భారతదేశపు నవ్య మరియు పునరుత్పత్తి శక్తి మంత్రత్వ శాఖ, పెద్ద నగరాలలో ఆదిత్య సౌర దుకాణాలను ఏర్పరచడాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ దుకాణాలు ఇప్పుడు అక్షయ్ ఊర్జా దుకాణాలు (Akshay urja shopa) గా పిలవబడుచున్నాయి. ఇవి అన్ని రకాల పునరుత్పత్తి శక్తి సాధనాలు మరియు వ్యవస్ధలను, సౌర శక్తి ఉత్పత్తులతో సహా అమ్మకాలకు మరియు, నిర్వహణకు ఉద్దేశించబడ్డాయి. ఈ దుకాణాలు, దిగువ పేర్కొన్న విధులను నిర్వహిస్తాయి.
- వివిధ రకాలైన పునరుత్పత్తి శక్తి మరియు శక్తి సామర్ధ్యం గల సాధనాల అమ్మకం
- పునరుత్పత్తి శక్తి సాధనాలను మరమ్మతు చేయుట, నిర్వహణ లోపాలను సరిచేయుట
- పునరుత్పత్తి శక్తి సాధనాలు మరియు వ్యవస్ధల గురించిన సమాచారం ప్రచారం చేయుట, మరియు
- వ్యక్తులు / సంస్ధలు ( కంపెనీలు) పునరుత్పత్తి శక్తి సాధనాలను వినియోగించుటకై ప్రోత్సహించుట
ఆర్ధిక సహాయం తీసుకొనుటకు అర్హత కలిగిన సంస్ధలు
రాష్ట్ర కేంద్ర సంస్ధలు ( state nodal agencies) , వ్యాపారులు ( private enterprenaurs) మరియు సేవా సంస్ధలు ( ngos) , దేశంలోని అన్ని జిల్లాలలో ఈ దుకాణాలను స్ధాపించి నిర్వహించగలవు.
ధన సహాయము
- అభ్యర్ధులు, ఏర్పాటు చేసే సంస్ధ యొక్క వ్యయంలో 85 శాతం పరిమితి వరకూ రుణాలు, నిర్ధేశిత బ్యాంకుల నుండి, 10 లక్షలకు మించకుండా 7 శాతం వడ్డీ రేటు తో పొందడానికి అర్హులు. ఇది, ఐదు సంవత్సరాల కాల పరిమితితో తిరిగి చెల్లించవలసి ఉంటుంది.
- రాష్ట్ర కేంద్ర సంస్ధల ( state nodal agencies) ద్వారా ప్రభుత్వం నిర్ణీత సమయానికి విడుదల చేసే గ్రాంటులు ( మంజూరు చేసే ధనం) ప్రోత్సహకాలు ( నియమిత ఆదాయాన్నీనుసరించి)
- కార్మికులకు, విద్యుత్తు, టెలిఫోన్ బిల్లులు మరియు యితర రకాలైన ఖర్చులకు, నెలకు 5000 చొప్పున ప్రభుత్వం యిచ్చే గ్రాంటు.
- ఈ దుకాణాల నిర్వహణలో నెలకు కనిష్టంగా 50,000 రూపాయల ఆదాయం, మొదటి సంవత్సరములో ఉన్నప్పుడు మరియు నెలకు కనిష్టంగా 1,00,000 రూపాయల ఆదాయం రెండవ సంవత్సరములో ఉన్నప్పుడు ప్రోత్సాహకంగా (incentive) 5,000 రూపాయలు నెలకు అందుతుంది.
- ఈ పథకం , రాష్ట్ర కేంద్ర సంస్ధలు మరియు ireda ల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది.
ఈ దుకాణాల స్ధాపనకు అనుసరించవలసిన సూచనలు
- ప్రతీ జిల్లాలో కేవలం ఒక్క దుకాణమే ఏర్పాటు చేయాలి. ఇప్పటికే, ఈ దుకాణాలు ఏర్పాటు చేసిన జిల్లాలలో మరికొన్ని దుకాణాలు ఏర్పాటు చేయుటకు అర్హత లేదు.
- ఈ దుకాణమునకు కనీసం 200 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన స్ధలం అవసరం. ( గిడ్డంగి నిలువ ఉంచే స్ధలాన్ని మినహాయించి). ఈ దుకాణములు నిర్మించాలి లేదా కొనాలి లేదా పునరుద్దరించబడాలి. బాడుగకు తీసుకున్న దుకాణాలు, ప్రభుత్వ సహకారానికి అర్హత పొందవు.
- ఈ దుకాణం నగరంలోని ముఖ్యమైన ప్రదేశంలో ఉండి, అక్కడకి చేరడానికి అనువైన సౌకర్యాలు కలదై ఉండాలి.
- ఈ దుకాణం యొక్క పేరు దేశం మొత్తం మీద ఒకటే ఉండాలి. అక్షయ్ ఊర్జా షాప్ (Akshay urja shop) అన్న పేరు కనీసం 8 x 3 సైజు కల కాంతి వంతమైన ఫలకం (board) పై వ్రాయబడి ప్రదర్శించబడాలి. దుకాణం యొక్క పేరు ఆరంభంలో వేరే పదంతో ఉండవచ్చు. ఉదాహరణకు దుకాణ యజమాని పేరుతో ఉండి, తరువాత ………….. అక్షయ్ ఊర్జా షాప్ అని ఉండాలి.
- ఈ దుకాణం, అందంగా, ఆకర్షణీయంగా, విద్యుదీపాలంకరణతో, వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉండాలి.
- ఈ దుకాణంలో కనీసం ఇద్దరు ఉద్యోగులు ఉండాలి. అందులో ఒకరు సాంకేతిక నిపుణుడై ( టెక్నిషియన్ ), పునరుత్పత్తి శక్తి సాధనాలను బాగు చేసి, నిర్వహించగలవాడై ఉండాలి.
- నవ్య మరియు పునరుత్పత్తి శక్తి మంత్రత్వ శాఖ, దుకాణాలలో నియమింపబడిన ఉద్యోగుల పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉండరు.
- ఈ దుకాణం, సాధారణ వ్యాపార దుకాణాల వలెనే పని చేయాలి. ఆ విధంగా ఆదాయం కూడ ఆర్జించగలిగి ఉండాలి.
- దుకాణంలో అమ్మే వస్తువుల, సాధనాలకు, మరమ్మత్తు, సంరక్షణ సౌకర్యం, కేవలం తాము అమ్మినవాటికే కాక, వేరే సంస్ధల నుండి తయారైన శక్తి ఉత్పత్తులు, అమర్చబడిన సాధనాలకు కూడ సరసమైన ధరలో మరమ్మత్తు చేయాలి.
- ఈ దుకాణం, వినియోగదారుడితో స్నేహపూర్వకంగా మెలిగే సంస్ధగా ఉండాలి. కఠినంగాగాని, అనువుగాని వేళల్లో వ్యాపారం గాని, నిర్లక్ష్యధోరణి గాని అవలబించకూడదు.
- ఈ దుకాణం అనేక మంది ఉత్పత్తిదారుల ఉత్పత్తిచేసిన పునరుత్పత్తి శక్తి సాధనాలను వివిధ నమూనాల్లో ప్రదర్శిస్తుంది. ఆ విధంగా, వినియోగదారుడు తనకు కావలసిన వస్తువులను ఎన్నుకోగలుగుతాడు.
- ఈ దుకాణంలో అమ్మే వస్తువుల ధరల పట్టిక తగిన విధంగా ప్రజలకు తెలిసే విధంగా ప్రకటించాలి. అంతే కాకుండా, తమ వద్దకు వచ్చే వ్యక్తులకు ( వినియోగదారులకు) ఈ సాధనాల గురించి సమాచారం వివరించాలి.
- ఈ సౌర దుకాణాలు వ్యాపారపరంగా తగిన గుర్తింపు పొందడానికి, శక్తి – సామర్ధ్యం కలిగిన వస్తువులను ఉదాహరణకు, చిన్నవైన ఫ్లోరోసెంట్ దీపాలు ( cfl – compact fluor escent lamps) విద్యుద్దీపాలకు కావలసిన అదనపు హంగులు, అధిక సామర్ధ్యం కల కిరోసిన్ స్టవులు మొదలైన వాటిని, తాము అమ్మే పునరుత్పత్తి శక్తి సాధనాలకు సంబంధించిన వస్తువులతో పాటు అమ్మవచ్చు.
- వినియోగదారుల సౌకర్యార్ధం, దుకాణం, బ్యాంకుల సహకారంతో వివిధ పునరుత్పత్తి శక్తి ఉత్పత్తులను కొనడానికి సులభమైన రుణ ఏర్పాట్లు కూడ చేస్తుంది.