స్టాక్ మార్కెట్ లో మదుపు చేసే వారు ఎప్పటి కపుడు తమ వద్ద వున్న షేర్ల స్తితి గతులు గురించి తెలుసు కుంటుండాలి.విశ్లేషకులు చెప్పారు కదా అని దీర్ఘ కాలిక వ్యూహం తో షేర్లను కొని వాటి సంగతి మర్చిపోకూడదు.
ఇప్పుడు లావాదేవీలు అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో జరుగుతున్నాయి కాబట్టి షేర్లను కొనుగోలు చేయగానే డీ మ్యాట్ ఖాతా కు మార్పించు కోవడం మంచిది .కొంత మంది ఇన్వెస్టర్లు డీమ్యాట్ ఖాతా ఉన్నప్పటికీ బ్రోకర్ దగ్గరే ఎక్కువకాలం షేర్లను ఉంచుతారు.ఇది మంచి పద్ధతి కాదు.ఫీజు భారం ఉన్నప్పటికీ షేర్లు మన డీమ్యాట్ ఖాతాలో వుంటే షేర్లకు భద్రత వుంటుంది.షేర్ తాలుకు కంపెనీ డివిడెండ్ ,బోనస్ ప్రకటిస్తే అవి మనకే అందుతాయి.కాబట్టి ఎక్కువ కాలం షేర్లను హోల్డ్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు షేర్లను కొనగానే డీమ్యాట్ ఖాతాలోకి మారిపించుకోవడం మంచిది. షేర్లు డీ మ్యాట్ లో ఉన్నంత మాత్రాన ఇక నిర్భయం గా ఉండొచ్చుఅనుకోవడం కూడా పొరపాటే. షేర్లను డీమ్యాట్ లో వుంచి మరచి పోవడం కూడా ప్రమాదమే.కొనుగోలు చేసిన షేర్లు ట్రేడ్ అవుతున్నాయా ?లేదా ఇన్వెస్టర్లు చెక్ చేసుకోవాలి. చాలా కంపెనీలు మఖలో పుట్టి పుబ్బలో
మాయమవుతుంటాయి. స్టాక్ ఎక్స్చంజ్ నిబంధనలు పాటించక డీ లిస్టు అయిపోతుంటాయి.ఒక కంపెనీ డీ లిస్టు అయితే దాని తాలుకు షేర్లు ట్రేడ్ అవవు.అంటే షేర్ తాలుకు కొటేషన్ కన్పించదు. కొటేషన్ కన్పించక పోతే ఆ షేర్లను అమ్ముకోవడం కష్టమే.
అలాంటి పరిస్తితిలో షేర్లు మన వద్ద ఉండి కూడా ప్రయోజనం లేదు. కష్టార్జితం అంతా బూడిదలో పోసినట్టే అవుతుంది. ఇది ఇన్వెస్టర్లు ఊహించని రిస్క్ కాబట్టి జాగ్రత్త గా వుండాలి,ఎప్పటికపుడు కొను గోలు చేసిన షేర్ల తాలుకూ కొటేషన్లు కన్పిస్తున్నాయా ? లేదా ?చెక్ చేసు కోవాలి. ఈ సందర్భం గా డీ లిస్టు గురించి తెలుసుకుందాం.డీ లిస్టు చేయడం అంటే ఏ స్టాక్ ఎక్స్చంజ్ లో షేర్లు లిస్టు అయ్యాయో అక్కడ షేర్ల అమ్మకాలు కొనుగోళ్లను అనుమతించిన షేర్ల జాబితా నుంచి తొలగించడం .డీలిస్ట్
కి కారణాలు ఎన్నో వుంటాయి .ముఖ్యం గా లిస్టింగ్ ఒప్పందం లోని నిబంధనలను షేర్ తాలుకు కంపెనీ అమలు చేయక పోవడం.నిర్ధారిత కాల వ్యవధి లో ఆర్ధిక ఫలితాలు ప్రకటించక పోవడం ,ప్రతి ఏటా రుసుములు చెల్లించ లేక పోవడం, ఇన్వెస్టర్ల సమస్యలు పట్టించుకోక పోవడం వంటి నిబంధనలు పాటించక పోతే ఏ కంపెనీ అయినా డీ లిస్టు అయి పోతుంది. అయితే ముందుగా హెచ్చరిక చేస్తూ నిబంధనలు అమలు చేయమని కంపెనీ లకు నోటీసులు ఇస్తారు.ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తే మటుకు డీ లిస్టు అవడం ఖాయం . సాధారణం గా పెద్ద కంపెనీలకు ,మంచి పేరున్న కంపెనీలకు ఇలాంటి సమస్యలు వుండవు. ఇన్వెస్టర్ల సొమ్ము దోచుకొని బోర్డు
తిప్పేసే కంపెనీలకు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.దాదాపు ఇప్పటికి నాలుగు వేలు కంపెనీలు పైగా డీ లిస్టు అయ్యాయి.వేలమంది ఇన్వెస్టర్లు మునిగి పోయారు. కాబట్టి షేర్లను కొనుగోలు చేసే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఎవరు పడితే వారు చెప్పిన టిప్స్ ను బట్టి షేర్లను కొనుగోలు చేయడం ప్రమాదం అని ఇన్వెస్టర్లు గుర్తెరగాలి.కొనుగోలు చేసిన షేర్లు ట్రేడ్ అవుతున్నాయో లేదో ఎప్పటి కప్పుడు చేసు కోవాలి.డీ లిస్టు అయిన కంపెనీల షేర్లను ప్రమోటర్లు కొనాలన్నా నిబంధన లేక పోలేదు అయితే అలా ముందు కొచ్చి ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేసిన కంపెనీ ఒక్కటి కూడా వున్నట్టు దాఖలా లేదు.Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest