స్టాక్ మార్కెట్ లో లాభాలు అర్జించాలంటే ఇన్వెస్టర్లు ఈ దిగువ నిచ్చిన సూత్రాలను పాటించాలి. లాభాలు రాకపోయినా నష్టాల పాలవ కుండా సేఫ్ గా ఉండొచ్చు.
- అందరు షేర్లను అమ్ముకుంటున్న సమయం లో కొనుగోళ్ళు చేయాలి
- మనసు ప్రశాంతం గా వున్నపుడు మాత్రమే ఇన్వెస్ట్ మెంట్ నిర్ణయాలు తీసుకోండి
- ఎవరు పడితే వారిచ్చే టిప్స్ ను అనుసరించ కూడదు
- మంచి షేర్లలో చౌక ధర కు దొరికే వాటిపైనే గురి పెట్టాలి … మంచి షేర్లలో కూడా నూటికి నూరు పాళ్ళు బెస్ట్ షేర్ ఏది ఉండ దని గుర్తుంచుకోవాలి
- మార్కెట్ పడే తరుణం లో షేర్లను కొనుగోలు చేయమని సలహాలు ఇవ్వడం చాల సులభం.
కాని కొనడమే కష్టం .ధైర్యం చాలదు. కానీ ధైర్యం చేయక తప్పదు - కేవలం టిప్స్ ఆధారం గానే షేర్లను కొనగూడదు. కొంత మేరకైనా స్వీయ విశ్లేషణ వుండాలి.
- షేర్లలో మదుపు చేసి సైలెంట్ గా ఉండ కూడదు
- ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీల మంచి చెడ్డ ల గురించి తెలుసు కోవాలి
- మార్కెట్ పోకడ తో నిమిత్తం లేకుండా కొన్ని షేర్లు పెరుగు తుంటాయి . కొన్ని తగ్గు తుంటాయి .పెరిగే వాటిలో మంచి వాటిని ఎంపిక చేసుకోవాలి
- ఒకే కంపెనీ లేక ఒకే గ్రూపు కి చెందినా కంపెనీల షేర్లలో మొత్తం సొమ్మును ను మదుపు చేయకూడదు ,
భిన్న రంగాలకు చెందిన కంపెనీల షేర్లను ఎంపిక చేసుకోవాలి* కొనుగోలు చేసిన షేర్ల కదలిక లను నిత్యం పరిశీలిస్తుండాలి, కంపెనీల తాలుకు బోనస్,డివిడెండ్,ఇతర సమాచారాన్ని కూడా తెలుసు కుంటుండాలి - షేర్లను ప్రేమించ కూడదు. ధర పెరిగితే వెంటనే స్పందించి అమ్మేసుకోవాలి
- ధరలు పతన మయ్యే తరుణం లో బెంబేలెత్తి పోకూడదు , ఓర్పు వహించాలి. చేతిలో సొమ్ము వుంటే మరిన్ని మంచి షేర్లను కొనాలి .ఇది కూడా అంత సులభమైన విషయం కాదు
- మార్కెట్ ఏ కారణాల వాళ్ళ పతనమైనా కొన్నాళ్ళకు పెరుగుతుంది. ఇన్వెస్టర్లు ఎపుడు ఆశ భావం తో ఉండాలి
- ఇన్వెస్టర్లు మరీ ఆశ బోతులుగా ఉండ కూడదు, దశలు వారీ గా లాభాలు గడించాలి అన్న దృక్పధం తో మదుపు చేయాలి