Wealth News

వీలునామాకు, నామినీకి గల తేడా ఏమిటి? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది?

వీలునామా,నామినీ రెండూ వేర్వేరు విషయాలు.ఎలా అంటారా?

ముందుగా నామినీ గురించి: ఉదా:తన జీవితంపై ఒక వ్యక్తి ఒక కోటి రూపాయల కి బీమా చేసి,నామినీ గా తల్లి పేరు రిజిస్టర్ చేసాడు అనుకుందాం.పెండ్లి అయ్యి ఇద్దరు చిన్న పిల్లలు ఒకరికి 4సం. ఇంకొకరికి 6సం.బీమా చేసిన వ్యక్తికి 36 సం.వయసు.భార్య వయసు 30.

25 సం.టర్మ్ తో పాలసీ తీసుకున్నాడు.పాలసీ తీసుకున్న తరువాత 7వ సం.లో పాలసీ క్లైమ్ కి వస్తె బీమా మొత్తాన్ని తల్లికి ఇస్తారు.

పైన చెప్పిన విధంగా కాకుండా ఒక ఇరవై సం. తర్వాత 50 లక్షలు మెచ్యూరిటీ మొత్తం వచ్చేలా పాలసీ తీసుకుని పాలసీ కంతులు(వాయిదాలు) క్రమం తప్పకుండా కడుతూ వున్నాడు.భార్య పేరు వీలునామా రిజిస్టర్ చేసాడు.సదరు వ్యక్తి అనుకోకుండా చనిపోయినా,పాలసీ వ్యవధి అయిపోయినా పాలసీ మొత్తాన్ని భార్య కి ఇస్తారు.

చాలా వరకు నామినీ ఒక ట్రస్టీ మాత్రమే.నామినీ చనిపోయిన వారి యొక్క డబ్బుకు ట్రస్టీ గా వుండి నామినీ aయొక్క వారసులకు అప్పజెప్పడం ట్రస్టీ యొక్క విధి.

ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి తన బ్యాంక్ ఖాతా మరియు ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా జీవిత బీమా పాలసీ లలో మరో వ్యక్తిని సదరు రికార్డ్ లలో నామినీ గా పెట్టాడు.

ఈ పైన చెప్పిన అన్ని ఆర్థిక సంస్థల లో వున్న డబ్బులన్నీ అక్కడ ఇరుక్కు పోకుండా తీసుకునే అవకాశం ఉన్నది.అదే నామినేషన్ చేయించ క పోయి వుంటే ఆయా ఆర్థిక సంస్థల నుంచి నగదును బయటికి తీసుకు రావడం కష్టం అయి వుండేది.నామినీ గా ఎవరో ఒకరి పేరు రిజిస్టర్ చేయక పోతే

వారసత్వ ధృవీకరణ అనీ సక్సెషన్ సర్టిఫికేట్ అనీ లీగల్ హైర్స్ సర్టిఫికేట్ అనీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.మనీ ఆర్థిక సంస్థల దగ్గర ఇరుక్కు పోతుంది.

ఇలా ఆర్థిక సంస్థల దగ్గర ఇరుక్కు పోయిన మనీ చాలానే ఉంది అనీ రిపోర్టులు చెబుతున్నాయి.

సెక్షన్ 39 ఇన్సూరెన్స్ ఆక్ట్ ప్రకారం L I C పాలసీ లు తీసుకునేటప్పుడు పాలసీ దారు ఎవరినైతే నామినీగా పేరు రిజిస్టర్ చేస్తారో ఆ నామినీ కే పాలసీ దారు మరణానంతరం దరఖాస్తు చేసిన వారికి అంటే claimant హక్కుదారు నకు అన్ని రకాల పత్రములు సమర్పించిన మీదట (ఆఫీస్ ద్వారా ఇవ్వబడిన క్లైమ్ పేపర్స్ policy బాండ్ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఆధార్ కాపీ పాన్ వివరాలు) బీమా పాలసీ డబ్బు ను

నామినీ ఖాతాలో వేయడం జరుగు తుంది.

వీలునామా రాసినా నామినీ గా రికార్డ్ లలో వున్నా సదరు వ్యక్తి బ్రతికి ఉన్నంత వరకు హక్కులు అసలు వ్యక్తికి

మాత్రమే వుంటాయి.నామినీ గానీ వీలునామా ఎవరి పేరున వున్నదీ ఆ వ్యక్తి గానీ అసలు వ్యక్తి మరణానంతరం మాత్రమే

మరణించిన వ్యక్తి యొక్క ఆస్థికి,డబ్బుకు హక్కుదారులతారు.

నామినేషన్ ఎన్నిసార్లయినా మార్చుకునే వీలుంది.వెసలుబాటు వుంది. అలా ఎందుకు అని అంటే ఒక వ్యక్తి తన పెండ్లికి ముందు తన తల్లిని గానీ తండ్రిని గానీ నామినీ గా రికార్డ్ లో రిజిస్టర్ చేసి వుంటారు.కానీ పెండ్లి అనంతరం సహచరిని/భార్యని నామినీ గా రికార్డులలో పొందు పరచ వలసి ఉంటుంది.

వీలునామా కూడా రెండు రకములుగా వుండే అవకాశం ఉన్నది.

అందులో మొదటిది: తన జీవిత కాలం సదరు ఆస్థిని అనుభవిస్తూ అనంతరం వారీసులకు చెందేలా వ్రాయడం ఒక పద్ధతి.

రెండవది.సంపూర్ణ హక్కులు సంక్రమింప జేస్తూ తన ఇష్టానుసారం అనుభవించే స్వేచ్ఛ మరియు అమ్ముకునేందుకు హక్కు ఉండునట్లు వ్రాయడం.

ఇవి కాకుండా షేర్స్,డివిడెండ్ లు,రాయల్టీ, డిబెం న్చర్ లు,ఇలా ఎన్నో రకాల ఆర్థిక సంస్థల దగ్గర డబ్బులు వ్యక్తుల లేదా సంస్థల డబ్బులు వుండే అవకాశం ఉంది.

అందువల్ల తప్పని సరిగా నామినేషన్ దాఖలు చేయడం మంచిది.నామినేషన్ రిజిస్టర్ అయిందా లేదా అనేది తెలుసు కోవడం ముఖ్యం.

కారణం ఏమంటే బ్యాంకు వారు గానీ బీమా సంస్థలు గానీ లేదా ఇతర ఏ ఆర్థిక సంస్థలు గానీ వారికున్న పని ఒత్తిడి కారణంగా నో లేదా నిర్లక్ష్యం వల్ల నో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.

నేను 2011 లో బ్యాంక్ ఖాతా తెరిచినప్పుడు ఏజ్ ప్రూఫ్,ఆధార్,పాన్ వివరాలు,నివాస ధృవీకరణ పత్రాలు అన్నీ ఇవ్వడం జరిగింది. ఓ రెండేళ్ల తరువాత ఎందుకనో బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ మొదటి పేజీ చూడటం జరిగింది.నామినేషన్ అన్న కాలం దగ్గర not registered అని వుంది.మరలా రెండోసారి అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి కరెక్షన్ చేయించడం జరిగింది.

అందరూ అలా వుంటారు అని కాదు.అన్ని చోట్ల అలానే జరుగుతుందని కాదు.

ఈ వ్యవస్థలో ఎవరిని వారే ఉద్ధరించు కోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *