education loaneducation loan

విద్యా సంబంధిత ఋణాలు:

భారత దేశం మరియు విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునేవారికి అందించే ఋణాల ప్రణాళిక యొక్క సవరించిన నమూనా

ఉపోద్ఘాతం

ఏ దేశంలోనైనా మానవ వనరుల అభివృద్ధి కైనా, అధికారం పొందడానికైనా విద్యయే ప్రమాణం. జనాభా యొక్క ప్రధానమైన ఈ అవసరాన్నితీర్చేందుకు ప్రభుత్వ, మరియు ప్రైవేట్ రంగాలలో తగిన సంస్థల ద్వారా ప్రోత్సాహాలు కల్పించే నిమిత్తం జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో విధి విధానాలు రూపొందించారు. ప్రతి ఒక్కరికి సార్వత్రిక ప్రాథమిక విద్య అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుండగ, ఉన్నత విద్యాభివృద్ధి ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నది. ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం అందించే సాయం క్రమేపీ తగ్గుతుండగా, దీనికయ్యే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆర్ధిక సంస్థలు చేయూత నివ్వవలసిన అవసరమేర్పడింది. దేశంలోను, విదేశాలలోను ఉన్నత విద్యారంగం విస్తరించి వివిధ రకాల సరికొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. మానవ వనరుల అభివృద్ధి జాతీయ లక్ష్యంకాగా ఉన్నత విద్యనభ్యసించే యోగ్యతగల విద్యార్ధులు ఆర్ధిక కారణాల దృష్ట్యా విద్యనభ్యసించే అవకాశం కోల్పోరాదన్నదే ప్రభుత్వ దృఢ సంకల్పం.

ఆర్ధికాభివృద్ధి మరియు సౌభాగ్యం కోసం విద్యా సంబంధమైన ఋణాలు పెట్టుబడిగా అందించాలన్నదే ముఖ్యోద్ధేశం . రాబోయే కాలంలో విజ్ఞానం, సమాచార సేకరణలో ఆర్ధికాభివృద్ధి సాధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

భారతదేశ ప్రభుత్వంచే నియమింపబడిన్ ఒక అధ్యయన బృందం ఇచ్చిన సూచనల మేరకు, విద్యా సంబంధిత ఋణాల పథకం నమూనాను 2001 సంవత్సరంలో భారతీయ బ్యాంకు సంఘం (IBA) తయారుచేసింది. భారత ప్రభుత్వం సూచించిన కొన్ని సవరణలతో ఈ పథకంను దేశంలోని అన్ని బ్యాంకులు అమలుపరచాలని భారతీయ రిజర్వు బ్యాంకు ఏప్రిల్ 28, 2001 వ తేదిన సర్క్యులర్ సంఖ్య ఆర్ పిసిడి .పి ఎల్ ఎన్ ఎఫ్ ఎస.బిసి.ఎన్ ఒ.83/06.12.05/2000-01తేదీన్ జారీ చేసింది. 2004-05వ సంవత్సరం యొక్క తన బడ్జ్ ట్ ప్రసంగంలొ గౌరవనీయులైన ఆర్ధిక శాఖామాత్యులు చేసిన ప్రకటనకు అనుబంధంగా 4 లక్షల రూపాయలకు పై బడి మరియు 7.5 లక్షలరూపాయల పరిధిలోకి వచ్చే అన్ని ఋణాల జారీలో హామీ(security)నిబంధనల వర్తింపులో కొన్ని సవరణలు చేసినట్టు ఐ బి ఎ తెల్పింది.

పై పథకంలలోని వివిధ్ అంశాలపై బ్యాంకు శాఖలు అందించే సమాచారం ఆధారంగా సభ్యులు వివరణలు కోరుతూ ప్రశ్నిస్తున్నట్టు తెలిపింది. ఎట్టి పరిస్థితులలోనైనా ఈ పథకాన్నిఅమలు చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని, బ్యాంకు శాఖలలో దీనిని అమలు సులభతరం చేసేందుకై పథకాన్ని పునః సమీక్షించి అవసరమైనచోట్ల మార్పులు చేసె నిర్ణయం గైకొన్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన బ్యాంకులలోని జనరల్ మేనేజర్లతో ఒక ప్రత్యేక బృందాన్ని ఐ బి ఎతో ఏర్పాటు చేసారు. ఈ బృందం చేసే సూచనల ఆధారంగా సవరించిన పథకం నమూనాను రూపొందించారు.

పథకం ఉద్దేశాలు

దేశ విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేయగోరు ప్రతిభావంతులు, యోగ్యులైన విద్యార్ధులకు ధన సహాయం కల్పించడమే బ్యాంకింగ్ రంగం యొక్క ముఖ్యోద్దేశం. విద్యా సంబంధిత ఋణ పథకం ఉద్దేశాలు, వాటి వివరాలు ప్రతి ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి పేదవాడయినప్పటికి, తన విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం కల్పించడమే ముఖ్యోద్దేశంగా బ్యాంకింగ్ వ్యవస్థ సులభతరమైన నియమనిబంధనలతో ఆర్థిక సాయం అందజేస్తోంది. ఆర్థిక కారణాల దృష్ట్యా ప్రతి ప్రతిభావంతుడైన విద్యార్థికి ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కోల్పోరాదన్నది ఈ ఋణ పథకం ఉద్దేశం.

ఈ పథకం వర్తించే విధానం

అన్ని వాణిజ్య బ్యాంకులు ఈ పథకాన్ని అమలు చెయ్యటానికి విధానాల వివరణ. ఈ విద్యా సంబంధమైన ఋణ పథకం అమలు పర్చడంలో బ్యాంకులు నిర్వహించవలసిన మార్గనిర్దేశక సూత్రాలు ఈ కింద వివరించబడినవి. అంతేకాక ఖాతాదారులతో మెరుగైన స్నేహ సంబంధాలు నెలకొల్పుకొనే సందర్బంలో విద్యార్దులకు, వారి తల్లిదండ్రులకు అనువైన రీతిలో ఋణాలు మంజూరు చేసే సమయంలో బ్యాంకులు ఈ మార్గనిర్దేశిత సూత్రాలను తమ ఇచ్చానుసారం మార్చుకొనే నిర్ణయాధికారం కల్పించబడింది.

ఈ పధకం వివరాలు కింద ఇవ్వబడ్డాయి

యోగ్యతా ప్రమాణాలు

విద్యార్ధి భారతీయుడై వుండాలి.
దేశ విదేశాల్లో ప్రవేశ పరీక్ష / ప్రతిభ ఆధారిత ఎంపిక ద్వారా వృత్తి / సాంకేతిక కోర్సులో ప్రవేశం పొందివుండాలి.

యోగ్యత కల కోర్సులు

దేశంలో చదువదగిన కోర్సుల జాబితా:

గ్రాడ్యుయేషన్ కోర్సులు: బి.ఎ, బి. కాం, బి.ఎస్.సి మొదలైనవి
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు: మాస్టర్స్ ( స్నాతకోత్తరవిద్య) / పి. హెచ్ డి
వృత్తి విద్యాకోర్సులు: ఇంజనీరింగ్, వైద్యం, వ్యవసాయం, పశు వైద్యం, న్యాయ, దంత వైద్యం, మేనేజ్ మెంటు, కంప్యూటర్ మొదలైనవి.
కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సులు: ఎలక్ట్రానిక్స్ విభాగానికి అనుసంధానం చేయబడిన ప్రముఖ సంస్థలు అందిచేవి లేదా విశ్వవిద్యాలయంకు అనుబంధ విద్యాసంస్థలు అందించేవి.
ఐ సి డబ్ల్యూ ఎ, సి. ఎ , సి. ఎఫ్. ఎ లాంటి కొర్సులు
ఐ. ఐ. ఎమ్ ; ఐ. ఐ. టి ; ఐ. ఐ. ఎస్ సి ; ఎక్స్. ఎల్. ఆర్ ఐ ; ఎన్. ఐ ఎఫ్ టి లాంటి సంస్దలు నిర్వహిస్తున్నకోర్సులు
డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ / షిప్పింగ్ వారిచే ఆమోదించబడిన ఏరోనాటికల్ , పైలట్ ట్రైనింగ్ , షిప్పింగ్ మొదలయిన రెగ్యులర్ డిగ్రి/ డిప్లమో కోర్సులు ఈ దేశంలో చదివేట్లయితే, విదేశాలలో అయితే అక్కడి స్ధానిక ఏవియేషన్ / షిప్పింగ్ వారిచే గుర్తించబడి ఆమోదించబడాలి.
విదేశీ విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో అందించే కోర్సులు.
అనుమతి పొందిన సంస్థలందించే సాయంత్రం కోర్సులు.
యు జి సి / ప్రభుత్వం / ఎ. ఐ. సి. టి. ఇ / ఎ. ఐ. బి. ఎమ్ . ఎస్ / ఐ. సి. ఎమ్ . ఆర్ మొదలైన సంస్థలచే అనుమతి పొందిన విశ్వ విద్యాలయాలు , కళాశాలలు నిర్వహించే డిగ్రి / డిప్లమా మొదలైన వాటిలో చేరేందుకు నిర్వహించే కోర్సులు.
జాతీయ సంస్థలు , ప్రముఖ ప్రైవేటు సంస్థలు అందించే కోర్సులు భవిష్యత్తులో ఉపయోగపడే లేదా గుర్తింపు పొందే కోర్సులను నిర్వహించే సంస్థల కోర్సులు బ్యాంకులు అనుమతించగల్గితే
పైన పేర్కొన్న జాబితాలో లేని కోర్సులకు బ్యాంకులు తమ దృష్టిలో గుర్తింపు ఇచ్చినట్టయితే
వినియోగ సంస్థలు భవిష్యత్తులో గుర్తించే పద్దతిలో విద్యా సంబంధిత ఋణాలను ఈ పథకం పరిధిలో మంజూరుచేస్తారు.

బి.విదేశీ చదువులు

గ్రాడ్యుయేషన్ : ఉపాధి అవకాశాలు గల వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులు
ప్రముఖ విశ్వవిద్యాలయాలు అందించే కోర్సులు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ : ఎమ్ సి ఎ ; ఎమ్ బి ఎ ; ఎమ్ ఎస్ మొదలైనవి.
లండన్ లోని సి ఐ ఎమ్ ఎ , అమెరికా సంయుక్త రాష్ట్రాలు ( యు ఎస్ ఎ) లోని సి. పి. ఎ మొదలైనవి.

ఏఏ ఖర్చులకు ఋణాలు ఇస్తారు

  • కళాశాల/పాఠశాల/వసతి సదుపాయాలకయ్యేఖర్చు
  • పరీక్ష / గ్రంధాలయం / ప్రయోగశాలలకయ్యేఖర్చు
  • పుస్తకాలు / పరికరాలు / పనిముట్లు / దుస్తుల కొనుగోలుకయ్యే ఖర్చు
  • పూచీ ధరావతు (caution deposit), భవన నిధి, విద్యాసంస్థకు చెల్లించే తిరిగి ఇవ్వబడే ధరావతు సంస్థ మద్దతుతో విద్యార్ధి చెల్లించిన బిల్లులు / రశీదులు అయితే ఈ బిల్లులు, రశీదులు పూర్తి విద్యాభ్యాసం కాలపరిమితి అయ్యే ట్యూషన్ ఫీజులో 10 శాతం మొ త్తానికి మించకుండా ఉండాలి.
  • విదేశాలలలో విద్యాభ్యాసానికి అయ్యే ప్రయాణ ఖర్చులు
  • కంప్యూటర్ల కొనుగోలు కోసం- కోర్సు పూర్తిచేయడానికి అవసరం ఉండి ఉంటే
  • ఋణం పొందే విద్యార్ధి కట్టవలసిన బీమా ప్రీమియమ్
  • విద్యాభ్యాసం పూర్తిచేసే సమయంలో వెళ్ళే అధ్యయన ప్రయాణాలు, పథక పనులు, సిద్ధాంత వ్యాసాలు మొ దలైన వాటికయ్యే ఖర్చు.

అందించే ఋణపరిమాణం:

పొందిన ఋణాలను తిరిగి చెల్లించే సామర్ధ్యంగల విద్యార్ధులు/వారి తల్లిదండ్రులకిచ్చే అవసరమైన ఋణ సదుపాయ గరిష్ట పరిమితి, మొ త్తం మంజూరు చేసే ఋణం

  • భారతదేశంలో విద్యాభ్యాసానికి-10 లక్షల రూపాయల వరకు
  • విదేశాలలలో విద్యాభ్యాసానికి-20 లక్షల రూపాయల వరకు

మార్జిన్

4 లక్షలరూపాయల వరకు – ఏమీలేదుఏమీలేదు
భారతదేశంలో5 శాతం
విదేశాలలో15 శాతం
  • ఈ ఋణానికి కావలసిన మార్జిన్ లో ఉపకారవేతనం/అసిస్టెంట్ షిప్ మొత్తం కలిపి ఉన్నది.
  • తీసుకున్న ఋణం మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం(మొదటి ,రెండవ సంవత్సరాలు కలిపిన రీతిలో) ఋణాలు మంజూరుచేసే సమయంలో మార్జిన్ లో కలిపి లెక్కింపు చేయబడును.

హామీ

4 లక్షల రూపాయల వరకుతల్లిదండ్రులను బాధ్యులుగా చేయడం
హామీ అవసరం లేదు
4 లక్షలరూపాయలకు మించి 7.5 లక్షలవరకుతల్లిదండ్రులను బాధ్యులుగాచేస్తూ, మూడవ వ్యక్తి పూచీకత్తుపై బ్యాంకు అధికారులు తమ యొక్క స్వయం నిర్ణయంపై మూడవ వ్యక్తి పూచీకత్తు అవసరం లేకుండానే ఋణం పొందే విద్యార్ధి తల్లిదండ్రులఆస్తులు,ఆదాయంపై తాను సంతృప్తి చెందితే తల్లిదండ్రులను, ఋణం పొందే విద్యార్ధిని బాధ్యులు చేస్తూవారి నుండి వారు సంతకం చేసిన పత్రాలను తీసుకుని ఋణం మంజూరు చేయవచ్చు.
7.5 లక్షలరూపాయలకు మించినచోఋణం పొందే విద్యార్ధి, అతని తల్లిదండ్రులను బాధ్యులను చేస్తూ ఋణానికి తులతూగు స్థిరాస్తులతోపాటు ఋణం పొందే విద్యార్ధి తన విద్యాభ్యాసంపూర్తి చేసిన పిదపభవిష్యత్తులో తాను పొందే ఆర్జనతో ఋణాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించే విధంగా అంగీకరించిన పత్రాలతో.

నోట్స్:

  • ఋణపత్రాలపై ఋణం పొందే విద్యార్ధి అతని తండ్రి లేదా తల్లి /సంరక్షకుడు ఉభయులు ఋణగ్రహీతలుగా చెల్లించే బాధ్యత వహిస్తూ తిరిగి చెల్లిస్తామని సంతకం చేయవలసి ఉంటుంది.
  • ఋణం పొందినప్పుడు హామీగా స్థలం / భవనం / ప్రభుత్వ హామీలు / ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన బాండ్లు / యుటిఐ యూనిట్లు,జాతీయ పొదుపు పత్రాలు(ఎన్ ఎస్ సి), కిసాన్ వికాస్ పత్రాలు(కెవిపి), జీవిత బీమా పాలసీ, బంగారం, షేర్లు / మ్యూచువల్ ఫండ్ యూనిట్లు / ప్రభుత్వం జారీ చేసే ఋణపత్రాలు (డిబెంచర్లు)/బ్యాంకు డిపాజిట్లు(విద్యార్ధి, అతని తల్లి లేక తండ్రి/సంరక్షకుడు లేదా మరెవరైనా మూడవ వ్యక్తి పేరిట ఋణ మొత్తానికి తులతూగే మొత్తం సొమ్ముకి సంబంధించినట్టు ఉండాలి)
  • ఏ సందర్భంలోనైనా స్థలం/భవనం లేదా ఇల్లు ఇంతకు ముందే తాకట్టలో ఉన్నట్లయితే అందులో తాకట్టు పెట్టని భాగాన్ని హామీగా పెట్టవచ్చును. దీనిని ఋణం మొత్తానికి చెల్లించే హామీకి మద్దతుగా సమర్పించవచ్చు.
  • కంప్యూటర్ కొనుగోలు కోసం ఋణం పొందిన పక్షంలో బ్యాంకునకు ఆ కంప్యూటర్ ను హామీగా సమర్పించాలి.

వడ్డీ రేటు

4 లక్షల రూపాయల వరకుబిపిఎల్ ఆర్
4 లక్షల రూపాయలకు మించినచోబిపిఎల్ ఆర్ +1%
  • ఋణం చెల్లించేందుకు ఇచ్చిన గడువు ( repayment holiday)/చెల్లింపు నిలుపుదల కాలావధి(moratorium period)లో సాధారణ వడ్దీ చెల్లించవలసి ఉంటుంది.
  • శాఖాపరంగా బ్యాంకులు ఇచ్చిన ఋణాలపై అపరాధ వడ్డీని చెల్లించమని కోరవచ్చును.

ఋణాల విలువ/ మంజూరు/పంపిణీ

  • సాధారణ పరిస్థితులలో ఋణం మంజూరు చేసే సమయంలో విద్యార్ధి భవిష్యత్తులో పొందే ఆదాయం ఆధారంగా ఋణం మంజూరు చేస్తారు. అవసరమైన పరిస్థితులలోతల్లి లేదా తండ్రి/సంరక్షకుని ఆదాయ వనరులను మదింపు చేసి ఋణగ్రహీతల చెల్లింపు సామర్ధ్యాన్ని ఆధారంగా చేసుకుని ఋణాన్ని మంజూరు చేస్తారు.
  • ఋణాలను మంజూరు చేసేటప్పుడు ఋణగ్రహీత తల్లిదండ్రుల నివాసం దగ్గరలోవున్న బ్యాంకు అధికారులకు అధికారం ఇవ్వబడుతుంది.
  • విద్య సంబంధ ఋణానికి వచ్చిన దరఖాస్తును ఋణం మంజూరుచేసె బ్యాంకు అధికారి తనపై అధికారితో సంప్రదించకుండా నిరాకరించకూడదు.
  • ఋణాన్ని మంజూరు చేసే సందర్భంలో ఋణగ్రహీత్ అవసరాన్ని బట్టి అతని కోరిక మేరకు విద్యాసంస్థలకు /పుస్తక విక్రేతలకు/అవసరమైన పరికరాలు/పనిముట్లను దృష్టిలో ఉంచుకొని మంజూరు చేస్తారు.

ఋణాల తిరిగి చెల్లింపు

ఋణాల తిరిగి చెల్లింపునకు ఇచ్చిన గడువు / కాలావధివిద్యాభ్యాసం పూర్తికాలం+1 సంవత్సరం లేదా ఉపాధి పొందిన ఆరునెలల తర్వాత ఏది ముందయితే ఆ కాలం

ఋణం తిరిగి చెల్లించే కాలం ప్రారంభం అయిన సమయంలో 5 నుంచి ఏడేళ్లలోపు ఋణాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఏదై నా సందర్భంలో విద్యార్ధి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేయవలసిన కాలంలో పూర్తి చెయ్యలేని పక్షంలో విద్యాభ్యాసం మరో రెండేళ్లలో పూర్తిచేసేవరకు ఋణాన్ని చెల్లించమని కోరకుండా అనుమతి నివ్వవచ్చును. విద్యార్ధి తన విద్యాభ్యాసాన్ని నియంత్రణలో పెట్టలేని కారణం వలన పూర్తి చేయలేక పోయినట్లైతే ఋణం మంజూరు చేసిన అధికారి కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన కాలాన్నిపొడిగించు నిర్ణయాధికారం కల్గి ఉంటారు.

  • ఋణం చెల్లించడానికి ఇచ్చిన గడువు సమయం(repayment holiday period)లో గణించబడిన వడ్డీ మొత్తం(accured interest) ను తీసుకున్న ఋణమొ త్తము(principal)నకు కలిపి చెల్లించవలసిన వాయిదాలు వాటి మొత్తాన్ని సమానంగా ఖరారు చేస్తారు(equated monthly instalments-EMI) .
  • విద్యాభ్యాసంచేస్తున్నసమయంలోనే,ఋణం చెల్లించవలసిన గడువు కాలమునకు ముందుగానే వడ్దీచెల్లించినచోఈ పథకంలో పేర్కొన్న విథంగా 1 శాతం వడ్దీమాఫీ ఋణగ్రహీతలకు కల్పించబడుతుంది.

జీవితబీమా

విద్యాసంబంధమైనఋణాలు ఉపయోగిచుకునేవిద్యార్ధులకు బ్యాంకులు జీవితబీమాసదుపాయం కల్పిస్తాయి. జీవితబీమా కంపెనీలలో శాఖాపరంగా వివిధ బ్యాంకులు తమ ఒప్పందాలను కుదుర్చుకోవచ్చును.

ఋణగ్రహీతలైన విద్యార్ధుల అనుక్రమం/జాడ తెలుసుకోవడం

విద్యాసంబంధమైనఋణాలను పొందిన విద్యార్ధులయొక్క విద్యాభ్యాసం గురించి ప్రగతి నివేదిక ద్వారా వారి ప్రతిభను అంచనా వేసేటందుకు విద్యార్ధులు చదువుకుంటున్న కళాశాలలు/విశ్వవిద్యాలయాల అధికారులను సంప్రదించి తెలుసుకునేహక్కు బ్యాంకు అధికారులు కల్గి ఉన్నారు. విదేశాలలో చదివే విద్యార్ధుల గురించి ప్రత్యేక వ్యక్తిగత గుర్తింపు కార్డు/గుర్తింపుకార్డు ద్వారా సమాచారాన్ని తెలుసుకునిబ్యాంకురికార్డులలో నమోదు చేసుకోవచ్చును.

ఋణ మంజూరుచేసేందుకుచెల్లించవలసిన చార్జీలు

భారతదేశంలో విద్యాసంబంధమైన ఋణాలు మంజూరు చేసేటందుకు ఏ రకమైన రుసుము చెల్లించనవసరంలేదు.

సామర్ధ్యతా సర్టిఫికేట్

విదేశాలలో విద్యాభ్యాసంచేయగోరు విద్యార్ధులకు బ్యాంకులు చెల్లింపు సామర్దత సర్టిఫికేట్ జారీచెయ్యవచ్చు. అవసరమైతే దరఖాస్తు దారు వద్దనుంచి సామర్ధ్యత నిరూపించుకునే పత్రాలు, ఆస్తుల పత్రాలను బ్యాంకులు పొంది ఈ సర్టిఫికేట్ ను ఇవ్వవచ్చు.

కొన్ని విదేశీ విశ్వ విద్యాలయాలు తమ సంస్థలో విద్యాభాసం చేయగోరే విద్యార్ధి ఆర్ధిక స్థోమత, సామర్ధ్యం గురించి ఆ విద్యార్ధి యొక్క బ్యాంకు నుంచి సర్టిఫికేట్ కోరవచ్చు. విద్యార్ధి తన పూర్తి కాల విద్యాభ్యాసానికి అయ్యేఖర్చులను చెల్లించగలలడన్న హామీని వారు ఆ విద్యార్ధి ని సిఫారస్ చేసే వారి వద్ద నుంచి పొందగో ర్తారు.

తదితర నిబంధనలు

ఎ. ప్రతిభావంతులైన విద్యార్ధులు

అత్యధిక ప్రతిభ/యోగ్యతగల విద్యార్ధి నుంచి ఎటువంటి హామీ పొందకనే బ్యాంకు అధికారులు తమ ఉన్నతాధికారులకు ఆ విద్యార్ధు ల ఋణాల మంజూరు గురించి సి ఫారసు చేయవచ్చు .

బి. బహుళ ఋణాలు

కుటుంబం నుంచి విద్యా సంబంధమైన ఋణాలు ఒకటికి మించి ఎక్కువ దరఖాస్తులు వచ్చినచో ఆ కుటుంబాన్ని ఒకే యూనిట్ గా పరిగణించి ఋణ మంజూరు విషయంలో మంజూరు చేసే మొత్తం ఋణానికి హామీని విద్యార్ధులు/తల్లిదండ్రులు తిరిగి చెల్లించే సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఋణాన్ని మంజూరు చేస్తారు.

సి. కనిష్ట వయోపరిమితి

విద్యా సంబంధమైన ఋణ మంజూరు విద్యార్ధి వయస్సు కు ప్రత్యేకమైన పరిమితి ,నిబంధనలు ఏమియు వర్తించవు.

డి. చిరునామా మార్పు

ఋణ గ్రహీతలైన విద్యార్ధి తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే సందర్భాలలో వారి యొ క్క చిరునామాను భవిష్యత్తులో ఋణగ్రహీత లతో సంప్రదింపులు జరిగేందుకు బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు తమ కంప్యూటర్ లో నమోదు చేసుకోవచ్చు .

ఇ ఋణాలకు ప్రాధాన్యత

గరిష్ట వయో పరిమితికి లోబడి పొందిన ఋణాలను సకాలంలో చెల్లించగలిగే గల విద్యార్ధు లకు తమ విద్యాభ్యాసం కొనసాగింపునకు బ్యాంకులు హెచ్చు ఋణము మంజూరుకు ప్రాధాన్యత నిస్తాయి .

సహ బాధ్యులు

ఋణగ్రహీతయిన విద్యార్ధి తల్లి/తండ్రి)/సంరక్షకుడు ఋణ చెల్లింపునకు సహ బాధ్యత వహించవలసి ఉంటుంది.పెండ్లి అయిన వ్యక్తి అయినచో ఋణగ్రహీత భార్యగాని భర్తగాని లేదా వారి తల్లిదండ్రులు,అత్తమామలు ఋణం చెల్లింపునకు సహబాధ్యులవుతారు.

బేబాకీ ధృవీకరణ పత్రం

విద్యా సంబంధమైన ఋణాల మంజూరు కోసం తనకు ఏ బకాయిలు లేవని ఋజువుచూపే పత్రాన్ని సమర్పించాలని కోరే నిబంధన ఏదీ వర్తించదు. అయితే బ్యాంకులు ఋణం కొరే అభ్యర్ధుల నుంచి తాము గతంలో ఏ బ్యాంకు లో ఋణాలు పొందలేదన్న వాగ్మూలం లేదా ప్రమాణం చేసే పత్రాన్ని ఖాయపరచడం.

దరఖాస్తుల పరిష్కారం

ఋణాల మంజూరు కోరుతూ వచ్చిన దరఖాస్తు లను 15 రోజుల నుంచి ఒక నెలలోపు పరిష్కరించాలి.ఋణాల మంజూరు ప్రాధాన్యత నిబంధనలకు లోబడి ఋణాలు కోరుతూ వచ్చి న దరఖాస్తు లను నిబంధనలలో పేర్కొన్న సమయానికల్లా పరిష్కరించాలి.

నిబంధనలలో సడలింపు

యోగ్యత,మార్జిన్(ఉపాంత),హామీ నిబంధనలు మొ దలైన ప్రమాణాలను సడలించేందుకు బ్యాంకు అధికారులు ఒక్కొక్క విషయంకలో తమ పై అధికారుల నిర్ణయానికి నిబంధనలను సడలించవచ్చు.

సర్క్యు లర్లు

ఆధారము: లభించు చోటు( మూలం): భారతీయ బ్యాంకుల సంఘం(ఐబిఎ)

వివిధ బ్యాంకుల విద్యాసంబంధితఋణపథకాలు

ఆధారము: ఉన్నత విద్యాశాఖ

By admin