Home

పసందైన లాభాలకు పది హేను సూత్రాలు

stock market

స్టాక్ మార్కెట్ లో లాభాలు అర్జించాలంటే ఇన్వెస్టర్లు ఈ దిగువ నిచ్చిన సూత్రాలను పాటించాలి. లాభాలు రాకపోయినా నష్టాల పాలవ కుండా సేఫ్ గా ఉండొచ్చు.

  • అందరు షేర్లను అమ్ముకుంటున్న సమయం లో కొనుగోళ్ళు చేయాలి
  • మనసు ప్రశాంతం గా వున్నపుడు మాత్రమే ఇన్వెస్ట్ మెంట్ నిర్ణయాలు తీసుకోండి
  • ఎవరు పడితే వారిచ్చే టిప్స్ ను అనుసరించ కూడదు
  • మంచి షేర్లలో చౌక ధర కు దొరికే వాటిపైనే గురి పెట్టాలి … మంచి షేర్లలో కూడా నూటికి నూరు పాళ్ళు బెస్ట్ షేర్ ఏది ఉండ దని గుర్తుంచుకోవాలి
  • మార్కెట్ పడే తరుణం లో షేర్లను కొనుగోలు చేయమని సలహాలు ఇవ్వడం చాల సులభం.
    కాని కొనడమే కష్టం .ధైర్యం చాలదు. కానీ ధైర్యం చేయక తప్పదు
  • కేవలం టిప్స్ ఆధారం గానే షేర్లను కొనగూడదు. కొంత మేరకైనా స్వీయ విశ్లేషణ వుండాలి.
  • షేర్లలో మదుపు చేసి సైలెంట్ గా ఉండ కూడదు
  • ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీల మంచి చెడ్డ ల గురించి తెలుసు కోవాలి
  • మార్కెట్ పోకడ తో నిమిత్తం లేకుండా కొన్ని షేర్లు పెరుగు తుంటాయి . కొన్ని తగ్గు తుంటాయి .పెరిగే వాటిలో మంచి వాటిని ఎంపిక చేసుకోవాలి
  • ఒకే కంపెనీ లేక ఒకే గ్రూపు కి చెందినా కంపెనీల షేర్లలో మొత్తం సొమ్మును ను మదుపు చేయకూడదు ,
    భిన్న రంగాలకు చెందిన కంపెనీల షేర్లను ఎంపిక చేసుకోవాలి* కొనుగోలు చేసిన షేర్ల కదలిక లను నిత్యం పరిశీలిస్తుండాలి, కంపెనీల తాలుకు బోనస్,డివిడెండ్,ఇతర సమాచారాన్ని కూడా తెలుసు కుంటుండాలి
  • షేర్లను ప్రేమించ కూడదు. ధర పెరిగితే వెంటనే స్పందించి అమ్మేసుకోవాలి
  • ధరలు పతన మయ్యే తరుణం లో బెంబేలెత్తి పోకూడదు , ఓర్పు వహించాలి. చేతిలో సొమ్ము వుంటే మరిన్ని మంచి షేర్లను కొనాలి .ఇది కూడా అంత సులభమైన విషయం కాదు
  • మార్కెట్ ఏ కారణాల వాళ్ళ పతనమైనా కొన్నాళ్ళకు పెరుగుతుంది. ఇన్వెస్టర్లు ఎపుడు ఆశ భావం తో ఉండాలి
  • ఇన్వెస్టర్లు మరీ ఆశ బోతులుగా ఉండ కూడదు, దశలు వారీ గా లాభాలు గడించాలి అన్న దృక్పధం తో మదుపు చేయాలి
admin:
All Rights ReservedView Non-AMP Version