Home

ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పనా పథకం (పి యమ్ ఇ జి పి)

Prime Minister Employment Generation Programme

 Prime Minister Employment Generation Programme

ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పనా పథకం (పి యమ్ ఇ జి పి) భారత ప్రభుత్వం యొక్క ఋణాలకు సంబంధించిన రాయితీ పథకం. ఈ పథకాన్ని ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన (పి యమ్ ఆర్ వై) మరియు గ్రామీణ ఉద్యోగ కల్పనా పథకం (ఆర్ ఇ జి పి) అనే రెండు పథకాలను మేళవించి ప్రవేశ పెట్టబడినది. ఈ పథకము 15 ఆగుస్ట్ , 2008 లో ప్రారంభించబడినది.

లక్ష్యములు
  • కొత్త స్వయం ఉపాధి వెంచర్లను / పథకాలను / చిన్న పరిశ్రమలను స్థాపించి, వాటి ద్వారా దేశం లోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించుట కొరకు
  • సంప్రదాయపరమైన ఒకే రకమైన వృత్తులలో పనిచేస్తున్నా వేరు వేరు చోట్లలో విడివిడిగా దూరాల్లో నివసించుచున్న పనివారిని ఒకే చోటుకు ఒకే దగ్గరకు తీసుకురావటం / మరియు

పట్టణాలలో ఉన్న నిరుద్యోగ యువతను ఒకటిగా చేర్చి వారికి స్వయం ఉపాధి అవకాశాలను

వీలైనంత మేరకు వారి స్థానాలలో కల్పించుట కొరకు.

  • సంప్రదాయబద్దమైన వృత్తులలో ఉన్న వారు – కుటుంబపరంగా ఎన్నో ఏళ్ళనుండి చేస్తున్నవారు– మరియు – క్రొత్తగా ఆ పనిని చేపట్టబోయే పనివారికి, ఈ రెండు రకాల వారికీ పెద్ద మెత్తం లో మరియు తరచుగా/నిరంతరంగా ఉపాధి కల్పించటం . దేశంలోని గ్రామీణ మరియు పట్టణాలలో ఉన్న నిరుద్యోగ యువతకు నిరంతరమైన ఉపాధి కల్పించడం ద్వారా గ్రామీణయువత పట్టణ ప్రాంతాలకి తరలిపోకుండా ఆపడానికి.
  • సాంప్రదాయబద్దమైన వృత్తులలో ఉన్న పనివారి రోజువారి వేతనాలను సంపాదించే సామర్ధ్యాన్ని పెంచి తద్వారా గ్రామీణ మరియు పట్టణ ఉద్యోగ అవకాశాల పెరుగుదల రేటు అభివృద్ధికి దోహదపడడానికి.
ఆర్థిక సహాయం యొక్క స్వభావం మరియు పరిమాణం

పి.యమ్.ఇ.జి.పి క్రింద మూల ధనము యొక్క స్థాయిలు

‘పి.యమ్.ఇ.జి. పి’కింద లబ్దిపొందిన వర్గములులబ్దిపొందిన వారి సహకారం (ప్రాజెక్టు ఖర్చులో)రాయితీ రేటు
( ప్రాజెక్టు ఖర్చులో )
ప్రదేశం (సంస్థ నెలకొల్పడిన స్థలము) పట్టణ ప్రాంతంగ్రామీణప్రాంతం
సాధారణ వర్గము10 %15%25%
ప్రత్యేకమైన వర్గము (యస్.సి./యస్.టి./ ఓ.బి.సి./మైనారిటీలు/మహిళలు/ ఎక్స్ సర్వీస్ మెన్/ వికలాంగులు/ ఈశాన్య ప్రాంతం/కొండ మరియు సరిహద్దు ప్రాంతాలు మొదలైనవారు5%25%35%

గమనిక:

  • ఉత్పత్తి / తయారు చేయు విభాగాని క్రింద, పథకానికి/సంస్థకి ఇవ్వబడే అధిక పెట్టుబడి రూ. 25 లక్షలు
  • వ్యాపార/సేవ విభాగానికింద పథకానికి/సంస్థకి ఇవ్వబడే అధిక పెట్టుబడి రూ. 10 లక్షలు
  • మొత్తం పథకం యొక్క పెట్టుబడిలో మిగిలిన మొత్తము బ్యాంకుల తరపునుండి టర్మ్ లోన్ల కింద ఇవ్వబడును.
లబ్దిపొందే వారికుండవలసిన అర్హత నియమాలు
  • ఎవరైనా 18 సంవత్సరములు దాటి ఉండవలెను.
  • ‘పి యమ్ ఇ జి పి’ కింద ప్రాజెక్టులను ఏర్పరచుకొనుటకు కావలసిన సహయానికి ఆదాయ పరిమితి లేదు.
  • తయారు చేయు విభాగంలో 10 లక్షలకు మించి పెట్టాలన్నా మరియు వ్యాపార సేవా విభాగాలలో 5 లక్షలకు మించి పెట్టాలన్నా, లబ్దిపొందేవారు కనీసం 8వ తరగతి పాసైన విద్యార్హత కలిగి ఉండవలెను.
  • ‘పి యమ్ ఇ జి పి’ కింద ప్రత్యేకముగా ఆమోదించబడిన కొత్త పథకాలకు మాత్రమే సహకారము అందజేయబడుతుంది.
  • స్వయంసహకార సంస్థలు (ఇతర పథకాల కింద లబ్దిపొందని దారిద్ర్య రేఖకి దిగువనున్నవారి తో సహా) ‘పి యమ్ ఇ జి పి’ కింద సహాయానికి అర్హులు.
  • సొసైటి రిజిస్ట్రేషన్ చట్టం, 1860 ప్రకారం నమోదు చేయబడ్డ సంస్థలు.
  • ఉత్పత్తి దారుల సహకార సంస్థలు మరియు
  • సేవా సంస్థలు
  • అప్పటికే నెలకొల్పబడిన సంస్థలు (‘పి యమ్ ఆర్ వై’ , ‘ఆర్ ఇ జి పి’ లేక రాష్ట్ర ప్రభుత్వం లేక భారత ప్రభుత్వం తరుపున ) భారత ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల ద్వారా అప్పటికే రాయితీ పొందిన సంస్థలకి అర్హత లేదు.

మరికొన్ని అర్హత నియమాలు.

  • కులము/వర్గము ధృవీకరించు పత్రము నఖలు గాని లేక ప్రత్యేక కేటగిరీలకు చెందినచో తత్సం బంధీకులైన అధికారులచే జారీ చేయబడిన పత్రములుగాని, లబ్దిదారునకు తన మార్జిన్ మనీ (రాయితీ) క్లెయిమ్ తో పాటు సంబంధించిన బ్యాంక్ శాఖలో సమర్పించవలెను.
  • అవసరమైనచో, ఆయా సంస్థల యొక్క బైలాస్ ధృవీకరణ పత్రము నకలును మార్జిన్ మనీ (రాయితీ) క్లెయిమ్ తో జతపరచవలయును.
  • ప్రాజెక్టు ఖర్చులో పెట్టుబడి ఖర్చు మరియు ఒక నిర్ణీత కాలవ్యవధికి తగిన వర్కింగ్ పెట్టుబడి ఉండాలి. ఈ పథకంలో, పెట్టుబడి ఖర్చు నిర్దేశింపబడని ప్రాజెక్టులుకు రుణ సహాయమునకు అర్హత ఉండదు. వర్కింగ్ పెట్టుబడి అవసరము లేని ఐదు లక్షలకు పైగా పెట్టుబడి కావలసిన ప్రాజెక్టులకు ప్రాంతీయ కార్యాలయము నుండి గాని , ఆ బ్యాంక్ శాఖ యొక్క కంట్రోలర్ నుండి గాని అనుమతి అవసరము. అటువంటి క్లెయిమ్ లకు ప్రాంతీయ కార్యాలయము లేక కంట్రోలర్ నుండి తత్సంబంధముగా ఇవ్వబడిన అనుమతి పత్రమును సమర్పించవలెను.
  • భూమి యొక్క ఖరీదును ప్రాజెక్టు ఖర్చు లో కలుపరాదు. నిర్మింపబడి యున్నగాని లేదా ధీర్ఘ కాలం లీజునకు గాని/అద్దెకుగాని తీసుకున్న వర్క్ షెడ్/వర్క్ షాప్ లకు 3 సంవత్సరముల వరకు అగు ఖర్చును మాత్రమే ప్రాజెక్టు కాస్టులో కలుపవచ్చును.
  • గ్రామీణ పరిశ్రమలలోని వ్యతిరేక చిట్టాలో పేర్కొనబడిన పనులు తప్ప ‘పి యమ్ ఇ జి పి’ సాధ్యపడే అన్ని కొత్త చిన్నపరిశ్రమలకు మరియు గ్రామీణ పరిశ్రమ ప్రాజెక్టులతో సహా ‘పి యమ్ ఇ జి పి’ వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న/పాత యూనిట్లకు అర్హత లేదు.(గైడ్ లైన్స్ యొక్క 29వ పేరాని చూడండి.)

గమనిక:

  • ప్రత్యేక కేటగిరిలో సంస్థలు/సహకార ఉత్పత్తి సంఘాలు/ప్రత్యేకముగా గుర్తింపబడిన ట్రస్టులు మరియు ఎస్.సి.,ఎస్.టి.,ఓ.బి.సి.,మహిళలు,వికలాంగులు,ఎక్స్ సర్వీస్ మెన్ మరియు బైలాస్ లో పేర్కొనబడిన మైనారిటి సంస్థలు ఈ మార్జిన్ మనీ (రాయితీ) పొందుటకు అర్హులు. అయితే జనరల్ కేటగిరీలో, ప్రత్యేక కేటగరీలో రిజిష్టర్ చేయబడని సహకార ఉత్పత్తి సంఘాలు/ట్రష్టులు మార్జిన్ మనీ (రాయితీ) పొందుటకు అర్హులు.
  • ‘పి యమ్ ఇ జి పి’ కింద ప్రాజెక్టులు ఏర్పాటుచేయుటకు ఆర్థిక సహయం పొందుటకు ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే అర్హులు. కుటుంబం అనగా సదరు వ్యక్తి లేక అతని భార్య లేక భర్త.
అమలు పరిచే ఏజన్సీలు

జాతీయ స్థాయిలో ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్ 1956 చట్టం క్రింద ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె వి ఐ సి, ముంబాయి ) లోని ఏకైక నోడల్ సంస్థ ద్వారా ఈ పథకం అమలు పరచబడును. రాష్ట్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతములలో ఈ పథకం ‘కె వి ఐ సి’ రాష్ర్ట డైరక్టరేట్,రాష్ట్ర ఖాది గ్రామీణ పరిశ్రమల బోర్డు (కె వి బి సి) మరియు జిల్లా పారిశ్రామిక కేంద్రము(డి ఐ సి) ద్వారా అమలుపరచబడును.పట్టణ ప్రాంతములలో ఈ పథకం రాష్ట్ర జిల్లా పరిశ్రమల కేంద్రములచే (డి ఐ సి) మాత్రమే అమలు చేయబడును.

‘పి యమ్ ఇ జి వి’ క్రింద ప్రతిపాదించిన అంచనా లక్ష్యములు

‘పి యమ్ ఇ జి పి’ క్రింద ఈ 4 సంవత్సరములకు (2008-09 నుండి 2011-12 వరకు) ఈ క్రింద పేర్కొన్న అంచనా లక్ష్యములు ప్రతిపాదించబడినవి.

సంవత్సరముఉద్యోగముల సంఖ్యమార్జిన్ మనీ(రాయితీ) (కోట్ల రూపాయలలో)
2008-09616667740.00
2009-10740000888.00
2010-119620001154.40
2011-1214188331702.60
మొత్తం37375004485.00

గమనిక

  • 250 కోట్ల రూపాయలు అదనపు సోమ్ముని వెనకబడిన మరియు ప్రగతి సాధించిన వాటిని కలుపుటకు ఉద్దేశించబడినది.
  • మొదటిగా, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అతిచిన్న పరిశ్రమలపైన ఎక్కువ ప్రాముఖ్యత కొరకు ‘కె వి ఐ సి’(రాష్ట్ర ‘కె వి ఐ బి’లతో పాటు) మరియు రాష్ట్ర ‘డి ఐ సి’ల మధ్య 60 : 40 నిష్పత్తి లో లక్ష్యములను ఉంచుతారు. అదే నిష్పత్తిలో మార్జిన్ మనీ రాయితీ కూడా విభజిస్తారు. తమకు కేటాయించబడిన సోమ్ములో కనీసం 50% గ్రామీణ ప్రాంతాలలో తప్పక వినియోగింప బడేటట్లు ‘డి ఐ సి’ లు చూస్తాయి.
  • అమలుపరిచే ఏజన్సీలకు ఆ సంవత్సరముయొక్క లక్ష్యములను రాష్ట్రాలవారీగా ఇస్తారు.
వ్యతిరేక చర్యల యొక్క జాబితా

‘పి యమ్ ఇ జి పి’ క్రింద చిన్న వ్యాపార సంస్థలు/ప్రాజెక్టులు/యూనిట్లను స్ధాపించుటకు ఈ క్రింద పేర్కొన బడిన చర్యలు అనుమతించబడవు.

  1. ప్రాససింగ్, కేనింగ్ చేసే (వధించిన)మాంసము, దానితో చేసిన ఆహారాన్ని అమ్మే ఏదైనా వ్యాపారం/ఉత్పత్తి చేసే పరిశ్రమ మరియు చుట్ట, బీడి, కిళ్ళీ, సిగిరెట్టు వంటి మత్తుకలిగించు వస్తువులను ఏదైనా అమ్మే వ్యాపారం/ఉత్పత్తి చేసే పరిశ్రమ మరియు మద్యం అమ్మే ఏదైనా హొటల్ లేదా డాబా, పొగాకు ముడి పదార్థాన్ని తయారు/ఉత్పత్తి చేయడం, కల్లుతీత తీసి అమ్మడం.
  2. టీ, కాఫీ, రబ్బరు వంటి వాటిని సాగు చేసే వ్యాపారం/పరిశ్రమ, పట్టు పురుగుల పెంపకం, మొక్కల పెంపకం, పువ్వుల తోటల పెంపకం,పందుల పెంపకం, కోళ్ళు పెంపకం,పంటకోత కోసే యంత్రాలు మొదలైనవి.
  3. వాతావరణ కాలుష్యాన్ని ప్రేరేపించే 20 మైక్రానుల దలసరి కన్నా తక్కువ ఉన్న పోలిథీన్ సంచులు తయారుచేయడం, ఆహార పదార్థాలు నిల్వ ఉంచుటకు, తీసుకొని పోవుటకు, పారవేయుటకు, దాచి ఉంచుటకు రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ తో సంచులు గాని డబ్బాలు గాని తయారు చేయడం మరియు ఏదైనా అటువంటి అంశం.
  4. సర్టిఫికేషన్ రూల్స్ పరిధిలో ఉన్న ఖాది కార్యక్రమముల వంకతో, అమ్మకంలో ముదరాయింపు తీసుకోనే పష్మీనా ఉన్ని మరియు చేతితో నూలువడకడం, నేయడం అటువంటి ఇతర ఉత్పాదనలని ప్రోసెస్ చేయు పరిశ్రమలు.
  5. గ్రామీణ రవాణా ( అండమాన్ నికోబార్ దీవులలో ఆటోరిక్షా, కాశ్మీర్ లో హౌస్ బోట్, షికారా మరియు టూరిస్టు బోట్లు మరియు సైకిల్ రిక్షాలు తప్ప).
admin:
All Rights ReservedView Non-AMP Version