Home

క్రెడిట్ కార్డ్

credit card

క్రెడిట్ కార్డులను వినియోగించే ముందు అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి, దానిని వినియోగించే విధానం మొదలైన అంశాలను వినియోగ దారుడు తెలుసుకోవడం ముఖ్యం. క్రెడిట్ కార్డ్ ను మీరు ఎలా వినియోగిస్తారో, ఏ విధంగా నిర్వహిస్తారో అనే దానిపై మీ ఆర్ధిక భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీ ఆర్ధిక భవిష్యత్ పై క్రెడిట్ కార్డుల వినియోగ ప్రభావం ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ అంటే అసలు అర్ధమేమిటి?

ఇది ప్లాస్టిక్ కార్డ్ మాత్రమే కాదు. ఇది ఒక ఆర్ధిక సంస్థ నుంచి మీరు పొందే ఋణానికి ఆధారమైనది. ఈ కార్డు ద్వారా మీరు ఋణాన్ని పొంది ఆ మొత్తాన్ని నిర్దేశించిన నెలవారి వాయిదాలలో తిరిగి చెల్లించేందుకు ఉపయోగడే సాధనం. మీకు జారీ చేయబడిన క్రెడిట్ కార్డ్ లో కొంత సొమ్మును మీరు పొందేటందుకు పరిమితి విధిస్తారు. మీరు పెట్టే ఖర్చు ఆ పరిమితికి లోబడి ఉండాలి. క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు చేసిన కొనుగోళ్లకు మొత్తం ఋణం, వడ్డీ లేకుండా మీరు ఒకే వాయిదాలో చెల్లించేందుకు ఆర్ధిక సంస్థలు కాల వ్యవధి (గ్రేస్ పిరియడ్ ) ఇచ్చినట్లయితే సరేసరి, లేకపోయినట్లయితే మీరు చెల్లించే మొత్తానికి వడ్దీతో సహా చెల్లించవలసి ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్ ను అవసరమైన మేరకే వినియోగించి మీ ఆర్ధిక స్తోమతను నెలవారీగా సక్రమంగా నిర్వహించుకోవచ్చు .

మూడు రకాలైన క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి

సాధారణ అవసరాలకు ఉపయోగ పడే(రివాల్వింగ్ క్రెడిట్ కార్డులు):

క్రెడిట్ కార్డులు వీటిని ఏ అవసరాలకైనా వాడుకోవచ్చు. దుస్తులు మొదలుకొని విమాన ప్రయాణాల వరకు వాడుకోవచ్చు. వీసా® ,మరియు మాస్టర్ కార్డ్ ® క్రెడిట్ కార్డులు ఇటువంటివే . మీరు చేసే ఖర్చులలో మార్పుల కోసం నెలవారీ కొనుగోళ్లు చేసి చెల్లించేందుకు జి పి సి క్రెడిట్ కార్డ్ లు ఉపయోగపడ్తాయి .మీరు కొనుగోలు చేసిన మొత్తం ఒకే వాయిదాలో వడ్డీలేకుండా ఒక నెలవరకు కాలపరిమితి ఇవ్వబడుతుందని గుర్తుంచుకోండి. మీరు కొనుగోలు చేసిన వస్తువులు, సరుకులకు పూర్తి చెల్లింపు ఒక నెల లోపల చేయనట్లయితే మరుసటి నెలనుంచి కొనుగోలు చేసిన నాటినుంచి చెల్లించని మొత్తానికి, ( కొంత మొత్తం చెల్లించి నట్లయితే ) మిగిలిన మొత్తానికి వడ్డీ వసూలు చేయబడుతుంది.

స్టోర్ కార్డులు

(ప్రత్యేక కాలపరిమితి, ఒకే రకానికి మాత్రమే వినియోగపడే కార్డులు). ఇవి ఒక ప్రత్యేక కారణానికి ఒక స్టోరు లేదా కొన్ని దుకాణాల సముదాయంలో వస్తువులు, సరుకులు కొనుగోలు కోసం జారీ చేయబడినవి. డిపార్ట్ మెంట్ స్టోర్ కార్డులు, ప్రముఖ దుస్తుల దుకాణాలు, నగల దుకాణాలు అందించే క్రెడిట్ కార్డుల వంటివి. ఈ కార్డులపై వడ్డీ రేటు చాలా అధికంగా ఉంటుంది. కొన్ని దుకాణాలు మీరు కొనే కొనుగోళ్ళపై మొదటి దఫా 15 శాతం దాకా తగ్గింపు ఇస్తాయి. తమ సరుకుల, వస్తువుల అమ్మకాలను పెంచుకునేందుకు ఈ రాయితీ కల్పిస్తారు. ఆ దుకాణాల్లో మీరు ఖాతా తెరచిన తదుపరి ఈ రాయితీ కల్పిస్తారు. ఎక్కువ కాలపరిమితి కల్గిన పక్షంలో ఈ అధికవడ్దీ రేటు పెద్దగా వినియోగదారులను బాధించదు.

సాంప్రదాయబద్ధమైన వడ్డీ వేసే కార్డులు

ఈ కార్డ్ లను వినియోగించేటప్పుడు మీరు చేసే కొనుగోళ్లకు, పొందే సేవలకు మీకిచ్చిన కాల వ్యవధిలో ఒకేదఫా మొత్తం ఋణం చెల్లించవలసి ఉంటుంది. ఇటువంటి ఋణాలకు సాధారణంగా వడ్డీ చెల్లించవలసిన అవసరమేర్పడదు. కాని క్రమం తప్పకుండా నెలవారీ వాయిదాలతో సంస్థ పేర్కొన్న రీతిలో మిగిలిన మొత్తం చెల్లించవలసి ఉంటుంది. చార్జ్ కార్డులను ప్రయాణాల, వినోదాల కార్డులుగా పిలుస్తారు. అమెరికన్ ఎక్స్ प्रेशरప్రెస్®, డైనర్స్ క్లబ్® కార్డులవంటివే.

క్రెడిట్ కార్డ్ వినియోగంతో వచ్చే ప్రయోజనాలు.

  • చెక్కులు వ్రాసి జారీ చెయ్యడం లేదా నగదును మీతో తీసుకువెళ్ళవలసిన అవసరముండదు.
  • మీరు అనుకోకుండా ఖర్చు చేయవలసి వచ్చినప్పుడు, అనుకోకుండా నగదు చెల్లింపులు చేయవలసి వచ్చినప్పుడు అంటే కారు మరమ్మత్తులు, వైద్య ఖర్చుల వంటివి.
  • మీకు అవసరమైనప్పుడు మీవద్ద నగదులేని సమయాల్లో అంటే భోజనం, దినసరి వెచ్చాలు, నీరు, గ్యాస్ వంటి వాటికి ఖర్చు చేయవలసినప్పుడు.
  • మీరు నెలలో చేసిన ఖర్చులు కొనుగోళ్లతో సహా నెలవారీ వివరణ పొందడం వలన మీరు చేసే ఖర్చు వివరాలు తెలుసుకోగల్గుతారు.
  • మీరు చేసే ఖర్చును ఒకే దఫా నెలవారీ చెల్లింపు ద్వారా క్రమపద్ధతి లో నిర్వహించవచ్చు.
  • మీరు చేసిన కొనుగోళ్లకు రక్షణ కల్పించ బడుతుంది. కొన్న వస్తువులకు హామీ ఇవ్వబడుతుంది.
క్రెడిట్ కార్డుల వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
  • కార్డుపై వసూలు చేసే చార్జీలకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది.
  • మీరు కొనుగోలు చేసే కొనుగోళ్లపై వసూలు చేసే ఆర్ధిక సంబంధమైన చార్జీల (పై వన్నియు) వల్ల మీ వస్తువుల ధర మరి కొంత పెరగవచ్చు.
  • మీరు మీ కార్డును ఇచ్చిన ఋణపరినమితికి మించి వినియోగించుకున్నచో, ఆ అధిక ఋణానికి అపరాధ రుసుము, అలాగే ఇచ్చిన కాలపరిమితి (నెలవారీ వాయిదాలు సక్రమంగా చెల్లించనట్లయితే) అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి మీ కార్డ్ ఖాతాను సక్రమంగా నిర్వహించుకోవాలి.
  • మీరు మీ బడ్జెట్ ను రూపొందించుకోవాలి. మీరు చేసిన ప్రతి ఖర్చును తిరిగి చెల్లించవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
  • ఎక్కువ కొనుగోళ్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ బడ్జెట్ కు మీ ఆర్ధిక స్తోమతకు మించి ఖర్చు చేయవద్దు.
  • మీరు పొందే ఋణపరపతి పై మీరు చెల్లించే అపరాధ రుసుము అంటే ఇచ్చిన కాలపరిమితి దాటిన తర్వాత చెల్లించే అధిక వడ్డీ, నెలసరి వాయిదాలను సక్రమంగా చెల్లించకపోవడం వల్ల చెల్లించే అధిక వడ్డీపై ప్రభావం చూపుతాయి.
క్రెడిట్ కార్డులను బాధ్యతాయుతంగా వినియోగించాలి

నెలవారీ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డ్ లు మీకు సాధారణ రీతిలో ఎక్కువ సదుపాయం కల్గించేందుకు ఉపయోగపడతాయి. అయితే ఈ సదుపాయాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. మీరు మీ యొక్క కార్డును సక్రమంగా ఉపయోగిస్తే, మీకు ఋణాలిచ్చేవారు ఋణాన్ని మీరు ఎలా వినియోగించుకోవాలో అవగాహన కలిగిన వారైనట్లు గుర్తిస్తారు. ఋణదాతలు మీకు ఉన్న విశ్వసనీయత ఆధారంగా మీకు పెద్దమొత్తంలో విలువైన వస్తువులకొనుగోళ్లు – కారు లేదా ఇల్లు వంటి వాటికి ఋణం మంజూరు చేస్తారు.

క్రెడిట్ కార్డ్ మీరు ఎందుకు ఉపయోగిస్తారన్నది ముఖ్యం కాదు, మీరే ముఖ్యం
  • మీరు పొందిన నెలవారీ పద్దు లో పేర్కొన్న చెల్లించవలసిన కనీస మొత్తాన్ని మీరు తప్పక చెల్లించండి. మీకు వచ్చిన నెలవారీ కనీస మొత్తాన్ని కాని లేదా నెలవారీ చెల్లించవలసిన మొత్తాన్ని గాని చెల్లించినట్లయితే ఆ చెల్లింపు మీకు మేలు కల్గిస్తుంది. మీకు అధిక మొత్తంలో వడ్దీ చెల్లించవలసిన పరిస్థితి రాదు.
  • మీరు చెల్లించే ప్రతీ చెల్లింపు ప్రతిసారి సరిఅయిన సమయంలో సక్రమంగా చెల్లించండి.
  • మీ కార్డులో పేర్కొన్న పరిమితి కి లోబడి మీ మొత్తం లావాదేవీలను నిర్వహించే జాగురూకత కలిగి ఉండండి.
  • మీరు చెల్లించలేని స్థాయిలో మీఖర్చులను పెంచుకోకండి. ఈ మార్గదర్శక సూత్రాన్ని మీరు గమనించక తప్పదు. క్రెడిట్ కార్డ్ పై తెచ్చిన ఋణాన్ని లేదా చేసే ఖర్చును (అద్దెలు లేదా తనఖా చెల్లింపులు మినహాయించి) మీరు పన్ను చెల్లించగా మిగిలిన ఆదాయంలో 20 శాతం మించకుండా జాగ్రత్త వహించాలి.
ఋణం వల్ల వచ్చే ఇబ్బందులను గమనించండి
  • బిల్లులు వచ్చేటంతవరకు మీరు ఎంత బాకీ వున్నారో మీకు తెలియదు.
  • మీరు కొన్ని సమయాలలో ఋణాల చెల్లింపులో జాప్యం చేసే అవకాశముంది.
  • కొన్ని సమయాలలో మీరు క్రెడిట్ కార్డు లో పేర్కొన్న కనీస ఋణం చెల్లింపు కూడా చేయలేకపోవచ్చు.
  • మీరు తరచు ఋణ పరిమితికి మించి ఖర్చు చేయవచ్చు.
  • మీకున్న ఋణ పరిమితిని వినియోగించుకోవచ్చును లేదా నగదు తీసుకుని బిల్లులు చెల్లించవచ్చను.
ఋణ బాధలను ఏ విధంగా ఎదుర్కోవాలి
  • మీరు ఋణదాతలతో ముఖాముఖి మాట్లాడండి. దీని వలన వారు ఋణాన్ని చెల్లించాల్సిన విధానం మరియు చెల్లింపు పట్టికను యేర్పాటు చేస్తారు.
  • అప్పటినుంచి మీరు క్రెడిట్ కార్డ్ లను వినియోగించకుండా ఆపివేయండి .
మీ స్తోమత తెలుసుకోండి

మీ ఆర్ధిక స్తోమత మించి ఖర్చు చేయవచ్చు. ఖరీదైన కొనుగోళ్ళు చేసి ఋణాన్ని పెంచుకోవచ్చు. మీ ఆర్ధిక స్తోమతను దృష్టిలో పెట్టుకుని విజ్ఞతతో క్రెడిట్ కార్డ్ ను వినియోగించాలి.

ఋణాల చెల్లింపు ప్రణాళిక రూపొందించుకోవడం

ప్రతి నెలా మీ కార్డుపై చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించనట్లయితే కనీసం మీపై ఋణదాతలు వసూలు చేసే ఛార్జీలపై అవగాహన కలిగి ఉండాలి. మీరు నెలవారీ చెల్లించవలసిన మొత్తం, దానిపై ఋణదాతలు వసూలుచేసే ఛార్జీ మీరు చెల్లించని మిగులు మొత్తంపై వసూలు చేసే వడ్దీపై అవగాహనకల్గి ఉండాలి. మీ క్రెడిట్ కార్డ్ నకు చెల్లించిన కనీస మొత్తం తర్వాత మిగులు సొమ్మును త్వరితగతిని చెల్లించే ప్రణాళిక లేదా ఆలోచన కల్గి ఉండాలి. అటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీరు ఋణాన్ని వినియోగించడంలో సమర్ధులుగా, బాధ్యతగల వారిగా గుర్తింపు పొందగలరు.

క్రెడిట్ కార్డ్ ను జాగ్రత్తపరచడం గురించి

నేరస్థుల నుంచి మిమ్ములను రక్షించేందుకు ఆర్ధిక సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తునే ఉంటాయి. మీ కార్డు పోయినా దొంగలించబడిన లేదా మీరు ఆర్ధికంగా మోసానికి గురయినట్లయితే మీకు కార్డు జారీ చేసిన సంస్థలను వెంటనే సంప్రదించండి.

డెబిట్ కార్డుకు – క్రెడిట్ కార్డుకు గల భేదం

మీరు చేసిన ప్రతి కొనుగోలు లేదా పొందిన నగదుకు డెబిట్ కార్డు నేరుగా మీ యొక్క ఖాతానుంచి ఆ సొమ్మును మినహాయిస్తే, క్రెడిట్ కార్డ్ మీ యొక్క లావాదేవీల యొక్క బిల్లులను మీఖాతాకు సమర్పించి అందులో నుంచి మినహాయిస్తుంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు మీ ఖాతానుంచి ఋణదాతకు చెల్లించబవలసి ఉంటుంది.

కొన్ని సందర్భాలలో ఊహించని పరిణామాలు సంభవించవచ్చు. మీ కార్డు పోవడం గాని, దొంగలింపబడడంగానీ జరగవచ్చు. ఆ పరిస్థితిలో తక్షణమే మీ బ్యాంకును సంప్రదించండి. అటువంటప్పుడు జరిగే మోసాలకు మీరు బాధ్యులు కానవసరంలేదు.

admin:
All Rights ReservedView Non-AMP Version