Home

రూపాయి విలువ పతనం కావడం అంటే అర్ధం ఏమిటి ?

డాలర్ తో పోలిస్తే రూపాయి  విలువ తగ్గడం గురుంచి ఈ మధ్య మీరందరూ తరుచుగా వింటూనే ఉన్నారు.ఈ మధ్య డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 74 చేరుకోవడం మీకు తెలిసే ఉంటుంది.. అసలు రూపాయి పతనం అంటే ఏమిటో ఒక్క సారి చూద్దాం. మార్కెట్ లో ఏదైనా ఒక వస్తువు ధర పడిపోయినప్పుడు దానిని కనుగోలు చేయాలి అనుకున్న వ్యక్తీ తక్కువ ధర చేల్లిస్తాడు అనే విషయం మీకు తెలుసుకదా ? అదే విధంగా  భారత దేశంలో నివసిస్తున్న మనం రూపాయిని  కనుగోలు చేయలేము. మనం ,మనకు కావలసిన రూపాయలను జీతం ద్వారా,  మనం అందించిన సేవల ద్వారా మాత్రమే పొందగలం.కాని మీరు ఒక్కసారి ఆలోచించండి.  విదేశాల నుండి మనం దేశానికి వచ్చే టూరిస్టులు కాని, విదేశాలలో ఉన్న మన బందువులు కాని మనకు డబ్బు పంపాలి అంటే  వారూ మన దేశ రూపాయిని కనుగోలు

చేయాల్సి ఉంటుంది అంటే వారి వద్ద ఉన్న విదేశీ కరెన్సీని  మన దేశ కరెన్సీలో కి మార్చు కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వారూ వారి వద్ద గల 100 డాలర్లతో మన రూపాయిని కనుగోలు చేసినప్పుడు  ఇది వరకటి కంటే ఎక్కువ రూపాయలు పొందితే  రూపాయి విలువ తగ్గినట్టు.అంటే మార్కెటులో ధర తగ్గడం వలన వస్తువులు అధికంగా వచ్చినట్టుగా . ఉదాహరణకి గతంలో 100 డాలర్లకు 6000  రూపాయలు వస్తే ఇప్పుడు అదే 100 డాలర్లకు 7400 రూపాయలు వస్తున్నాయి.అంటే గతంతో పోలిస్తే అధిక రూపాయలు వస్తున్నాయి కదా ? మనం ఇది వరకు వంద రూపాయలు ఇచ్చి కొన్న వస్తువులు , ఈ సారి అదే వంద రూపాయలకు అవే వస్తువులు ఇదివరకటి కంటే ఎక్కువ వస్తే దాని అర్ధం వస్తువల ధర పడిపోవడమే కదా ? అదే విధంగా రూపాయి కూడా .

ఒక దేశ కరెన్సీ దాని స్వంత భౌగోళిక ప్రాంతంలో మాత్రమే చెల్లు బాటు అవుతుంది.దాని  భౌగోళిక ప్రాంతం వెలుపల డబ్బుతో సంభందమైన యే లావాదీవీ జరపాలన్న పరస్పర ఆమోదయోగ్యమైన  కరెన్సీ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించవలసి ఉంటుంది. సాదారణంగా అంతర్జాతీయ లావాదేవీలకు  us డాలర్ ను పరస్పర ఆమోదయోగ్యమైన కరెన్సీగా వాడతారు. అందువలనే ఒక దేశ కరెన్సీ  యొక్క విలువని డాలర్ తో పోలుస్తారు. మనం మన రూపాయిని డాలర్ తో పోలుస్తున్నప్పుడు  USD –INR అని సంబోదించడం జరుగుతుంది. అంటే ఒక డాలర్ విలువ ఎన్ని రూపాయలకో సమానం అనే విషయం తెలియచేస్తుంది.ఉదాహరణకు USD –INR = 74 అంటే ఒక డాలర్ కి 74 రూపాయలు సమానం .

రూపాయి విలువ పతనం వలన మన దేశం అధిక  విదేశీ నిధులను పొందలేదు. అదే రూపాయి బలంగా ఉంటే అధిక విదేశీ నిధులను పొందడానికి  అవకాశం ఉంటుంది. రూపాయి విలువ పతనం కావడం అనేది గిరాకి ,సరఫరా ,ఆర్ధిక మరియు రాజకీయ కారణాలపై ఆధారపడి ఉంటుంది.

మన దేశం మన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం , అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడం చాలా సర్వసాధారణం. ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకం పొందితే , దిగుమతి చేసుకున్న వస్తువులకు విదేశీ మారకం చెల్లించవలసి ఉంటుంది. ఇది సాదారణంగా us డాలర్ రూపంలోనే జరుగుతుంది.ఐతే మన దేశం ఎగుమతుల ద్వారా పొందే విదేశీ మారకం కంటే , చేసుకొనే దిగుమతులకు చెల్లించవలసిన విదేశీ మారకం ఎక్కువ కావడం వలన విదేశీ మారక ద్రవ్యలోటు ఏర్పడుతుంది.ఈ లోటు కొంత వరకు  NRIs పంపే డబ్బు, విదేశీ అప్పుల వలన తీరితే  మిగితా  లోటు పూరించడానికి మనం అంతర్జాతీయ  మార్కెట్ లో కనుగోలు చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే గిరాకీ అధికంగా ఉంటుందో  అప్పుడు దాని విలువ పెరుగుతుంది.దానితో మన రూపాయి విలువ తక్కువగా ఉంటుంది. 

మన దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. దానిని తగ్గించడానికి రిజర్వు బ్యాంక్ వివిధ చర్యలు తీసుకున్నప్పటికి కూడా  ద్రవ్యోల్బణం దిగిరావడం లేదు .దీనివలన విదేశీ పెట్టుబడులు తగ్గడంతో  రావలసిన డాలర్ ప్రవాహం తగగ్డం వలన కూడా రూపాయి పతనం జరుగుతుంది.

సాదారణంగా దేశంలో భారీ విదేశీ మారకం నిల్వ ఉంటుంది. వాటి నుండి దేశం చేసుకొనే దిగుమతలకు కావాల్సిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఎప్పుడైతే విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉంటాయో అప్పుడు మన అవసారాలకు సరిపడా డాలర్ కనుగోలు చేయవలసి ఉంటుంది. దానితో రాపాయి విలువ తగ్గిపోతుంది.

 దేశం చేసే స్వల్ప కాలిక ఋణాలు చెల్లించడానికి  డాలర్లు సేకరించవల్సి  ఉంటుంది. దానితో డాలర్ విలువ పెరిగి రూపాయి పతనం కావడం జరుగుతుంది.

దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా బలహీన ప్రభుత్వం అనడానికి పరోక్షంగా ఎన్నో సంకేతాలు ఉన్నాయి. పాలక పార్టీ ఎన్నో విధాన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేయడం జరుగుతుంది. దీనివలన విదేశీ పెట్టుబడి దారులు మన ఆర్ధిక వ్యవస్థపై సందేహంతో పెట్టుబడి పెట్టడానికి వేనుకాడతారు.  ఇది కూడా రూపాయి విలువపై  ప్రభావం చూపిస్తుంది.

admin:
All Rights ReservedView Non-AMP Version