పాన్ అంటే ఏమిటి?
ఆదాయంపన్ను శాఖ (ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్), మీ ఖాతాకు శాశ్వతంగా కేటాయించే సంఖ్యను (పర్మినెంట్ అకౌంట్ నంబర్. . పి ఏ ఎన్) పాన్ అంటారు. ఇది అంకెలు, అక్షరాలతో కూడిన పది స్థానాల సంఖ్య. ఈ సంఖ్యను లామినేట్ చేసిన కార్డుపై ముద్రించి ఆదాయంపన్ను శాఖ అందజేస్తుంది. ఉదాహరణకు పాన్ ఇలాఉంటుంది. ఏఏబిపిఎస్1205ఇ. { సెక్షన్ 139 ఏ (7) వివరణ (బి) మరియు (సి) }
పాన్ కలిగివుండవలసిన అవసరం ఏమిటి?
ఆదాయంపన్నును ప్రకటించే పత్రాలలో (రిటన్), ఆ శాఖకుచెందిన ఏ అధికారితోనైనా జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలలో పాన్ ను పేర్కొనడం తప్పనిసరి. 2005 జనవరి నుంచి, ఆదాయంపన్ను శాఖకు చెల్లించవలసిన అన్ని చలాన్లపైన పాన్ పేర్కొనడం తప్పనిసరిచేశారు. {సెక్షన్ 139 ఏ (5) (ఏ) (బి) మరియు (బి)} ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు (సి బి డి టి)ఎప్పటికప్పుడు ప్రకటించే, ఆర్ధికలావాదేవీలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలలోకూడా పాన్ ను విధిగా పేర్కొనాలి. స్థిర ఆస్తులు లేదా వాహనాల కొనుగోలు, లేదా హోటళ్ళు, రెస్టారెంట్‌లకు 25,000/- రూపాయలకు పైబడి చేసే చెల్లింపులు, లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆర్ద్కిక లావాదేవీల వంటివి ఈ కోవలోకి వస్తాయి. టెలిఫోన్ లేదా సెల్‌ఫోన్ కనెక్షన్ పొందాలన్నా పాన్ ను పేర్కొనడం తప్పనిసరి. బ్యాంకులో లేదా పోస్టాఫీసులో 50,000 రూపాయలకు పైబడిన కాలపరిమితి డిపాజిట్లకు చెల్లించాలన్నా, బ్యాంకులో 50,000 రూపాయలు, అంతకు మించి నగదు చెల్లించాలన్నా కూడా పాన్ నంబర్‌ను పేర్కొని తీరాలి. { సెక్షన్ 139 ఏ (5) 114 బి నిబంధనతో కలిపి చదువుకోవాలి }
పైన పేర్కొన్న లావాదేవీలలో, పాన్ ను పేర్కొనే విధంగా, ఆదాయంపన్నుశాఖ ఏ విధంగా శ్రద్ధ వహిస్తుంది?
సి బి డి టి ప్రకటించిన ఆర్ధిక, ద్రవ్య లావాదేవీలకు సంబంధించిన పత్రాలలో తన పాన్ పేర్కొనడం, ఆ పత్రాలను అందుకునే వ్యక్తి చట్టబద్ధమైన బాధ్యత.
{Section139A (6)}
ఇన్‌కం టాక్స్ రిట ర్న్ లో పాన్ విధిగా పేర్కొనాలా?
అవును, ఇన్‌కం టాక్స్ రిట ర్న్ లో పాన్ ను విధిగా పేర్కొనాలి.
అధికారులు పాన్ ను ఎలా సరిచూడగలుగుతారు?
పాన్ ను సరిచూడగలిగే సదుపాయం ఇన్‌కం టాక్స్ వెబ్ సైట్ లో వుంటుంది.
ఎవరెవరికి తప్పనిసరిగా పాన్ వుండాలి?
i. ప్రస్తుతం ఆదాయం పన్ను చెల్లించవలసినవారికి, చెల్లించేవారందరికి, ఇతరుల తరఫున ఇన్‌కం టాక్స్ రిటన్ రిటర్న్ దాఖలుచేయవలసినవారికి కూడా పాన్ వుండడం తప్పనిసరి.
{Section 139A (1) and (1A)}
ii. విధిగా పాన్ పేర్కొనవలసిన ఆర్ధిక లావాదేవీలలోకి కొత్తగా ప్రవేశించాలనుకునే వారికి కూడా పాన్ తప్పనిసరిగా ఉండాలి
{ Section 139A (5) (c) read with Rule 114B}
iii. ఆదాయం పన్నును లెక్కిం చే అధికారి తనకు తానుగా కాని, ఆ వ్యక్తి నుంచి అందే అభ్యర్ధనపైన కాని ఎవరికైనా పాన్ కేటాయించవచ్చు.
{Section 139A (2) and (3)}
ఒక వ్యక్తి, ఒకటికంటె ఎక్కువ పాన్ లు పొందవచ్చునా? ఉపయోగించవచ్చునా?
ఒకటికంటె ఎక్కువ పాన్ లు పొందడం లేదా ఉపయోగించడం చట్ట విరుద్ధం
{Section 139A (7)}
పాన్‌కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి?
పాన్ కు సంబంధించిన సేవలను మెరుగుపరచడంకోసం, ఇన్‌కం టాక్స్ కార్యాలయం వున్న ప్రతిపట్టణంలో ఐ టి పాన్ సేవా కేంద్రాలను ఏర్పాటుచేయడానికి యు టి ఐ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్ (యు టి ఐ ఐ ఎస్ ఎల్) సంస్థకు ఆదాయం పన్ను శాఖ అధికారం కల్పించింది. . టిన్ ఫెసిలిటేషన్ సెంటర్స్ నుంచి పాన్ సేవలను అందించడానికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ ఎస్ డి ఎల్) సంస్థకు కూడా ఇన్‌కంటాక్స్ శాఖ అధికారం కల్పించింది. పెద్ద నగరాలలోని పాన్ దరఖా స్తుదారుల సౌకర్యంకోసం, యు టి ఐ ఐ ఎస్ ఎల్ ఒకటికంటె ఎక్కువ ఐ టి పాన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటుచేసింది. అదేవిధంగా, టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లుకూడా ఒకటికి మించి ఏర్పాటయ్యాయి.
పాన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? తెల్ల కాగితంపైన దరఖాస్తు చేయవచ్చునా?
ఫారం 49 ఏ లోనే పాన్ కోసం దరఖాస్తు చేయాలి. ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ కు చెందిన వెబ్ సైట్ నుంచి, లేదా యు టి ఐ ఐ ఎస్ ఎల్, లేదా ఎన్ ఎస్ డి ఎల్ వెబ్ సైట్ (www. incometaxindia. gov. in, లేదా www. utiisl. co. in లేదా tin. nsdl. com) నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న, లేదా స్థానికం గా ముద్రించిన, లేదా (ఏ 4 సైజు 70 జి ఎస్ ఎం మందం కలిగిన పేపర్ పై) జిరాక్స్ చేసిన, లేదా ఇతర ఏ విధంగా నైనా పొందిన దరఖాస్తు పత్రంలో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తు ఫారాలు ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ల లో, టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లలో కూడా లభిస్తాయి.
ఎక్కడినుంచైనా పొందిన, ఫారం 49 ఏ లో, పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునా?
అవును. ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ల నుంచి, టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లనుంచి కాకుండా, ఇతరత్రా ఎక్కడినుంచైనా పొందే ఫారం 49 ఏ లో పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ కు చెందిన వెబ్ సైట్ నుంచి, లేదా యు టి ఐ ఐ ఎస్ ఎల్, లేదా ఎన్ ఎస్ డి ఎల్ వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న, లేదా స్థానికం గా ముద్రించిన, లేదా జిరాక్స్ చేసిన దరఖాస్తు పత్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పాన్ కోసం ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చునా?
అవును, కొత్తగా పాన్ కేటాయింపు కోసం ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఇంతేకాకుండా, పాన్ సమాచారంలో ఏవైనా మార్పులు చేయాలనుకున్నా, కొత్త పాన్‌కార్డు పొందాలనుకున్నా (పాన్ వుండి కార్డు మాత్రమే కొత్తది పొందడం), ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. (మరిన్ని వివరాలకోసం (www. tin-nsdl. com) వెబ్ సైట్ లో చూడండి).
నేను త్వరగా పాన్ పొందడం (తత్కాల్) ఎలా?
పాన్ కోసం ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తుచేసుకుని, నామినేటెడ్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజు చెల్లిస్తే, ప్రాధాన్య ప్రాతిపదికపై పాన్ కేటాయించి. ఆ సమాచారం ఇ-మెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది.
ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడవున్నదో తెలుసుకోవడం ఎలా?
ఏ పట్టణంలోనైనా ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడవున్నదో అక్కడి ఆదాయంపన్ను కార్యాలయాన్ని గాని, లేదా అక్కడి యు టి ఐ / యు టి ఐ ఐ ఎస్ ఎల్ / ఎన్ ఎస్ డి ఎల్ కార్యాలయాన్ని గాని సంప్రదిం చి తెలుసుకోవచ్చు. లేదా ఆదాయం పన్ను శాఖ (), లేదా యు టి ఐ ఐ ఎస్ ఎల్ (), లేదా ఎన్ ఎస్ డి ఎల్ () వెబ్ సైట్ ద్వారాకూడా తెలుసుకోవచ్చు.
ఈ ఐ టి పాన్ సర్వీస్ సెంటర్లు లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏ ఏ సేవలను అందిస్తాయి?
ఐ టి పాన్ సర్వీస్ సెంటర్లు లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లు పాన్ దరఖాస్తు ఫారాలను (ఫారం 49 ఏ), కొత్త పాన్‌కార్డు దరఖాస్తు ఫారాలను, పాన్ సమాచారంలో మార్పులు చేయడానికి దరఖాస్తుచేసుకునే ఫారాలను సమకూర్చుతాయి. దరఖాస్తులను పూర్తిచేయడంలో, దరఖాస్తుదారుకు సహకరిస్తాయి, పూర్తిచేసిన ఫారాలను తీసుకుని, రసీదు ఇస్తాయి. ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి పాన్ వచ్చిన తర్వాత, యు టి ఐ ఐ ఎస్ ఎల్ లేదా ఎన్ ఎస్ డి ఎల్, (ఎవరు ఆ పాన్ అందుకుంటారో వారు) దానిని కార్డు మీద ముద్రించి, దరఖాస్తుదారుకు ఆ కార్డు అందజేస్తారు.
నేను ఫారం 49 ఏ ను అసంపూర్తిగా అందజేస్తే ఏమవుతుంది?
ఐ టి పాన్ సర్వీస్ సెంటర్లు లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లు అసంపూర్తిగా వున్న లేదా లోపాలతోకూడిన పాన్ దరఖాస్తు ఫారాలను స్వీకరించవు. అయితే, దరఖాస్తుదారు అవసరం మేరకు ఫారం 49 ఏ, లేదా కొత్త పాన్‌కార్డుకోసం దరఖాస్తు, లేదా పాన్ సమాచారంలో మార్పులకు ఉద్దేశించిన దరఖాస్తు ఫారాలను సక్రమంగా పూర్తిచేయడంలో ఈ సెంటర్లు దరఖాస్తుదారులకు సహకరిస్తాయి.
ఫారం 49 ఏ దరఖాస్తుతో పాటు ఏ ఏ పత్రాలను జతచేయాలి, లేదా ఏ సమాచారం పొందుపరచాలి?
అ) వ్యక్తిగత దరఖాస్తుదారు ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోను (స్టాంపు సైజు : 3. 5 x 2. 5 సెం. మీ. ) దరఖాస్తు ఫారం పై అతికించాలి.
ఆ) గుర్తుపట్టడానికి రుజువుగా, చిరునామాకు రుజువుగా 114 నిబంధనలో పెర్కొన్న ఏదోఒక పత్రాన్ని జతచేయాలి.
ఇ) మీ దరఖాస్తును పరిశీలించే సంబంధిత ఇన్‌కంటాక్స్ అధికారి (అసెసింగ్ ఆఫీసర్) హోదాను, కోడ్ ను ఫారం 49 ఏ లో పేర్కొనాలి.
వ్యక్తిగత దరఖాస్తుదారుల విషయంలో, (మైనర్లు, హెచ్ యు ఎఫ్ దరఖాస్తుదారులతో సహా) గుర్తుపట్టడానికి రుజువుగా ఏ ఏ పత్రాలు పనికివస్తాయి?
స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, గుర్తింపుపొందిన విద్యా సంస్థనుంచి పొందిన డిగ్రీ, డిపాజిటరీ ఖాతా, క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతా, నీటి బిల్లు, రేషన్ కార్డు, ఆస్తిపన్ను విధింపు ఉత్తర్వు, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎం. పి. లేదా ఎం. ఎల్ ఏ, లేదా మునిసిపల్ కౌన్సిలర్ లేదా గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతోకూడిన గుర్తింపు పత్రం. . . వీటిలో ఏదో ఒకదాని నకలును (కాపీ) వ్యక్తిగత గుర్తింపునకు రుజువుగా అందజేయవచ్చు.
పాన్ దరఖాస్తుదారు మైనర్ అయితే, ఆ దరఖాస్తుదారు తలిదండ్రులు లేదా సంరక్షకుని కి సంబంధించి, పైన పేర్కొన్న ఏదో ఒక గుర్తింపు పత్రం అందజేయవచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్ యు ఎఫ్) తరఫున పాన్ కోసం దరఖాస్తు చేస్తే, ఆ కుటుంబ కర్తకు సంబంధించి పైన పేర్కొన్న ఏ పత్రం నకలునైనా రుజువుగా అందజేయవచ్చు.
వ్యక్తిగత దరఖాస్తుదారులకు (మైనర్లు,, హెచ్ యు ఎఫ్ దరఖాస్తుదారులతోసహా) చిరునామాకు రుజువంటే ఏమిటి?
ఎలెక్ట్రిసిటి బిల్లు, టెలిఫోన్ బిల్లు, డిపాజిటరీ ఖాతా, క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతా, నీటి బిల్లు, రేషన్ కార్డు, ఉద్యోగి గా గుర్తిస్తూ యాజమాన్యం ఇచ్చే సర్టిఫికేట్, ఆస్తిపన్ను విధింపు ఉత్తర్వు, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అద్దె రశీ దు, ఎం. పి. లేదా ఎం. ఎల్ ఏ, లేదా మునిసిపల్ కౌన్సిలర్ లేదా గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతోకూడిన చిరునామా ధ్రువీకరణ పత్రం. . . వీటిలో ఏదో ఒకదాని నకలును (కాపీ) చిరునామాకు రుజువుగా అందజేయవచ్చు.
పాన్ దరఖాస్తుదారు మైనర్ అయితే, ఆ దరఖాస్తుదారు తలిదండ్రులు లేదా సంరక్షకుని కి సంబంధించి, పైన పేర్కొన్న ఏ పత్రం నకలునైనా చిరునామాకు రుజువుగా అందజేయవచ్చు.
హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్ యు ఎఫ్) తరఫున పాన్ కోసం దరఖాస్తు చేస్తే, ఆ కుటుంబ కర్తకు సంబంధించి పైన పేర్కొన్న ఏ పత్రం నకలునైనా చిరునామాకు రుజువుగా అందజేయవచ్చు.
ఇతర దరఖాస్తుదారులకు, వ్యక్తిగత గుర్తింపునకు, చిరునామాకు రుజువుగా ఏ పత్రాలు పనికివస్తాయి?
కంపెనీల రిజిస్ట్రార్ జారీచేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నకలు ; ఫర్మ్స్ రిజిస్ట్రార్ జారీచేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నకలు; చారిటీ కమిషనర్ జారీచేసిన పార్ట్ నర్ షిప్ డీడ్ నకలు, లేదా ట్రస్ట్ డీడ్ నకలు, లేదా రిజిస్ట్రేషన్ నంబర్ సర్టిఫికేట్ నకలు ; లేదా చారిటీ కమిషనర్, లేదా సహకార సంఘాల రిజిస్ట్రార్ లేదా సంబంధిత అధికారపరిధి కలిగిన ఏ అధికారి అయినా జారీచేసిన అగ్రిమెంట్ నకలు, లేదా రిజిస్ట్రేషన్ నంబర్ సర్టిఫికేట్ నకలు ; లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వశాఖలలో దేనినుంచైనా దరఖాస్తుదారు వ్యక్తిగత గుర్తింపును, చిరునామాను వెల్లడిస్తూ జారీ అయ్యే ఇతర ఏ పత్రాన్ని అయినా ఇతర దరఖాస్తుదారుల వ్యక్తిగత గుర్తింపునకు, చిరునామాకు రుజువుగా అందజేయవచ్చు.
అసెసింగ్ ఆఫీసర్ కోడ్ తెలుసుకోవడం ఎలా?
అసెసింగ్ ఆఫీసర్ కోడ్, మీరు మీ ఇన్‌కంటాక్స్ రిటర్న్ దాఖలుచేసే ఇన్‌కంటాక్స్ కార్యాలయంలో లభించవచ్చు. అంతకుముందు, ఇన్‌కంటాక్స్ రిటర్న్ దాఖలుచేయని దరఖాస్తుదారులు, ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ నుంచిగాని,టిన్ ఫెసిలిటేషన్ సెంటర్‌నుంచిగాని, జ్యురిసిడిక్షనల్ ఇన్‌కంటాక్స్ కార్యాలయంనుంచిగాని పొందవచ్చు.
పాన్ దరఖాస్తుకు ఫోటో తప్పనిసరా?
వ్యక్తిగత దరఖాస్తుదారులకు మాత్రమే ఫోటో తప్పనిసరి
సంతకంచేయలేని దరఖాస్తుదారుల మాటేమిటి?
అలాంటివారు, ఫారం 49 ఏ లో, లేదా కొత్త పాన్‌కార్డు దరఖాస్తు ఫారంలో, లేదా పాన్ సమాచారంలో మార్పులు చేయడానికి దరఖాస్తుచేసుకునే ఫారంలో, సంతకంకోసం నిర్దేశించిన చోట, తన ఎడమమచేతి బొటనవేలి గుర్తు వేయాలి. దానిని ధ్రువీకరిస్తున్నట్టు, మేజిస్ట్రేట్, లేదా నోటరీ, లేదా ప్రభుత్వ గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి, వారి అధికారిక ముద్ర (మొహరు) వేయించి పంపాలి.
మహిళలకు తండ్రిపేరు తప్పనిసరా (వివాహిత / విడాకులు తీసుకున్న / వితంతు అభ్యర్థులతో సహా)?
పాన్ దరఖాస్తులో (ఫారం 49 ఏ లో) కేవలం తండ్రిపేరే వ్రాయవలసివుంటుంది. మహిళా దరఖాస్తుదారులు, వారి వివాహ స్థితితో నిమిత్తంలేకుండా, తండ్రిపేరు మాత్రమే వ్రాయాలి.
ఫారం 49 ఏ లో టెలిఫోన్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలా?
టెలిఫోన్ నంబర్ తప్పనిసరి కాదు. అయితే, టెలిఫోన్ నంబర్ పేర్కొంటే, సమాచారం త్వరగా అందించడానికి వీలవుతుంది.
దేశంలో నివసించని వ్యక్తి, మైనర్, మతిస్థిమితం లేని వ్యక్తి, మందమతి, బాల వారసుల తరఫున ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
ఐ టి చట్టం, 1961 లోని 160 వ సెక్షన్ ప్రకారం, దేశంలో నివసించని వ్యక్తి, మైనర్, మతిస్థిమితం లేని వ్యక్తి, మందమతి, బాల వారసులు, ఇంకా ఈ కోవకు చెందినవారి తరఫున, ప్రాతినిధ్య (రెప్రెజెంటెటివ్) అసెసీ దరఖాస్తు చేయవచ్చు.
నేను ఆదాయం పన్ను శాఖకు దరఖాస్తు చేసుకున్నాను; కాని నా పాన్ ఏమిటో నాకు తెలియదు. తెలుసుకోవడం ఎలా?
మీరు, దయచేసి ఆయకర్ సంపర్క్ కేంద్ర (ఆస్క్) ను సంప్రతించండి. ఆస్క్ ఫోన్ నంబర్: 0124-2438000 (లేదా ఎన్ సి ఆర్ నుంచి 95124-2438000), లేదా www. incometaxindia. gov. in వెబ్ సైట్‌లో (” నో యువర్ పాన్ “) నుంచి తెలుసుకోండి. ‘know your PAN’
ఐ టి పాన్ సర్వీస్ సెంటర్‌లో లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఏదైనా ఫీజు చెల్లించవలసి వుంటుందా?
ఒక్కొక్క పాన్ దరఖాస్తుకు 85 రూపాయలు + దానికి వర్తించే సర్వీసు సుంకం వసూలుచేసుకోవడానికి యు టి ఐ ఐ ఎస్ ఎల్, ఎన్ ఎస్ డి ఎల్ లకు అధికారం ఇవ్వడం జరిగింది. సురక్షితంగా వుండే పాన్ కార్డు ఖరీదు కూడా ఇందులో వున్నది. ఐ టి పాన్ సర్వీస్ సెంటర్‌లో లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించవలసి వుంటుంది.
ఒక నగరం లేదా పట్టణం నుంచి మరొక చోటికి వెళ్ళినా లేదా బదిలీ అయినా మళ్ళీ పాన్‌కోసం దరఖాస్తు చేసుకోవాలా?
పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్. . . శాశ్వత ఖాతా సంఖ్య) అనే పేరును బట్టే, అది శాశ్వత సంఖ్య. పాన్ ఖాతాదారు జీవితకాలంలో దానిలో మార్పు వుండదు. అయితే, వున్న నగరమో, పట్టణమో మారినందువల్ల అసెసింగ్ ఆఫీసర్ మారవచ్చు. అందువల్ల, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ ‘సమాచార కోశం’ (డేటా బేస్) లో తగిన విధంగా మార్పుచేయడానికి వీలుగా, ఇలాంటి మార్పులను గురించి, సమీపంలోని, ఐ టి పాన్ సర్వీస్ సెంటర్, లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్ లో తప్పనిసరిగా తెలియజేయాలి. కొత్త పాన్ కార్డు / పాన్ సమాచారంలో మార్పుల కు సంబంధించిన దరఖాస్తు రూపంలో ఈ అభ్యర్ధనలు చేయవలసి వుంటుంది.
నేను నెలక్రిందటనే యు టి ఐ టి ఎస్ ఎల్ / ఎన్ ఎస్ డి ఎల్ కు దరఖాస్తు చేశాను, కాని ఇప్పటివరకు నాకు పాన్ కార్డ్ రాలేదు. నేను ఇన్‌కంటాక్స్ రిటర్న్ దాఖలుచేయవలసి వుంది. ఏం చేయాలి?
మీరు, దయచేసి ఆయకర్ సంపర్క్ కేంద్ర (ఆస్క్) ను సంప్రతించండి. ఆస్క్ ఫోన్ నంబర్: 0124-2438000 (లేదా ఎన్ సి ఆర్ నుంచి 95124-2438000), లేదా www. incometaxindia. gov. in వెబ్’know your PAN’ (” నో యువర్ పాన్ “) నుంచి తెలుసుకోండి లేదా pan@incometaxindia. gov. in కు ఇ-మెయిల్ పంపండి.
ఆదాయం పన్ను శాఖ జారీ చేసిన కార్డులు మావద్ద ప్రస్తుతం వున్నాయి. అవి ఇకపైకూడా చెల్లుబాటు అవుతాయా?
ఆదాయం పన్ను శాఖ కేటాయించిన అన్ని పాన్ లు. , జారీచేసిన అన్ని పాన్ కార్డులు చెల్లుబాటు అవుతూనేవుంటాయి. ఒకసారి పాన్ పొందినవారు మళ్ళీ దరఖాస్తుచేయవలసిన అవసరంలేదు.
ఆదాయం పన్ను శాఖ నాకు పాన్ కార్డు జారీ చేసింది. అయితే, నేను ఇప్పుడు సురక్షితమైన పాన్ కార్డును పొందవచ్చునా?
సురక్షితమైన పాన్ కార్డు పొందడంకోసం, కొత్త పాన్‌కార్డు / పాన్‌కార్డులో సమాచా రం మార్పునకు సంబంధించిన దరఖాస్తు ఫారంలో, ఐ టి పాన్ సర్వీస్ సెంటర్ లేదా టిన్ ఫెసిలిటేషన్ సెంటర్‌కు దరఖాస్తుచేయవలసి వుంటుంది. ఈ దరఖాస్తులో మీరు మీ ప్రస్తుత పాన్ ను పేర్కొని, ఆ పాన్ కార్డును అప్పగించవలసి వుంటుంది. కొత్త పాన్‌కార్డుకోసం 60 రూపాయలు + సంబంధిత సర్వీసు చార్జి చెల్లించవలసి వుంటుంది.
నేను పాన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. నాకు పాన్ నంబర్ వచ్చిందికాని, పాన్ కార్డు ఇంకా రాలేదు. ఏం చేయాలి?
మీకు కేటాయించిన పాన్ నంబర్‌ను పేర్కొంటూ, కొత్త పాన్ కార్డు కోసం లేదా పాన్‌సమాచారంలో మార్పుకోసం ఉద్దేశించిన దరఖాస్తు ఫారాన్ని నింపి, ఏదైనా ఐ టి పాన్ సర్వీస్ సెంటర్‌లోకాని, టిన్ ఫెసిలిటేషన్ సెంటర్‌లొకాని దాఖలుచేయండి.
నేను, ఈ రోజే పన్ను చెల్లించాలనుకుంటున్నాను. కాని, నాకు పాన్ లేదు. నేను ఏం చేయాలి?
కొత్తగా పాన్ కేటాయించబడాలంటే, దాదాపు 15 రోజులు పడుతుంది. అయితే, ఇంటర్నెట్ ద్వారా దరఖాస్తు చేసి, ప్రాసెసింగ్ రుసుమును క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే, దాదాపు 5 రోజులలోనే పాన్‌ను పొందవచ్చు. కాని, పాన్ పొందడానికి తగినంత ముందుగానే చర్యలు చేపట్టాలని సలహా.
పాన్ దరఖాస్తులకు సంబంధించిన సమాచారంకోసం ఎవరిని సంప్రదిం చాలి?
ఈ విషయాలను గురించి ఈ కిందివారిని సంప్రదిం చవచ్చు:
యు టి ఐ ఐ ఎస్ ఎల్ విషయంలో | ఎన్ ఎస్‌డి ఎల్ విషయంలో |
ది వైస్ ప్రెసిడెంట్, ఐ టి పాన్ ప్రాసెసింగ్ సెంటర్, యు టి ఐ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్, ప్లాట్ నం: 3, సెక్టర్: 11, సి బి డి -బేలాపూర్, నవీ ముంబై- 400 614 ఇ-మెయిల్ : utiisl-gsd@mail. utiisl. co. in టెలిఫోన్ నం: 022-27561690ఫాక్స్ నం: 022-27561706 | ది వైస్ ప్రెసిడెంట్, ఇన్‌కం టాక్సెస్ పాన్ సర్వీసెస్ యూనిట్, ఎన్ ఎస్ డి ఎల్, 4 వ అంతస్తు, ట్రేడ్ వరల్డ్, ‘ ఏ ‘ వింగ్, కమల మిల్స్ కాంపౌండ్, ఎస్ బి మార్గ్, లోవర్ పరేల్, ముంబై-400 013 ఇ-మెయిల్ : tininfo@nsdl. co. in టెలిఫోన్ నం: 022-2499 4650 ఫాక్స్ నం: 022-2495 0664 |
ఆధారము: http://www. incometaxindia. gov. in/pan/overview. aspa