Kisan Credit Card (KCC)Kisan Credit Card (KCC)

కిసాన్ క్రెడిట్ కార్డులు

బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా రైతులకు వారి స్వల్పకాలిక ఉత్పత్తులను సాధించడం కోసం అవసరమయ్యే పనిముట్లు తదితర అవసరాలకు కావాల్సిన సరైనమొత్తాలు, సరైనసమయాల్లో అందించడమే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌  ముఖ్యోద్దేశ్యం. దీనివల్ల రైతులకు ఖర్చుకు తగ్గట్టుగా రుణాలను చెల్లించే వెసులుబాటు కలుగుతుంది.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ పథకం వల్ల లాభాలేమిటి?

– సరళీకృతమైన రుణాల పంపిణీ విధానం.
– డబ్బూ గురించి రైతులు ఇబ్బంది పడనవసరం లేదు
– ప్రతి పంటకీ రుణం కోసం అప్లై చేసుకోనక్కర్లేదు.
– ఖచ్ఛితంగా రుణం దొరుకుతుంది కాబట్టి రైతుకు వడ్డి భారం తగ్గుతుంది.
– విత్తనాలను, ఎరువులను తమకిష్టం వచ్చినపుడు, తాము ఎంచుకొన్నవాటిని కొనుక్కొనె వెసులుబాటు ఉంటుంది.
– డబ్బిచ్చి కొనుక్కోవడంవల్ల వచ్చే డిస్కౌంట్‌లను డీలర్లనుంచి పొందవచ్చు.
– 3ఏళ్లపాటు రుణ సౌకర్యం – ప్రతి సీజనుకీ ఎవరికీ చెప్పనక్కర్లేదు.
– వ్యవసాయ ఆదాయాన్నిబట్టే గరిష్ట రుణ పరిమితి
– గరిష్ట రుణ పరిమితికి లోబడి ఎన్ని సార్లైనా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
– పంటకోత అయ్యాకే రుణాన్ని తిరిగి చెల్లించే అవసరం.
– వ్యవసాయ అడ్వాన్సుకు వర్తించే వడ్డీ రేటే దీనికీ వర్తిస్తుంది.
– వ్యవసాయ అడ్వాన్సుకు వర్తించే సెక్యూరిటీ,  డాక్యుమెంటేషన్‌ షరతులే దీనికీ వర్తిస్తాయి.

 

Who can apply for Kisan Credit Card?

  1. Small & Marginal farmers
  2. Share croppers
  3. Fishermen
  4. People involved in Animal Husbandry
  5. Lessee and tenant farmers
  6. Self Help Groups (SHGs)
  7. Joint Liability Groups (JLGs)

కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ పొందడం ఎలా?

– మీ సమీప పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకుకెళ్లండి. తగు వివరాలు పొందండి.
– అర్హతగల ప్రతి రైతుకూ ఒక కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌, పాస్‌బుక్‌ ఇవ్వడం జరుగుతుంది. అందులో రైతు పేరూ, చిరునామా, భూమి వివరాలూ, గుణ గరిష్ట పరిమితి, కాలవ్యవధి , ఫోటో – అన్ని ఉండి ఒక ఐడెంటిటీ కార్డ్‌గానూ, లావాదేవీలకు రికార్డుగానూ పనికొస్తుంది.
– రుణాన్ని పొందినవారు ఆ కార్డ్‌ను, పాస్‌బుక్‌ను రుణాన్ని పొందే సమయంలో చూపాలి. 

వివిధ లీడింగ్‌ బ్యాంకులిచ్చే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ల పేర్లు

– అలహాబాద్‌ బ్యాంక్‌ కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌
– ఆంధ్రా బ్యాంక్‌ –  ఎ.బి. కిసాన్‌ గ్రీన్‌ కార్డ్‌
– బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా – బి.కె.సి.సి.
– బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కిసాన్‌ సమాధాన్‌ కార్డ్‌
– కెనరా బ్యాంక్‌ కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ – కె.సి.సి.
– కార్పొరేషన్‌ బ్యాంక్‌ కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ -కె.సి.సి.
– దీనా బ్యాంక్‌ కిసాన్‌ గోల్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌
– ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓరియంట్‌ గ్రీన్‌ కార్డ్‌
– పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌  క్రిష్‌ కార్డ్‌
– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ -కె.సి.సి.
– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా -కె.సి.సి.
– సిండికేట్‌ బ్యాంక్‌ – యస్.కె.సి.సి.
– విజయా బ్యాంక్‌ విజయా కిసాన్‌ కార్డ్‌

కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి పర్సనల్ ఏక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్

కిసాన్ క్రెడిట్ కార్డు ( కె సి సి ) ఉన్నవారికిపర్సనల్ ఏక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్(కెసిసి ఉన్న వ్యక్తికి ఒక వేళ ఏక్సిడెంట్ అయితే, నష్ట పరిహారం) ఇవ్వబడుతుంది.

ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు

  • పరిధి ( ఈ స్కీము కవరేజి – అంటే ఎవరెవరికి మరియు ఎంతవరకు వర్తిస్తుందని)   –  ఈ స్కీము  కిసాన్ క్రెడిట్ కార్డు ( కె సి సి ) ఉన్నవారందరికి వర్తిస్తుంది, వీరిలో ఎవరైనా మన  దేశంలో అనుకోని సంఘటన వలన  చనిపోయినా లేదా శాశ్వతంగా వికలాంగులైనా వారికి కవరేజి ఉంటుంది.
  • కవరయ్యే వ్యక్తులు  70 సంవత్సరముల వరకు వయసు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారందరూ.
  • ఏ ప్రమాదానికి ఎంతవరకు కవరేజి ఉంటుంది  ఈ స్కీము క్రింద వచ్చే పరిహారం (రుసుము/డబ్బు) ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
  • బాహ్యంగా  కనిపించే మరియు హింసాత్మకమైన ప్రమాదానికి గురి అయ్యి దుర్మరణం సంభవిస్తే : రూ.50,000/-
  • రూ.50,000/- శాశ్వతమైన మరియు సంపూర్ణమైన వికలాంగతకు గురిఐతే  : రూ.50,000/-
  • రెండు అవయవాలు లేదా రెండు కళ్ళు లేదా ఒక అవయవం మరియు ఒక కన్ను కోల్పోతే: రూ.50,000/-
  • ఒక అవయవం లేదా ఒక కన్ను కోల్పోతే: రూ. 25,000/-.
  • మాస్టర్ పోలసీ (చెల్లుబడి అయ్యే) కాలం/సమయం –  3 సంవత్సరముల వరకు అమలులో ఉంటుంది / చెల్లుబాటు అవుతుంది.
  • ఇన్సూరెన్స్ ( అమల్లో ఉండే) సమయం/కాలం – ఈ ఇన్సురెన్స్ కవరేజి అనేది , ఈ స్కీము లో పాల్గొనే బ్యాంకుల నుండి సంవత్సరపు ప్రిమియమ్ రుసుము అందిన తేది నుండి ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది.  ఒకవేళ అది మూడు సంవత్సరముల ఇన్సురెన్స్ పాలసి అయినట్టైతే , ప్రీమియమ్ రుసుము/డబ్బు  అందిన తారీకు/తేది నుండి మూడు సంవత్సరములు అమల్లో ఉంటుంది.
  • ప్రీమియమ్  కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి ఒక సంవత్సరానికి ప్రీమియమ్ అయిన రూ.15/- లలో, రూ .10/- బ్యాంక్ కట్టవలెను మరియు రూ.5/- కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారి దగ్గరనుండి తీసుకోవలెను.
  • ఆపరేషనల్ విధానం – ఈ వ్యాపార సేవలు జోను ప్రకారం  నాలుగు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అందిచబడతాయి  – యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ  లిమిటెడ్ వారు –  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అండమాన్ మరియు నికోబార్, పాండిచేరీ, తమిళనాడు మరియు లక్ష్యద్వీప్ ప్రాంతాలను   కవరు చేస్తుంది.
  • ఈ పధకాన్ని అమలుచేసే బ్రాంచులు నెల వారిగా ఇన్సూరెన్స్ ప్రీమియమ్ తో పాటు కెసిసి కార్డులు ఇవ్వబడ్డ/అందిచబడ్డ రైతుల జాబితాను నెలవారీగా జమ చేయవలసి ఉంటుంది.
  • క్లెయిము ( పరిహారపు డబ్బు/రుసుమును) అందుకునే విధానంము  చావు , వికలాంగికత్వం క్లెయిములు, మరియు మునిగిపోవుట వలన సంభవించిన మరణానికి :ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్దేశించిన ఆఫీసులలో క్లెయిములు నిర్వహించ బడతాయి. ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించాలి.

How to apply online for Kisan Credit Card?

Have a look at the process to apply online for Kisan Credit Card:

Step 1: Visit the official website of bank – SBI/Axis Bank/PNB/Indian Overseas Bank/Bank of India/HDFC Bank/Others

Step 2: Search ‘Apply for KCC’ online & Download & Print Application Form

Step 3: Fill the KCC form completely

Step 4: Submit the filled form to nearest branch of the Bank

Step 5: Loan Officer will review your form, will issue application reference number

Step 6: Save the application reference number

Step 7: Once the loan is sanctioned, Kisan Credit Card will be dispatched

వ్యవసాయానికి అప్పు

వ్యవసాయ రంగంలో పరపతి బ్యాంకులు

వ్యవసాయం వంటి అనేక ప్రముఖ ఆర్థిక రంగాలకు రుణాలని మంజూరు చేయడంలో బ్యాంకులను జాతీయం చేయడమనేది ముఖ్యమైన సంఘటన. దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతు ఉన్న వ్యవసాయ రంగానికి బ్యాంకుల ద్వారా మరింత ఆర్థికచేయూతనందిస్తేనే అభివృద్ధి సాధ్యమౌతుంది. 2004-05నుంచి మూడెళ్లపాటు వ్యవసాయ రంగానికి బ్యాంకులందించే రుణాలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది . ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై ఉండే శ్రద్ధ వల్ల 11వ పంచవర్ష ప్రణాళికలో ఆ రంగానికి ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. ఇక ఈ బ్యాంకులు ఇస్తున్న రుణ పథ కాలను తగురీతిలో వాడుకొని లబ్ది పొందడం రైతుల వంతయినది. కింద ఇచ్చిన జాబితాలో కొన్ని భారత జాతీయ బ్యాంకులందించే రుణ పథకాలను ఇవ్వడం జరిగింది :

అలహాబాద్ బ్యాంక్ www.allahabadbank.com

  • కిసాన్ శక్తి యోజన పథ కం
  • రైతులు తమకు ఇష్టమొచ్చిన రీతిలో రుణాన్ని వాడుకోవచ్చుఎలాంటి మార్జిన్ అక్కర్లేదు.
  • 50 శాతం రుణమొత్తాన్ని తన వ్యక్తిగత అవసరాలకు లేదా వడ్డీ వ్యాపారులనుంచి తీసుకొన్న రుణాలను తిరిగి
  • చెల్లించడం వంటి ఇతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు.

ఆంధ్రాబ్యాంక్ www.andhrabank.in

  • ఆంధ్రాబ్యాంక్ కిసాన్ గ్రీన్ కార్డ్
  • వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద వర్తింపు

బ్యాంక్ ఆఫ్ బరోడా www.bankofbaroda.com

  • పొడి నేల దున్నడానికి పనికొచ్చే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లను కొనుక్కోవచ్చు
  • వ్యవసాయం, పశుసంపద ముడి సరుకులను అమ్మేవారికి, పంపిణీ చేసేవారికి, వ్యాపారులకూ అవసరమయ్య మూలధ న అవసరాల కోసం
  • వ్యవసాయ యంత్రాలను అద్దె కు తీసుకోవడానికి
  • తోట సేద్యాభివృద్ధికి
  • డైరీ, పందుల పెంపకం, కోళ్ళ పెంపకం, పట్టు పరిశ్రమ వంటి వాటిలో మూలధన అవసరాల కోసం
  • షెడ్యూల్డ్ కులాలు/ తెగలవారికి వ్యవసాయ పనిముట్లు, ఉపకరణాలు, ఎద్దుల జత వంటివాటిని కొనుక్కోవడానికి, సేద్య సౌకర్యాలు కల్పించుకోవడానికి

బ్యాంక్ ఆఫ్ ఇండియా www.bankofindia.co.in

  • ఓరియంటల్ గ్రీన్ కార్డ్ పథ కం(ఓజిసి)
  • వ్యవసాయ రుణాలకై మిశ్రమ రుణ పథ కం
  • కోల్డ్ స్టోరేజీ/ గోడౌన్లను ఏర్పాటు చేసుకోవడం
  • కమీషన్ ఏజెంట్లకు రుణ సహాయం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ www.pnbindia.in

  • పంట రుణాలు, వ్యవసాయం కోసం బంగారంపై రుణాలు
  • వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ రుణాలు
  • కోల్డ్ స్టోరేజీ/ ప్రవేటు వేర్హౌస్లు
  • మైనర్ ఇరిగేషన్, బావుల పథకం/ పాత బావుల అభివృద్ధి పథకం
  • భూముల అభివృద్ధి రుణాలు
  • ట్రాక్టర్, పవర్ టిల్లర్, తది తర పనిముట్ల కొనుగోలు
  • పంట పొలాలు/ బీడు/ వ్యర్థ భూముల కొనుగోలు
  • రైతులకై వాహన రుణాలు
  • డ్రిప్ ఇరిగేషన్, స్ప్రి క్లర్లు
  • స్వయం సహాయ సంఘాలు(సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్)
  • అగ్రి క్లినిక్లు, అగ్రి బిజినెస్ సెంటర్లు
  • యువ కృషి ప్లస్ పథకం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా www.statebankofindia.com

  • స్వ సహాయ సంఘాలకు(సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్) రుణాలు
  • విజయాకిసాన్ కార్డ్
  • విజయాప్లానర్స్ కార్డ్
  • కళాకారులకు, గ్రామీణ పరిశ్రమలకు విఐసి – మార్జిన్ మనీ పథకం

ఉపయుక్తమైన బ్యాంకింగ్ ఇంటర్నెట్ లింక్స్

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *