Home

ఆషామాషీ గా మదుపు చేయకండి

stock market

మార్కెట్ లో లాభ సాటి షేర్లను గుర్తించి మదుపు చేస్తే నష్ట పోయే అవకాశాలు తక్కువగా వుంటాయి అయితే లాభ సాటి షేర్లను గుర్తించడం అంతా సులభమైన విషయం కాదు. ఇక్కడే మన శక్తి సామర్ధ్యాలు బయట పడతాయి. మంచి షేర్లను గుర్తించడానికి నిరంతర పరిశీలన అవసరం. మార్కెట్ లో ప్రతి పరిణామాన్నిగమనిస్తుండాలి.ఆర్ధిక ఫలితాలను పరిశీలిస్తుండాలి.అందుకు కొంత సమయం కేటాయించాలి .ఓర్పుగా మార్కెట్ కి సంబంధించిన ప్రతి అంశాన్ని అధ్యయనం చేయాలి.

చిన్న ఇన్వెస్టర్లు సహజం గా అంతా ఓపిక చూపరు.కొందరైతే ఏమాత్రం కష్ట పడకుండా అలా మదుపు చేస్తే ఇలా లాభాలు రావాలని కోరు కుంటారు. ఆలాంటి వాళ్ళలో కొద్దిమంది లబ్ది పొందినా అధిక భాగం చేతులు కాల్చుకున్నవారే వుంటారు.ఆలాంటి వారు స్టాక్ మార్కెట్ కి దూరం గా ఉండటమే మంచిది .రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవాలన్న కోరిక ఉండొచ్చు కానీ స్టాక్ మార్కెట్లో అది సాధ్య పడదు.క్రమం గా ఒక పద్ధతి ప్రకారం మంచి షేర్లను కొనుగోలు చేస్తూ నిర్ణీత కాలం లో లాభాలను అర్జించాలని అనుకుంటే మటుకు కొంత కృషి చేయాల్సిన అవసరం వుంటుంది. అందుకోసం ఒక ప్లాన్ రూపొందించుకొని షేర్లను ఎంచుకొని వాటి గురించి అధ్యయనం చేస్తూ మంచి పోర్ట్ ఫోలియోను ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితం గా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

చాలా మంది ఇన్వెస్టర్లు ప్రస్తుతంఈవిధానాన్నేఅనుసరిస్తున్నారు .మార్కెట్లో పెద్ద మొత్తాల్లో మదుపు చేసే ఇన్వెస్టర్లు ఎక్కువగా షేర్ మార్కెట్ పై శ్రద్ధ చూపుతారు.ఆన్ లైన్ ఫోరమ్స్ లో చేరుతుంటారు ,అన్ని వేళల మార్కెట్ పరిణామాలపై ఓ కన్నేసి ఉంచుతారు. అన్ని సిఫారసులను పరిశీలిస్తుంటారు.అందు బాటు లో కొచ్చిన యే అవకాశాన్ని చేజార్చు కోకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు.తద్వారా లాభాలు గడిస్తుంటారు. లాభాలు ఆర్జిస్తూనే అసలు అంటే పెట్టుబడి మొత్తాన్ని పక్కన పెట్టేస్తారు. మిగిలిన మొత్తం తోనే రొటేషన్ కూడా చేస్తుంటారు.అవసరమైన సందర్భం లో మళ్ళీ పెట్టుబడి పెడుతుంటారు. ఇలాంటి వారంతా కూడా ప్రారంభం లో చేతులు కాల్చుకున్న వారే.అయితే అనుభవాలు నేర్పిన పాఠాలతో ఆరి తేరి జాగ్రత్త పడ్డ వారు.

మొత్తం మీద స్టాక్ మార్కెట్ లో మదుపు చేసి లాభాలు గడించాలనుకుంటే మటుకు కొంత మేరకైనా పరిశ్రమించాలి .అపుడే లాభాల ఆర్జనకు అవకాశాలు వుంటాయి .అంతే గానీ ఆషా మాషీ గా మదుపు చేస్తే మటుకు చేతులు కాల్తాయి.

admin:
All Rights ReservedView Non-AMP Version