Home

మదుపుదారులు చేయవలసిన, చేయకూడని అంశాలు General DO’s and DON’Ts for Investors

stock market down

గతంలో కంటె ఇటీవల, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిపెట్టే / వ్యాపారంచేసే మదుపుదారుల సంఖ్య బాగా పెరుగుతున్నది. అందువల్ల, స్టాక్ మార్కెట్ విషయంలో మదుపుదారులు ఏమేమి చేయాలో, ఏవి చేయకూడదో తెలుసుకోవడం అవసరం. మదుపుదారులు పాటించవలసిన, పాటించకూడని కొన్ని సాధారణ అంశాలను ఈ క్రింద పేర్కొనడం జరిగింది.

చేయవలసినవి: DOs:-

  • సెబి / స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లలో నమోదుచేసుకున్న మధ్యవర్తులతోనే వ్యవహరించండి.
  • మీరు ఖాతాదారుగా నమోదు చేసుకోవడం పూర్తయినవెంటనే, అందుకు సంబంధించిన అన్ని దస్తావేజుల జిరాక్స్ కాపీలను తీసుకుని, మీవద్ద వుంచుకోండి.
  • మీ బ్రోకర్ / ఏజెంట్ / డిపాజిటరీ పార్టిసిపెంట్ కు ఎలాంటి గందరగోళం లేని, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి.
  • లావాదేవీలు జరిగిన ప్రతిసారి, మీ బ్రోకర్‌ను మీకు కాంట్రాక్టు నోట్ ఇవ్వమనండి. లావాదేవీలపై ఏదైనా అనుమానం వస్తే, బి ఎస్ ఇ వెబ్‌సైట్‌లో సరిచూసుకోండి.
  • మార్కెట్‌లోని మధ్యవర్తులకు చెల్లించవలసిన మొత్తాలను బ్యాంకులద్వారా మాత్రమే చెల్లించండి.
  • ఏవైనా షేర్లను కొనవలసిందిగా, మార్కెట్ మధ్యవర్తులకు చెప్పేముందు, ఆ కంపెనీ తీరుతెన్నులేమిటి, దాని సామర్ధ్యం ఎంత, యాజమాన్యం ఎలా వుంది, మౌలిక ప్రాతిపదికలు (ఫండమెంటల్స్) ఎలా వున్నాయి, ఆ కంపెనీ ఇటీవల చేసిన ప్రకటనలేమిటి, వివిధ నిబంధనలకింద ఆ కంపెనీ వెల్లడించిన విషయాలేమిటి అనేవి పరిశీలించి తెలుసుకోవాలి. ఎక్స్‌ఛేంజుల, కంపెనీల వెబ్‌సైట్ల ద్వారా, డేటా వెండర్ సమాచార దర్శనుల(డేటా బేస్) ద్వారా, వ్యాపారానికి సంబంధించిన పత్రికల ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు
  • మీరు ఎంత నష్టాన్ని భరించగలుగుతారో, అందుకు అనుగుణమైన వ్యాపార / పెట్టుబడి వ్యూహాలను అనుసరించాలి. ఎందుకంటే, షేర్ మార్కెట్లో పెట్టే ఏ పెట్టుబడిలోనైనా, ఎంతో కొంత నష్ట భయం వుండనే వుంటుంది. మీరు అనుసరించే వ్యూహాన్నిబట్టి ఆ నష్టభయం హెచ్చు తగ్గులు ఆధారపడి వుంటాయి.
  • ఏ మధ్యవర్తితోనైనా మీరు ఖాతాదారుగా నమోదుచేసుకోవడానికి ముందు, తగిన పరిశీలన అవసరం. బ్రోకర్ల ద్వారా వ్యాపారం జరపడానికి అవసరమైన, పెట్టుబడిదారు నమోదు దస్తావేజులలోని, ‘ రిస్క్ డిస్‌క్లోజర్ డాక్యుమెంట్ ‘ ( నష్ట భయాన్ని వెల్లడించే పత్రం ) లోని అంశాలను జాగ్రత్తగా చదివి, అర్ధం చేసుకోండి.
  • హఠాత్తుగా ధర పెరిగే షేర్లతో జాగ్రత్త; ముఖ్యంగా తక్కువ ధర షేర్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం
  • స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులకు ఖచ్చితంగా లాభం వస్తుందన్న హామీ ఏమీ వుండదు.
  • పెట్టుబడులకు సంబంధించిన అన్నిరకాల పత్రాల ( దరఖాస్తులు, రసీదులు, కాంట్రాక్ట్ నోట్ మొదలైనవి ) ప్రతులను ( జిరాక్స్ కాపీలను ) తీయించి మీవద్ద వుంచుకోండి.
  • ముఖ్యమైన పత్రాలను పంపేటప్పుడు అవి తప్పక చేరే విధంగా పంపండి. ( రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపడం మంచిది ) .
  • మీవద్ద డబ్బు వున్నదని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే, కొనండి
  • మీ వద్ద సెక్యూరిటీలు వున్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే అమ్మండి.
  • లావాదేవీల పత్రాలు సరిగా అందేలా తగిన వాకబు చేయండి. ఉదాహరణకు, మీకు అందవలసిన దస్తావేజులు , తగిన వ్యవధిలోగా అందకపోతే, తక్షణమే, సంబంధితులతో ( వ్యాపార సభ్యుడు లేదా కంపెనీని) సంప్రదించండి.
  • మీ లావాదేవీలను, నేరుగా దస్తావేజుల పత్రాల రూపంలోనే జరుపుతారా, లేక డి మాట్ రూపంలో జరుపుతారా అనే విషయం మీరు స్పష్టంగా పేర్కొనాలి.
  • మీ వ్యాపార సభ్యునిపై ఏదైనా ఫిర్యాదు చేయాలనుకున్నా, లేక మధ్యవర్తిత్వంకోసం దరఖాస్తుచేయాలనుకున్నా, మీ భౌగోళిక పరిధికి సంబంధించిన మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి దరఖాస్తు చేయాలి. మీ వ్యాపార సభ్యునికి , చట్ట ప్రకారం, మీరు తెలియజేసిన మీ చిరునామానుబట్టి, భౌగోళిక పరిధిని నిర్ణయించుకోవాలి. సంబంధిత మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రం భౌగోళిక వివరాలు, కాంట్రాక్ట్ నోట్‌లో కూడా వుంటాయి.
  • నేరుగా ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రంలో దాఖలుచేసే ఫిర్యాదు, లేదా మధ్యవర్తిత్వ దరఖాస్తుకు ” కాల పరిమితిని ” లెక్కించడంలో, ఐ జి ఆర్ సి సేవల ద్వారా ఫిర్యాదును పరిష్కరించే ప్రయత్నానికి పట్టిన కాలాన్ని లెక్కలోకి తీసుకోరు.
    బి ఎస్ ఇ లో నమోదైన ఏదైనా కంపెనీపై ఫిర్యాదు చేయాలనుకుంటే, మీ భౌగోళిక పరిధికి సంబంధించిన మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి దరఖాస్తు చేయాలి. మీ చిరునామానుబట్టి, మీ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రం భౌగోళిక పరిధిని నిర్ణయించుకోవాలి. ఈ విధంగా చేస్తే, మీ ఫిర్యాదును త్వరగా చేపట్టడానికి వీలవుతుంది.

చేయకూడనివి: DONTs :-

  • మీ లావాదేవీలను, సెబి / స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లలో నమోదుచేసుకొనని బ్రోకర్లు / సబ్ బ్రోకర్లతోకాని, నమోదుచేసుకోని ఇతర మధ్యవర్తులతో కాని నిర్వహించవద్దు.
  • పూర్తిగా చదివి అర్ధం చేసుకోనిదే, ఎలాంటి దస్తావేజులపైన సంతకాలు చేయవద్దు.
  • మీ భౌగోళిక పరిధికి సంబంధించని ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి , ఫిర్యాదులు లేదా మధ్యవర్తిత్వ దరఖాస్తులు చేసుకోవద్దు. మీ వ్యాపార సభ్యునికి , చట్ట ప్రకారం, మీరు తెలియజేసిన మీ చిరునామానుబట్టి, భౌగోళిక పరిధిని నిర్ణయించుకోవాలి. మదుపుదారుల ఫిర్యాదులను ఎక్స్ ఛేంజీలు, మధ్యవర్తిత్వం ద్వారా లేదా ఐ జి ఆర్ సి పద్ధతి ద్వారా పరిష్కరిస్తాయి. నేరుగా ప్రాంతీయ మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రంలో దాఖలుచేసే ఫిర్యాదు, లేదా మధ్యవర్తిత్వ దరఖాస్తుకు ” కాల పరిమితిని ” లెక్కించడంలో, ఐ జి ఆర్ సి సేవల ద్వారా ఫిర్యాదును పరిష్కరించే ప్రయత్నానికి పట్టిన కాలాన్ని లెక్కలోకి తీసుకోరు.

బి ఎస్ ఇ లో నమోదైన ఏదైనా కంపెనీపై మీరు ఫిర్యాదుచేయాలనుకుంటే, భౌగోళిక పరిధికి చెందని మధ్యవర్తిత్వ న్యాయ కేంద్రానికి దరఖాస్తు చేయవద్దు. ఎందుకంటే, అవి త్వరగా పరిష్కారం కావు. మీ చిరునామా ఆధారంగా భౌగోళిక పరిధిని నిర్ణయించుకోండి.

  • వదంతులపైన, ఊహాగానాలపైన ఆధారపడి లావాదేవీలు సాగించవద్దు.
  • ఈ షేర్లలో పెట్టుబడి పెడితే, లాభం ఖాయం వంటి మాటలకు మోసపోవద్దు.
  • కంపెనీలు తమ సెక్యూరిటీలకు ప్రభుత్వ ఆమోదం వున్నదనో, లేదా ప్రభుత్వ ఏజెన్సీల వద్ద నమోదుచేసుకున్నామనో చేసే ప్రచారానికి మోసపోవద్దు. ఎందుకంటే, ఆ ఆమోదం మీరు కొనాలనుకునే సెక్యూరిటీలకు సంబంధించినది కాక, ఇతర మరెందుకో సంబంధించినది కావచ్చు.
  • మీ డి మాట్ లావాదేవీల స్లిప్ బుక్ ను ఏ మధ్యవర్తికీ ఇవ్వవద్దు.
  • కంపెనీలు, తమ ఆర్ధిక సామర్ధ్యాన్ని గురించి, పత్రికలలో, టెలివిజన్ ఛానల్స్‌లో చేసే ప్రకటనల ఆధారంగా, మీ లావాదేవీలను నిర్ణయించుకోవద్దు.
  • కంపెనీలలోని పరిణామాలను గురించి ప్రచార, ప్రసార సాధనాలలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మవద్దు. వీటిలో కొన్ని మిమ్ము తప్పుదారి పట్టించవచ్చు.
  • ఎవరైనా లాభంపొందినవారి పెట్టుబడి నిర్ణయాలను గుడ్డిగా అనుకరించవద్దు.
  • మీకు బాగా పరిచయం వున్న వారైనా సరే, మీ లావా దేవీలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను వారినుంచి తీసుకోవడం మరువవద్దు.
  • పెట్టుబడిలో ఎదురయ్యే ముప్పులను ముందుగానే గమనించడం మరువవద్దు.
  • మీ పెట్టుబడులను పోస్ట్ డేటెడ్ (తర్వాతి తేదీ వేసిన) చెక్కులద్వారా చెల్లిస్తామనే హామీలకు మోసపోవద్దు
  • అవసరాన్నిబట్టి, సంబంధిత వ్యక్తులను, తగిన అధికారులను కలుసుకోవడానికి వెనుకాడవద్దు
  • భారీ లాభాలు వస్తాయి అనే హామీల వెంట పరుగులు పెట్టవద్దు.
admin:
All Rights ReservedView Non-AMP Version