Banks AccountsBanks Accounts

పొదుపు ఖాతా

డబ్బు దాచుకోవడమనేది ఎప్పుడూ త్వరపడి చేసే పనికాదు. ఒకసారి పొదుపు చేసే అలవాటు కు లోబడితే, మీ ఆర్ధిక భద్రతకు కావలసిన ధృఢమైన పునాదిని నిర్మించుకోగలుగుతారు. అంతేకాక, ప్రణాళికా బద్ధమైన ఖర్చులకు, మరియు అనుకోని ఖర్చులకు కూడా పొదుపు మిమ్ములను సిద్ధంగా ఉంచుతుంది.

మీ పొదుపు ఖాతాను(saving account) ఎంపిక చేసుకోవడం ఎలా ?

ఒక పొదుపు ఖాతాను(saving account) ఎంచుకునే ముందు మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. మొదటిది, మీ బ్యాలెన్స్ సొమ్ము మీరు చేసే డిపాజిట్ల ఆధారంగా పెరుగుతుంది. మరియు మీరు సంపాదించుకునే వడ్డీ వల్ల పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో, వడ్డీ రేట్ ను, లాభాలకిచ్చే రేటు గాను లేక వార్షిక ఆదాయ శాతంగానూ పరిగణిస్తారు. కనిష్ట సొమ్ము విలువకు చెల్లించే రుసుములుగానూ లేక డబ్బు తిరిగి తీసుకునే పరిమితులు దాటిన సందర్భాలలో తీసుకునే వ్యయానికి గాని, ఏమైనా నియమాలు ఉన్నావేమో ముందుగానే తెలుసుకోండి.

మీ పొదుపు ఖాతాను ఉపయోగించుకొనుట ఎలా ?

ఒకసారి మీరు డబ్బును పొదుపు ఖాతాలో జమ చెయ్యడం మొదలు పెట్టినప్పుడు, మీ డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ (తిరిగి తీసుకొనుట) మరియు బదిలీలు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొని గుర్తు పెట్టుకోవాలి. అందువలన అనుకోని సేవా రుసుములు చెల్లించవలసిన పరిస్ధితిరాదు. ఒకే నివేదికలో, మీరు మీ పొదుపు ఖాతాను మరియు వాడుకునే ఖాతాను అనుసంధానించిన ట్లైతే, రెండు ఖాతాలలో ఉన్న సొమ్ము గురించి తెలుసుకొనుట చాలా సులభం. అనుకోని ఖర్చులకు అవసరమయ్యే అదనపు సొమ్ముమీకు ఎక్కువగా జమ చేసినట్లైతే, ప్రత్యేక కొనుగోళ్ళ కొరకు మీరు విడిగా వేరే ఒక పొదుపు ఖాతాను తెరవవచ్చు.

పొదుపు ఖాతా(saving account), మీ సొమ్ముకు భద్రమైన రక్షణను యిస్తుంది. ఖాతాదారులలో, పొదుపు చెయ్యడమనే అలవాటును ప్రోత్సహిస్తుంది. ఈ ఖాతాలను, మీరు బ్యాంకులు మరియు తపాలా కార్యాలయాలలో తెరవవచ్చు. దాచుకున్న సొమ్ము పై వడ్డీ ని కూడా ఆర్జించవచ్చు.

భారతదేశంలో నివసించే అందరు భారతీయులు, హిందూ అవిభక్త కుటుంబాలు, ఆస్తి సంరక్షక సంస్ధలు, సంఘాలు, సమితులూ మరియు క్లబ్బులు పొదుపు ఖాతాను తెరవడానికి అర్హులు. మైనర్లు ( 18 సంవత్సరాల కంటె తక్కువ ఉన్నవారు) కూడ తమ సంరక్షకుడి సహాయంతో పొదుపు ఖాతాను నిర్వహించవచ్చు.

వివిధ బ్యాంకులు, మరియు తపాలా కార్యాలయాలు కనిష్ట డిపాజిట్ ను 500 రూపాయల నుండి 5000 రూపాయల దాకా నిర్ణయించాయి. సాధారణంగా, జాతీయ బ్యాంకులు కనిష్ట డిపాజిట్ ను తక్కువగా నిర్ణయించాయి.

ఆన్ లైన్ ద్వారాగాని, లేక బ్యాంకు యొక్క వినియోగదారుల సేవా కేంద్రం నుండి గాని, ఖాతా తెరచుట కొరకు దరఖాస్తు చేసుకొనవచ్చు. లేక వ్యాపార కార్యకర్త ద్వారా సంప్రదించవచ్చు. మీరు వ్యక్తిగతం గా కూడ బ్యాంకుకు వెళ్ళి మీ దరఖాస్తు ఫారమ్ ను అవసరమైన అధికారిక ధృవపత్రాలతో సహా దాఖలు పరచవచ్చు.

వడ్డీ రేట్లు, పొదుపు ఖాతా పై, బ్యాంకుకు, బ్యాంకుకు వేరేగా సంవత్సరానికి 3 శాతం నుండి 4 శాతం వరకు ఉండవచ్చు. మీ పొదుపు ఖాతా బ్యాలెన్స్ పై వచ్చిన వడ్డీ మీ ఖాతా కు ఆరునెలలకి ఒకసారి జమ చేయబడుతుంది. అది సెప్టెంబరు మరియు మార్చిలో.

పొదుపు ఖాతాను తెరవడానికి 18 సంవత్సరాలు పై బడిన వారు సహ- దరఖాస్తుదారుగా ఉండవచ్చు. చెక్కుల ద్వారా మీ డబ్బును తిరిగి తీసుకొనవచ్చు. ATM కార్డులు మొదలైన వాటి ద్వారా కూడ మీ సొమ్మును పొందవచ్చు. కొన్ని బ్యాంకులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కూడ కలుగ చేస్తున్నాయి. దాని ద్వారా మీ నగదు బదలాయింపులను ఆన్ లైన్ ద్వారా నిర్వహించుకో వచ్చు. అంతేకాకుండా, ఫోను బ్యాంకింగ్ సదుపాయం కూడ ఉన్నది. ఫిక్స్ డ్ ఖాతాలు నిర్ణీత వ్యవధికి దాచుకున్న సొమ్ము తో పోల్చినప్పుడు, పొదుపు ఖాతాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. మీరు ఒక వేళ అధిక వడ్డీ రేట్ ను ఆశించినట్లైతే, మీ బ్యాంకరుకు మీ ఖాతా లో ఒక పరిమితి దాటిన తరువాత చేరిన సొమ్మును ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాకు మళ్ళించమని లేక రికరింగ్ డిపాజిట్ ఖాతాకు కలపమని గట్టి ఆదేశాలు జారీ చేయవచ్చు. బ్యాంకులు వృద్ధులైన పౌరులకు(senior citizens) అధిక వడ్డీ రేట్లను ఇస్తాయి. కేవలం ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలకే ఈ సదుపాయం ఉంటుంది.

కరెంట్ ఖాతా

కరెంట్ ఖాతా అనేది, ఖాతాదారుడు, బ్యాంకులో దాచుకున్న సోమ్మును, ఏ సమయంలో నైనా తిరిగి తీసుకునే సదుపాయం కలదు. సోమ్ము దాచుకున్న ఖాతాదారుడు ఈ ఖాతాను స్వేచ్ఛగా రోజులో ఎన్ని సార్లు అయినా వాడుకొనవచ్చు. కాని పొదుపు ఖాతాలలో దాచుకున్న సోమ్ముకు, కేవలం పరిమితి గానే లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంటుంది. ఈ కరెంట్ ఖాతాను చిన్న చిన్న వ్యాపారులు, వర్తకాలు, వృత్తులలో ఉన్నవారు తెరుస్తారు. కరెంట్ ఖాతాలు, వడ్డీ ఇవ్వని ఖాతాలు.

లబ్ధిదారులు

ప్రాధమికంగా వ్యాపార అవసరాల నిమిత్తం, కరెంట్ ఖాతాలు ఉద్దేశించబడ్డాయి. వ్యాపారులు, భాగస్వామ్య వ్యాపార సంస్ధలు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్ధలు మొదలైనవి, ఈ ఖాతాను ఉపయోగించుకుంటాయి. ధనలావాదేవీలను, వ్యాపారంలోని ప్రతి స్ధాయిలో, ఎటువంటి యిబ్బంది లేకుండా సవ్యంగా జరగడానికి వీలుగా మాత్రమే ఈ కరెంట్ ఖాతా ఉద్దేశించబడింది.

భారతదేశంలో నివసించే అందరు భారతీయులు, 18 సంవత్సరాల వయసు నిండినవారు, అంత కన్నా ఎక్కువ వయసు కలవారు ఈ ఖాతా తెరవడానికి అర్హులు. అంతేకాక, వ్యక్తులు, వ్యక్తి యాజమాన్యం కల సంస్ధలు, భాగస్వామ్య సంస్ధలు, వ్యాపార సంస్ధలు, ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ కంపెనీలు, సంస్ధలు, ఆస్తి సంరక్షక సంస్ధలు, అవి భక్త ఉమ్మడి కుటుంబాలు మొదలైనవి కూడా ఈ ఖాతాను తెరవవచ్చు. కరెంట్ ఖాతాను వ్యక్తి గాగాని, సమిష్టిగాగాని కూడా తెరవవచ్చు.

బ్యాంకులు 5000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు కనిష్ట డిపాజిటును ఖాతా తెరవడానికి అడుగుతాయి. సామాన్యంగా, జాతీయబ్యాంకులలో కరెంట్ ఖాతా తెరవడానికి, డిపాజిట్ తక్కువగానే అవసరం ఉంటుంది.

కరెంట్ ఖాతాను తెరవడం చాలా సులభం. దరఖాస్తు ఫారమ్ ను పూర్తిగా నింపి, అవసరమైన అధికారిక ధృవపత్రాలను, గుర్తింపు నిరూపణ మరియు చిరునామా నిరూపణ పత్రాల వంటి వాటిని జతచేసి యివ్వవలసి ఉంటుంది. అదనపు అధికారిక ధృవపత్రాల అవసరం వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఒకే వ్యక్తి యాజమాన్యం క్రింద ఉండే వ్యాపారానికి కావలసిన ధృవపత్రాలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ప్రైవేట్ భాగస్వామ్య వ్యాపార సంస్ధకు) కు కావలసిన అధికారిక పత్రాలు కు తేడా ఉంటుంది.

నిబంధనలు లేని ఖాతా

ఇటీవల, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయాలలో, బ్యాంకింగ్ వ్యవస్ధ ను, ఎటువంటి నిబంధనలు లేని ఖాతాలను బ్యాంకులలో ప్రవేశ పెట్టడం ద్వారా, అధిక సంఖ్యలో గల పేదలు, బడుగు వర్గాలు బ్యాంకింగ్ వ్యవస్ధలోనికి రాగలుగుతారని భావించి, వారిని ఆదేశించింది. 70,000 బ్యాంకు శాఖలు దేశం అంతటా ఉన్నప్పటికీ, ఇంకా అధిక శాతం ప్రజలు ధన పరపతి లేకుండా జీవిస్తున్నట్లు గ్రహించడం వలన ఈ ఆలోచన వచ్చింది.

అందువలన ఈ నిబంధనలు లేని ఖాతాలు, ఒక క్రొత్త బ్యాంకింగ్ ఉత్పత్తిని, ఈ వినూత్నమైన సాధనం ద్వారా ప్రవేశ పెట్టి పేద, బడుగు వర్గాల ప్రజలకు ధన పరపతిని పెంచి, వారి పరమిత పరపతిని తగ్గిస్తుంది. ప్రతీ బ్యాంకుకు, ఈ ఖాతాలను ప్రవేశ పెట్టే స్వేచ్ఛ ఉండడం వలన, ప్రాధమికంగా ఈ ఖాతాను తెరవడానికి బ్యాలెన్స్ లేక పోయినా లేక తక్కువగా బ్యాలెన్స్ ఉన్నా లావాదేవీల సౌకర్యాలు కలుగ చేసే సదుపాయం ఉంటుంది.

సేవా ఖర్చుల గురించి ఆలోచన ఉన్నప్పటికీ, ఎందరో ఆర్ధిక నిపుణులు మరియు శాస్త్రవేత్తలు, దేశంలోని అత్యధికులైన పేదలు, బడుగు వర్గాల వారికి ఎప్పటి నుంచో రావలసిన ధన పరపతిని కల్పించడంలోనూ, వారి పరిమిత పరపతిని సమర్ధవంతంగా ఎదుర్కొనడంలోనూ ఈ ఖాతా ఒక అద్భుతమైన సాధనంగా భావిస్తున్నారు.

ఉదాహరణ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనలు లేని ఖాతా యొక్క వివరములు

ఈ ఖాతా అతి తక్కువ బ్యాలెన్స్ సొమ్ము మరియు / తక్కువ లేక అసలు రుసుము లేని విధంగా ఉంటుంది. ప్రజలలో అత్యధికులైన పేదలకు అందుబాటులో ఉండి, ప్రస్తుతం పొదుపు ఖాతా కు వర్తించే నియమాలు లేకుండా ఉంటుంది. వివరాలు క్రింద పేర్కొన బడ్డాయి.

అర్హత 18 సంవత్సరాలు, అంతకు మించి వయసు గలవారు, వారి నెలవారీ ఆదాయం 5000 రూపాయలు లేక అంతకంటె తక్కువగా ఉండడం.
అమలు పరచే విధానం ఒక్కరు / సమిష్టిగా
మొదటి డిపాజిట్ సొమ్ము ఖాతా తెరచుటకు 50 రూపాయలు
కనిష్ట బ్యాలెన్స్ సొమ్ము లేదు
గరిష్ట బ్యాలెన్స్ సొమ్ము ఖాతా దారుడి వ్యాపార మొత్తం విలువ 10000 రూపాయలు, యితర డిపాజిట్ ఖాతాలతో సహా
వడ్డీ రేటు పొదుపు ఖాతాకు వర్తించేది అది i.e. 3.5% సంవత్సరానికి
చెక్కు సౌకర్యం అందుబాటులో ఉంది.
ఎటిఎమ్ – కమ్ – డెబిట్ కార్డు ఎటువంటి రుసుమూ తీసుకొనకుండా మంజూరు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేదు
ఖాతాల సంఖ్య సాధారణంగా, ఒక ఖాతాదారునికి ప్రాధమికమైన నిబంధనలు లేని ఖాతా ( No frills account) ఒకటికి మించి తెరిచే సదుపాయం లేదు.
పాస్ పుస్తకం మంజూరు అవుతుంది. నెలలో 11వ తారీఖున మరియు 20 వ తారీఖున అప్ డేట్ చేయబడుతుంది.
ఇక్కడ పేర్కొన్నవి కాక యితర సేవలకు చెల్లించే రుసుం ఇక్కడ పేర్కొన్నసేవలు కాక యితర సేవలకు, ఈ ఉత్పత్తికి సంబంధించి బ్యాంకు శాఖల ఆవరణలో ఉన్న నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. ఇవి వెబ్ – సైట్ లో కూడ అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా “ Revised service charges, w.e.f. 11.02.2008’’.
నియామక సదుపాయం అందుబాటులో ఉన్నది.
ఈ ఉత్పత్తి అందుబాటులో ఉన్న ప్రదేశాలు అన్ని శాఖలు, ప్రత్యేకమైన శాఖలను మినహాయించి

ఫిక్స్ డ్ డిపాజిట్స్

నిర్ణీత కాల వ్యవధికి దాచుకునే సొమ్ము స్ధిరమైన ఖాతాలు (Fixed period) అవి చెల్లింపుకు వచ్చే దశను బట్టి (maturity period), వడ్డీ రేటుని బట్టి, డిపాజిట్ చేసిన ధనాన్ని బట్టి స్ధిరంగా ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో వస్తున్న అధికమైన పోటీ వలన, స్ధిరమైన ఖాతాలు కూడ, మీకు అదనపు లాభాలు చేకూర్చే విధంగా చాల వరకు మార్పుకు లోనవుతున్నాయి.

దిగువ పేర్కొన్న వ్యక్తులు లేక అవాస్తవమైన వ్యక్తులు కాని ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతా పై దరఖాస్తు చేసుకొనవచ్చు

  • పౌరులు
  • ఏకైక యాజమాన్యం కల సంస్ధలు
  • ప్రైవేట్ మరియు ప్రభుత్వ కంపెనీలు
  • హిందూ అవి భక్త కుటుంబాలు
  • ట్రస్టులు
  • సంఘాలు, క్లబ్బులు, మరియు సమితులు
  • భారతదేశంలో నివసించే విదేశీయులుa

స్ధిరమైన ఖాతాలలో మీరు, మీ ధనాన్ని 7 రోజుల నుండి 10 సంవత్సరాల దాకా డిపాజిట్ (దాచుకొనవచ్చు) చేయవచ్చు. అనేక బ్యాంకులు ఆ ధనాన్ని వేల సంఖ్యలో డిపాజిట్ చేయాలని అడుగుతాయి. మీ ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలపై బ్యాంకులు రుణాలు, ఓవర్ డ్రాప్ట్ సదుపాయాన్ని కలుగచేస్తాయి. మీ ధనాన్ని మీరు తిరిగి పొందవచ్చు, కాని దానికి మీరు పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. ఆ పీనల్ రేటును, బ్యాంకు, డిపాజిట్ చేసే రోజునే నిర్దేశిస్తుంది.

ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలపై వచ్చే వడ్డీ 5000 రూపాయలు, ఒక ఖాతాదారునికి, ఒక శాఖకు, ఒక సంవత్సరానికి దాటినప్పుడు ఆ ఆధారం నుండి ఆదాయపు పన్నుకోత విధిస్తారు.

కనిష్ట ధనం డిపాజిట్ చేయదగినది, బ్యాంకు, బ్యాంకు కూ మారుతూ ఉంటుంది. కొన్ని బ్యాంకులు కనిష్టంగా 10000 రూపాయలు కోరుతాయి. అవి దాటినప్పుడు వేలల్లో జమ చేయవచ్చు. బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలపై ఒక రసీదును యిస్తాయి. దానిలో మెచ్యూరిటీ తారీఖు, మెచ్యూరిటీ అయిన సందర్భంలో చెల్లించవలసిన సొమ్ము, వడ్డీ రేటు మొదలైనవి ఉంటాయి. వృద్ధులు, అధిక వడ్డీ రేట్లను పొందడం ద్వారా అదనపు లాభాలను అందుకుంటారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *