివిధ రంగాలలోని విస్తరించిన పరిశ్రమల్లో వేరువేరుగా పెట్టుబడి పెట్టి నష్టాల స్థాయిని తగ్గించడమే అని పేర్కొనాలి. ఒకే సమయంలో, ఒకే విధంగా (నిష్పత్తిలో) ఒకే దిశలో అన్ని స్టాకుల పనితీరు ఉండదు, కనుక నష్టాల తగ్గుదలలో చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లోని అన్ని పరిశ్రమలు ఒకే విధంగా ఉండవు కాబట్టి (Diversification) మ్యూచువల్ ఫండ్స్ తమయొక్క మదుపు చేసిన సొమ్ము విలువకు తగిన వాటాలు (యూనిట్లను) జారీ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లోని మదుపరులను యూనిట్ హోల్డర్స్(వాటా దారులు) అంటారు.

మదుపరులు తాము మదుపు చేసిన సొమ్ముకు దామాషా (proportion) పద్ధతిలో లాభాలు లేదా నష్టాలు పొందుతారు. కాలానుగుణంగా (time to time) మ్యూచువల్ ఫండ్స్ వివిధ రకాల లక్ష్యాలతో వివిధ పరిధుల్లో తమ పెట్టుబడులు పెడుతున్నట్టు సాధారణంగా ప్రకటిస్తూ ప్రారంభిస్తాయి. ప్రతి మ్యూచువల్ ఫండ్ భారత సెక్యూరిటీస్ మరియు మారక సంస్థ (securities and exchange board of India)లో తప్పక నమోదు చేసుకుని ఉండాలి. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు ఆ సెక్యూరిటీస్ మార్కెట్ ను నియంత్రించే ఈ సంస్థ తన పేరు నమోదుచేసుకోవడానికి కారణం అదే.

భారత దేశంలోని మ్యూచువల్ ఫండ్స్ చరిత్ర ఏమిటి ? మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో సెబి(SEBI) పాత్ర ఏమిటి ?

1963 వ సంవత్సరంలో భారత దేశంలో మొట్టమొదటగా యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంస్థ మ్యూచువల్ ఫండ్ ను ఏర్పాటు చేసింది. 1990వ సంవత్సర ప్రారంభంలో, భారత ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలయిన బ్యాంకులు, తదితర సంస్థలు (LIC) వంటివి మ్యూచువల్ ఫండ్స్ ను ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది.

1992 వ సంవత్సరంలో భారత సెక్యూరిటీస్ మరియు మారక సంస్థ (securities and exchange board of India) చట్టం అమలులోకి వచ్చింది. సెబి(SEBI- securities and exchange board of India) ఉద్దేశం యేమిటంటే – సెక్యూరిటీస్ లో పెట్టుబడి పెట్టే మదుపరుల ఆర్ధిక శ్రేయస్సు అలాగే సెక్యూరిటీస్ మార్కెట్ ను అభివృద్ధి పరచడం మరియు నియంత్రించడమూ, మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించినంతవరకు – మదుపరుల డబ్బుకు భద్రత కల్పిస్తూ వారి శ్రేయస్సుకు పాటుపడడం, మ్యూచువల్ ఫండ్స్ ను నియంత్రించే విధివిధానాలను రూపొందించడం సెబి (SEBI) కర్తవ్యం లేదా విధి. 1993 వ సంవత్సరములో సెబి (SEBI) నియమ నిబంధనలను ప్రకటించింది. ఆ తర్వాత ప్రైవేటు రంగ సంస్ధలు కూడా మ్యూచువల్ ఫండ్స్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఆ విధంగా క్యేపిటల్ మార్కెట్ లో ప్రైవేటు భాగస్వామ్యము కూడా ప్రారంభమైంది. 1996 వ సంవత్సరములో నియమ నిబంధనలన్నీ పూర్తిగా సవరించబడ్డాయి. క్రమేపీ (Time to time) ఆ నియమ నిబంధనలు సవరింపబడుతూ ఉన్నాయి. మదుపరుల శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని సెబి క్రమేపీ మ్యూచువల్ ఫండ్స్ కు మార్గదర్శక సూత్రాలను కూడా జారీ చేస్తోంది.

ప్రభుత్వ రంగ లేదా ప్రైవేటు రంగ సంస్ధలు ప్రారంభించిన మ్యూచువల్ ఫండ్స్ గాని లేదా విదేశీ సంస్ధలచే అభివృద్ది చేయబడుతున్న మ్యూచువల్ ఫండ్స్ గాని అవే నియమ నిబంధనలకు లోబడి నియంత్రించబడతాయి. వీటిలో వేటికీ భేదభావం చూపకుండా సెబి ఈ నియమ నిబంధనలను మ్యూచువల్ ఫండ్స్ కు వర్తింపచేస్తూ, పర్యవేక్షిస్తుంది. ఈ సంస్ధలు అందిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పధకాలన్నింటికి సంబంధిం చిన నష్టాలు ఒకే రీతిలో వుంటాయి.

మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు?

మ్యూచువల్ ఫండ్స్ ను ఒక ట్రస్ట్ రూపంలో ఏర్పాటు చేస్తారు. ఈ ట్రస్ట్ లో హామీదారు లేదా పూచీపడువారు లేదా ఏర్పరచువారు (sponsor), ట్రస్టీలు, ఆస్తులు నిర్వహించే కంపెనీ (Asset Management Company –AMC) మరియు సంరక్షకుడు (Custodian) వుంటారు. ఈ ట్రస్ట్ ను ఒక పూచీదారు కాని అంతకంటే ఎక్కువ పూచీదారులు కాని ఏర్పాటు చేస్తారు. వారినే సంస్థ ప్రవర్ధకులు (promoter)అని అంటారు. మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఆస్తులకు జవాబుదారులుగా ధర్మకర్త (ట్రస్టీ)లు ఉంటారు. వీరు యూనిట్ హోల్డర్ల యొక్క శ్రేయస్సు కోసం నియమింపబడతారు. సెబి చే అనుమతి పొందిన ఆస్తులు నిర్వహించే కంపెనీ (Asset Management Company –AMC) మ్యూచువల్ ఫండ్స్ ను ఏ ఏ రకాల సెక్యూరిటీస్ లో మదుపు చేయాలో నిర్ణయించి అమలు చేస్తుంది. సెబితో నమోదు చేసుకున్న సంరక్షకుడు (custodian) , వివిధ రకాల పథకాలలో వున్న ఫండ్ సెక్యూరిటీలను తన అధీనంలో ఉంచి కాపాడుతుంటాడు. ఎఎమ్ సి పై ధర్మకర్త (ట్రస్టీ)లకు పర్యవేక్షణ చేసే అధికారం ఉంటుంది. ఆదేశాలిచ్చే అధికారం కూడా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ సెబి యొక్క నియమనిబంధనలను పాటిస్తున్నదీ లేనిదీ అలాగే ఆ ఫండ్ పనితీరునూ పర్యవేక్షిస్తుంది.

ట్రస్ట్ యొక్క డైరెక్టర్ లలో మూడవ వంతు లేదా ట్రస్ట్ బోర్డ్ లో మూడవ వంతు ధర్మకర్త లు (ట్రస్టీలు) స్వతంత్రులై ఉండాలనే నియమనిబంధన ఉంది. ఆ నియమ నిబంధనలకనుగుణంగా ఈ మూడవ వంతు ట్రస్టీలు పూచీదారులతో (స్పాన్సర్స్) ఎటువంటి సంబంధము లేనివారై ఉండాలి. అలాగే ఎ ఎమ్ సి లోని సగం మంది డైరెక్టర్ లు కూడ స్వతంత్రులై ఉండాలి. ఏ పథకమైనను ప్రారంభించేముందు (అమలులోకి తెచ్చే ముందు) అన్ని మ్యూచువల్ ఫండ్స్ సెబితో నమోదు చేసుకుని ఉండాలి.

ఒక పథకం యొక్క నికర ఆస్తుల విలువ అంటే అర్ధం ఏమిటి?

ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రత్యేక లేదా నిర్ధిష్ట పథకం పనితీరు ఆ నికర ఆస్తుల విలువ (NAV) ద్వారా కనుగొంటారు.

మదుపరుల నుండి సేకరించిన సొమ్మును సెక్యూరిటీస్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ మదుపు చేస్తాయి. అర్ధమయ్యేరీతిలో చెప్పాలంటే, ఒక పథకం యొక్క సెక్యూరిటీస్ మార్కెట్ విలువే ఆ పథకం యొక్క నికర ఆస్తి విలువ(NAV). సెక్యూరిటీస్ మార్కెట్ విలువ ప్రతీరోజు మార్పు చెందడం వల్ల పథకం యొక్క NAVకూడా రోజువారీగా మారుతుంటుంది. పేర్కొన్న రోజుకు ఒక యూనిట్ యొక్క ఎన్ఎవి ఎంత అంటే ఆ యూనిట్ కలిగిన పథకం యొక్క సెక్యూరిటీస్ మార్కెట్ విలువను ఆ పథకంలో గల మొత్తం యూనిట్ల సంఖ్యలో భాగించగా వచ్చిన ఫలితమేనని చెప్పాలి. ఉదాహరణకు ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలోగల సెక్యూరిటీస్ మార్కెట్ విలువ 200 లక్షల రూపాయలు అనుకుంటే ఆ మ్యూచువల్ ఫండ్ 10 లక్షల యూనిట్లను మదుపరులకు యూనిట్ 10 రూపాయల చొప్పున జారీ చేసి ఉంటే ఆ ఫండ్ యొక్క ఒక యూనిట్ ఎన్ఎవి 20 రూపాయలుఅని చెప్పాలి. మ్యూచువల్ ఫండ్స్ తమ యొక్క పథకం ఎన్ఎవిని రోజువారీగాగాని, వారానికొకసారి గాని పథకం యొక్క లక్షణాన్ని బట్టి ప్రకటించవలసి ఉంటుంది.

వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ పథకాలేమిటి?

పరిపక్వత సమయాన్ని అనుసరించి పధకాలు

ఒక మ్యూచువల్ ఫండ్ పధకం కాల పరిమితి లేనిది లేక కాల పరిమితికి లోబడినది అని విభజించాలంటే దాని పరిణితి ద్వారా నిర్ధారించాలి.

కాల పరిమితి లేని ఫండ్ / పధకం

ఒక కాల పరిమితి లేని ఫండ్ / పధకం అని చెప్పాలంటే ఆ పధకం ఎల్లప్పుడూ సొమ్ము సేకరిస్తూ, చెల్లిస్తూ తిరిగి చెల్లించిన వాటాలను కొనుగోలు చేస్తూ నిరంతర ప్రక్రియగా సాగిస్తూ ఉంటే దానిని కాల పరిమితి లేని ఫండ్ / పధకం అంటారు. ఈ పధకాలకు స్ధిరమైన పరిపక్వత సమయం అంటూ ఏమీ వుండదు. మదుపరులు తమ అనుకూలత ప్రకారం వాటాల కొనుగోలు మరియు అమ్మకాలు రోజువారీ ఎన్ఎవి (N A V) ఆధారంగా చేసుకోవచ్చు. ఈ పధకం ముఖ్యలక్షణం మదుపరుల వాటాలకు ద్రవ్యత్వం (liquidity) అనగా నగదు పొందడం లేదా ఇవ్వడం సులభం.

కాల పరిమితి గల ఫండ్ / పధకం

ఒక కాల పరిమితి గల ఫండ్/ పధకానికి పరిపక్వత సమయం నిర్ణయించబడి వుంటుంది. ఉదా:5– 7 సంవత్సరములు. ఈ పధకం ప్రారంభంలో కొంత కాలం గడువు ఇస్తారు. ఈ సమయంలో దీనిలో మదుపరులు పెట్టుబడులు పెట్టడానికి / వాటాలు కొనుగోలు చేయడానికి తెరిచి వుంటుంది. మదుపుదారులు ఈ పధకం తెరిచి వుంచిన కాలంలో కాని లేదా పట్టావినిమయం (Stock Exchange) లో పొందుపరచిన పట్టిక నుండి కాని వాటాలను కొనుగోలు చేయవచ్చు. మదుపరులు ఈ పధకం నుండి తప్పుకొనుటకు వీలుగా కొన్ని కాల పరిమితి గల ఫండ్ / పధకంలో వాటాలను ఎన్ ఎ వి (N A V) ధరల ఆధారంగా తిరిగి అమ్ముకునే వీలుకల్పిస్తూ మ్యూచువల్ ఫండ్ లు తిరిగి కొనుగోలు చేస్తాయి. సాధారణంగా ఈ మ్యూచువల్ ఫండ్ లు ఎన్ ఎ వి (N A V) ధరలను వారం వారం ప్రకటిస్తారు.

పెట్టుబడి ఉద్దేశంతో ఏర్పాటు చేసే పధకాలు

ఒక పథకం అభివృద్ధి పథకంగా కూడా విభజించవచ్చు. ఆదాయ పథకం లేదా మదుపు చేసే ఉద్దేశం కల్గిన సమతౌల్య పథకంగా కూడా విభజించవచ్చు. ఈ పథకం కాల పరిమితి లేని ఫండ్ / పథకం లేదా కాల పరిమితి గల ఫండ్ పథకాలుగా ఇదివరకే వివరించడం జరిగింది. ఈ పథకాలన్నింటిని ఈ కింద పేర్కొన్న విధంగా విభజించవచ్చు.

అభివృద్ధి / ఈక్విటీ ఆధారిత పథకం

అభివృద్ధి పథకం ముఖ్య లక్షణం యేమిటంటే పెట్టిన మూలధనం విలువ పెరగడం. మధ్య తరహా నుంచి దీర్ఘకాలం సమయంలో దీని విలువ పెరుగుతుంది. ఈ పథకాల్లో మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా తమ మూలనిధిలోని ఎక్కువ భాగం ఈక్విటీలుగా మదుపు(పెట్టుబడిగా పెడతారు) చేస్తారు. ఈ ఫండ్స్ లో నష్టాలను పోల్చి చూస్తే అధికంగా ఉంటాయి. ఈ పథకాలు మదుపరులకు వివిధ రకాల ఐచ్చికాలను కల్పిస్తాయి. డివిడెండ్ ఆప్షన్ , మూలధనం పెరగడం వంటి ఐచ్చికాల వంటివి కల్పిస్తాయి. మదుపరుల ప్రాముఖ్యతను బట్టి తమకనువైన ఐచ్చికాలను పేర్కొనవలసి ఉంటుంరది. తర్వాత కాలంలో మదుపరులు తమ ఐచ్చికాలను మార్చుకునే వీలును మ్యూచువల్ ఫండ్స్ కల్పిస్తాయి లేదా అనుమతినిస్తాయి. అభివృద్ధి పథకాలు మదుపరులకు దీర్ఘకాలిక ప్రయోజనం కల్పిస్తాయి. దీర్ఘకాలంలో మదుపరులకు తాము పెట్టిన పెట్టుబడుల మూలధనం విలువ పెరిగే రీతిలో ఉంటాయి.

ఆదాయం / డెబ్ట్ ఆధారిత పథకం

మదుపరులకు క్రమబద్ధమైన రీతిలో నిర్దిష్టమైన ఆదాయం కల్పించడం ఆదాయం ఫండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో చేసే మదుపును స్థిరమైన ఆదాయం ఇచ్చే సెక్యూరిటీలు అనగా బాండ్లు, కంపెనీల డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు మనీ మార్కెట్ పత్రాలలో మదుపుగా చేస్తారు. ఈ ఫండ్స్ లో చేసే మదుపు ఈక్విటీ పథకాల్లో చేసే మదుపుతో వచ్చే నష్టాలలో పోల్చి చూస్తే కొంత తక్కువనే చెప్పాలి. ఈక్విటీ మార్కెట్లలో వచ్చే (హెచ్చుతగ్గుల ) మార్పుల ప్రభావం ఈ ఫండ్స్ పై ఉండదు. ఈ పథకాలలో మూలధనం విలువ పెరుగుదల కూడా పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫండ్స్ లోని ఎన్ఎవిలు దేశంలోని వడ్డీరేట్లలొ వచ్చే మార్పులకనుగుణంగా వుంటాయి. వడ్డీరేట్లు తగ్గిపోయినచో ఈ ఫండ్స్ యొక్క ఎన్ఎవిలు తక్కువ వ్యవధికి పెరగవచ్చు. అలాగే పెరిగినచో ఎన్ఎవిలు తగ్గిపోవచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే మదుపరులు ఈ హెచ్చుతగ్గుల మార్పుల గురించి ఆందోళన చెందకపోవచ్చు

బ్యాలెన్స్ డ్ ఫండ్

అభివృద్ధి మరియు క్రమబద్ధమైన ఆదాయం మదుపరులకు కల్పించడం బ్యాలెన్స్ డ్ ఫండ్ ల యొక్క ముఖ్యోద్దేశం. ఈ ఫండ్స్ లోని పథకాలలోను ఈక్విటీలలోను మరియు స్థిరమైన ఆదాయం కల్పించే సెక్యూరిటీలలోను తమ ప్రకటన పత్రాలలో పేర్కొన్న రీతిలో దామాషా పద్ధతిలో మదుపును చేస్తారు. తగినంత అభివృద్ది ఉంటే చాలన్న మదుపరులకు ఈ ఫండ్స్ లోని పథకాలు అనువైనవిగా ఉంటాయి. వీరు సాధారణంగా ఈక్విటీ మరియు డెబ్ట్ సాధనాలలో 40-60% వరకు మదుపు చేస్తారు. స్టాకు మార్కెట్లలోని షేర్ల ధరలలో వచ్చే హెచ్చు తగ్గు మార్పులు ఈ ఫండ్స్ పై ప్రభావం కల్గిస్తాయి. పూర్తి ఈక్విటీ ఫండ్స్ తో పోలిస్తే ఈ ఫండ్స్ లో ఎన్ఎవిల తీవ్రత కొంత మేరకు తక్కువ స్థాయిలోనే ఉంటుంది

మనీ మార్కెట్ లేదా ద్రవ్యశీలత ఫండ్స (అతి త్వరగా నగదు రూపంలో మార్చుకునే ఫండ్)

ఈ ఫండ్స్ కూడా ఆదాయం ఇచ్చేవి. వీటి ముఖ్యోద్దేశం ఏమిటంటే మూలధనాన్నిభద్రపరచడం, త్వరగా నగదుగా మార్చుకునే సౌకర్యం మరియు తగినంత (మిత) ఆదాయం కల్పించడం. ఈ పథకాలన్నీ సురక్షితమైన స్వల్ప కాల వ్యవధితో కూడిన ట్రెజరీ బిల్లులు, డిపాజిట్ల సర్టిఫికెట్లు, వ్యాపార లావాదేవీల పత్రాలు (commercial papers), అంతర బ్యాంకుల కాల్ మనీ (inter- bank call money), ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైన వాటిల్లో మాత్రమే మదుపు చేస్తాయి.

గిల్ట్ ఫండ్

ఈ ఫండ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో మాత్రమే మదుపు చేస్తాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు తిరిగి చెల్లించవన్న అపనమ్మకం ఉండదు. అయితే ఈ పథకాల ఎన్ఎవిలు వడ్డీ రేట్లు మారుతున్నప్పుడల్లా హెచ్చుతగ్గులతో మార్పు చెందుతాయి. అలాగే ఆర్ధిక కారణాల వలన కూడా మారుతాయి. ఎలాగంటే ఆదాయ లేదా డెట్ ఆధారిత పథకాలు ఎలా మారుతాయో ఆ విధంగానే మారుతాయి.

ఇండెక్స్ ఫండ్

ఇండెక్స్ ఫండ్ ఒక ప్రత్యేక సూచిక (పట్టిక) లో పేర్కొన్న రీతిని ప్రతిబింబిస్తాయి. అంటే బిఎస్ ఇ సెన్సిటివ్ ఇండెక్స్ (BSE sensitive index), ఎస్ &పిఎన్ ఎస్ ఇ 50 ఇండెక్స్(S&P NSE50index(Nifty), మొదలైన వాటిలాగానే ఉంటాయి. ఈ పథకాలు ఒక సూచికలో పేర్కొన్న వాటికి గుర్తింపునిస్తూ వాటి సెక్యూరిటీల్లో మదుపు చేస్తాయి. ఈ పథకాల్లో ఎన్ ఎవిలు ఆ సూచికలో పేర్కొన్న సెక్యూరిటీల విలువ మెరుగుదల, తగ్గుదల ఆధారంగా హెచ్చుతగ్గులుగా ఉంటాయి. అయితే ఎప్పుడు ఎన్ ఎవిలు హెచ్చుతగ్గుల శాతం ఆ ఇండెక్స్ లలో ఉండనక్కరలేదు. ఎందుకంటే సాంకేతిక పరిభాషలో ట్రాకింగ్ ఎర్రర్(tracking error)అనే కారణం వల్ల ఆ హెచ్చుతగ్గుల శాతం ఇండెక్స్ ల పెరుగుదల తగ్గుదలలాగ ఉండనక్కరలేదు. ఈ అంశం గురించి అవసరమైన బహిరంగ ప్రకటనలు మ్యూచువల్ ఫండ్స్ పథకాల అమ్మకపు ఆహ్వాన (offer) పత్రంలో పేర్కొనడం జరుగుతుంది.

ఈ ఫండ్స్ మార్పిడి వ్యాపార ఇండెక్స్ ఫండ్స్ కూడాను (exchange traded index funds). ఈ ఫండ్స్ స్టాక్ ఎక్స్ చేంజ్ (stock exchange) ల మీదుగా వ్యాపారం చేసుకునేలాగా మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభిస్తాయి.

సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్స్/పథకాలు అంటే ఏమిటి?

అమ్మకపు ఆహ్వాన పత్రాలలో పేర్కొన్నట్టు ఆయా రంగాలు లేదా పరిశ్రమల్లో మాత్రమే ఉన్న సెక్యూరిటీలలో మదుపుచేసే నిధులు లేదా పథకాలను సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్స్ /పథకాలు అంటారు. ఉదాహరణకు ఫార్మాస్యుటికల్స్ (మందుల తయారీ పరిశ్రమ, సాఫ్ట్ వేర్ , ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (Fast moving consumer goods- FMGG), పెట్రోలియమ్ స్టాక్ లు మొదలైనవి ఈ ఫండ్ల మీద వచ్చే లాభాలు ఆయా రంగాలు/ పరిశ్రమలు పనితనం మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఫండ్ల మీద వచ్చే అధిక లాభాలు డైవర్శిఫైడ్ ఫండ్స్(అనేక రకాలుగా ఫండ్స్ ను పెట్టుబడులు పెట్టే ఫండ్స్- diversified funds) తో పోలిస్తే అధిక రీతిలో (సాహసం తో కూడినవి లేదా అపాయకరమైనవి-risky) గా ఉంటాయి. మదుపరులు ఈ ఫండ్స్ పెట్టుబడి పెట్టే రంగాలు/ పరిశ్రమల యొక్క పనితనం (సామర్ధ్యం) పై దృష్టి పెట్టుకోవలసిన అవసరముంది. సమయానుకూలంగా ఈ ఫండ్స్ నుంచి వైదొలగవలసి ఉంటుంది. ఈ విషయంలో వారు నిపుణుల సలహాలు పాటించడం మంచిది. 

టాక్స్ సేవింగ్ (పన్ను ఆదా) పథకాలు అంటే ఏమిటి?

ఈ పథకాలు పన్ను రాయితీలను కల్పిస్తూ మదుపరుల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తాయి. ఈ పన్ను రాయితీలు 1961 వ సంవత్సరంలో అమలులోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక అధికరణ (provisions) లకు లోబడి ఇవ్వబడతాయి. ఈ పథకాలలో ప్రభుత్వం పన్ను రాయితీలు మదుపరులకు కల్పించడానికి అనుమతినిచ్చింది. ఉదాహరణకు ఈక్విటీ జోడిత సేవింగ్స్ స్కీములు (Equity Linked Savings Schemes-ELSS) వంటివి. పొదుపు పథకాల మ్యూచువల్ ఫండ్స్ కు పన్ను రాయితీలు కల్పిస్తూ ప్రారంభించిన పెన్షన్ పథకాలు కూడా ఇటువంటివే. ఈ పథకాలు అభివృద్ధి సాధన మరియు ఈక్విటిల్లో మదుపుకు ప్రాబల్యం కల్పిస్తూ ఉండేవిగా ఉంటాయి. ఈ పథకాల అభివృద్ధి అవకాశాలు మరియు అపాయకరమైన సాహసాలతో(risky) కూడి ఈక్విటీ ఆధారిత పథకాలలాగానే ఉంటాయి. 

ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం అంటే ఏమిటి?

ఈ పథకం ప్రాథమికంగా తన మ్యూచువల్ ఫండ్స్ లోని ఇతర పథకాలలోగాని లేదా మరే ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో కాని మదుపు చేస్తే దానిని ఎఫ్ఒఎఫ్ (FOF) పథకం అని అంటారు. ఒకే పథకంలో మదుపరులు ఎక్కువ విధాలుగా(diversification)పెట్టుబడులు పెట్టుకునేందుకు ఈ ఎఫ్ఒఎఫ్(FOF) పథకం ఎంతో ఉపకరిస్తుంది. ఈ పథకం విస్తృతంగా రిస్క్( సాహసంతో కూడిన అపాయకరమైన) పరిస్థితులను వివిధరకాలుగా విస్తరిస్తుంది.

లోడ్ లేదా నో లోడ్ ఫండ్స్(Load/ No Load funds)అంటే ఏమిటి?

ఒక పథకంలో నుంచి వెలుపలికి రావడానికి , లేదా అందులో చేరడానికి ఎన్ ఎవిలో కొంత శాతం చార్జీలను వసూలు చేసే పథకాన్ని లోడ్ ఫండ్ అంటారు. అంటే ఈ ఫండ్స్ లో వాటా (యూనిట్లు) కొనుగోలుకు లేదా అమ్మకం చేసే ప్రతి ఒక్కనికి కొంత చార్జీలు చెల్లించవలసి ఉంటుంది. ఈ చార్జీలను మ్యూచువల్ ఫండ్స్ మార్కెటింగ్ మరియు పంపిణీ ఖర్చులుగా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ఒక వాటా ఎన్ఎవి పదిరూపాయలుకాగా ఈ పథకంలో చేరడానికి లేదా వెలుపలికి రావడానికి లోడ్ చార్జీలుగా 1 శాతం వసూలు చేస్తారు. అప్పుడు యూనిట్లు (వాటా) కొనుగోలు చేసే మదుపరులు 10 రూపాయలకు 10 పైసలు లోడ్ చార్జీలు చెల్లించాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కు తమ యూనిట్లను తిరిగి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించే మదుపరులు 9 రూపాయలకు 90 పైసలు ప్రతీ ఒక్క యూనిట్ కు పొందుతారు. కాబట్టి మదుపరులు మదుపు చేసే సమయంలో ఈ లోడ్ చార్జీలను పరిగణనలోనికి తీసుకుని తమకు వచ్చే లాభాలు / ఆదాయం పై వీటి ప్రభావం ఉంటుందన్న అవగాహన కల్పించుకోవాలి. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ అందించే సేవా ప్రమాణాలు ( Service Standards) మరియు పనితనం యొక్క ఫలితాలు (రికార్డు) పరిగణించడం కూడా అతి ముఖ్యం. లోడ్ లు ఉన్నప్పటికీ సమర్ధత కలిగిన ఫండ్స్ ఎక్కువ లాభాలు ఇచ్చేవిగా ఉంటాయి.

నో లోడ్ ఫండ్ (no load fund) అంటే ఆ ఫండ్ లోని పథకాల్లోంచి వెలుపలికి రావడానికి లేదా చేరడానికి ఎటువంటి చార్జీలు వసూలు చేయని ఫండ్ అని అర్ధం . అంటే ఈ ఫండ్ లోని పథకాల్లో చేరడానికి మదుపరులు ఎన్ఎవి ధర మీద చేరవచ్చు. అంటే మదుపరులు కొనుగోలు లేదా అమ్మకం చేసే వాటాలపై (యూనిట్లపై) ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించనక్కరలేదు.

అమ్మకపు ఆహ్వాన పత్రాలల్లో పేర్కొన్న స్థాయికి మించి లోడ్ ను హెచ్చించి కాని లేదా సరికొత్త లోడ్ కు కాని మ్యూచువల్ ఫండ్ వసూలు చేయవచ్చా?

అమ్మకపు ఆహ్వాన పత్రంలో పేర్కొన్న స్థాయికి మించి లోడ్ ను మ్యూచువల్ ఫండ్ పెంచకూడదు. ఏమైనా మార్పు చేయదలిస్తే కొత్తగా చేసే పెట్టుబడులకు మాత్రం ఆ మార్పులు వర్తిస్తాయి తప్ప అసలు పెట్టుబడులకు వర్తించవు. కొత్త లోడ్ లు వసూలు చేయడం కాని లేదా ఉన్న(గత) లోడ్ లను పెంచడం కాని చేయదలిస్తే మ్యూచువల్ ఫండ్స్ అమ్మకపు ఆహ్వానపత్రాలలో తగిన సవరణలు చేయాలి. ఈ విధానం వల్ల కొత్త మదుపరులు తాము మదుపు చేసే సమయంలో ఈ లోడ్ లను గురించి అవగాహన కల్గి ఉంటారు.

లాభాల హామీ ఇచ్చే పథకం అంటే ఏమిటి?

లాభాలు హామీ ఇచ్చే పథకాలు అంటే పథకం పనితనంతో సంబంధం లేకుండా వాటాదారుల (యూనిట్ హోల్డర్ల)కు నిర్ధిష్ట లాభాలు హామీ ఇచ్చి ఆ లాభాలను చెల్లించే పథకాలను హామీ లాభాల పథకమని అంటారు.

మదుపరులు ఆహ్వాన పత్రాన్ని క్షుణ్ణంగా చదివి ఈ లాభాలు పథకం వర్తించే పూర్తి సమయం(గడువు)కు ఇవ్వబడతాయి. లేదా కొంత సమయానికి (కొన్నాళ్ళకు) ఇవ్వబడతాయా అని తెలుసుకోవాలి. కొన్ని పథకాలు ఒక సంవత్సరానికి ఒక దఫా మాత్రమే లాభాలు ఇస్తామని హామీ ఇస్తాయి. ఈ పథకాలు పునః సమీక్షించి మరుసటి సంవత్సరం ప్రారంభంలో మార్పులు చేస్తాయి.

మదుపరుల నిధులను (సొమ్మును) పెట్టుబడి పెట్టి విస్తరించే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల కేటాయింపును మార్చుకోవచ్చా?

మార్కెట్ పంధాను పరిగణించి, దూరదృష్టి కల్గిన నిర్వాహకులు ఆస్తుల కేటాయింపును మార్చుకోవచ్చు. అమ్మకపు ఆహ్వాన పత్రంలో బహిరంగపరచిన రీతికి భిన్నంగా వివేకంగల ఫండ్ మేనేజర్ (ఫండ్ నిర్వాహకుడు) ఈక్విటీ లేదా డెట్ పత్రాల్లో ఎక్కువ లేదా తక్కువ తరహా ఫండ్ ను మదుపు చేయవచ్చును. భద్రతను పరిగణించి అతడు స్వల్ప కాల వ్యవధి ఆధారంగా ఈ చర్యలు చేపట్టవచ్చు. అంటే ఎన్ఎవి ని రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టవచ్చు. మదుపరుల శ్రేయస్సును పరిగణనలోనికి తీసుకుని అతని అస్సెట్ కేటాయింపులలో మార్పులు చేయుటకు కొంత మేరకు సడలింపు కోసం ఫండ్ మేనేజర్లకు అనుమతి ఇవ్వబడింది. అయితే మ్యూచువల్ ఫండ్స్ అస్సెట్ కేటాయింపులను శాశ్వత స్థాయిలో మార్పు చేయుటకు యూనిట్ హోల్డర్ల (వాటాదారుల) కు ముందుగా తెలియపరచవలసిన అవసరముంది. అంతేగాక మదుపరులకు ఈ పథకం నుంచి వెలుపలికి పోవడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్ఎవి లపై ఎటువంటి లోడ్ వసూలు చేయకుండా వారి ఐచ్చికతకు అవకాశం కల్పించాలి.

ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క పథకంలో ఎలా మదుపు చేయాలి?

కొత్త పథకాలను ఫలానా తేదీ నుంచి ప్రారంభించుచున్నట్లు మ్యూచువల్ ఫండ్ లు సాధారణంగా వార్తా పత్రికలలో ప్రకటనల ద్వారా తెలియజేస్తాయి. దరఖాస్తు ఫారాలు మరియు తమకు అవసరమైన సమాచారం పొందేందుకు మదుపరులు మ్యూచువల్ ఫండ్ యొక్క పంపిణీ దారులు మరియు ఫండ్స్ ప్రతినిధులను సంప్రదించవచ్చు. పంపిణీదారులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉంటారు. ఫండ్స్ యొక్క ప్రతినిధులు పంపిణీదారులు దరఖాస్తు ఫారాలనందించే సేవలు చేస్తారు. వారి వద్ద మదుపరులు దరఖాస్తు ఫారాల ద్వారా సొమ్ము జమ (డిపాజిట్) చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ యొక్క యూనిట్లను ప్రస్తుతం తపాలా కార్యాలయాలు, బ్యాంకులు కూడా పంపిణీ చేస్తున్నాయి. అయితే తపాలా కార్యాలయాలు, బ్యాంకులు అందించే ఈ సేవలను మదుపరులు బ్యాంకులు, తపాలా కార్యాలయాల యొక్క స్వంత పథకాలుగా భావించరాదు. అందుచేత ఈ పథకాలపై వచ్చే లాభాలు (returns) బ్యాంకులు, తపాలా కార్యాలయాలు ఇస్తాయన్న హామీ ఆ సంస్థల నుంచి పొందుతాయనుకోరాదు. మదుపరులకు మ్యూచువల్ ఫండ్స్ యొక్క పథకాలను పంపిణీ చేసేందుకు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు సహాయం చేయడం వరకే వారి పని అని గ్రహించాలి.

ఒక ప్రత్యేక పథకంలో మదుపు చేసేందు కోసం పంపిణీ దారులు / ప్రతినిధులు ఇచ్చే బహుమతులు, కమీషన్లను మదుపరులు తీసుకొనరాదు. మ్యూచువల్ ఫండ్స్ యొక్క పనితీరును పరిగణనలోకి తీసుకుని వాటి నిర్ణయాత్మక ఉద్దేశాలను మాత్రమే మదుపరులు గమనించాలి.

మ్యూచువల్ ఫండ్స్ లో ప్రవాస భారతీయులు (NRI) మదుపు చేయవచ్చా?

అవును. ఎన్ఆర్ఐ ((ప్రవాస భారతీయులు) లు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. ఇందుకు సంబంధించిన అవసరమైన వివరాలను పథకాల యొక్క అమ్మకపు ఆహ్వాన పత్రాలలో ఇవ్వబడతాయి. 

డెట్ లేదా ఈక్విటీ ఆధారిత పథకాల్లో ఒకరు ఎంత సొమ్ము మదుపు చేయవచ్చు?

ఒక మదుపరి తన యొక్క సాహసంతో కూడిన (risk taking capacity) అపాయాన్ని ఎదుర్కొనే సామర్ధ్యం , వయస్సు, ఆర్ధికస్తోమతలు మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని మదుపు చేయవచ్చు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ పథకాలు వివిధ రకాల సెక్యూరిటీలలో మదుపు చేస్తాయి. ఈ విషయాలను అమ్మకపు ఆహ్వాన పత్రాలలో పేర్కొంటారు. అందుచేత వివిధ రకాల సెక్యూరిటీలలో వివిధ రకాల లాభాలు మరియు ప్రమాదాలు ఉంటాయి. మదుపరులు తాము నిర్ణయాలు తీసుకునే ముందుగా ఆర్ధిక నిపుణులతో కూడా సంప్రదించవచ్చును. ఈ అంశం పై ప్రతినిధులు, పంపిణీదారులు కూడా తమ వంతు సహాయం అందిస్తారు. 

మ్యూచువల్ ఫండ్ యొక్క పథకాల్లో దరఖాస్తు ఫారం నింపడం ఎలా?

దరఖాస్తు ఫారంలో పేర్కొన్నటు వంటి అవసరమైన సమాచారంతోబాటు, దరఖాస్తుదారు పేరు, చిరునామా, ఎన్ని యూనిట్ల కోసం దరఖాస్తు చేస్తున్నారో తదితర వివరాలను దరఖాస్తుదారు స్పష్టంగా తెలియజేయాలి. దరఖాస్తుదారు తన యొక్క బ్యాంకు ఖాతా నెంబరు కూడా వ్రాయాలి.ఎందుకంటే భవిష్యత్ లో మ్యూచువల్ ఫండ్ వారు డివిడెండ్(లాభాల వాటా) ఇచ్చి నప్పుడు కాని లేదా యూనిట్లను తిరిగి కొనుగోలు చేసేటప్పుడు కాని జారీ చేసే చెక్కు/ డ్రాఫ్ట్ లు మోసపూర్వకంగా నగదుగా మార్చుకోవడాన్ని అరికట్టేందుకు ఈ బ్యాంకు ఖాతానెంబరు ఇవ్వడం తప్పనిసరిగా భావించాలి. మ్యూచువల్ ఫండ్ ను తర్వాత కాలంలో దరఖాస్తుదారు చిరునామాలో మార్పు, బ్యాంకు ఖాతా నెంబరు మార్పు మొదలైన వాటిని వెంటనే తెలియజేయాలి. 

అమ్మకపు ఆహ్వానపత్రంలో మదుపరి పరిశీలించవలసిన అంశాలు ఏమిటి?

సంక్షిప్త అమ్మకపు ఆహ్వానపత్రంలో పెట్టుబడి పెట్టే రాబోవు మదుపరులకు ఉపయోగపడే అవసరమైన అతి ముఖ్య సమాచారమును మ్యూచువల్ ఫండ్స్ అందించవలసి ఉంటుంది. అమ్మకపు ఆహ్వానపత్రంలో ఒక పథకంలో చేరేందుకు అవసరమైన దరఖాస్తు ఫారం ఒక ముఖ్య భాగమై ఉంటుంది. అమ్మకపు ఆహ్వానపత్రంలో బహిరంగ పరచవలసిన కనీస అంశాలను సెబి నిర్దేశించింది. ఒక పథకంలో మదుపు చేసే ముందుగా మదుపరి అమ్మకపు ఆహ్వాన పత్రాన్ని జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. పథకం యొక్క ముఖ్య లక్షణాలకు సంబంధించిన అంశాలపై అతి జాగ్రత్త వహించాలి. అంటే రిస్క్ అంశాలు, ప్రాథమిక జారీ ఖర్చులు మరియు పథకంలో మరల మరల వసూలు చేసే ఖర్చులు పథకంలో చేరడానికి , తొలగడానికి వసూలు చేసే లోడ్ లు, స్పాన్సర్ ట్రాక్ రికార్డ్ పట్ల జాగ్రత్త వహించాలి. అంతేగాక ఫండ్ లో ముఖ్యమైన వ్యక్తులైన ఫండ్ మేనేజర్ల వంటి వారి విద్యా యోగ్యతలు పనిలో వారి పూర్వానుభవము పట్ల కూడా జాగ్రత్త వహించాలి. అలాగే మ్యూచువల్ ఫండ్ గతంలో నిర్వహించిన ఇతర పథకాల యొక్క పని సామర్ధ్యం, మ్యూచువల్ ఫండ్స్ పై వాయిదాపడిన వ్యాజ్యాలు (litigations) మరియు విధించిన అపరాధరుసుము (పెనాల్టి) మొదలైన వాటి గురించి జాగ్రత్త పడాలి. 

మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేసిన తర్వాత మదుపరి సర్టిఫికేట్ కాని లేదా తన యొక్క అక్కౌంట్ స్టేట్ మెంట్ కాని ఎప్పుడు పొందగలడు?

మ్యూచువల్ ఫండ్స్ ప్రకటించిన పథకం యొక్క ప్రాథమిక పెట్టుబడుల స్వీకరణ గడువు ముగిసిన నాటి నుంచి 6 వారాలలోపు మదుపరులకు సర్టిఫికేట్లు లేదా అక్కౌంట్ స్టేట్ మెంట్లు పంపబడతాయి. కాలపరిమితితో కూడిన పథకం విషయంలో మదుపరులకు డిమాట్ అక్కౌంట్ స్టేట్ మెంట్ (DEMAT account statement) కాని యూనిట్ సర్టిఫికేట్లు కాని పొందుతారు. ఎందుకంటే ఈ పథకాలకు స్టాక్ ఎక్స్ చేంజ్ (stock exchange) లలో వ్యాపారాలు జరుగుతాయి. కాబట్టి కాల పరిమితి లేని పథకం విషయంలో మ్యూచువల్ ఫండ్ పథకం బహిరంగ ప్రకటన ద్వారా ప్రాథమిక పెట్టుబడుల స్వీకరణ గడువు ముగిసిన 30 రోజులలోపు అక్కౌంట్ స్టేట్ మెంట్లు పంపుతుంది. అమ్మకపు ఆహ్వాన పత్రంలో తిరిగి కొనుగోలు చేసే విధానం గురించి వివరింపబడుతుంది.

కాలపరిమితితో కూడిన పథకాలలో స్టాక్ మార్కెట్ల నుండి యూనిట్లు కొనుగోలు చేసిన తర్వాత ఎంత కాలానికి యూనిట్ల్ బదిలీ జరుగుతుంది?

సెబి (SEBI) నియమ నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్ లాడ్జ్ మెంట్ (lodgment) సర్టిఫికేట్లు జారీ అయిన తేదీ నుంచి నెలలోపు (ముప్పై రోజులలోపు) యూనిట్లను బదిలీ చేయవలసి ఉంటుంది.

యూనిట్ హోల్డర్ అయిన పిదప డివిడెండ్లు (లాభాల వాటా) లేదా తిరిగి కొనుగోలు చేసిన యూనిట్ల పై వచ్చే సొమ్ము పొందడానికి ఎంత కాలం పడుతుంది?

డివిడెండ్ ప్రకటించిన ముప్పై రోజులలోపు యూనిట్ హోల్డర్లకు డివిడెండ్ వారెంట్లను మ్యూచువల్ ఫండ్ పంపవలసి ఉంటుంది. అలాగే వాటాదారు కోరిక మేరకు వాటాను తిరిగి కొనుగోలు చేసిన తర్వాత కాని లేదా యూనిట్ల విడుదల (redemption) నిర్వహించిన తేదీ నుంచి కానీ 10 పనిరోజులలోపు తిరిగి కొనుగోలు చేసిన లేదా విడుదల (redemption) సొమ్ము పంపడం జరుగుతుంది.

విడుదల కల్గించిన / లేదా తిరిగి కొనుగోలు చేసిన యూనిట్ల సొమ్మును నిర్ణయించిన గడువు లోపు పంపడంలో విఫలమైన పక్షంలో అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీ (Asset management company) సెబి (SEBI) తీసుకునే కాలానుగుణమైన వడ్డీ రేట్ల ప్రకారం వడ్డీని (15 శాతం ప్రస్తుతం వడ్డీ రేటు) చెల్లించవలసి ఉంటుంది.

అమ్మకపు ఆహ్వానపత్రంలో పేర్కొన్న ఒక పథకం యొక్క లక్షణాలను మ్యూచువల్ ఫండ్ మార్పు చేయవచ్చా?

చేయవచ్చు. అయితే పథకం యొక్క నియమ నిబంధనల లక్షణాలను మార్చకుండా అంటే పథకం యొక్క మౌలికాంశాలను ఉదాహరణకు రూపం, పెట్టుబడుల తీరు మొదలైన వాటిని మార్చుకోవచ్చు. అయితే ఈ మార్పు విషయాన్ని ప్రతి ఒక్క వాటాదారుకు తెలియపరచాలి లేదా దేశ వ్యాప్తంగా చెలామణి కల్గిన ఆంగ్ల పత్రికలో ప్రకటన ప్రచురణ ద్వారా తెలియపరచాలి. అలాగే మ్యూచువల్ ఫండ్ ప్రధాన కార్యాలయంగల ప్రాంతం నుంచి ప్రచురింపబడుతున్న ప్రాంతీయ భాషా పత్రికలో ప్రకటన ప్రచురణ ద్వారా కూడా తెలియ పరచాలి. ఈ పథకంలో ఉండడానికి ఇష్టం లేని వాటాదారు ఎటువంటి ఎక్జిట్ లోడ్ లేకుండా ప్రస్తుతం అమలులో ఎన్ఎవి వద్ద తొలగడానికి (వెళ్లి పోవడానికి) యూనిట్ హోల్డర్లకు హక్కు కలదు. స్పా న్సర్ మార్పు చెందిన సందర్భంలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇదే విధానాన్ని అనుసరించవలసిన అవసరముంది. అలాగే పథకం యొక్క రూపాన్ని కాల పరిమితితో కూడిన పథకం నుంచి కాల పరిమితిలేని పథకంగా మార్చినప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించవలసి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ లో వస్తున్న మార్పులను గురించి మదుపరులు ఎలా తెలుసుకోగలరు?

మ్యూచువల్ ఫండ్ లో కాలానుగుణంగా మార్పులు వస్తూ ఉంటాయి. తమ ఫండ్ లో ఏవైనా ద్రవ్యంకు సంబంధించిన (material) మార్పులు కనుక అవసరమైతే ఆ సమాచారాన్ని యూనిట్ హోల్డర్లకు మ్యూచువల్ ఫండ్ తెలియజేయాలి. ఇదేకాక ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ తమ యొక్క మదుపరులకు త్రై మాసిక వార్తా సమాచారాలను లేఖల ద్వారా తెలియజేస్తాయి. ప్రతి రెండేళ్ళకు కనీసం ఒక్కసారైనా అమ్మకపు ఆహ్వాన పత్రాల్లోని అంశాలను సవరించి ఆ రోజు నాటికి ఉన్న అంశాలను తెలియపరచవలసిన అవసరం ప్రస్తుతం అమలులో ఉంది. ఇది ఇలా ఉండగా, మ్యూచువల్ ఫండ్ పథకంలో ద్రవ్యానికి సంబంధించి చేసిన మార్పులు గురించి అమ్మకపు ఆహ్వాన పత్రం సవరించి తిరిగి ప్రచురించే సమయం వరకు ఈ మార్పుల అంశంతో కూడిన సమాచారం కలిగిన అదనపు(అనుబంధ) పత్రాన్ని(addendum) ప్రస్తుత అమ్మకపు ఆహ్వాన పత్రంకు జత చేసి కొత్త మదుపరులకు అందించాలి.

Loans

నిధుల కోసం కటకటలాడే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయూతనిచ్చేలా 08  ఏప్రిల్ 2015 ప్రధాని నరేంద్ర మోదీ ‘ముద్ర’ యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల దాకా ఋణాలను అందిస్తుంది. దాదాపు 12 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న 5.75 కోట్ల పైగా లఘు, చిన్న తరహా సంస్థల ఆర్థిక అవసరాలు తీర్చడంపై ఇది దృష్టి పెడుతుంది. పెద్ద సంస్థల్లో కేవలం 1.25 కోట్ల మందే ఉపాధి పొందుతుండగా, చిన్న సంస్థలు 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నన్నాయి. ఇలాంటి వాటికి తోడ్పాటునిచ్చేందుకే ముద్ర పథకాన్ని ప్రవేశపెట్టినారు. ప్రధాన మంత్రి ముద్ర యోజనకు రూ. 20,000 కోట్ల కార్పస్ నిధి ఉంటుంది.

ముద్ర విధులు:

  • మైక్రో యూనిట్ల అభివృద్ధి, రీఫైనాన్సింగ్ కార్యకలాపాల కోసం  చిన్న తరహా వ్యాపారవేత్తలకు రూ. 50,000 నుండి రూ. 10 లక్షల దాకా ముద్ర ఋణాలు ఇస్తుంది.
  • బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు 7 శాతం వడ్డీ రేటుపై రీఫైనాన్స్ సేవలను అందిస్తుంది. తయారీ, సర్వీసులు తదితర రంగాల్లోని చిన్న వ్యాపారులకు ఋణాలు కల్పించే సంస్థల మార్గదర్శకాలు రూపొందించడం, ఎంఎఫ్‌ఐల రిజిస్ట్రేషన్, రేటింగ్ మొదలైన అంశాలను ముద్ర పర్యవేక్షిస్తుంది.
  • ఎంఎఫ్‌ఐ తీసుకునే రిస్కును బట్టి వడ్డీ రేటును నిర్ణయిస్తుంది.
  • ముద్ర నిధి నుంచి తీసుకునే మొత్తాన్ని ఋణంగా ఇచ్చేటప్పుడు నిర్దిష్ట వడ్డీ రేటుకు మించి వసూలు చేయకుండా పరిమితి విధిస్తుంది.

సూక్ష్మ ఋణ సంస్థలు (ఎంఎఫ్‌ఐ), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) కూడా ముద్ర నుంచి రుణాలు తీసుకోవచ్చని, తదుపరి ఆ మొత్తాన్ని ఇతరులకు రుణాలిచ్చేందుకు ఉపయోగించుకోవచ్చు.

ఫండింగ్ దశను బట్టి ‘శిశు’, ‘కిశోర్’, ‘తరుణ్’ పేరిట మూడు రకాల పథకాల కింద ముద్ర యోజన నిధులు సమకూర్చుతుంది.

రుణ రకాలు:

  • శిశు: రూ. 50,000 దాకా ఋణాలు,
  • కిశోర్: రూ. 5 లక్షల దాకా,
  • తరుణ్: రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల దాకా ఋణాలు వర్గీకరించారు.

ఋణం పొందుటకు అర్హత:

  • భారత పౌరుడై ఉండాలి,
  • ఒక వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగ ఉండాలి,
  • ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగంలో.
  • రుణ అవసరం రూ.10 లక్షల లోపు ఉండాలి.
  • పైన పేర్కొన్న అర్హత గల వారు దగరలో వున్నబ్యాంక్,  సూక్ష్మ ఋణ సంస్థ (ఎంఎఫ్‌ఐ), లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) అధికారులను సంప్రదించాలి.


ఇ పథకం వర్తించే రంగాలు:

  1. ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ / కార్యాచరణ – ఆటోరిక్షా, చిన్న వస్తువులు రవాణా వాహనం, 3 వాహనాలు, ఇ-రిక్షా ప్యాసింజర్ కార్లు, టాక్సీలు, మొదలైనవి వస్తువులు మరియు వ్యక్తిగత రవాణా కోసం రవాణా వాహనాల కొనుగోలు.
  2. కమ్యూనిటీ, సామాజిక మరియు వ్యక్తిగత సేవలు కార్యక్రమాలు –  బ్యూటీ పార్లర్స్, వ్యాయామశాల, షాపులు, టైలరింగ్ దుకాణాలు, డ్రై క్లీనింగ్, చక్రం మరియు మోటార్ సైకిల్ మరమ్మతు దుకాణం, డిటిపి మరియు ఫోటో సౌకర్యాలు, మెడిసిన్ దుకాణాలు, కొరియర్ ఏజెంట్లు, మొదలైనవి.
  3. ఆహార ఉత్పత్తులు సెక్టార్ – పాపడ్ తయారీ, పచ్చడి తయారీ, జామ్ / జెల్లీ తయారీ, వ్యవసాయ ఉత్పత్తులకు పరిరక్షణకు గ్రామీణ స్థాయి, తీపి దుకాణాలు, చిన్న సేవ ఆహారం స్టాళ్లు మరియు రోజు క్యాటరింగ్ / రోజువారి క్యాటరింగ్  సేవలకు, కోల్డ్ స్టోరేజ్, ఐస్ & ఐస్ క్రీమ్ తయారీ యూనిట్లు, బిస్కట్, రొట్టె మరియు బన్ను తయారీ మొదలైనవి.
  4. వస్త్ర ఉత్పత్తులు సెక్టార్ / కార్యాచరణ –  చేనేత, ప్రజలకు చికన్ పని, జరీ మరియు జర్దారీ పని, సంప్రదాయ ఎంబ్రాయిడరీ మరియు చేతిపని, సంప్రదాయ అద్దకం మరియు ప్రింటింగ్, దుస్తులు డిజైన్, అల్లడం, పత్తి జిన్నింగ్, కంప్యూటరీకరణ ఎంబ్రాయిడరీ, కలపడం మరియు ప్రయత్నంగా కార్యక్రమాలకు మద్దతు అందించడానికి ఉత్పత్తులైన బ్యాగులు, వాహనం ఉపకరణాలు, మొదలైనవి.


ఋణము పొందు విధానం మరియు కావలిసిన డాక్యుమెంట్స్:
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (PMMY) కింద సహాయం పొందగోరేవారు వారి ప్రాంతంలో ఆర్థిక సంస్థల ఏ యొక్క స్థానిక శాఖ అధికారులనైనా సంప్రదించవచ్చును,  పి ఎస్ యు బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు సహకార బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సేలందించే ఇన్స్టిట్యూషన్స్ (MFI) మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC). సాయం మంజూరు సంబంధిత రుణ సంస్థల అర్హత నిబంధనలను ప్రకారం ఉండాలి.

  • గుర్తింపు రుజువు: ఓటరు ఐడి కార్డ్ / డ్రైవింగ్ లైసెన్సు / పాన్ కార్డు / ఆధార్ కార్డు / పాస్పోర్ట్ / ప్రభుత్వంచే జారీచేయబడిన ఫోటో ఐడీ ధృవీకరణ మొదలైనవి.
  • నివాసం రుజువు: ఇటీవలి టెలిఫోన్ బిల్లు / విద్యుత్ బిల్లు / ఆస్తి పన్ను రసీదు (చివరి 2 నెలల లోపువి) / ఓటరు ఐడి కార్డ్ / వ్యక్తిగత / ప్రొప్రైటర్ / భాగస్వాములు బ్యాంక్ ఖాతా పుస్తకము లేదా తాజా ఖాతా స్టేట్మెంటు, ఆధార్ కార్డ్ / పాస్పోర్ట్ వెంటనే బ్యాంక్ అధికారులు / నివాస సర్టిఫికెట్ ద్వారా ధృవీకరణ / సర్టిఫికెట్ ప్రభుత్వం జారీ చేసింది, అధికారం / స్థానిక పంచాయితీ / మున్సిపాలిటీ మొదలైనవి.
  • దరఖాస్తుదారు యొక్క ఇటీవలి ఫోటోగ్రాఫ్ (2 కాపీలు) 6 నెలల లోపువి.
  • మెషినరీ / ఇతర వస్తువులను కొనుగోలు కొటేషన్.
  • సరఫరాదారు పేరు / యంత్రాలు ధర కొనుగోలు వివరాలు.
  • వ్యాపార సంస్థ యాజమాన్యానికి సంబంధించిన సంబంధిత లైసెన్సు / నమోదు సర్టిఫికెట్లు / ఇతర పత్రాలు ప్రతులు, వ్యాపార యూనిట్ చిరునామా యొక్క గుర్తింపు, వ్యాపార సంస్థ గుర్తింపు / చిరునామా రుజువు.
  • ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ / మైనార్టీ etc వంటి వర్గం యొక్క ప్రూఫ్.


గమనిక: అన్ని ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ఋణాలు పొందగోరువారు వారు ఈ క్రింది విషయాలు గమనించాలి:

  • ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.
  • అదనపు హామీ ఉండదు.
  • రుణo తిరిగి చెల్లించే కాలం 5 సంవత్సరాల వరకు విస్తరించబడింది.
  • అభ్యర్థి ఏ బ్యాంకు / ఆర్థిక ఇంస్టిట్యూషన్ యొక్క డిఫాల్టర్ ఉండకూడదు.

సంబంధించిన వనరులు:

బ్యాంకరు కిట్