మార్కెట్ ఎంత పడితే మళ్ళీ అంతా పైకి లేస్తుంది.
పెరుగుట విరుగుట కొరకే అన్న సూత్రం స్టాక్ మార్కెట్ కి
అక్షరాలా వర్తిస్తుంది. సెన్సెక్స్ యే స్థాయికి పడిపోయిన మళ్ళీ ఉత్తుంగ తరంగం లా లేస్తుంది.కాబట్టి ఇన్వెస్టర్లు కంగారు పడాల్సిన అవసరమే లేదు.
ప్రస్తుతం సెంటిమెంట్ బాగా లేదు కాబట్టి కొత్త లేదా చిన్న ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దూరం గా ఉండటమే మేలు . సెంటిమెంట్ మెరుగు పడే వరకు ఓపిక పట్టక తప్పదు.
కాక పోతే ఈ పతన దశలో మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తుండాలి. ఇన్వెస్ట్ మెంట్ వ్యూహాలను రూపొందించుకోవాలి. కంపెనీల షేర్ల ధరలపై సెంటిమెంట్ ప్రభావం ఎలా ఉంది ?
షేర్ల ధరలు తగ్గాయా ??లేక పెరిగాయా?? ఒక అంచనాకు రావాలి. పని తీరు, ఫలితాలు బాగుండి, షేర్ ధర కూడా తగ్గి వుంటే అలాంటి షేర్లను ఎంపిక చేసి పెట్టు కోవాలి.మార్కెట్ స్థిరీకరణ బాట పట్టాక కొనుగోళ్ళకు పూనుకోవాలి.
మార్కెట్ పతన మౌతున్నదంటే అది ఇన్వెస్ట్ మెంట్ కి అవకాశం దొరకడమే అని భావించాలి. మార్కెట్ ఇప్పటికి కొన్ని వందల సార్లు పతన మైంది మళ్ళీ పెరిగింది.
ఇక ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన షేర్లలో మదుపు చేసిన ఇన్వెస్టర్లు కూడా
నష్టాల నివారణకు ప్రయత్నం చేయ వచ్చు. కొనుగోలు చేసిన షేర్లను మళ్ళీ కొనుగోలు చేసి యావరేజ్ చేసుకోవాలి . లేదంటే యే ప్రయత్నం చేయకుండా
ఉండటమే మంచిది. కాగా రిస్క్ తీసుకునే సత్తా వున్నా ఇన్వెస్టర్లు మాత్రం ధరలు తగ్గిన షేర్ల పై ఒకన్నేయ వచ్చు.