sbi kisan land purchase schemesbi kisan land purchase scheme

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భూమి లేని రైతులకు శుభవార్త చెప్పింది. భూమి లేని రైతుల కోసం ఓ సరికొత్త స్కీంను ప్రకటించింది. వ్యవసాయం చేయాలనుకునే యువతకు ఈ స్కీం ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ల్యాండ్ పర్చేజ్ స్కీం పేరిట రుణాలు అందిస్తోంది.
ఈ స్కీం లో భాగంగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు.
మీరు భూమి విలువలో కేవలం 15 శాతం డబ్బులు చెల్లిస్తే చాలు. 85 శాతం మొత్తానికి బ్యాంక్ లోన్ అందిస్తుంది. అంతేకాకుండా తీసుకున్న రుణాన్ని 7 నుంచి పదేళ్లలోపు తిరిగి చెల్లిస్తే చాలు అని SBI ప్రకటించింది.

తీసుకున్న రుణాన్ని చెల్లించిన తర్వాత మీకు భూమిపై యాజమాన్య హక్కు లభిస్తుంది. దీనివల్ల సన్నకారు రైతులకు, పొలం లేని వారికి మేలు కలుగనుంది.
ఈ స్కీం కింద లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే బ్యాంక్ ఎలాంటి అప్పు ఉండకూడదు. ఈ స్కీం కోసం 2.5 ఎకరాల కన్నా తక్కువ పొలం ఉన్న రైతులు అర్హులు అవుతారు. వారే దరఖాస్తు చేసుకోవచ్చు.

పొలం లేనివారు కూడా లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. మరోవైపు ఈ స్కీం కింద లోన్ తీసుకుంటే ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా హాలిడే పేమెంట్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. కాగా, కరోనా వైరస్ దెబ్బకి సజావుగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా తలకిందులైంది. పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు పల్లెబాట పట్టారు. కొందరు వర్క్ ప్రం హోమ్ లో ఉద్యోగాలు చేస్తున్నా.. చాలామంది సంస్థలు మూతపడటంతో ఉద్యోగాలు కోల్పోయారు. ఊరికి వచ్చి ఆ పనీ ఈ పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భూములు ఉన్నవారు పొలంబాట పట్టారు. పలుగులు పాలు పట్టి పొలాల్లోకి వెళ్లి నడుము వంచుతున్నారు అలాంటి వారి కోసం ఎస్బీఐ ఈ సరికొత్త స్కిన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.


మీ దగ్గరలోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి అధికారులను కలిస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వివరిస్తారు. మీరు అర్హులైతే రుణాలు కూడా పొందొచ్చు.

చిన్న మరియు ఉపాంత రైతులు మరియు భూమిలేని వ్యవసాయ కూలీలకు భూమి కొనుగోలు కు సహాయం చేయడం, భూములను ఏకీకృతం చేయడానికి మరియు బంజర భూమి మరియు తడి భూముల అభివృద్ధికి ప్రస్తుత రుణగ్రహీతలకు కూడా.

రుణ మొత్తం:

భూమి ఖర్చు

నీటిపారుదల సౌకర్యాలు భూ అభివృద్ధి (భూమి ఖర్చులో 50% మించకూడదు).

వ్యవసాయ పరికరాల కొనుగోలు

రిజిస్ట్రేషన్ ఛార్జీలు & స్టాంప్ డ్యూటీ

బ్యాంకు అంచనా వేసినట్లుగా, గరిష్టంగా రూ .5 లక్షల భద్రతకు లోబడి, రుణ వ్యయం భూమి ఖర్చులో 85% ఉంటుంది
కొనుగోలు చేయవలసిన భూమి తనఖా ఉంటుంది.

గెస్టేషన్ కాలం ముగిసిన 9-10 సంవత్సరాలు(గరిష్టం), సగం వార్షిక వాయిదాలతో. అభివృద్ధి చెందిన భూమికి గెస్టేషన్ కాలం గరిష్టంగా 1 సంవత్సరం మరియు భూమి అభివృద్ధి చెందడానికి 2 సంవత్సరాలు ఉంటుంది.

ఎవరు అర్హులు?

చిన్న మరియు ఉపాంత రైతులు 5 ఎకరాల కంటే తక్కువ నీటిపారుదల / 2.5 ఎకరాల సాగునీటిని తమ పేర్లతో కలిగి ఉన్నారు, భూమిలేని వ్యవసాయ కూలీలు.
రుణగ్రహీతలు కనీసం రెండేళ్లపాటు రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించే రికార్డును కలిగి ఉండాలి.
ఇతర బ్యాంకుల మంచి రుణగ్రహీతలు తమ బ్యాంకును ఇతర బ్యాంకులకు లిక్విడేట్ చేస్తే కూడా అర్హులు.

పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సంప్రదించండి.
SBI Land Purchase Scheme Click here

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *