Home

సుకన్య సమృద్ధి యోజన పథకం

సుకన్య సమృద్ధి యోజన

సమాజంలో ఆడ పిల్లలకు సమాన అవకాశాలు.. ఉద్యోగాలు.. ఉన్నతమైన చదువు అందించాలని.. భ్రూణ హత్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. ఆ పథకం లోనే భాగంగా బాలికల కోసం కొత్తగా ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పథకం ఖాతాను ఎక్కడ ప్రారంభించాలి, ఎంత డబ్బులు కట్టాలి, వడ్డీ ఎంత చెల్లిస్తారు.. అనే వివరాలు పూర్తి సమాచారం మీకోసం.

సుకన్య సమృద్ధి దరఖాస్తు మరియు వివరాలు :

  • ప్రతీ జిల్లాలోని ప్రధాన తపాలా కార్యాలయాలు, ఇతర ఉప తపాలా కార్యాలయాల్లో ఈ పథకం అందుబాటులో ఉంది.
  • అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని పదేళ్ల వయస్సున్న ఆడపిల్ల తల్లిదండ్రులు అర్హులు.
  • దేశంలో ఏ తపాలా శాఖలోనైనా సుకన్య సమృద్ధి ఖాతా తెరవవచ్చు.
  • పదేళ్లలోపు బాలిక పేరుపై తల్లిదండ్రులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.
  • ఒక బాలికపై ఒక్క ఖాతా మాత్రమే తెరిచే అవకాశం ఉంది.
  • ఖాతాను తెరవడానికి బాలిక జనన ధ్రువీకరణ పత్రం, తండ్రి, లేదా సంరక్షకుడి చిరునామా, గుర్తింపు తెలియజేసే పత్రాలు తప్పని సరి.
  • ఏ బాలికల పేరుతో ఖాతా ప్రారంభిస్తారో ఆమెకు సంబంధించిన రెండు పాస్‌పోర్టు సైట్‌ ఫొటోలు ఇవ్వాలి.
  • తపాలా కార్యాలయంలో ఇచ్చే దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, పైన తెలిపిన వివరాలు జతచేసి తపాలా కార్యాలయం పనివేళల్లో అందజేయాలి.
  • రూ. 250/- చెల్లించి ఖాతాను తీసుకోవాల్సి ఉంటుంది.
  • పథకం కొత్తగా వచ్చినందున ప్రభుత్వం 2 డిసెంబరు 2003 తర్వాత జన్మించిన బాలికల పేరు మీద మాత్రమే ఖాతా తెరిచేందుకు అవకాశం ఉంది.
  • సుకన్య సమృద్ధి పథకంలో ఖాతా ప్రారంభించిన వారికి ప్రభుత్వం 8.3 శాతం వడ్డీ అందిస్తుంది.
  • రూ. 250 తో ప్రారంభించిన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు జమ చేయొచ్చు.
  • ఇలా ఖాతాలో వేసిన డబ్బుకు ప్రతి ఏటా వడ్డీ కలుపుతారు. మధ్యలో డబ్బులు తీసుకోవడానికి వీలుండదు.
  • ఖాతాను ప్రారంభించిన నాటి నుంచి కనీసం 14ఏళ్లు, గరిష్ఠం 21ఏళ్ల వరకు ఖాతా నిర్వహించవచ్చు.
  • బాలికకు 18 ఏళ్లు వచ్చాక చదువు కోసమైతే సగం డబ్బులు తీసుకోవచ్చు.
  • చేసిన పొదుపుపై వడ్డీ ఉదాహరణ నెలకు రూ.వెయ్యి చొప్పున 14ఏళ్లు చేస్తే 21ఏళ్ల తర్వాత 6లక్షల7వేల 128రూపాయలు వస్తాయి.
  • ప్రతి ఆర్థిక సంవత్సరం వడ్డీ రేట్లలో మార్పు ఉండవచ్చు. ఆర్థిక సంవత్సరాన్ని అనుసరించి అధికారులు వడ్డీని లెక్కిస్తారు.

ఒకవేళ వివాహం జరిగే వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తపాలా కార్యాలయంలో అందజేస్తే పూర్తి డబ్బులు అందజేస్తారు. లేదంటే బాలికకు 21 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రధాని ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకంపై అందరికి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఈ ఖాతాలను తీసుకొని ప్రయోజనం పొందాలి.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

సుకన్య సమృద్ధి డిపాజిట్లకు 8.1 శాతం వడ్డీ

నూతన ఆర్ధిక సంవత్సరం 2015-16లో చిన్నమొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో చేసే డిపాజిట్లపై వడ్డీరేటును ప్రభుత్వం 8.3 శాతంగా నిర్ణయించింది.

ప్రస్తుతం ఈ ఖాతాలపై 8.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పథకం కింద 10 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వారికి 14 సంవత్సరాలు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన ఖాతాని ఏయే బ్యాంకులు అందిస్తున్నాయి?

బేటీ బచా వో.. బేటీ పఢావో ఉద్యమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ సుకన్య సమృద్ధి యోజనను హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆడపిల్లల పట్ల వివక్షను అంతం చేసి లింగ అసమానతలను రూపుమాపాలనే నినాదంలో ఈ పథకం ముందుకెళ్తుంది.

ఆడ పిల్లలకు ప్రత్యేక ఖాతాలు తెరవడం వల్ల ఆర్థిక సాధికారత లభిస్తుందని, తద్వారా వారిని మగ పిల్లలతో సమానంగా సంరక్షించేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 8.1 శాతం వడ్డీ లభించే ఈ ఖాతాలో జమ చేసుకున్న సొమ్ముకు ఆదాయపన్ను మినాహాయింపు కూడా ఉంది.

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఏయే బ్యాంకుల్లో తెరవచ్చు?

తపాలా కార్యాలయాల్లో కానీ, అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఏ శాఖలోనైనా కానీ వెయ్యి రూపాయాల కనీస డిపాజిట్‌తో పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవవచ్చు. ఒక వార్షిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకు జమ చేసుకునేందుకు వీలుంది. ఏయే బ్యాంకుల్లో ఈ ఖాతాలను తెరవచ్చో చూద్దాం.

1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) బరోడా బ్యాంక్
3) పంజాబ్ నేషనల్ బ్యాంక్
4) బ్యాంక్ ఆఫ్ ఇండియా
5) కెనరా బ్యాంక్
6) యూకో బ్యాంక్
7) యునైటెడ్ బ్యాంక్
8) ఆంధ్రా బ్యాంక్
9) అలహాబాద్ బ్యాంకు
10) ఇండియన్ బ్యాంక్
11) కార్పొరేషన్ బ్యాంక్
12) సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా
13) ఐడిబిఐ బ్యాంక్
14) దేనా బ్యాంక్

సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ వల్ల ప్రయోజనాలు:

ఈ పథకం కింద ఆడ పిల్ల తల్లితండ్రులు తమ పదేళ్ల లోపు వయస్సు గల కుమార్తె ల పేరిట బ్యాంకు ఖాతా తెరవొచ్చు. తల్లితండ్రులు ఈ ఖాతాలో రూ.1,000 మొదలుకొని లక్షన్నర రూపాయల వరకు జమ చేయవచ్చు. ఈ ఖాతాలో జమ చేసిన డబ్బుకు ఇతర పథకాల కన్నా బ్యాంకులు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి.

ఖాతా ప్రారంభించినప్పటి నుంచి 21 సంవత్సరాల నగదు వెనక్కి తీసుకునేవీలుండదు. ఒక వేళ 18 ఏళ్లు వయసొచ్చిన తర్వాత అమ్మాయి వివాహం కోసం కానీ, చదువుల కోసం కానీ జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది

సుకన్య సమృద్ధి ఖాతా: లోపాల గురించి తెలుసుకోండి..!

ఆడపిల్లల పట్ల వివక్షను అంతం చేసి లింగ అసమానతలను రూపుమాపాలనే నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించారు. ఇందుకోసం మోడీ బేటీ బచా వో.. బేటీ పఢావో పిలుపునిచ్చారు. ఆడ పిల్లలకు ప్రత్యేక ఖాతాలు తెరవడం వల్ల ఆర్థిక సాధికారత లభిస్తుందని, తద్వారా వారిని మగ పిల్లలతో సమానంగా సంరక్షించేందుకు వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో చేసే డిపాజిట్లపై వడ్డీరేటును ప్రభుత్వం 8.1 శాతంగా నిర్ణయించింది. అంతే కాదు ఈ ఖాతాలో జమ చేసుకున్న సొమ్ముకు ఆదాయపన్ను మినాహాయింపు కూడా ఉంది. ఈ పథకం కింద 10 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వారికి 14 సంవత్సరాలు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు.

తపాలా కార్యాలయాల్లో కానీ, అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఏ శాఖలోనైనా కానీ వెయ్యి రూపాయాల కనీస డిపాజిట్‌తో పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవవచ్చు. ఒక వార్షిక సంవత్సరంలో గరిష్టంగా రూ. లక్షన్నర వరకు జమ చేసుకునేందుకు వీలుంది.

అయితే ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

1. కాల పరిమితి:

ఈ ఖాతా తక్కువ కాల పరిమితి పెట్టుబడిదారులకు ఏవిధంగానూ హెల్ప్ అవదు. ఖాతాలో ఉన్న జమ అయిన డబ్బు 21 సంవత్సరాల తర్వాత మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకం కింద 10 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వారికి 14 సంవత్సరాలు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు.

2. రెండు ఖాతాలు:

ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఇద్దరు బాలికలున్న తండ్రి రెండు ఖాతాల్లో విడివిడిగా సొమ్ముని జత చేయాల్సి ఉంటుంది. ముగ్గురు కూమార్తెలున్న తండ్రి మరో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచేందుకు వీలు లేదు.

3. ముందు ఉపసంహరణ

ఈ పథకం కింద జమ చేసిన నగదుని 21 సంవత్సరాల తర్వాతనే చెల్లిస్తారు. ఏదైనా కారణం చేత ముందుగా నగదుని విత్ డ్రా చేసుకుందామనుకుంటే ఇవ్వరు. ఒక వేళ బాలిక చనిపోతే దానిని వేరుగా పరిగణిస్తారు.

4. ఆన్‌లైన్ ఫెసిలిటీ లేదు సుకన్య సమృద్ధి యోజన పథకం కింద తెరిచిన ఖాతాలో డీడీ లేదా చెక్కు ద్వారా మాత్రమే జమ చేయాలి. ఆన్‌లైన్ ద్వారా చెల్లించే సౌకర్యం లేదు. సాంకేతిక పెరిగిన ఈ రోజుల్లో ప్రజలకు పెద్ద అసౌకర్యంగా అనిపిస్తుంది.

5. వడ్డీ రేట్లలో తేడా

ఈ పథకం కింద జమ చేసిన నగదుకు ప్రభుత్వం ప్రకటించే వడ్డీ రేట్లలో ప్రతి ఏడాదికి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ నగదుని ప్రభుత్వ బాండ్లకు అనుసంధానం చేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద జమ చేసిన నగదుకి రిస్క్ భయం తక్కువగా ఉండే వడ్డీ మాత్రమే లభిస్తుంది.

admin:
All Rights ReservedView Non-AMP Version