sipsip

“సిప్ “అనే పదం ఇటీవల కాలం లో తరచుగా వింటున్నాం.చాలా మంది “సిప్ “అన గానే అదేదో ఒక స్కీం అని భావిస్తుంటారు .కానీ సిప్ అంటే మదుపు చేసే పద్ధతి.  సిష్టమేటిక్  ఇన్వెస్ట్మెంట్  ప్రోసీజర్  దీన్నే తెలుగులో క్రమానుగత పెట్టుబడి విధానం అంటారు. దీర్ఘ కాలిక వ్యూహం తో మదుపు చేసే ఇన్వెస్టర్ లకు సిప్ చాలా అనువైనది.రికరింగ్ డిపాజిట్ తరహాలోనే నెలకు నిర్ణీత మొత్తాన్ని  మదుపు చేయడాన్ని సిప్ అంటారు .  బ్యాంకుల్లో ,పోస్ట్ ఆఫీసుల్లో మదుపు చేస్తే రికరింగ్ అంటాం. అదే మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే సిప్ అంటాం .అంతకు మించి  పద్దతిలో తేడా లేదు. అయితే రికరింగ్ లో వడ్డీ గ్యారంటీ వుంటుంది. సిప్ లో ఆ గ్యారంటీ లేదు. ఇన్వెస్టర్లు  ఆ విషయాన్నీ గమనించాలి.మ్యూచువల్ ఫండ్స్  సమీకరించిన మొత్తాలను  షేర్ల లో మదుపు చేస్తాయి కాబట్టి కొంత మేరకు నష్ట భయం వుంటుంది.  అందుకే రాబడికి ఫండ్స్ ఎలాంటి హామీలు ఇవ్వవు. అలాంటపుడు సిప్ చేయడమెందుకు అనే సందేహం కూడా రావచ్చు.

షేర్ మార్కెట్లో నేరుగా మదుపు చేయలేని ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ లో   మదుపు చేస్తుంటారు , ఫండ్స్ ను మార్కెట్ లో అనుభవం గల నిపుణులు  నిర్వహిస్తారు కాబటి నష్టం తక్కువ  ఉంటుందనే నమ్మకం తోనే ఫండ్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఈ ఫండ్స్ లో కూడా మంచి వాటిని ఎంచుకొని మదుపు చేస్తే లాభాలు ఆర్జించే అవకాశాలు పుష్కలం గా వున్నాయి.అయితే చిన్న ఇన్వెస్టర్లు పెద్ద మొత్తాల్లో మదుపు చేయ లేరు కాబటి నెల వారీ గా మదుపు చేసేందుకు సిప్
విధానం అమలు లో కొచ్చింది. దీర్ఘ కాలం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే లాభాలకు ఛాన్స్ ఉంది. అయితే పధకాల ఎంపిక పైనే లాభాలు ఆధార పడివుంటాయి.ఒకే సారి పెద్ద మొత్తం లొ మార్కెట్  పెట్ట కుండా కొద్ది పాటి మొత్తాల్లో క్రమం తప్ప కుండా మదుపు చేయాలి .ఇన్వెస్టర్ల వీలును బట్టి రూ. 500 ,1000 ,2000మేరకు నెల నెలా మదుపు చేయవచ్చు.ఈ విధానం లొ ముందుగా ఖచ్చితం గా ఏమేరకు మదుపు చేయ గలరో ఇన్వెస్టర్లు నిర్ణయించుకుంటే మంచిది.
ఎంత కాలం మదుపు చేస్తారనేది కూడా ముందుగా నిర్ణయించు కోవాలి .కనీసం మూడు నుంచి అయిదేళ్ళు వ్యవధి వరకు మదుపు చేస్తే లాభాలకు అవకాశం వుంటుంది .కాగా సిప్ పద్ధతి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లొ మదుపు చేయాలనుకునే ఇన్వెస్టర్లు  యే మ్యూచువల్ ఫండ్ సంస్థ కార్యాలయానికి వెళ్ళిన మిగతా విషయాలు వాళ్ళే చూసుకుంటారు. అయితే ముందుగా నిపుణుల  సలహా తీసుకుంటే మంచిది .

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *