Home

ఋణం తీర్చలేని వారు తెలుసుకోవలసిన 5 హక్కులు

loan

మీరు ఋణం తీర్చలేకపోతున్నారా?  బ్యాంకులు ఆస్తులనుస్వాధీనము చేసుకునే ప్రయత్నము చేస్తున్నాయా ? బెదిరిపోకండి. ఈ స్తితిలో కూడా సర్వము ముగిసిపోయిందని బెంబేలు పడనవసరము లేదు..నిబంధనల ప్రకారము ఋణ దాతకి సర్వహక్కులు అంత తేలికగా సంక్రమించవు.  మీరు తీర్చవలసిన  సమయములో  ఋణం తీర్చలేకపోయినా  ఈక్రింది హక్కులు మీకు వుంటాయి.

సముచిత కాల నోటీసు హక్కు

బ్యాంకులు ఆస్తులు స్వాధీనము చేసుకునే ముందు  మీకు సరిఅయిన సమయము, అవకాశము ఇవ్వవలసి వుంటుంది. SARFAESI  చట్ట ప్రకారము  బ్యాంకులు ఋణాన్ని వసూలుచేస్తాయి.  ఏదైనా ఒక ఋణము90 రోజులకంటె ఎక్కువ డ్యూ అయితే  బ్యాంకులు ఆవిషయాన్ని తెలియపరుస్తూ  ఋణ గ్రస్తులకు 2 నెలల (60రోజుల)   వ్యవధినిఇస్తూ నోటేఏసు ఇవ్వాలి.  ఈనోటీసుసమయములో కూడా ఋణం లేదా ఓవర్ డ్యూ మొత్తాన్ని చెల్లించలేకపోతే  అప్పుడు బ్యాంకులు  ఆ ఆస్తులమ్ను అమ్మకానికిపెట్టవచ్చు.  అదికూడా ఆస్తి పూర్తి వివరాలతో పొందుపరచిన 30 రోజుల పబ్లిక్  నోటీసుఇచ్చినతరువాత .

సరియయిన ధరనుపొందే హక్కు

ఇవ్వబడ్డ60 రోజుల నోటీసుకాలములో  ప్రతి స్పందన లేక పోయినాకట్ట వలసిన సొమ్ము కట్ట లేక పోయినా  ఆస్తులను వేలము వేయవచ్చు. కానీ ఈ ప్రక్రియ  ప్ర్రరంభించటానికి ముందు బ్యాంకులు తమ వాల్యుయేటర్ నిర్ధారించిన విలువను  మరియు రిజర్వ్ ధర తో పాటు వేలముసమయము, తేదీ , సూచిస్తూ  నోటీసుఇవ్వాలి .ఈ స్తితిలో  ఋణము తీసుకున్న వారు  ఆస్తివిలువకు సంబంధించి  తమ అభ్యంతరాలను తెలియపరచవచ్చు.  తమ ద్రుస్టిలో  ఆస్తి యొక్క  సరియైన విలువను  బ్యాంకుద్రుష్టికి తేవచ్చు. తమకు తెలిసిన బయ్యర్స్  ను బ్యాంకుకు పరిచయము చేసి  వారిద్వారా ఆస్తి కొనుగోలు చేయించవచ్చు .  ఈవిధముగాతమఆస్తికిసరియైనధరపలికేటట్లుగా చూడవచ్చు.

మిగులును అందుకునే హక్కు

వేలము వేయగా వచ్చిన సొమ్ములోనుంచి  ఋణ దాతలు  తమకు రావలసిన మొత్తమును  మినహాయించుకొని, అప్పుతీసుకున్నవారికి  తిరిగిఇచ్చేయాలి.  ఈ విషయాన్ని అప్పుతీసుకున్నవారు ఎప్పుడు ద్రుష్టి లో  వుంచుకోవాలి.  ఏ దైనా అప్పుఓవర్ డ్యూ అయినప్పుడు  నిస్ప్రుహకు లోను గాకుండా  వేలంపొకడలను  గమనించాలి.  ఓవర్డ్యూస్  అయిన మొత్తానికి  మించి వచ్చిన సొమ్మును అప్పు తీసుకునే వారికే చెందుతుందన్న  విషయము గుర్తుంచుకోవాలి.

వినిపించేహక్కు

నోటీసు  సమయములో  అధిక్రుత అధికారికి  మీ అభ్యంతరాలను,  మీకు కల కారణాలను,  విన్నవించటాంకి మీకు హక్కు వున్నది. ఆస్తిస్వాధీన పరచు కోవటానికి వ్యతిరేకిస్తూ  మీ కారణాలను, వాదనలను,వివరిస్తూ దరఖాస్తు  పెట్టుకోవచ్చు.

మానవతాద్రుక్పధముతోవ్యవహరించాలి

కొందరి రికవరీ ఏజంట్ల  వ్యవహారశైలి గురించిన  ఫిర్యాదులను  ద్రుష్టి లో వుంచుకొని  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  బ్యానులను నిలదీయటము జరిగినది.  బ్యాంకు లు కూడా  తమ ఢోరణీని మార్చుకొని ఖాతా దారులకు  ఇబ్బంది కగని రీతిలో వ్యవహరించాలని  నిర్ణయించాయి.  పర్యవసారముగా అప్పుతీసుకున్న వారికి ఈవెసులుబాటులు కలిగాయి:

  • ఖాతాదారులు (అప్పుతీసుకున్న వారు ) నిర్ణయించిన  స్తలములో రికవరీ ఏజంట్లు వారిని కలవాలి.
  • పగలు 7 గంటలనుండి రాత్రి7 గంతల లోపు  ఋణగ్రస్తులను  రికవరీ  ఏజంట్లు కలవవచ్చును/ ఫొను చేయవచ్చును.
  • ఋణగ్రస్తులను కానీ వారి కుటుంబ సభ్యులను కాని  అవమానించకూడదు.
  • రికవరీ ఏజంట్లు అసభ్యకరముగా  ప్రవర్తించకూడదు.
  • రికవరీ ఏజంట్లు అసభ్య

ఆధారం : సముద్రాల అనురాధ , అడ్వకేట్

admin:
All Rights ReservedView Non-AMP Version