goldgold

ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఎదైనా శాఖకు వెళ్ళి సావరిన్ గోల్డ్ బాండ్లను కొనవచ్చు. ఇలా కొంటే బాండ్లను ప్రమాణపత్రాల రూపేణా అందజేస్తారు. ఆ పత్రాలను భద్రపరచుకోవాలి.

ఆన్‌లైన్ అయితే KYC పూర్తైన వారు (షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి పెట్టుబడులు చేసేవారు) బ్యాంకు వెబ్‌సైట్ లేదా డీమ్యాట్ ఖాతా ద్వారా సులువుగా ఈ బాండ్లను కొనవచ్చు. ఇలా కొంటే డిజిటల్ రూపేణా డీమ్యాట్ ఖాతా హోల్డింగ్స్‌లో కొనుగోలు చేసిన బాండ్లను చూడవచ్చు.

ఉదాహరణకు జెరోధాలో 2016లో కొన్న బాండ్లు:

దాని వల్ల వచ్చే లాభ నష్టాలు ఏమిటి?

లాభాలు:

బంగారం నగలు, బిస్కెట్ల రూపంలో కొంటే స్వచ్చత, భద్రపరచే బాధ్యత, ఖర్చు వంటి రిస్కులు ఉంటాయి. గోల్డ్ బాండ్లలో ఈ భయాలు ఉండవు.

999 స్వచ్చమైన బంగారం ప్రమాణికంగా బాండ్లు కేటాయిస్తారు.

బాండ్ల గడువు పూర్తయ్యాక షేర్లను అమ్మినట్టు అమ్మేయవచ్చు – ద్రవ్యత్వ లోపం, బ్రోకరేజీ రుసుము, తరుగు వంటి వృధా ఖర్చులు ఉండవు.

బాండ్ల పెట్టుబడి మొత్తంపై సాలీనా 2.5% వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది.

మెచ్యూరిటీ తరువాత లాభానికి అమ్మేస్తే ఆ లాభంపై ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఉండదు. ఒకవేళ నష్టానికి అమ్మితే ఆ నష్టానికి ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో మినహాయింపు పొందవచ్చు.

బాండ్ల కొనుగోలులో గ్రాముకు 50 రుపాయల డిస్కౌంట్ ఉంటుంది. ఇది మనబోటి రీటైల్ మదుపర్లకు మాత్రమే!

గోల్డ్ బాండ్లు ప్రభుత్వ పూచీకత్తుతో రిజర్వు బ్యాంకు విక్రయిస్తుంది. అందువల్ల భరోసా ఉంటుంది. దివాలా, ద్రవ్యత్వలోపం వంటి మోసాలకు తావు లేదు.

నష్టాలు:

8 సంవత్సరాల మెచ్యూరిటీ గడువు ఉంటుంది. అమ్మేయాలనుకున్న వారికి కొంత రుసుముతో 5 ఏళ్ళ తరువాత అమ్ముకునే సౌకర్యం.

బాండ్లపై చెల్లించే 2.5% వడ్డీని వ్యక్తిగత ఆదాయానికి జోడించి స్లాబు ప్రకారం ఉపయుక్తమైన ఆదాయపు పన్ను చెల్లించాలి.

మెచ్యూరిటీ తరువాత మార్కెట్లో బంగారం ధర మన కొనుగోలు ధరకంటే తక్కువగా ఉంటే నష్టం సంభవం. అయితే ఇది భౌతికంగా బంగారం కొన్నా ఉంటుంది.

సావెరిన్ గోల్డ్ బాండ్స్ – 2021

సావెరిన్ గోల్డ్ బాండ్లపై వివరాలకు

ప్రభుత్వం జారీ చేసే గోల్డ్ బాండ్ల నోటిఫికేషన్ ప్రకారం కొత్తగా ఈ బాండ్లలో పెట్టుబడికి తేదీలు:

మే 17న మొదలయ్యే ట్రాంచ్‌కు గాను 24 కారట్ల బంగారం గ్రాము ధర 4,777 రుపాయలుగా నిర్ణయించారు. దానిపై రీటైల్ మదుపర్లకు (మనకు) గ్రాముకు 50 రుపాయల డిస్కౌంట్ వర్తిస్తుంది. అంటే ఒక గ్రాము 4727 రుపాయలకు కొనుగోలు చెయ్యవచ్చు.

కనీస పెట్టుబడి 1 గ్రాము, గరిష్టం 4కీజీలు.

పెట్టుబడి మొత్తంపై ఏటా 2.5% వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ వడ్డీ వ్యక్తిగత ఆదాయానికి కలిపి స్లాబు ప్రకారం పన్ను కట్టవలసి ఉంటుంది.

మెచ్యూరిటీ 8 ఏళ్ళ తరువాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, లాభంపై ఎలాంటి పన్ను ఉండదు. అయిదేళ్ళ తరువాత అత్యవసరమైతే అమ్ముకోవచ్చు కానీ పన్ను మినహాయింపు ఉండదు.

డీమ్యాట్ ఖాతా ఉన్నవారు ఆ ఖాతా నుండి నేరుగా బాండ్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు జెరోధాలో ఖాతా ఉన్నవారు కింది లంకె ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు:

 జెరోధా లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇక్కడే ఈ లింక్ మీద క్లిక్ చేయండి

డీమ్యాట్ ఖాతా లేనివారు ఏదైనా ప్రముఖ బ్యాంకు శాఖకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *