mutual fundsmutual funds

ఒక పథకం యొక్క పనితీరు దాని నికర ఆస్తి విలువ (NAV) ను ప్రతిబింబిస్తూ తెలుస్తుంది. ఆ నికర ఆస్తి విలువ కాలపరిమితి లేని పథకాల్లో రోజువారీగాను, కాలపరిమితి గల పథకాల్లో వారం వారీగాను బహిరంగంగా ప్రకటింపబడుతాయి.మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఈ ఎన్ఎవిలు వార్తా పత్రికలలో ప్రచురించవలసిన అవసరం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ యొక్క వెబ్ సైట్లలో కూడా ఈ ఎన్ఎవిలు లభ్యమౌతాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ తమ యొక్క ఎన్ఎవిలను భారత మ్యూచువల్ ఫండ్స్ సంఘం (association of mutual funds in India) యొక్క వెబ్ సైట్ లో కూడా పొందుపరచాలి. ఎ ఎమ్ ఎఫ్ ఐ (AMFI) వెబ్ సైట్ ఏమిటంటే www.amfindia.com. ఆ విధంగా మదుపరులు అన్ని మ్యూచువల్ ఫండ్ల్ యొక్క ఎన్ఎవిలను ఒకే స్థలంలో పొందే వీలుంది.

అంతే గాకుండా, మ్యూచువల్ ఫండ్లు తమ యొక్క పనితీరును అర్ధసంవత్సరాల ఫలితాల రూపంలో ప్రచురించవలసిన అవసరముంది. గత ఆరునెలలు, ఒక సంవత్సరం, మూడు సంవత్సరాలు, అయిదు సంవత్సరాలు కాలం ప్రకారం తమ పథకాలపై వచ్చే లాభాలు /ఆదాయాలతో కలిపి ప్రకటించవలసి ఉంది. ఈ ఫలితాలను పథకం ప్రారంభ సమయం నుంచి ప్రకటించాలి. మొత్తం ఆస్తులపై చేసిన ఖర్చుల శాతం వివరాలను మదుపరులు తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే ఈ ఖర్చులు తమకొచ్చే ఆదాయంపై ప్రభావం చూపడమే కాక ఆ సంవత్సరం యొక్క అర్ధ సంవత్సరం సమాచారం వివరాల సమాచారానికి ఉపయోగపడ్తాయి.

సంవత్సరానికి వాటాదారులకు వార్శిక నివేదికను గాని సంక్షిప్త వార్షిక నివేదికను గాని మ్యూచువల్ ఫండ్లు పంపించవలసిన అవసరం కూడా ఉంది.

మ్యూచువల్ ఫండ్ల యొక్క పథకాల మీద, ఆ వివిధ పథకాలలో వచ్చే ఆదాయాల గురించి కూడా కలిపి చేసిన వివిధ రకాల అధ్యయనాలను ఆర్ధిక వార్తా పత్రికలలో వారం వారీగా ప్రచురించడం కూడా జరుగుతోంది. ఈ అధ్యయనాలే కాక అనేక పరిశోధనా సంస్థలు (many research agencies) కూడా మ్యూచువల్ ఫండ్ల యొక్క పనితీరుపై పరిశోధనా వ్యాసాలు ప్రచురిస్తున్నాయి. ఈ పరిశోధనా వ్యాసాలలో వివిధ రకాల పనితీరు స్థాయిని కూడా కలిపి తెలియ పరుస్తారు. మదుపరులు ఈ పరిశోధనా వ్యాసాలను అధ్యయనం చేసి వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల యొక్క వివిధ పథకాల పనితీరు గురించి ఇచ్చిన సమాచారం పై అవగాహన కలిగించుకోవాలి.

మదుపరులు తమ పథకాల పనితీరును అదే స్థాయిలోని ఇతర మ్యూచువల్ ఫండ్ల యొక్క పథకాల పనితీరుతో పోల్చుకోవచ్చు.వారు ఈక్విటీ ఆధారిత పథకాల యొక్క పనితీరుతో పాటు బిఎన్ఇ సెన్సి టివ్ ఇండెక్స్ (BSE Sensitive Index), ఎస్ &పిసిఎన్ ఎక్స్ నిఫ్టీ ( S&PCNX Nifty) మొదలైన పథకాల నిర్దేశిత ప్రమాణాల (benchmark)పనితీరుతో కూడా పోల్చుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్ల యొక్క పనితీరు ఆధారంగా మదుపరులు మ్యూచువల్ ఫండ్ల పథకంలో ఎప్పుడు చేరాలో లేదా ఎప్పుడు విరమించుకోవాలో నిర్ణయించుకోగలరు .

మదుపరుల నుంచి పోగు చేసిన పెట్టుబడుల సొమ్మును మ్యూచువల్ ఫండ్ పథకాలు ఎక్కడ మదుపు చేస్తారో తెలుసుకోవడం ఎలా?

అర్ధ సంవత్సరం వారీగా తమ మొత్తం పథకాలలోని పూర్తి వాటాల జాబితా(portfolios)లను మ్యూచువల్ ఫండ్స్ వార్తా పత్రికలలో ప్రచురించి ప్రకటించవలసిన (బహిరంగపరచవలసిన) అవసరముంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ తమ పూర్తి వాటాల జాబితాను యూనిట్ హోల్డర్లకు నేరుగా పంపుతాయి.

పథకం యొక్క వాటాల జాబితా ప్రతి సెక్యూరిటీలో మదుపు చేసిన మొత్తాన్ని తెలియజేస్తుంది. అంటే ఈక్విటీ , డిబెంచర్లు, మనీ మార్కెట్ పత్రాలు (instruments)ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైనవి. వాటియొక్క మొత్తం మార్కెట్ విలువ మరియు ఎన్ ఎ వి లో వాటి శాతం తెలియజేస్తాయి. ఈ వాటాల మొత్తం జాబితాలు నగదుగా మార్చుకునే సెక్యూరిటీల వాటాల జాబితాను ప్రకటించవలసిన అవసరముంది. అంతేగాక రేటెడ్ మరియు అన్ రేటెడ్ డెట్ సెక్యూరిటీలలో చేసిన మదుపు గురించి, నికర నిరర్ధక ఆస్తులు (NPAS- Non Performing Assets) గురించి కూడా ప్రకటించవలసి ఉంది.

కొన్ని మ్యూచువల్ ఫండ్స్ వాటాదారులకు తమ పథకాలలో ఉన్న మొత్తం వాటాల జాబితాలతో కూడిన సమాచారాన్ని త్రైమాసిక వారీ లేఖల ద్వారా పంపుతాయి.

మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయడానికి మరియు ఒక కంపెనీ ప్రాథమికంగా ప్రజల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఇచ్చిన ప్రకటనల ద్వారా వాటిలో మదుపు చేయడానికి /ఏమైనా తేడా ఉందా?

ఉంది. తేడా ఉంది. మదుపరులకు మార్కెట్ పై గల భావన, అవగాహనల (Market sentiment and perception of Investors) ఆధారంగా కంపెనీల యొక్క ఐపిఒలు జారీ చేసే ధర కంటే ఎక్కువ లేదా తక్కువ ధరకు పెట్టుబడులను ఆహ్వానిస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్ల యొక్క ముఖ లేదా మూల విలువ (Par value) యూనిట్ల కేటాయింపు అయిన తర్వాత తక్షణం తగ్గడం కాని పెరగడం కాని జరగదు. మ్యూచువల్ పండ్ పథకాలు సెక్యూరిటీలలో మదుపు చేసేందుకు కొంత సమయం పడ్తుంది. పథకాల యొక్క(NAV- net asset value)ఎన్ఎవి – నికర ఆస్తి విలువ ఆ పథకాలు పెట్టుబడి పెట్టే సెక్యూరిటీ విలువ పై ఆధారపడి ఉంటాయి.

ఒకే స్థాయిలో వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లు పథకాలను అందిస్తూ ఉంటే, ఎవరైనా తక్కువ ఎన్ఎవిగల పథకాలను ఎంపిక చేసుకోవచ్చా?

కొంతమంది మదుపరులు ఎక్కువ ఎన్ఎవిగల పథకాల కంటే తక్కువ ఎన్ఎవిగల పథకాలకు ప్రాముఖ్యత కల్పిస్తూ వాటిలో పెట్టుబడి పెట్టే ఉద్దేశం కల్గి ఉంటాయి. కొన్ని సమయాలలో వారు యూనిట్లు 10 రూపాయల చొప్పున జారీ చేసే కొత్త పథకాలకు ప్రాముఖ్యత ఇస్తారు. అప్పటికే అదే స్థాయిలో ఎక్కువ ఎన్ ఎ వి లకు అందించే పథకాలు అమలులో ఉన్నా మదుపరులు కొత్త వాటినే ఎంచుకుంటారు. మ్యూచువల్ ఫండ్ల పథకాల విషయంలో మదుపరులు ఈ విషయాన్ని గ్రహించాలి. అవేమిటంటే వివిధ రకాల మ్యూచువల్ ఫండ్లు తక్కువ లేదా ఎక్కువ ఎన్ఎవిలకు అందించే ఒకే రకమైన పథకాలకు ఒకదాని కంటే ఒకటి సంబంధం ఉండని విధంగా ఉంటాయి. పై విషయాలు పక్కన పెట్టి మదుపరులు తాము పెట్టుబడి పెట్టేందుకు ఎంపిక చేసుకున్న పథకం యొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క పనితీరు రికార్డు, సేవల ప్రమాణం, వృత్తి నిర్వహణ మొదలైన వాటి ఆధారంగా ఆ పథకంలో మదుపు చేయాలి. ఈ కింద ఆ విషయాన్ని ఉదహరించడం జరిగింది.

ఉదాహరణకు పథకం ‘ఎ’ ఎన్ ఎ వి 15 రూపాయలకు అందుబాటులో ఉండగా పథకం ‘బి’ 90 రూపాయలకు అందుబాటులో ఉందనుకోండి. ఈ రెండు పథకాలు ఈక్విటీ ఆధారిత పథకాలయినప్పటికినీ వీటి పనితీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ రెండు పథకాల్లో మదుపరి 9 వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. పథకం ‘ఎ’లో అతడు 600 యూనిట్లను యూనిట్ 15 రూపాయల చొప్పున 9 వేల రూపాయలకు పొందగా పథకంలో ‘బి’లో అతడు 100 యూనిట్లను యూనిట్ కి 90 రూపాయల చొప్పున 9 వేల రూపాయలకు పొందుతాడు. మార్కెట్ లో వీటి ధర 10 శాతం పెరిగినట్లయితే , ఈ రెండు పథకాలు సమానమైన పనితీరుతో వాటి ఎన్ఎవిలను ప్రతిబింబిస్తాయి. అయితే పథకం ‘ఎ’లోయూనిట్ ఎన్ఎవి రూ11 16.50 లు కాగా పథకం’ బి’లో యూనిట్ ఎన్ ఎవి 99 రూపాయలు గా పెరుగుతుంది. ఈ ప్రకారం పెట్టుబడుల యొక్క మార్కెట్ విలువ రూ11 9900(600 యూనిట్లకి రూ11 16.50 చొప్పున ) పథకం ‘ఎ’లోనూ అదె 9900 రూపాయలకు 100 యూనిట్లకు రూ11 99 చొప్పున ఉంటాయి. అందువలన మదుపరి తాను పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క పథకం మీద 10 శాతం లాభం పొందుతాడు. ఈ కారణంగా పథకాల యొక్క ఎన్ఎవి తక్కువైనా లేదా ఎక్కువైనా మరియు తాను పెట్టుబడి పెట్టదలచిన సొమ్మును తక్కువ సంఖ్య్లో కేటాయింపబడిన లేదాఎక్కువ సంఖ్యలో కేటాయింపబడినాపెట్తుబడి పెట్టే నిర్ణయానికి ఈ అంశాలు పెద్దగా పరిగణనలోనికి తీసుకోవలసిన అవసరం లేదు. అలాగే కొత్త ఈక్విటీ ఆధారిత పథకం 10 రూపాయలకు ఇవ్వడానికి పెట్టుబడులు ఆహ్వానించినట్టయితే మరియు ప్రస్తుతం అమలులోఉన్న పథకం 90 రూ11లకు అందుబాటులో ఉన్నట్లయితే పథకంలో మదుపు చేసే నిర్ణయానికి ఈ అంశాలు పరిగణించనక్కరలేదు. ఇదే విధంగా ఆదాయం లేదా డెట్ ఆధారిత పథకాలకు కూడా ఈ అంశాలను పరిగణించనక్కరలేదు.

ఇది ఇలా ఉండగా, ఎక్కువ ఎన్ ఎ వి తో ఉత్తమ రీతిలో నిర్వహింపబడుతున్న పథకం ఎక్కువ లాభాలు గడించడంతో పోలిస్తే, అలాగే నైపుణ్యం కొరవదిన రీతిలో తక్కువ ఎన్ఎవితో నిర్వహింపబడుతున్న పథకం తక్కువ లాభాలు గడించడం సర్వసాధారణమే. అలాగే ఎన్ ఎ వి లు పడిపోయిన సందర్భాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ ఎన్ ఎ వి లు కలిగి నైపుణ్యంతో కూడి నిర్వహింపబడుతున్న పథకం యొక్క ధర, తక్కువ ఎన్ ఎవి కల్గి నైపుణ్యం కొరవడి నిర్వహింపబడుతున్న పథకం యొక్క ధర పడిపోయినంతగా పడిపోదు. అందువలన మదుపరి వృత్తి నైపుణ్యంతో నిర్వహిస్తున్న పథకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అంతేగాని తక్కువ ఎన్ ఎ వి గల పథకానికి ఎక్కువ ప్రాధాన్యత రాదు. తక్కువ ఎన్ ఎ వి గల పథకంలో అతడు ఎక్కువ సంఖ్యలో యూనిట్లు పొందవచ్చు. కాని ఆ పథకం నైపుణ్యంతో నిర్వహింపబడకపోతే అతడు అధిక లాభాలు పొందలేడు.

ఎన్నో పథకాలు అందుబాటులో ఉండగా మదుపు చేయడం కోసం ఏ పథకం ఎంపిక చేసుకోవాలో ఎలాగ తెలుస్తుంది?

ఇంతకు ముందు చెప్పినట్టుగా, మదుపరులు పెట్టుబడులు పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్లు జారీ చేసిన అమ్మకపు ఆహ్వాన పత్రంలోని పథకాన్ని క్షుణ్ణంగా చదవాలి. వారు ఆ పథకం యొక్క గత పనితీరు రికార్డును దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అలాగే అదే మ్యూచువల్ ఫండ్ యొక్క ఇతర పథకాలను గురించి కూడా తెలుసుకోవాలి. మదుపరులు తాము పెట్టుబడి పెట్టే పథకాల లక్ష్యాలతో సమానమైన లక్ష్యాలు గల ఇతర పథకాల పనితీరును సరిపోల్చు కోవలసి ఉంటుంది. ఒక పథకం యొక్క గత పనితీరు ఆ పథకం యొక్క భవిష్యత్ పనితీరుకు ఎటువంటి కొలబద్ద(indicator)కాదని మరియు గతంలో ఉత్తమ పనితీరు కనబరచినా, భవిష్యత్ లో అలాగే పనితీరు ఉంటుందో , ఉండకపోవడం జరగవచ్చని మదుపరి తాను పథకంలో పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకునే సమయంలో ముఖ్య అంశంగా ఆలోచించవలసి ఉంటుంది. డెట్ ఆధారిత పథకాల విషయంలో , గతంలో వచ్చిన లాభాల పై దృష్టి పెట్టడం కాకుండా మదుపరిడెట్ పత్రాల రేటింగ్ ను ప్రతిబింబించే వాటి నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలి. తక్కువ లాభాలనార్జించే ప్రమాణం గల పథకం ఉత్తమ ప్రమాణ పత్రాలుకలిగి ఉంటే అందులొ మదుపు చేయడం సురక్షితం . అలాగే, ఈక్విటీ పథకాలలో కూడా మదుపరులు నాణ్యత గల వాటాల జాబితాపై దృష్టి పెట్టాలి. మదుపరులు నిపుణుల సలహాలను తీసుకోవచ్చును. 

మ్యూచువల్ ఫండ్ల పథకాల మాదిరిగా కంపెనీలు మ్యూచువల్ బెనిఫిట్ అని పేర్లు కూడా పెట్టుకుని ఉండవచ్చా?

కొన్ని కంపెనీలు మ్యూచువల్ ఫండ్ల లాగే మ్యూచువల్ బెనిఫిట్ అని పేరు పెట్టుకొనవచ్చని మదుపరులు భావించవచ్చు. కాని అటువంటి కంపెనీలు సెబి పరిధి కిందకు రావు. సరిగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్లు సెబి మ్యూచువల్ ఫండ్లుగా తమ పేరు నమోదు చేసుకున్న తర్వాత తాము ప్రవేశ పెట్టబోయే పథకాలకు మదుపరులనుంచి పెట్టుబడులు ప్రోగు చేస్తాయి. 

స్పాన్సర్ హెచ్చు స్థాయి యోగ్యత కల్గి ఉంటే అతడు ఉత్తమ లాభాలు అందించగలడని హామీ ఇవ్వవచ్చా?

మ్యూచువల్ ఫండ్ పథకం జారీ చేసే అమ్మకపు ఆహ్వాన పత్రం లో స్పాన్సర్ గురించి మూడేళ్ళ సమయం యొక్క అతని యోగ్యత , అతని ఆర్ధిక నిర్వహణ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ను అందిస్తున్న కంపెనీ యొక్క పనితీరు రికార్డును మదుపరులు తెలుసుకోవడమే ఈ అంశం యొక్క ముఖ్యోద్దేశం. స్పాన్సర్ యొక్క యోగ్యత హెచ్చు స్థాయిలో ఉంటే పథకం అందించే లాభాలు అదికమౌతాయనుకోవడం సరియైనదికాదు. అలాగే ఎన్ ఎ వి విలువ పడిపోతే, స్పాన్సర్ ఆ విలువకు పరిహారం చెల్లిస్తాడనుకోవడం కూడా సమంజసం కాదు.

మ్యూచువల్ ఫండ పై సమాచారాన్ని మదుపరులు ఎక్కడనుంచి పొందవచ్చో ఎలాగ తెలుస్తుంది?

అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇంచుమించు తమ స్వంత వెబ్ సైట్లు (websites) కల్గి ఉన్నాయి. మదుపరులు అన్ని మ్యూచువల్ ఫండ్ల ఎన్ ఎ వి ల గురించి, అర్ధ సంవత్సరవారీ ఫలితాలు మరియు ఆ ఫండ్ల యొక్క వాటాల జాబితాలు భారత వెబ్ మ్యూచువల్ ఫండ్ల సంఘం (Association of web mutual funds in India) యొక్క వెబ్ సైట్ లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ (ఎఎమ్ఎఫ్ఐ- AMFI) www.amfiindia.com మదుపరులకుపయోగించే సమాచారాన్ని ఎఎమ్ఎఫ్ఐ కూడా ప్రచురిస్తుంది.

సెబి మార్గదర్శకాలు మరియు నియమ నిబంధనల గురించి సమాచారం పొందడానికి మదుపరులు సెబి యొక్క వెబ్ సైట్ www. sebi.gov.inకు log on చేసి మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్ లోకి వెళ్ళవచ్చు. ఈ వెబ్ సైట్ లో మ్యూచువల్ ఫండ్స్ వివరాలు (డేటా), మ్యూచువల్ ఫండ్స్ పొందుపరచిన లిఖిత ఆఫర్ పత్రాలు , మ్యూచువల్ ఫండ్స్ యొక్క చిరునామాలు మొదలైనవి తెలుసుకొవచ్చును. అలాగే ఆ వెబ్ సైట్ లో సెబి యొక్క వార్షిక నివేదికలు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేగాక మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వెబ్ సైట్ లో ఇవ్వబడింది. అదే విధంగా ఎన్నో వెబ్ సైట్లలో వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారంతోబాటు ఆ ఫండ్స్ ఏ కాలానికి ఎంత మొత్తంలో ఆదాయాలు ఇస్తాయో ఇవ్వబడ్డాయి. అలాగే ఎన్నో వార్తా పత్రికలు మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన ఉపయోగకరమైన సమాచారాన్ని రోజువారీ లేదా వారం రోజుల కొకసారి ప్రచురిస్తాయి. మ్యూచువల్ ఫండ్ల సమాచారాన్ని పొందడానికి మదుపరులు ఆ ఫండ్ల ప్రతినిధులను గాని పంపిణీ దారులను గాని సంప్రదించి వారి మార్గదర్శకత్వం పొందవచ్చు.

మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో మదుపు చేసే మదుపరి తన బదులు నామినీ ని నియమించుకోవచ్చా?

వ్యక్తులు వాటాలను పొందడానికి దరఖాస్తు చేసే సమయంలో నామినేషన్ ఇవ్వవచ్చు. అలాగే వ్యక్తులు వాటాలను తమ పేరిట కాని లేదా సంయుక్తంగా కాని కలిగి ఉన్నట్లయితే తమ తరఫున కూడా నామినేషన్ ఇవ్వవచ్చు. వ్యక్తులు కాకుండా ఉన్న సంస్థలు అనగా సంఘం, ట్రస్టు, బాడీ కార్పొరేట్ (body corporate), భాగ స్వామ్య సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబం (Hindu undivided family- HUF) యొక్క కర్త, పవర్ ఆఫ్ అటార్నిటి (holder of power of attorney) గల వారు నామినేషన్ ఇవ్వరాదు. 

మదుపరులు తమ సమస్యలను (పిర్యాదులను) ఏ విధంగా పరిష్కరించుకోగలరు?

మ్యూచువల్ ఫండ్ పథకాల యొక్క పెట్టుబడి ఆహ్వాన పత్రంలో మదుపరులు తమ యొక్క ప్రశ్నలు, పిర్యాదులు లేదా సాధక బాధకాల గురించి ఏ పేరుగల వ్యక్తితో సంప్రదించాలన్న విషయం ఆధారంగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి తమ సమస్యలు పరిష్కరించుకోవాలి. మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలను ఆ మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు పర్యవేక్షిస్తారు . పెట్టుబడి ఆహ్వాన పత్రంలో అస్సెట్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ల పేర్లు మరియు ట్రస్టీల పేర్లు కూడా ఇవ్వబడతాయి. మదుపరులు తమ యొక్క మ్యూచువల్ ఫండ్ లేదా తమ యొఅక్క మ్యూచువల్ ఫండ్ యొక్క మదుపరుల సేవా కేంద్రానికి వెళ్లి తమ పిర్యాదులు చేయవచ్చు. తమ పిర్యాదులు ఇంకా పరిష్కారం కాకపోతే, ఆ మదుపరులు సెబిని సందర్శించి తమ పిర్యాదులకు మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించమని కోరవచ్చు. పిర్యాదులను స్వీకరించిన తర్వాత సెబి (SEBI) ఆ పిర్యాదులకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్ లతో సంప్రదించి క్రమంగా వాటి పరిష్కారం కొసం చర్యలు చేపట్టవచ్చు. మదుపరులు తమ పిర్యాదులను ఈ కింది మూలం/ ఆధారం( సోర్స్) కు కూడా పంపవచ్చు.

ఆధారము: SEBI-FAQ’S

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *