Home

PF అకౌంట్ ఉందా? ఒక్క రూపాయి చెల్లించకుండానే మీకు రూ.6 లక్షలు బెనిఫిట్..!

Wealthtech Speaks Employees' Deposit Linked Insurance Scheme (EDLI)

మీకు EPF (ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) అకౌంట్ ఉందా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకోసమే. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు వచ్చే లాభాలపై మీకు అవగాహన ఉందా? ఇది తెలియక పోతే మీరు ఇన్స్యూరెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహించే ‘ఈడీఎల్ఐ’ (EDLI) స్కీమ్‌కు అర్హులే. అయితే దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

పీఎఫ్ అకౌంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఈపీఎఫ్ అకౌంట్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ఒక కంపెనీలో 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే.. అప్పుడు ఆ కంపెనీ కచ్చితంగా ఈపీఎఫ్ సేవలను ఎంప్లాయీస్‌కు అందుబాటులో ఉంచాలి. ఈపీఎఫ్ అకౌంట్ ముఖ్య ఉద్దేశం రిటైర్మెంట్ బెనిఫిట్స్. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఉత్తమమైన రిటైర్మెంట్ సేవింగ్ సాధనాల్లో ఈపీఎఫ్ కూడా ఒకటి.

మూడు సేవింగ్ స్కీమ్స్..

ఈపీఎఫ్ స్కీమ్‌లో చేరడం వల్ల పదవీ విరమణ తర్వాత కచ్చితమైన రాబడి పొందొచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. కాగా ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లు మూడు రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ అనేవి ఇవి. తొలి రెండూ అంటే ఈపీఎఫ్, ఈపీఎస్ అనేవి సేవింగ్స్ స్కీమ్స్. ఇక ఈడీఎల్ఐ (ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్) అనేది ఇన్సూరెన్స్ స్కీమ్.

ఈడీఎల్ఐ అంటే ఏంటి?

అసలు ఈడీఎల్ఐ స్కీమ్ ఏంటంటే? ఇది బీమా పథకం. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఈపీఎఫ్‌ఓ అందించే బీమా ప్రయోజనం. ఇటీవల ఈ స్కీమ్‌కి సంబంధించి కొన్ని సవరణలు చేసింది ఈపీఎఫ్‌ఓ. ఎక్కువ మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈ ఇన్సూరెన్స్ లాభాలు అందించేందుకు ఈపీఎఫ్ఓ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈపీఎఫ్ సబ్‌స్కైబర్ చనిపోవడానికి ముందు ఒక సంవత్సరానికి ముందు ఒక సంస్థ లేదా అంతకంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేసి సర్వీసులో మరణించినట్టైతే వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ బీమా ప్రయోజనం కల్పించాలని EPFO నిర్ణయం తీసుకుంది. గతంలో ఇలాంటి నియమాలు ఉండేవి కావు.

ఈడీఎల్ఐ స్కీమ్ కొత్తదేమీ కాదు. 1976 నుంచే అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగులకు ఈపీఎఫ్ మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్న ప్రతి కంపెనీకి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ వల్ల ఉద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగి మరణిస్తే.. అప్పుడు వారికి ఈ ఈపీఎఫ్‌వో స్కీమ్ నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఈపీఎఫ్‌వో చట్టం కింద రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీకి ఇది వర్తిస్తుంది. ఈ కంపెనీలు ఈ స్కీమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకొని ఉద్యోగులకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్‌ను అందించాల్సి ఉంటుంది.

స్కీమ్‌లో ఎలా చేరాలి?

ఈడీఎల్ఐ స్కీమ్‌లో ప్రత్యేకంగా చేరాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ ఈపీఎస్ సేవింగ్స్ స్కీమ్స్‌తో లింక్ అయ్యి ఈ పథకంప నిచేస్తుంది. అంటే ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు అందరికీ ఈడీఎల్ఐ స్కీమ్ వర్తిస్తుంది. ఆటోమేటిక్‌గానే ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ స్కీమ్ కోసం ఉద్యోగులు పరోక్షంగా కంట్రిబ్యూట్ చేస్తారు. మీరు పని చేస్తున్న కంపెనీ ఈ స్కీమ్‌కు మీ తరుపున కంట్రిబ్యూషన్ చేస్తుంది. డీఏ, శాలరీ ప్రాతిపదికన కంట్రిబ్యూట్ మొత్తం డిసైడ్ అవుతుంది. కంపెనీ గరిష్టంగా 0.50 శాతం లేదా రూ.75లను ఈడీఎల్‌ఐ స్కీమ్‌కు మీ తరుపున కంట్రిబ్యూట్ చేస్తుంది.

స్కీమ్ ప్రయోజనాలు

ఈ స్కీమ్ ద్వారా రరూ.2.5 నుంచి రూ.6 లక్షల వరకు ఉచితంగా బీమా పొందవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగా మరణిస్తేనే.. సంబంధించిన నామినీకి ఈ బీమా మొత్తం లభిస్తుంది. అయితే ఈడీఎల్ఐ స్కీమ్ నెలకు బేసిక్ సాలరీ రూ.15 వేల లోపు ఉన్నవారందరికీ వర్తిస్తుంది. బేసిక్ సాలరీ రూ.15 వేలు దాటితే గరిష్టంగా రూ.6 లక్షల వరకే బీమా ఉంటుంది.

ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగి మరణం తర్వాత నామినీకి శాలరీకి 30 రెట్లు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఇక్కడ శాలరీ అంటే కేవలం డీఏ, బేసిక్ శాలరీని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ డబ్బుతోపాటు అదనంగా రూ.1.5 లక్షల బోనస్ కూడా అందజేస్తారు. కంపెనీలు ఉద్యోగులకు ఈడీఎల్ఐ స్కీమ్ కన్నా మంచి ఇన్సూరెన్స్ పథకాన్ని అందజేస్తే.. అప్పుడు ఈ స్కీమ్ నుంచి తప్పుకోవచ్చు. ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడే మరణిస్తే.. నామినీకి గరిష్టంగా రూ.6 లక్షల వరకు లభిస్తాయి.

డబ్బు ఎలా క్లెయిమ్ చేయాలి?

అయితే ఈడీఎల్ స్కీమ్‌లో చేరడానికి ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంప్లాయిర్ మాత్రం బేసిక్ సాలరీలో రూ.5 శాతం లేదా గరిష్టంగా 75 రూపాయలు ప్రతీ నెల చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ చనిపోతే నామినీ ఈ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు.

 ఒకవేళ నామినీ కూడా మరణిస్తే.. అప్పుడు వారి బంధువులు క్లెయిమ్ డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ పెద్ద కొడుకు తీసుకోవడానికి వీలు లేదు. అలాగే కూతురు ఉండి, ఆమెకు పెళ్లై ఉండి భర్త జీవించి ఉంటే.. అప్పుడు వీరికి కూడా క్లెయిమ్ డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలని భావిస్తే.. అప్పుడు ఫామ్ 5ని ఫిల్ చేసి ఈపీఎఫ్‌వో ఆఫీస్‌లో అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈడీఎల్ఐ మెబర్ డెత్ సర్టిఫికెట్, గార్డియన్‌షిప్ సర్టిఫికెట్, సక్సెషన్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

ఉదాహరణ గమనిస్తే..

ఈడీఎల్ఐ స్కీమ్ ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుంద్దాం. ఒక ఉద్యోగి ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్‌గా కొనసాగుతున్నారు. ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ స్కీమ్స్‌లో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగి డ్యూటీలో మరణించారు. ఈ ఉద్యోగి నెలవారీ జీతం రూ.15,000గా ఉంది. ఇప్పుడు ఉద్యోగి నామినీ ఈడీఎల్ఐ క్లెయిమ్ కోసం అప్లై చేసుకున్నారు. నామినీకి రూ.6 లక్షలు (30 x Rs 15,000) + (Rs 1,50,000) వస్తాయి.

admin:
All Rights ReservedView Non-AMP Version