Home

ఋణాలు Loans

loan

ఋణం

మీరు ఋణం కొరకు బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఆర్ధికంగా మీరు ఎంత శక్తి మంతులో బ్యాంకు వారు చూస్తారు. ఋణం పొందుటకు కావలసిన అర్హత లోని ముఖ్యాంశాలలో ఇవి కొన్ని: ఋణం తిరిగి చెల్లించే సామర్ధ్యం, వయసు, ఆదాయం, ఆదాయ వనరు, పరపతి సామర్ధ్యం, విద్యార్హత మరియు అవసరమైన అధి కారిక ధృవపత్రాలు , మీ ఋణ దరఖాస్తుతో పాటు దాఖలు చేసినవి.

అందుబాటులో ఉన్న వివిధ రకాల ఋణాలు

గృహ ఋణం, గృహాన్ని అభివృద్ధి చేయుటకు ఋణం, కారు ఋణం, మోటార్ సైకిళ్ళ ఋణం, విద్యాఋణం, వివాహ ఋణం, వ్యాపార ఋణం, ఏదైనా వస్తువు హామీగా ఋణం, వ్యక్తిగత ఋణం, మరియు NRI ఋణం (విదేశాలలో నివసించే స్వదేశీయుల ఋణం). వడ్డీని రోజు వారీగా, నెలవారిగా, త్రైమాసికంగా లేక వార్షికంగా ఆధారం చేసుకుని లెక్కిస్తారు. ఈ కాల పరిమితుల చివరకు మిగిలిన అసలు ఋణం సొమ్ము ఆధారంగా వడ్డీరేటు ను లెక్కిస్తారు.

ఋణాలను రెండు వర్గాలుగా విభజించవచ్చు 1. హామీ ఉన్న వాటికి ఋణం 2. హామీ లేకుండా ఋణం ఇంకా ఈ ఋణాలు నిర్ణయించిన రేటు పై ఋణం మరియు వడ్డీరేటు ఎప్పటికప్పుడు మారిపోయే విధమైన ఋణంగా వర్గీకరించవచ్చు. హామీ ఉన్న వాటిపై ఋణం విషయంలో మీరు మీ యింటిని గాని, లేక వేరే రకమైన విలువైన వాటిని తనఖా పెట్టి ఋణం తీసుకోవచ్చు. హామీ లేకుండా ఋణం విషయంలో అటువంటి నిబంధనలు ఏమీ లేవు. హామీ లేని ఋణాలు తక్కువ కాల పరిమితికి సంబంధించిన ఋణాలు – అవే హామీ ఉన్న ఋణాలు ఎక్కువ కాల పరిమితికి సంబంధించినవి. హామీ లేని ఋణం విభాగంలో యిచ్చే ఋణ ధనం పరిమితమైనది. కాని హామీ ఉన్న ఋణం విభాగంలో యిచ్చే ఋణ ధనం చాల అధికంగా ఉండి, మీ గృహం యొక్క విలువపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకు అంగీకరించే సెక్యూరిటీలు లేక వేరే విధమైన విలువైన ఆస్తులపై మీరు ఋణాలను పొందవచ్చు.

వడ్డీరేటు

ఋణ ఒప్పందం పై ఆధారపడి వడ్డీరేటు ఉంటుంది. వడ్డీరేటు స్దిరమైనదిగానూ లేక మారుతూ ఉండే (అస్ధిరమైన) విధంగానూ ఉండి, మీరు ఋణం తీసుకునే సమయంలో ఏది ఎంచుకుంటే దానిపై ఆధారపడి ఉంటుంది.

సామాన్యవడ్డీ: ఈ వడ్డీ కేవలం అసలు ఋణం సొమ్ము పైనే లెక్కిస్తారు. లేక చెల్లించని అసలు సొమ్ము యొక్క భాగం పైనే లెక్కిస్తారు

చక్ర వడ్డీ: ఇది కూడ సామాన్యవడ్డీ వంటిదే కాని, కాలంతో పాటు తేడా ఎక్కువై పోతుంది. ఈ తేడా ఎందుకంటే కట్టని వడ్డీ కూడ అసలు సొమ్ములో కలసిపోతుంది కాబట్టి. ఇంకో విధంగా చెప్పాలంటే, ఋణ గ్రహీత, తన పాత వడ్డీ పై కూడ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. అసలు సొమ్ము లో ఏ మాత్రం చెల్లించకుండా లేక వడ్డీని చెల్లించి ఉన్నట్లైతే, ఋణాన్ని ఈ సూత్రాల ద్వారా గణిస్తారు.

స్ధిరమైన వడ్డీరేటుతో ఋణాలు – ఒకసారి ఒప్పందం జరిగినప్పుడు, ఋణ కాలం మొత్తం కూడ అదే వడ్డీరేటు ఉంటుంది.

అస్ధిరమైన లేక మారుతూ ఉండే వడ్డీరేటు పై ఋణాలు – కొన్ని ఋణాలు, అస్ధిరమైన వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో, చెల్లించే వడ్డీరేటు, మార్కెట్టు వడ్డీరేటును అనుసరించి ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకు యొక్క ప్రధానమైన ఋణరేటు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, అధికారికంగా వడ్డీ రేటును మార్చినప్పుడు, ఆ ప్రభావం మీ ఋణం యొక్క వడ్డీరేటు పై కూడ ఉంటుంది.

ఋణ గ్రహీతకు కొన్ని బ్యాంకులు, వివిధ అంచనాలతో అంతర్గత విలువ ను నిర్ణయిస్తాయి. ఆ విలువ స్ధాయి ఒక్కొక్క ఋణ గ్రహీతకు, బ్యాంకు నియమ నిబంధనలనుసరించి, ఒక్కొక్క రకంగా ఉంటుంది. అధిక ధన పరపతి విలువ ఉంటే అధిక మొత్తంలో ఋణాలు పొందే అవకాశం ఉంటుంది.

సమాంతర పూచీకత్తు

ఋణ ఒప్పందాలలో సమాంతర పూచీకత్తు అంటే, ఋణ గ్రహీత ఒక ప్రత్యేకమైన ఆస్తిని ఋణ దాతకు తనఖా పెట్టడం వలన అతడి ఋణ చెల్లింపుకు హామీ ఉంటుంది. ఋణ గ్రహీత తన బాకీ చెల్లించని పరిస్ధితులలో ఋణ దాతకు ఈ హామీ రక్షణగా ఉంటుంది. అంటే ఋణ ఒప్పందం ప్రకారం, ఏ ఋణ గ్రహీత అయినా అసలు సొమ్ము మరియు వడ్డీ చెల్లించలేని పక్షంలో ఇది వర్తిస్తుంది. ఋణ గ్రహీత ఒక బాకీని తీర్చలేనప్పుడు (దివాలా తీయుట వలన గాని) లేక ఏదైనా సంఘటన వలన గాని) తాను సమాంతర పూచీకత్తు పై తనఖా పెట్టిన ఆస్తిని ఋణ దాతకు యిచ్చి వేస్తారు. అప్పుడు ఋణదాత ఆ ఆస్తికి యజమాని అవుతారు. ఉదాహరణకు, ఒక తనఖా ఋణం లావాదేవీతో ఋణంతో కొన్న స్ధిరాస్తి సమాంతర పూచీకత్తు అవుతుంది. కొనుగోలు దారుడు, తనఖా పై తీసుకున్న ఋణం ఒప్పందం ప్రకారం తీర్చలేనప్పుడు, ఆ స్ధిరాస్ధి బ్యాంకు యాజమాన్యం కు బదిలీ అయిపోతుంది. బ్యాంకు ఒక చట్ట ప్రక్రియ – ఋణ గ్రహీత కోల్పోయిన తనఖా విడిపించుకునే హక్కు – ద్వారా స్ధిరాస్ధిని ఋణ గ్రహీత నుండి తనఖా ఋణ ఒప్పందం ప్రకారం తాను పొందుతుంది.

సమానమైన నెల వాయిదాల గురించి

ఇ.ఎమ్. ఐ (EMI) అంటే సమానమైన నెల వాయిదాలు అని అర్ధం. మీరు, ఒక ఋణం తీసుకున్నప్పుడు, ఆ సొమ్మును ప్రతీనెలా తీర్చే క్రమంలో, ఋణ కాల వ్యవధికి చివరకు, అన్ని బాకీలు తీరే విధంగా గణించి నిర్ణయిస్తారు. ఈ నెల వాయిదా చెల్లింపులో అసలు సొమ్ము మరియు వడ్డీ కలుపుకుని ఉంటుంది. దీనినే ఇ.ఎమ్. ఐ (EMI) అంటారు.

ఋణ చెల్లింపు విధానం, సాధారణంగా పోస్ట్ – డేటెడ్ చెక్కులు (ముందుగానే తర్వాతి తారీఖులపై యిచ్చే చెక్కులు) లేక ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ (ఎలక్ట్రానిక్స్ సహాయంతో తీర్చే వ్యవస్ధ), మీ ఖాతాకు అనుసంధానింపబడి ఉన్నదానితో కాని జరుగుతుంది. ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్ధలో అంగీకరించబడిన, ఒక నిర్ణీత తేదికి, మీ బ్యాంకు ఖాతా నుండి దానంతటదే తగ్గించబడి ఋణ చెల్లింపు జరిగిపోతుంది. భారతదేశపు మార్కెట్ లో, 6 నెలల కాల వ్యవధి నుండి 25 సంవత్సరాల దాకా ఋణాలు అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితమైన కాలపరిమితి, మీరు ఎంచుకున్న ఋణ ప్రణాళిక పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఇది బ్యాంకుకు, బ్యాంకుకు మారుతూ ఉంటుంది.

ఋణాలలో రకాలు

  • వ్యక్తిగత ఋణం
  • విద్యా ఋణం
  • కారు ఋణం
  • వ్యవసాయ ఋణం
  • చిల్లరవ్యాపారానికి ఋణం
  • గృహ ఋణం

admin:
All Rights ReservedView Non-AMP Version