insuranceinsurance

భవిష్యత్తులో మన ఆరోగ్యానికి, వ్యాపారాలకి, ఆస్థులకి ఏమి ఆపదలు వస్తాయో ఊహించటం కష్టం. మనకు, మన కుటుంబాలకి ధన నష్టం కలిగే అవకాశాల నుండి రక్షణ పొందడాన్ని బీమా (Insurance) చేయటం అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే బీమా అనగా అనుకోని విపత్తు లకు బీమా సంస్ధచే అందచేయబడే ధన సహాయం.

భారీగా రాబోయే నష్టాన్ని పూరించేందుకు ముందుగా చిన్న ఖర్చుని ఇష్టంగా భరించడం బీమా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆస్తిని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని, ఇలా దేనినయినా బీమా చేయవచ్చు. బీమాను విక్రయించే కంపెనీని బీమా సంస్థగా ; బీమా కొనేవారిని బీమాదారు లేక పట్టాదారు లేక పాలసీ దారు అంటారు. బీమా వల్ల లబ్ధి పొందడానికి చెల్లించాల్సిన రుసుము అనగా కిస్తు లేదా ప్రీమియం ను లెక్కకట్టడానికి బీమా నిష్పత్తి ని ఉపయోగిస్తారు.

బీమా ద్వారా మానసికంగా కొంత స్థిమితాన్ని పొందవచ్చు. విపత్తు సంభవిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. దీని కొరకు వినియోగదారు, బీమా సంస్ధతో అనుకోని విపత్తులకి కావలసిన నష్ట పరిహారం, బీమా కాలం, విపత్తు మూలం అవబడే వివరాలు తెలియబరిచి, బీమా సంస్థ ఒప్పందం ప్రకారం ఒకసారి గాని, క్రమ పద్ధతిలో వాయిదాల మీద కాని డబ్బు (ప్రీమియం) చెల్లించాలి. బీమా సంస్థ – చేసుకున్న ఒప్పందం ప్రకారం – విపత్తు సంభవించినపుడు, లేక కాల పరిమితి ముగిసిన రోజున, ఒప్పందం ప్రకారం ఇవ్వ వలసిన ధనం ఇస్తుంది. బీమా ఒప్పందాలు పెట్టుబడితో మిళితం అయి, విపత్తు జరగక పోయినా, కాల పరిమితి ముగిసిసప్పుడు కొంత రాబడిని కలిగించగలవు.

బీమా విధానాల రకాలు.

  1. Life Insurance
  2. Motor insurance
  3. Health insurance
  4. Travel insurance
  5. Property insurance
  6. Mobile insurance
  7. Cycle insurance
  8. Bite-size insurance

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *