Home

మదుపరులు పాటించవలసిన ముందు జాగ్రత్తలు

stock market

బ్రోకర్ లేదా సబ్ బ్రోకర్‌ను ఎంపికచేసుకోవడం Selecting a Broker/ Sub – Broker

జాగ్రత్తగా పరిశీలించి, సెబి ( సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ) లో తమ పేరు నమోదుచేసుకున్న బ్రోకర్‌తో లేదా సబ్ బ్రోకర్‌తో మాత్రమే మీ సెక్యూరిటీల వ్యాపారాన్ని నిర్వహించండి. తన బ్రోకర్ల జాబితాను బి ఎస్ ఇ ప్రచురించింది. ఆ జాబితా ద్వారాకాని , బి ఎస్ ఇ వెబ్‌సైట్ ద్వారాకాని బ్రోకర్ల వివరాలను తెలుసుకోవచ్చు.

ఒప్పందం కుదుర్చుకోవడం Entering into an Agreement

  • మీరు ఎంపికచేసుకున్న బ్రోకర్ లేదా సబ్ బ్రోకర్ వద్ద ఖాతాదారు నమోదు పత్రాన్ని పూర్తిచేయండి .
  • ఆ బ్రోకర్ లేదా సబ్ బ్రోకర్‌తో ఖాతాదారు ఒప్పందం కుదుర్చుకోండి. బి ఎస్ ఇ తో వ్యాపారం చేసే సభ్యునికి ఖాతాదారుగా తమ పేరు నమోదుచేసుకోవడం, మదుపరులందరికీ తప్పనిసరి. ఒప్పందం కుదుర్చుకునే ముందు ఈ క్రింది అంశాలపట్ల శ్రద్ధ వహించండి
  • తగిన విలువ కలిగిన స్టాంపు పేపరుమీద ఈ ఒప్పందాన్ని వ్రాసుకోవలసి వుంటుంది. అంతకంటె ముందే, ఆ ఒప్పందానికి సంబంధించిన నియమ నిబంధనలను శ్రద్ధగా చదివి అర్ధంచేసుకోండి
  • ఒప్పందపత్రంలోని ప్రతి పేజీలో ఖాతాదారు, ఒప్పందంపై సంతకం చేయడానికి అర్హతవున్న బి ఎస్ ఇ సభ్యుడు లేదా ప్రతినిధి సంతకం చేయాలి. సాక్షులు కూడా, ఒప్పందంలో, తమ పేరును, చిరునామాను పొందుపరుస్తూ , సంతకం చేయాలి. బ్రోకర్ / సబ్ బ్రోకర్/ ఖాతాదారు ఒప్పందం తప్ప, మరెలాంటి దస్తావేజును దాఖలుచేయాలని, నియంత్రణాధికారులు కోరడంలేదు.

లావాదేవీలు జరపడం Transacting

  • మీరు ఏ ఎక్స్ ఛేంజ్‌ద్వారా వ్యాపారం చేయాలనుకుంటున్నారో, బ్రోకర్ లేదా సబ్ బ్రోకర్‌కు స్పష్టంగా చెప్పండి. ప్రతి ఎక్స్‌ఛేంజ్‌కి వేరువేరుగా ఖాతాలు ఏర్పాటుచేసుకోండి.
  • వ్యాపారం చేసిన 24 గంటలలోగా, బ్రోకర్ లేదా సబ్ బ్రోకర్‌నుంచి తగిన కాంట్రాక్ట్ నోట్ పొందండి.
  • కాంట్రాక్ట్ నోట్ అనేది, ఒక ఖాతాదారు తరఫున, ఏ రోజు చేసిన వ్యాపారానికి ఆ రోజున, బి ఎస్ ఇ నిర్దేశించిన నమూనా ఫారంలో ఇచ్చే ధ్రువీకరణ పత్రం. కాంట్రాక్ట్ నోట్‌లో పేర్కొన్న విధంగా, బి ఎస్ ఇ లో చేసే వ్యాపార లావాదేవీలను పరిష్కరించడంలో, వ్యాపారంచేసే సభ్యునికి, ఖాతాదారుకు మధ్య చట్టబద్ధమైన సంబంధాన్ని ఈ నోట్ ఏర్పరస్తుంది. ి
  • కాంట్రాక్ట్ నోట్ రెండు ప్రతులుగా ( అసలు, దానికి నకలు ) వుంటుంది. వ్యాపారం చేసే సభ్యుడు, ఖాతాదారు చెరొక ప్రతి పొందవచ్చు. తనకు అసలు ప్రతి అందిందని ధ్రువీకరిస్తూ, ఖాతాదారు నకలు పైన సంతకం చేయవలసివుంటుంది.
  • ఏ) కాంట్రాక్ట్ నోట్ – ఫారం ‘ ఏ ‘ – ఖాతాదారుల తరఫున బ్రోకర్ గా / ఏజంట్ గా వ్యవహరిస్తున్న సభ్యుడు జారీచేసేది
  • బి) కాంట్రాక్ట్ నోట్ – ఫారం ‘ బి ‘ – ఖాతాదారుల వ్యాపారాన్ని నిర్వహించే సభ్యులు, తాము ప్రధాన వ్యాపార నిర్వాహకులమని ( ప్రిన్సిపల్స్) ప్రకటిస్తూ జారీచేసేది.
  • కాంట్రాక్ట్ నోట్‌లో ఈ క్రింది వివరాలను పేర్కొనేలా శ్రద్ధ వహించండి
    వ్యాపారంచేసే సభ్యుని / సబ్ బ్రోకర్ సెబి రిజిస్ట్రేషన్ నంబరు
    ఆర్డర్ నంబరు, ట్రేడ్ (వ్యాపారం) నంబరు, వ్యాపార సమయము, పరిమాణము, ధర, బ్రోకరు కమిషన్ (బ్రోకరేజ్), పరిష్కారం సంఖ్య , ఇతర సుంకాల వివరాలు
    వ్యాపార ధరను బ్రోకరేజి తో కలపకుండా, విడిగా చూపించాలి

    షేర్ / డిబెంచర్ కు గరిష్ఠంగా, రూ. 0.25 వంతున, లేదా షేర్ / డిబెంచర్ కు సంబంధించిన కాంట్రాక్టు ధరలో గరిష్ఠంగా, 2.5 % …ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే, ఆ మొత్తాన్ని బ్రోకర్ కమిషన్ కింద చెల్లించవలసి వుంటుంది. గరిష్ఠంగా చెల్లించే ఈ బ్రోకరేజిలో, సబ్ బ్రోకర్ కమిషన్‌కూడా చేరి వుంటుంది ( సబ్ బ్రోకరేజి, కాంట్రాక్టు ధరలో 1.5 % కు మించకూడదు). ఇవి కాకుండా, బ్రోకరేజి పైన సర్వీసు సుంకం, ఖాతాదారుకు విధించే ఏవైనా జరిమానాలు, సెక్యూరిటీల లావాదేవీల సుంకం ( ఎస్ టి టి ) మాత్రమే వ్యాపారంచేసే సభ్యుడు అదనంగా విధించవచ్చు

    కాంట్రాక్ట్ నోట్ లో బ్రోకరేజి, సర్వీస్ టాక్స్, ఎస్ టి టి లను విడివిడిగా చూపించాలి.
  • అధికారం పొందిన ప్రతినిధి సంతకం వుండాలిి
  • ఎక్స్‌ఛేంజి ఒక పార్టీగా వుండే అన్ని రకాల న్యాయ వ్యవహారాలపై ముంబై కోర్టులకు మాత్రమే విచారణ పరిధి వుంటుందని; ఇతర అన్నిరకాల న్యాయ వ్యవహారాలలో, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రం ( రీజియనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ) ఏ కోర్టుల పరిధిలో వుంటే ఆ కోర్టులకు, న్యాయ విచారణాధికారం వుంటుందనే ఆర్బిట్రేషన్ నిబంధన కాంట్రాక్ట్ నోట్ ముఖపత్రంలో తప్పనిసరిగా పొందుపరచి వుండాలి.

పరిష్కారం Settlement

  • కొనుగోలు / అమ్మకానికి సంబంధించిన కాంట్రాక్ట్ నోట్ చేతికి అందిన వెంటనే సెక్యూరిటీలను / చెల్లించవలసిన సొమ్మును బ్రోకర్‌కు అందజేసేలా శ్రద్ధ వహించాలి. ఎట్టిపరిస్థితిలో, నిర్ణీత చెల్లింపుల ( పే ఇన్ ) రోజునకు ముందే అందజేయాలి.
  • అమ్మకాలు జరిగిన (పే ఔట్) 24 గంటలలోగా, ఖాతాదారుకు సభ్యుడు డబ్బును లేదా సెక్యూరిటీలను అందజేయాలి
  • డి మాట్ ఖాతా ప్రారంభించాలి
  • షేర్ల కొనుగోలు, అమ్మకాలను డి మాట్ లోనే సాగించేలా చూడండి.
  • డి మాట్ ఖాతానుంచి షేర్ల పంపిణీ జరగాలంటే, ఆ షేర్లను, సెక్యూరిటీలను విక్రయించిన బ్రోకర్ పూల్ ఖాతాకు, లబ్ధిదారు ఖాతానుంచి, బదలాయింపు జరగడానికి అవసరమైన ఆదేశాలను డిపాజిటరీ పార్టిసిపెంట్ (డి పి) ఇవ్వాలి.

డి పి కి ఈ క్రింది వివరాలను సమకూర్చాలి:

  • షేర్లను బదలాయించవలసిన బ్రోకర్ పూల్ ఖాతా వివరాలు ; స్క్రిప్ వివరాలు, పరిమాణం( ఎన్ని) మొదలైనవి. డిపాజిటరీల నిర్వహణకు అనువుగా, నిర్ణీత సెక్యూరిటీలకు చెల్లింపులు జరపడానికి తుది గడువుకు కనీసం 48 గంటలు ముందుగా, పంపిణీ ( డెలివరీ ఔట్) ఆదేశాలు ఇవ్వాలి.
  • మీరు కొనుగోలుచేసిన షేర్లు మీ డి మాట్ ఖాతాలోకి జమకావడంకోసం, మీ తరఫున ఆ షేర్లను కొనుగోలుచేసిన బ్రోకర్ పూల్ ఖాతా నుంచి, లబ్ధిదారు (బెనిఫిషియరీ) ఖాతాలోకి అనుమతించవలసిందిగా, డిపాజిటరీ పార్టిసిపెంట్‌కు ” డెలివరీ ఇన్ ” ఆదేశాలు ఇవ్వాలి.
  • ఆ షేర్ల పత్రాలు నేరుగా మీ చేతికి అందిన పక్షంలో, పంపిణీ మంచి చెడ్డలను గురించి సెబి జారీచేసిన నిబంధనలతో వాటిని పోల్చిచూడండి
  • పంపిణీ లోపాలను తక్షణమే బి ఎస్ ఎ ద్వారా చక్కదిద్దుకోవాలి.
  • మీ పేరున బదలాయింపబడడానికి, నేరుగా మీ చేతికందిన షేర్ల నమోదు విషయంలో, వాటి బదలాయింపు ఒప్పందం (డీడ్) అన్ని విధాల చెల్లుబాటుకు అనుగుణంగా, అన్ని వివరాలతో, తగిన విలువగల స్టాంపులతో వున్నదో లేదో నిర్ధారించుకోండి.

మదుపుదారుల హక్కులు Rights of Investors

  • మదుపుదారులకు కంపెనీ ప్రకటించే అన్ని ప్రయోజనాలను / సమాచారాన్ని పొందగలగడం
  • కంపెనీలోని హోల్డింగ్స్ బదలాయింపులు, ఉప విభాగాలుగా చేయడం, క్రోడీకరించడం వంటి సేవలను సక్రమంగా పొందడం
  • ఈక్విటీ హోల్డర్‌గా, ఆ కంపెనీ విడుదలచేసే తదుపరి క్యాపిటల్ ఇష్యూలో తాను ఖాతాదారుగా చేరే హక్కు కలిగి వుండడం
  • కాంట్రాక్టు ధరలో బ్రోకరేజి 2.5 % కు మించకపోవడం
  • లావాదేవీల ధర, బ్రోకరేజి, సర్వీస్ టాక్స్, ఎస్ టి టి విడి విడిగా పేర్కొన్న నిర్దిష్టమైన ఫారంలో కాంట్రాక్ట్ నోట్ అందినట్టు బ్రోకర్‌నుంచి రసీదు పొందడం
  • Expect delivery of shares purchased/value of shares sold within 24 hours from pay-out.
  • అమ్మిన లేదా కొనుగోలు చేసిన ( పే ఔట్ ) 24 గంటలలోగా, కొనుగోలు చేసిన షేర్లను / అమ్మిన షేర్ల విలువను అందుకోగలనని ఆశించడం
  • భౌగోళిక పరిధికి సంబంధించిన, ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి (ఆర్బిట్రేషన్ సెంటర్) వెళ్ళగలగడం
  • ఎక్స్‌ఛేంజ్ తో వ్యాపారం సాగించే సభ్యులపైన చేసే ఫిర్యాదులను, లేదా మధ్యవర్తిత్వంకోసం చేసే దరఖాస్తులను ఈ కింద 1 వ నిలువు గడిలో పేర్కొన్న సంబంధిత ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రంలో దరఖాస్తుచేయాలి. ఆ ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రం, వ్యాపారంచేసే సభ్యునికి చట్టబద్ధంగా , లిఖితపూర్వకంగా తెలియజేసిన భాగస్వామి తాజా చిరునామా లేదా నమోదైన కార్యాలయం , 2 వ నిలువు గడిలో పేర్కొన్న ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ( భారతదేశంలో ) వున్నదో, ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందినదై వుండాలి . అయితే, భారతీయ సంతతికి చెంది, ఇండియాలో నివసించని భాగస్వామి విషయంలో, వ్యాపారంచేసే సభ్యుని సభ్యత్వం కార్పొరేట్ సభ్యత్వమా, నాన్ కార్పొరేట్ సభ్యత్వమా అనేదానినిబట్టి, ఆ సభ్యుని చిరునామా లేదా రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా 2 వ నిలువుగడిలొని ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోవుంటే, ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రమై వుండాలి. దరఖాస్తుదారు నిబంధనలకు అనుగుణంగా మధ్యవర్తిత్వ దరఖాస్తును ఏ ఆర్బిట్రేషన్ సెంటర్‌లో దాఖలుచేస్తే, ఆ ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రంలొ విచారణలు చేపడతారు.
నిలువుగడి 1నిలువుగడి 2
ప్రాంతీయ మధ్య వర్తిత్వ న్యాయ కేంద్రాలుప్రాంతీయ మధ్య వర్తిత్వ న్యాయ కేంద్రాల పరిధిలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లిమిటెడ్్
ఉ ఉత్తర ప్రాంతీయ కార్యాలయం ,
7వ అంతస్తు, మెర్కంటైల్ హౌస్్
కె జి మార్గ్ కె జి మార్గ్ , న్యూఢిల్లీ-110 001.
టెలిఫోన్ నంబర్ : 011-41510481
టెలి ఫాక్స్ నంబర్ : 011-41510480
ఇ- మెయిల్ ఐ డి :iscdelhi@bseindia.com ;ritesh.kumar@bseindia.com
ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ , ఉత్తరాంచల్, హిమాచల ప్రదేశ్, పంజాబ్, జమ్ము-కాశ్మీర్, చండీఘర్ , రాజస్థాన్్
బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లిమిటెడ్
తూర్ తూర్పు ప్రాంతీయ కార్యాలయం ,
1వ అంతస్తు, కిషోర్ భబన్
17, ఆర్ ఎన్ ముఖర్జీ రోడ్ ,
కోల్‌కతా- 700 001
టెలిఫోన్ నంబర్ : 033-22133184 ,
టెలి ఫాక్స్ నంబర్ : 033-22130530
ఇ- మెయిల్ ఐ డి :isc.kolkata@bseindia.com;anirban.guha@bseindia.com
West Bengal, Bihar, Jharkhand, Orissa, Assam, Arunachal Pradesh, Mizoram, Manipur, Sikkim, Meghalaya, Nagaland, Tripura, Chhattisgarhపశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, ఒరిస్సా, అస్సాం, అరుణాచల ప్రదేశ్ , మిజోరం, మణిపూర్, సిక్కిం,మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, చత్తీస్‌ఘర్్
బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లిమిటెడ్
దక్షిణ ప్రాంతీయ కార్యాలయం ,
4వ అంతస్తు, ఎక్స్‌ఛేంజ్ బిల్డింగ్్
నంబర్ 11, సెకండ్ లైన్ బీచ్ ,
చెన్నై- 600 001
టెలిఫోన్ నంబర్ : 044-42163999
టెలి ఫాక్స్ నంబర్ : 044-42164999
ఇ- మెయిల్ ఐ డి :iscchennai@bseindia.com;
s.periyasamy@bseindia.com
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , కేరళ, తమిళనాడు, అండమాన్-నికోబార్, లక్షద్వీప్ , పుదుచ్చేరి
బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లిమిటెడ్
పశ్చిమ ప్రాంతీయ కార్యాలయం ,
డిపార్ట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్టర్ సర్వీసెస్,
పి జె టవర్స్, 1 వ అంతస్తు, దలాల్ స్ట్రీట్
ఫోర్ట్, ముంబై- 400001.
టెలిఫోన్ నంబర్ : 022-22721233/34
టెలి ఫాక్స్ నంబర్ : 022-22723677
ఇ- మెయిల్ ఐ డి :crasto@bseindia.com
మహారాష్ట్ర, గుజరాత్, గోవా, డామన్-డయూ , దాదర్-నగర్ హవేలి, మధ్య ప్రదేశ్
admin:
All Rights ReservedView Non-AMP Version