షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు అందరూ చూసే వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్ అనగా ఏమి ?
వార్షిక నివేదిక లేదా అన్యూవల్ రిపోర్ట్ అనగా ఒక ఆర్ధిక సంవత్సరంలో ఏదేని కంపెనీ లేదా వ్యాపారం యొక్క ఆదాయం, ఖర్చులు, ఆ ఆర్ధిక సంవత్సరంలో జరిగిన కొత్త ఒప్పందాలు , చేరుకున్న మైలు రాళ్ళు ,మేనేజ్మెంట్ లో మార్పులు చేర్పులు, ముఖ్యమైన సిబ్బంది మార్పులు చేర్పులు, భవిష్యత్తు ప్రణాళికలు మొదలగునవి పొందుపర్చినటువంటి నివేదిక . ఈ నివేదికను మేనేజ్మెంట్ రూపొందించి దానిని షేర్ హోల్డర్స్, అంటే వాటా దారులకు, ప్రమోటర్లకు , వివిధ ప్రభుత్వ విభాగాలకు , సెబీ కి, అందచేస్తుంది.సాదారణ ప్రజానీకానికి మరియు ఆ కంపెనీ లేదా వ్యాపారం పై ఆసక్తి ఉన్న వారందరికి అందుబాటులో ఉంటుంది. సాదారణంగా వార్షిక నివేదిక ను పుస్తక రూపంలో రూపొందిస్తారు. దానిలో చైర్మన్ సందేశం మొదలుకొని భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయి.
సాధారణంగా వార్షిక నివేదిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నుండి వాటాదారులకు ఒక లేఖ అన్నమాట. దీనిలో అందరూ బోర్డు సభ్యులు, ఆడిటర్లు, సెక్రటరీ మొదలగు వారీ యొక్క ఫోన్ నంబర్లు ఒక జాబితా రూపంలో ఉంటాయి.తదుపరి పేజీలలో బ్యాలెన్స్ షీట్ వంటి వివరణాత్మక ఆర్థిక నివేదికలు, ఆదాయ ప్రకటన, సహాయక షెడ్యూళ్లు సంస్థ కార్యకలాపాల మీద ఒక సాధారణ నివేదిక, ఒక స్వతంత్ర ఆడిటర్ యొక్క నివేదిక మొదలగునవి పొందుపరుస్తారు. అంతే కాకుండా కంపెనీ లో వివిధ వర్గాల వాటా ఏ విధంగా ఉంది మొదలగు వివరాలు
ఉంటాయి. అంటే కంపెనీలో ఎవరేవ్వరికి ఎంత భాగస్వామ్య వాటా ఉంది అనే వివరాలు. కంపెనీ యొక్క షేరు ధర చరిత్ర మొత్తం అంటే షేరు యొక్క గరిష్ట , కనిష్ట ధరల వివరాలు ఉంటాయి. సంస్థ సాధించిన అన్ని మైలురాళ్ళు మరియు విజయాలు వివరిస్తూ చిత్రాలు మరియు గ్రాఫ్లు మొదలగునవి కూడా ఉంటాయి.
సాధారణంగా ఒక వార్షిక నివేదికలో వ్యాపార అనుకూల అంశాలు ద్విగుణీకృతం చేస్తూ అంటే గొప్పగా చెప్తూ , ప్రతికూల అంశాలపై తక్కువ శ్రద్ధ చూపెడతాయి.కాబట్టి, మీరు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వార్షిక నివేదికను చదవ వలసి ఉంటుంది. చైర్మన్ తన సందేశంలో పరోక్షంగా లక్ష్యాలు సాధించలేనందుకు క్షమాపణలు కూడా చెప్పి ఉండవచ్చు. మీరు గతంలో చెప్పిన భవిష్యత్ ప్రణాళికలు సాధించారా లేదా అని తెలుసుకోవడానికి గత ఆర్ధిక సంవత్సర వార్షిక నివేదికతో పోల్చి చూస్తే లక్ష్యాలు చేరుకున్నది లేనిది సులభంగా తెలిసిపోతుంది. పూర్తిగా ఒక వార్షిక నివేదికను చదివి అర్థం చేసుకోవాలి అంటే కొంత నైపుణ్యం మరియు సహనం అవసరం అవుతుంది. మీరు ఒక కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఆ వార్షిక నివేదిక ద్వారా ఆ సంస్థ యొక్క కార్యకలాపాలను మరింత లోతుగా అర్ధం చేసుకోవడానికి సహాయ పడుతుంది.మీరు వార్షిక నివేదిక ద్వారా క్రింది విషయాలపై ఒక అవగాహన కు రాగలుగుతారు.
Letter from the CEO
Summary of the operations-milestones, achievements, prospects.
Past Annual summary of all financial figures.
Management discussion and analysis of the performance of the company
The balance sheet
The income statement
Auditor’s report
Subsidiaries, brands, addresses, registered office, head quarters etc..
Names of directors
Stock price history