ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకుంటున్నారా? అయితే, కానీ ఖర్చు లేకుండానే అందుకు సంబంధించిన విషయమంతా ఆన్‌లైన్ ద్వారా పొందే అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది. మెసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు ఇప్పుడు ఫ్రీ ఆన్‌లైన్ టెక్నాలజీ కోర్సు ఒకటి ప్రారంభించారు. దీని ద్వారా వ్యాపార నైపుణ్యాల్ని, స్టార్టప్‌కు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఈ జ్ఞానం ఎంఐటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎంఐటి లాంచ్ ప్రోగ్రాంలు నిర్వహించే మార్గాల్ని చూపుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకునే వారికి, వ్యాపార రంగంలో ఒక లక్ష్యంగా కొత్తగా ఏదైనా చేద్దాం అనుకునే యువత కోసం రూపొందించిన ఒక వినూత్నమైన కోర్సు ఇది. ఈ ప్రయత్నంలో వారికి ఎదురయ్యే సవాళ్లను ఎలా చేదించాలో వారు చెబుతారు.
- ఎంటర్‌ప్రెన్యూర్ కావాలన్న తీవ్రమైన ఆకాంక్ష ఉన్నా, చాలా మందికి దాన్ని ఎలా ప్రారంభించాలో తెలియదు. అలాంటి వారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది హైస్కూల్, కాలేజ్ విద్యార్థులను ఉద్దేశించి రూపొందించినదే అయినా అన్ని వయసుల వారూ ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- కేవలం ఆరు వారాల శిక్షణతో సొంతంగా ఒక వెంచర్‌ను ప్రారంభించడానికి అవసరమైన సాధనాలు, నైపుణ్యాలు, విషయజ్ఞానం లభిస్తాయి.
యోగ్యతలు:ఎంటర్‌ప్రెన్యూర్‌గా గానీ, మరే వ్యాపారంలో గానీ పూర్వానుభవం ఏమీ అవసరం లేదు.
శిక్షణలో
- కొత్తగా కంపెనీని ప్రారంభించడంలో ఎదురయ్యే తీవ్రమైన ఆటంకాల్ని ఎలా అధిగమించాలి
- కొత్త వ్యాపార ఆలోచనలకు ఎలా ఆచరణ రూపం ఇవ్వాలి.
- మార్కెట్ రీసెర్చ్ చేయడం ఎలా? మీ ఉత్పత్తులు లేదా సేవలు మీ కస్టమర్‌ను చేరడం ఎలా?
- మీ సంస్థకు సంబంధించిన ప్రణాళికను రూపొందించుకుని, అందులో మీ హోదాను పెంచుకోవడం ఎలా?
- ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా వ్యాపారానికి, అమ్మకాలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఎలా
- అనే ప్రశ్నలకు, ఇతర సందేహాలకు ఈ కోర్సులో పూర్తి సమాధానాలు లభిస్తాయి.
మరింత సమాచారం కోసం entrepreneurship