EPF Balance Check OnlineEPF Balance Check Online


ఈపీఎఫ్ అంటే ఏమిటి?

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ భారత ప్రభుత్వ సామాజిక భద్రతా కార్యక్రమం. ఈ ఫండును భారత ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (భారత ప్రభుత్వ చట్టబద్ధ శాఖ) ద్వారా అమలుచేస్తున్నారు. ఈ ఫండ్ లో యజమాని (సంస్థ యొక్క యజమాని) మరియు ఉద్యోగి వేతనం నుంచి తప్పనిసరిగా పొదుపు ఉండాలి. ముసలి వయస్సు లేదా అత్యవసర పరిస్థితిలో ఈ ఫండ్ ఉపయోగించుకోవడానికి ఉద్యోగికి అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వివిధ ఆన్ లైన్ సేవలను విస్తరిస్తుంది. ఉద్యోగులు క్రింది సేవల లబ్దిని పొందవచ్చు.

  1. పిఎఫ్ ఖాతా నిల్వ.
  2. పిఎఫ్ లావాదేవీల పాస్ పుస్తకం.
  3. ఫైల్ బదిలీ దావా.
  4. ఇతర సేవలు.

పిఎఫ్ పాస్ బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి సూచనలు

కింద పిఎఫ్ పాస్ బుక్కు డౌన్లోడ్ ప్రక్రియ వివరించబడింది.

  1. members.epfoservices.in ను దర్శించండి
  2. మీరు మొదటి సారి యూజర్ అయితే, మొదట రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు నమోదు లింక్ http://members.epfoservices.in/employee_reg_form.php to register.
  3. పేరు, మొబైల్ నెంబర్, పుట్టిన తేది వంటి కొన్ని వ్యక్తిగత వివరాలు పూరించాలి. మీ వ్యక్తిగత వివరాలే కాకుండా బాక్స్ డ్రాప్ డౌన్ నుంచి ఒక డాక్యుమెంట్ రకాన్ని (పాన్ కర్డు, ఓటరు గుర్తింపు కార్డు తదితరమైనవి) ఎంచుకొండి మరియు సంబంధిత పత్రం నంబర్ (పాన్, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య) క్రింద ఇచ్చిన టెక్స్టు బాక్స్ లో నమోదు చెయ్యండి.
  4. వివరాలను నమోదు చేసిన తర్వాత, వినియోగదారుడు “పిన్ పొందండి” ఎంపికను క్లిక్ చేయాలి.
  5. కొన్ని నిమిషాలలో, వినియోగదారు అతని/ఆమె మొబైలు ఫోనులో పిన్ పొందుతారు. తర్వాత పేజీ కింది వైపు ఉన్న బక్సు “అధికార పిన్ నమోదు” లో పిన్ నమోదు చేయండి. డిస్క్లైమర్ తర్వాత అందుబాటులో ఉన్న “నేను అంగీకరిస్తున్నాను” చెక్ బాక్స్ ఎంచుకోవటం మర్చిపోవద్దు.
  6. ఒకసారి మీరు విజయవంతంగా రిజిస్టరు చేసుకుంటే, లాగిన్ పేజీకి వెళ్ళండి. మీ పత్రం మరియు మొబైల్ సంఖ్యను నమోదు చేయండి, తర్వాత”సైన్ ఇన్ చేయి” క్లిక్కు చేయండి.
  7. తర్వాత వెబ్ పేజీ యూజర్ యొక్క ఎగువ ఎడమ వైపు “డౌన్లోడ్ ఇ పాస్ బుక్” ఎంపికను ఎంచుకోవాలి.
  8. సంస్థ ఏ రాష్ట్రం కిందికి వస్తుంది, వాకందారు పిఎప్ అకౌంటును చూస్తున్న EPFO ఆఫీసు, కోడు వివరాలు, అకౌంటు సంఖ్య మరియు యూజరు పేరు లాంటి వివరాలను ఇవ్వాలి. వివరాలను ఇచ్చిన తర్వాత ” గెట్ పిన్”ను క్లిక్ చేయండి. పాసు బుక్కు అందుబాటులో ఉంటే, వినియోగదారు అతని/ఆమె మొబైల్ నంబరులో PIN ను పొందుతారు. గమనిక: ప్రస్తుత సదుపాయం మే 2012 నుండి వేతనాల ఎలక్ట్రానిక్ చలాన్ కం రిటర్న్ లను యజమాని అప్లోడ్ చేసిన సభ్యులకే కలదు.
  9. “అధికార పిన్ నమోదు” బాక్స్ లో పిన్నును (మొబైల్ ద్వారా పొందినది) నమోదు చేయండి.
  10. .చివరగా మీరు పిఎఫ్ పాసు బుక్కు పొందుతారు మరియు పాస్ బుక్ డౌన్లోడ్ చేయడానికి “డౌన్లోడ్” బటన్ను క్లిక్కు చేయండి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *